Homeక్రీడలుT20 World Cup Team India: రాహుల్ ద్రావిడ్ బిలో యావరేజ్ కోచా? టీమిండియా అవస్థలకు...

T20 World Cup Team India: రాహుల్ ద్రావిడ్ బిలో యావరేజ్ కోచా? టీమిండియా అవస్థలకు కారకులెవరు?

T20 World Cup Team India Dravid: ఇంట్రవర్ట్ అని తెలుసు కానీ, అసలు ఏం చేయాలో కూడా చెప్పలేనంత ఇంట్రవర్ట్ అని అయితే అనుకోలేం కదా ! బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చూసినా – బౌలింగ్ లైనప్ పికింగ్ చూసినా – ఆన్ ఫీల్డ్ స్ట్రాటజీస్ ఆలోచించినా – ఏ రకంగా అయినా బాస్, నువ్ బిలో యావరేజ్ కోచ్ వా అనిపిస్తోంది ! జెంటిల్మన్ గేమ్ కి పోస్టర్ బోయ్ వేమో అనిపించేంతగా ఒదిగిపోయిన నువ్వు… కోచ్ గా మాత్రం తూచ్ అనిపిస్తున్నావ్. ఎందుకో అర్థం కావడం లేదు గురూ !

బుకానన్ ఎవరో బుర్రకు తట్టేది కాదు ఎంత ఆలోచించినా ! అప్పట్లో గూగుల్ ఇంత యాక్టివ్ కాదు. గుర్తు చేయడానికి. జాన్ రైట్ ప్లేయర్ గా పెద్ద పొడిచిందేమీ లేదు. కివీస్ సైజు ప్లేయరంతే ! రవిశాస్త్రి కూడా స్టేడియంలో కంటే బయట బ్యాటింగ్ చేసిందే ఎక్కువ. ప్రొఫెషనల్ క్రెడెన్షియల్స్ తక్కువే! కానీ ఇప్పుడున్న ఏ కొలతను బట్టీ చూసినా వీళ్లు సాధించింది వరల్డ్ క్లాస్ రికార్డ్. వండ్రఫుల్ అనదగ్గ కోచింగ్ ట్రాక్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంది. లారా వదిలేశాడు. వివ్ రిచర్డ్ పెద్ద పొడిచిందేమీ లేదు. మన కుంబ్లేని మధ్యలోనే పంపేశారు. కపిల్ చేతులెత్తేశాడు. వసీం అక్రమ్ కూడా వల్ల కాదన్నాడు. – ఇవి కొందరు గ్రేటెస్ట్ ప్లేయర్ల కోచింగ్ రికార్డ్స్. గొప్ప ప్లేయర్లు, కోచ్ లుగా సక్సెస్ కాలేరా ? లేటెస్ట్ ఈ వరసలో ద్రవిడ్ చేరుతున్నాడా అనే డౌట్ వస్తోంది. వరల్డ్ కప్ కి జట్టు ఎంపిక మొదలు, బ్యాటింగ్ లైనప్ అండ్ ప్లేయర్స్ ప్రిఫరెన్స్ వరకూ ప్రతీ చోటా ఇదే అనుమానం.

వరల్డ్ కప్ జరిగేది ఆస్ట్రేలియాలో అని తెలిసినప్పుడు, పేస్ బౌలింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండి ఉండాలి ! అదేమంటే బుమ్రా లేడంటారు. ఉంటే మాత్రం 15 ఓవర్లు అయితే వేయడుగా! పిచ్ కండిషన్ ను బట్టీ ప్యాక్ కి సలహాలు ఇవ్వడం, బ్యాట్స్ మన్ వీక్ నెస్ పట్టి ఎటాక్ ఎలా ఉండాలో చెప్పడం లాంటివి చాలానే ఉంటాయంటారా ! ఎస్ ! మరి అలాంటి బుమ్రా డౌట్ అని ఆర్నెల్ల నుంచే తెలిసినప్పుడు మరి ఆల్టర్ నేటివ్స్ ఎక్కడ ? ఐపీఎల్ ఫ్లాట్ పిచ్ ల మీద పగలదీసిన హర్షాల్ పటేల్, పరిస్థితి అనుకూలిస్తే చూద్దామనే హర్షదీప్, ఎప్పుడు ఎలా వేస్తాడో తెలియని భువీ, ఇంటర్నేషనల్ టీ20 ఆడి ఏడాదిన్నర అవుతున్న షమీ – ఇదా బౌలింగ్ ఎటాక్ ? సౌతాఫ్రికా మ్యాచ్ లో ముఖమ్మీదకి లేచేలా ఎన్ని బౌన్సర్లు వేశారు టీమిండియా బౌలర్లు ? ఎవరైనా లెక్క చెప్పండి చూద్దాం ! అదేమంటే స్వింగ్ మీద డిపెండ్ అయ్యారు. బౌన్సు కాదని లాజిక్కొకటి. బాస్… ఆ స్వింగ్ థ్యాంక్స్ టు పెర్త్ !

బ్యాటింగూ అంతే ! రాహుల్ ఫెయిల్ అవుతున్నాడు. అఫ్ కోర్స్… వార్నర్ కొడుతున్నాడా, బాబర్ సంగతేంటి, బట్లర్ ఎప్పుడు ఆడాడు… అసలు ఓపెనర్లకే కలిసి రావడం లేదు అంటారేమో ! సరే! మరి మిడిలార్డర్ లో పాక్ మీద అక్సరొచ్చాడు. తేలిపోయాడు. కార్తీక్ ఈ వరల్డ్ కప్ ఫినిష్ అయితే కానీ ఫినిషర్ గా సక్సెస్ కాడేమో తెలియదు. కాస్తో కూస్తో సందు దొరికితే హుడాని ఎక్కించారు. ఐదారు మ్యాచులుగా హుడా ఆడగా చూసినోడు లేడు. ఏమైనా అంటే 155 స్ట్రైక్ రేట్ ఉందనే లాజిక్కొకటి. ఎవరి మీద ఆ కొట్టుడు ? దేశవాళీలో ! మరి పంత్ కు పని ఎందుకు లేదో అర్థం కాదు. 38 ఏళ్ల దినేశ్ కార్తీక్ కోసం పాతికేళ్ల పంత్ ను పక్కనపెట్టిన ముందు చూపు చూశాక, వెనక నుంచి పెట్టాలి దండం అనిపిస్తుంది ఎవరికైనా! ఆస్ట్రేలియాలో అంతటి సక్సెస్ ఉన్న బ్యాటర్ ఈ మధ్యకాలంలో లేడు. అయినా పంత్ టీమ్ లో లేడు. అదే సర్ ప్రైజ్ అంటే !

పైపెచ్చు, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉండగా – అశ్విన్ ను 18 ఓవర్ కి దించడం అయితే మహా చాణక్యం. ఏం చేయాలి మరి, స్పిన్నర్ తో 20వ ఓవర్ వేయించలేనుగా అంటున్నాడు లేజీ రోహిత్. మై డియర్ కన్సొలేషన్ కెప్టెన్… 20 కాదు బాస్, 16 లోపు కోటా కంప్లీట్ చేయాలి. నెదర్లాండ్స్ మీద పాకిస్థాన్ పేస్ ఎటాక్, ఎస్పెషల్లీ… లాస్ట్ ఐదు ఓవర్లలో యార్కర్ల దాడి చూడలేదా నువ్వు ? మరి ఇంత జరుగుతుంటే కోచ్ ద్రవిడ్ ఏం చేస్తున్నట్టు ? అరటి పళ్లు తింటూ టెన్షన్ ను దాచుకునేందుకు సీరియెస్ నెస్ కప్పుకున్నాడు డగౌట్ లో !
వాట్ ఈజ్ దిస్ అండీ !

-మొక్కుకున్నాం

ద్రవిడ్ వేర్ ఆర్ యు బాస్. ఇప్పుడో సీన్ గుర్తొస్తోంది. గగన్ ఖోడా, శఠగోపన్ రమేశ్ లాంటి దేశవాళీ టాలెంట్ ను పెట్టుకొని సీనియర్ మోస్ట్ జూనియర్ ప్లేయర్లా నువ్ పోరాడిన రోజులు చూశాం. అఖ్తర్ 153 కిలోమీటర్ల స్పీడులో బౌల్ చేస్తుంటే… నీకంటే ఎక్కువ ఫ్యాన్స్ మొక్కుకున్నారు.. నీకు ఆ బంతి కనిపించాలీ అని! అలాంటి రోజులు దాటి, ఆస్ట్రేలియా మీద ఆస్ట్రేలియాలో డబుల్ సెంచరీ చేసి ఒంటి చేత్తో నువ్ మ్యాచ్ గెలిపించడానికి మూడేళ్లు కూడా పట్టలేదు. మనకి సత్తా ఉండటంతోపాటు ఎదుటోడు నమ్మకం కూడా ఉంచితే రిజల్ట్ అలా ఉంటుందని నీకిప్పుడు చప్పక్కర్లేదు. నువ్ కీపింగ్ చేస్తే టీములో ఉంటావ్ లేదంటే లేదు అని అల్టిమేటం ఇస్తే – ఒకట్రెండు కాదు 80కిపైగా వన్డేల్లో కీపింగ్ చేసిన కెపాసిటీ నీది. అడాప్టబిలిటీ గురించి నీకు కొత్తగా తెలియక్కర్లేదు. టీ20లకు నువ్ ఏం పనికొస్తావ్ అనుకుంటుండగా, 22 బంతుల్లో నువ్ చేసిన హాఫ్ సెంచరీ టెంపర్మెంట్ కి టెస్టిమొనీ. పైగా నువ్ జనరేషన్ ట్రాన్సిషన్ ఎలా ఉంటుందో ఒకసారి కాదు రెండు మూడు సార్లు చూసినోడివి. నీ రాకతో టీమ్ కంపోజర్ మారింది. అజర్ లేకపోతే మిడలార్డర్ ఏమవుతుందో అనుకుంటే – ఇంకా స్ట్రాంగ్ అవుతుందని చెప్పినోడివి. కుర్రోళ్ల రాకకు ఇరుసుగా నిలిచి ధోనీ జమానాకు దారిచ్చినోడివి. మరి ఇంత చూశావ్ కదా బాస్ – మరి ఆ అనుభవం అంతా ఎటు పోయింది ? ఏమైంది నీకు ?

– ఎందుకు పంత్ ను పక్కన పెట్టారు?

పేస్ పిచ్ ల మీద టెస్టుల్లో గెలిపించే సత్తా ఉన్నోణ్ని, టీమ్ ఇబ్బందుల్లో ఉంటే నిలబడి కొట్టే కుర్రోణ్ని, పంత్ ను ఎందుకు డిస్టర్బ్ చేయడం ? వచ్చే ఏడాది వరల్డ్ కప్ తర్వాత రోహిత్ వెళ్లిపోతే, శ్రేయస్ పేస్ ఆడలేడు, సంజూ అవకాశాలిచ్చినా అందుకోడు, రాహుల్ డల్ అయిపోయాడు – అంటూ కంతలు వెదుక్కుంటూ ఎంత కాలం ? సిరాజ్ లాంటివాళ్లని మనం సానపట్టలేం. ఉమ్రాన్ బ్రెయిన్ లెస్ ఎక్స్ ప్రెస్ అనేస్తాం. బుమ్రా డౌట్ ఫుల్. మరి హు ఈజ్ నెక్ట్స్ ? వరల్డ్ కప్ ఆరు నెలల ఉండగానే – ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లను రొటేట్ చేసింది ఆస్ట్రేలియా. టోర్నమెంట్ వచ్చేసరికి ఫుల్ బెంచ్ తో దిగింది. మరి మనం ? నువ్ ఆలోచన చేయడం లేదో నువ్ ఆలోచించినా పడనీయడం లేదో తెలీదు కానీ గురూ… ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ యువర్ టెన్యూర్. అవసరమొచ్చినప్పుడు కవర్ చేసేందుకు గంగూలీ కూడా లేడు. ఈ ద్రవిడ్ కంటే, ఆ శాస్త్రే బెటర్ అనే మాట మాత్రం వినపడనీయకు బాస్, చివుక్కుమంటుంది చాలా మందికి !

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular