spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Viveka Case : వివేకా కేసులో ఫస్ట్ టైమ్ జగన్ ప్రస్తావన.. ఏం జరగబోతోంది?

YS Viveka Case : వివేకా కేసులో ఫస్ట్ టైమ్ జగన్ ప్రస్తావన.. ఏం జరగబోతోంది?

YS Viveka Case : వివేకా హత్య కేసులో కీలక ట్విస్ట్. తొలిసారి సీఎం జగన్ పేరును సీబీఐ ప్రస్తావించింది. ఇన్నాళ్లూ సీఎంను టార్గెట్ చేస్తూ విపక్షాలు హత్యకేసులో ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఫస్ట్ టైమ్ సీబీఐ నేరుగా పేరు ప్రస్తావించడం సంచలనం కలిగిస్తోంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సీబీఐ అనుబంధ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ లో సీఎం జగన్ పేరు ప్రస్తావనకు తీసుకొచ్చింది. హత్య విషయం జగన్ కు ఉదయం 6.15 గంటల కంటే ముందే తెలిసినట్టు తమ దర్యాప్తులో తేలినట్టు సీబీఐ కౌంటర్ లో ప్రస్తావించింది. వివేకా హత్య గురయినట్టు ముందుగా చూసినట్టు చెబుతున్న పీఏ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే జగన్ కు తెలుసునని సీబీఐ స్పష్టం చేయడం సంచలనంగా మారింది.

ఈ కేసుకు సంబంధించి నేరుగా జగన్ పేరు బయటకు రావడంతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. ఆది నుంచి రకరకాల ఆరోపణలు వస్తున్నా సీబీఐ అంతదూరం వెళుతుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే కొద్దిరోజుల కిందట ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ కొత్తపలుకు కాలమ్ లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2019 మార్చి 15 వేకువజామున మరో నలుగురితో కలిసి ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తున్నారని.. ఆ సమయంలో అతడికి ఫోన్ వచ్చిందని.. బయటకు వెళ్లి మాట్లాడి వచ్చిన జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని కాలమ్ లో ప్రస్తావించారు. ఇప్పుడు దానికి దగ్గరగా ఉన్న విషయాన్ని సీబీఐ కౌంటర్ లో పేర్కొనడం విశేషం.

అయితే జగన్ కు అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారా? అన్నదానిపై సీబీఐ స్పష్టతనివ్వలేదు. దీనిపై దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. శనివారం దీనిపై మరికొంత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. శుక్రవారం సీబీఐ తన వాదనలు వినిపించే చాన్స్ దక్కలేదు. అవినాష్ రెడ్డి, సునీత తరపు లాయర్లు వాదనలు వినిపించడంతో సమయం గడిచిపోయింది. శనివారం ఉదయం సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా వివేకా కేసులో జగన్ అంశంపై కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కేసు నీరుగారుతోందని విపక్షాలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏకంగా సీఎం జగన్ పేరు రావడం కీలకాంశమే.

తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే వివేకానందరెడ్డి హత్య గురించి.. తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి సీఎం జగన్ చెప్పారన్న ప్రచారం ఉంది. దీంతో సీబీఐ దానిపైనా దృష్టిపెట్టింది. ఆ నలుగురి వాంగ్మూలాన్ని సేకరించింది.  ఆ నలుగురిలో ఒకరైన మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టారు.తాను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చానని చెప్పారు. జగనే తమకు వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని..అయితే గుండెపోటా కాదా అన్నది మాత్రం చెప్పలేదన్నారు. మరో వైపు ఉదయమే వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి .. జగన్‌, భారతి పీఏలకు ఫోన్లు చేసి.. మాట్లాడాలని సీబీఐ గుర్తించి వారిని పిలిచి ప్రశ్నించింది. దీంతో ఈ వ్యవహారం కీలక మలుపులు తిరగబోతున్నట్లుగా చెబుతున్నారు. సరిగ్గా జగన్ ఢిల్లీలో ఉండగా ఆయన పేరు బయటకు రావడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper