Homeక్రీడలుక్రికెట్‌India vs Pakistan : కొలంబో మినీ ఇండియా అయిపోయింది.. పాకిస్తానోళ్ల కు కాస్త గ్యాప్...

India vs Pakistan : కొలంబో మినీ ఇండియా అయిపోయింది.. పాకిస్తానోళ్ల కు కాస్త గ్యాప్ ఇవ్వండ్రా.. లేకుంటే పోయేలా ఉన్నారు!

India vs Pakistan : దెబ్బ మీద దెబ్బ.. షాక్ మీద షాక్.. ఇలా ఇచ్చుకుంటూనే పోతున్నారు టీమిండియా అభిమానులు. ఏ మాత్రం అవకాశం దొరికినా సరే దుమ్ము రేపి వదిలిపెడుతున్నారు. భారతీయుల సత్తా ఏమిటో పాకిస్తాన్ వాళ్లకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నారు… టి20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబోలో జరుగుతున్న మ్యాచ్ ను వీక్షించడానికి ఇండియా నుంచి భారీగా అభిమానులు శ్రీలంక వెళ్లిపోయారు. హోటల్ గదులను బుక్ చేసుకున్నారు. టికెట్లు కూడా ముందుగానే కొనుగోలు చేశారు. […]

India vs Pakistan : దెబ్బ మీద దెబ్బ.. షాక్ మీద షాక్.. ఇలా ఇచ్చుకుంటూనే పోతున్నారు టీమిండియా అభిమానులు. ఏ మాత్రం అవకాశం దొరికినా సరే దుమ్ము రేపి వదిలిపెడుతున్నారు. భారతీయుల సత్తా ఏమిటో పాకిస్తాన్ వాళ్లకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నారు…

టి20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబోలో జరుగుతున్న మ్యాచ్ ను వీక్షించడానికి ఇండియా నుంచి భారీగా అభిమానులు శ్రీలంక వెళ్లిపోయారు. హోటల్ గదులను బుక్ చేసుకున్నారు. టికెట్లు కూడా ముందుగానే కొనుగోలు చేశారు. సూర్య కుమార్ యాదవ్ సేన ఆడుతోంది స్వదేశంలో అన్నట్టుగా భారతీయ అభిమానులు వ్యవహరిస్తున్నారు.

కొందరు అభిమానులు కొలంబో నగరంలో బస్సు మీద ఎక్కి.. భారతీయ జెండాను అటూ ఇటూ తిప్పుతున్నారు. ఆ బస్సు మొత్తం కొలంబో నగరం చుట్టూ తిరిగింది. తద్వారా టీమిండియా అభిమానులు తమ స్థాయి ఏమిటో.. తమ జట్టు ఎలాంటిదో పాకిస్తాన్ దేశస్థులకు.. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు రుచి చూపించారు. అంతటితోనే టీమ్ ఇండియా అభిమానులు ఆగడం లేదు.

ప్రేమ దాస మైదానంలోకి టికెట్లతో ప్రవేశించారు. టికెట్లు పట్టుకొని మైదానం లోపలికి వెళ్తున్న తీరు రోమాలను నిక్కపొడిచేలా ఉంది. ఆడుతోంది ఇండియాలోనా అన్నట్టుగా ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్. కొలంబో నగరంలో ప్రదర్శన చేయడం.. కొలంబో ప్రేమదాస మైదానంలోకి వేలాదిమంది వెళ్లిపోవడం.. ఈ దృశ్యాలు చూస్తుంటే టీమిండియా కు అభిమానుల సపోర్టు ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు…

ఈ మైదానంలోకి పాకిస్తాన్ అభిమానులు వచ్చినప్పటికీ వారు మామూలు సంఖ్యలోనే ఉన్నారు. ఒకవేళ వారు ఏదైనా కవ్వింపు చర్యలకు దిగితే.. అడ్డగోలుగా మాట్లాడితే.. టీమిండియా అభిమానుల చేతిలో తుక్కు తుక్కు కావడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కొలంబో నగరంలో దాదాపు అన్ని హోటల్ గదులు బుక్ అయ్యాయని.. ఇందులో సింహభాగం టీమిండియా అభిమానులు బుక్ చేసుకున్నారని అక్కడి హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మ్యాచ్ లో మొదట్లో ఆడబోమని పాకిస్తాన్ చెప్పిన నేపథ్యంలో చాలామంది శ్రీలంక హోటల్ నిర్వాహకులు ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత పాకిస్తాన్ మనసు మార్చుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు. టీమిండియా అభిమానుల వల్ల వ్యాపారం బాగుందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper