bcci vs pcb : ఆర్థికంగా మనస్థాయి కాదు. జట్టు పరంగా మనకు దరిదాపుల్లో కూడా లేదు. ఈ ప్రకారం చూసుకున్న ఒక జుజుబి. అటువంటి పాకిస్తాన్ టి20 వరల్డ్ కప్ లో పిచ్చి వేషాలు వేసింది. టీమిండియాతో మ్యాచ్ ఆడబోనని మొండికేసింది.
మ్యాచ్ ఆడాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలని.. ఆదాయం నుంచి మొదలు పెడితే ట్రై సిరీస్ ల వరకు అన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేసింది. అయితే పాకిస్తాన్ షరతులకు ఐసీసీ ఒప్పుకోలేదు. అసలు పాకిస్తాన్ జట్టను బీసీసీఐ కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. ఈ క్రమంలో ఐసీసీ అనేక రకాలుగా నిబంధనలను విధించడం.. ఇంకా రకరకాలుగా షరతులు తెరపైకి తీసుకురావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది…
చివరికి భారత జట్టుతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా మ్యాచ్ ఆడతామని పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రకటించింది. దీంతో కొలంబోలోని ప్రేమ దాస మైదానంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భారత అభిమానులు శ్రీలంక చేరుకున్నారు. ప్రేమ దాస మైదానంలో ఆసీనులయ్యారు. టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
ఈ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు బిసిసిఐ పాకిస్తాన్ కు షాక్ ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ ప్రారంభానికి ముందు దురంధర్ ర్యాప్ పాటను బీసీసీఐ ప్రదర్శిస్తుంది. ఈ పాట ద్వారా పాకిస్తాన్ మీద రివేంజ్ తీర్చుకోవడానికి బీసీసీఐ ప్రణాళిక రూపొందించిందని తెలుస్తోంది.
గత ఏడాది చివర్లో విడుదలైన దురంధర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను మొత్తం బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ సునామి సృష్టించింది. పాకిస్తాన్లో అడుగుపెట్టిన భారత గూడచారి.. ఎటువంటి పనిచేశాడు.. ఉగ్రవాదుల ఆగడాలను ఎలా అరికట్టాడు.. అనే కథతో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా మనదేశంలోనే కాకుండా.. పాకిస్తాన్లో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. కాకపోతే పాకిస్తాన్ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయలేదు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను పాకిస్తాన్ ప్రజలు విపరీతంగా చూశారు. అందువల్లే ఈ సినిమా విపరీతమైన ఆదరణ దక్కించుకుంది..
దురంధర్ సినిమా ద్వారా పాకిస్తాన్ లో ఉన్న అసలు కోణాన్ని బయటపెట్టిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆ సినిమాలోనే ఉన్న ఒక ర్యాప్ పాట ద్వారా పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాలని బీసీసీఐ డిసైడ్ అయింది. ఎందుకంటే ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత జట్టుతో మ్యాచ్ ఆడబోమని రకరకాల ప్రచారాలు చేసింది. చివరికి భారత దేశంలో సరైన స్థాయిలో శాంతిభద్రతలు ఉండవని విమర్శ చేసింది. వాటికి గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి బీసీసీఐ దురంధర్ సినిమాలోని రాప్ పాటను ఆయుధంగా వాడుకుంటున్నది.
BCCI’s epic plan to cook and humiliate Pakistan!
Before the Ind vs Pak match, Humankind will perform the rap song “Dhurandhar” at the R. Premadasa Stadium in Colombo.
This will be an epic move by the BCCI — no one will expect this!
What’s your view on this? pic.twitter.com/MlF9PXRwvf
— Sonu (@Cricket_live247) February 15, 2026