Home Blog Page 8635

ఈ సినిమాని చూడడం కంటే ట్రైలర్ ని మరోసారి చూస్తే సరిపోతుంది!

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ ని రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పుడు… ఇంకేముంది వర్మ అసలే మామూలోడు కాదు, ఇలాంటి టైటిల్ తో సినిమా తీస్తున్నాడంటే మనకి తెలియని రాజకీయ రహస్యాలేవో ఈ సినిమాలో ఖచ్చితంగా చూపిస్తాడని అని అనుకొని వుంటారు సినిమా ప్రేక్షకులు మరియు రామ్ గోపాల్ వర్మ అభిమానులు. తర్వాత కొన్ని రోజులకు ఫస్ట్ లుక్ పోస్టర్ లు , ట్రైలర్ లు చూసి ఇంకేముంది ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులను అందరిని పిచ్చపిచ్చాగా ట్రోల్ చేసేసాడు వర్మ , ట్రయిలర్ ఇలా ఉంటె మరి అసలు సినిమాలో ఇంకేమి చూపిస్తాడో అనుకున్నారు సగటు ప్రేక్షకులు. ట్రయిలర్ తర్వాత వచ్చిన టాక్ తో ఈ చిత్రంపై ఎన్నో విమర్శలు , పోలీస్ కేసులు మరియు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పై పెద్ద రాద్ధాంతం జరిగి చివరికి హై-కోర్ట్ వరకు వెళ్లి ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ ని ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ గా మార్చారు.

అసలు విషయమేమిటంటే. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా అసలు రామ్ గోపాల్ వర్మ కి అయినా అర్దమయ్యిందా? లేదా వూరికే కాలక్షేపానికి తీసాడా అనే సందేహం కలగక మానదు. ఈ చిత్రంలో నటించిన 3-4 క్యారెక్టర్స్ తప్ప అది కూడా వాళ్ళు రియల్ క్యారెక్టర్స్ కి కొంచెం దగ్గరగా ఫీల్ అయ్యేలా నటించడం మినహా ఈ సినిమాలో చూడడానికి ఏమి లేదు. అసలు ఈ సినిమా గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పడం అనవసరం. సినిమా చూడడం కంటే ట్రైలర్ ని మరోసారి చూడడం బెటర్.

జనసేనాని వైరల్ వీడియోలు: బీజేపీపై ఫైర్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఎన్నికల సమయంలో పలు సందర్భాలలో బీజేపీ ని విమర్శించిన పవన్ ఇప్పుడు అదే పార్టీతో కలిసి పనిచేయడం అనేక ఆలోచనలకు తావిస్తుంది. 2019 అక్టోబరులో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సభలో ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.‘‘చస్తే చస్తాం గానీ.. జనసేన పార్టీని ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయం. మనం కలుపుతామా భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని. చస్తే చస్తాం.. ఉంటే ఉంటాం.. పోతే పోతాం.. కానీ తెలుగుజాతి ఉన్నతిని, గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాం’’ అంటూ ప్రజాపోరాట యాత్ర సందర్భంగా ఆయన బీజేపీ, ప్రధాన నరేంద్ర మోదీ గురించి పలుమార్లు పలు విధాలుగా మాట్లాడారు.

అలాగే “పాచిపోయిన లడ్డూ లాంటి ప్రత్యేక ప్యాకేజీ కూడా మోదీ సర్కారు రాష్ట్రానికి సరిగా ఇవ్వలేదు. ఉడుముకు ముఖంపై రాసిన తేనెలా రాష్ట్రం పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన అయోమయ పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను నాలుగేళ్లుగా అమలు చేయలేదు. నన్ను, బీజేపీని, టీడీపీని భాగస్వాములుగా ప్రజలు భావించారు. అందువల్ల వారికి నైతికంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని పవన్ చెప్పిన మాటలకు ఇప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో… బీజేపీ అవకాశవాద పార్టీ అని ఒకసారి, తెలుగు జాతిని అగౌరవపరిచిన పార్టీ బీజేపీ అని మరోసారి పవన్ కళ్యాణ్ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీని అడగాల్సి ఉంది అని కూడా పవన్ అన్నారు. మరి ఈ మాటలన్నిటికి ఆయన ఎలా స్పందిస్తారో.. వేచి చూడాలి.

సంక్రాంతి రేస్ కి భయపడిన బాలయ్య!

ఎన్టీఆర్ కధానాయకుడు , మహానాయకుడు చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ రూలర్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి డబల్ రోల్ తో వివిధ గెటప్పులు మరియు హైవోల్టేజ్ పంచ్ డైలాగ్స్ తో వస్తున్న రూలర్ ని చూస్తే దర్శకుడు కెఎస్ రవికుమార్ కూడా బోయపాటి తరహాలో విపరీతమైన యాక్షన్ సీన్ లను సినిమా మొత్తం నింపాడనిపిస్తుంది.

సరే .. అసలువిషయమేమిటంటే… బాలకృష్ణ నటించిన గత 6 సినిమాల రిలీజ్ డేట్ లను పరిశీలిస్తే , ఒక్క ‘పైసవసూల్’ మినహా అన్నీకూడా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్ కధానాయకుడు కి సీక్వెల్ గా వచ్చిన మహానాయకుడు కేవలం సంక్రాంతికి ఒకనెల గ్యాప్ తర్వాత రిలీజ్ అయింది. అయితే … ప్రతి సంక్రాతి రేస్ లో పాల్గొనే బాలయ్య ఈసారి మాత్రం తప్పుకున్నాడు. రూలర్ ని డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చెయ్యడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు.

ఒక పక్క జనవరి 11న మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’, జనవరి 12న అల్లుఅర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ మరియు జనవరి 13న వెంకటేష్-నాగ చైతన్యల ‘వెంకీ మామ’ సినిమాల రిలీజ్ డేట్ లను ప్రకటించడంతో వారి .. వారి హీరోల అభిమానులు పండగ చేసుకుంటానికి సిద్ధమయ్యారు. కానీ ఈసారి బాలయ్య అభిమానులకు మాత్రం పండగ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఒకవేళ రూలర్ గనుక అనుకున్న విజయం సాధిస్తే మాత్రం నందమూరి అభిమానులకు పండగ సంక్రాంతికి ముందే స్టార్ట్ అవొచ్చు… మరి రూలర్ తో బాలకృష్ణ ఏమి రికార్డ్స్ సృష్టిస్తాడో చూడాలి… !

చంద్రబాబుకి కౌంట్ డౌన్ స్టార్ట్ ?

చంద్రబాబు నాయుడు పై ఆర్ధిక అక్రమాల వార్తలు ఇటీవల జోరందుకున్నాయి. అందులో మొదటిది ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) అధికారిక ప్రకటన. సీబీడీటీ ఎక్కడా వ్యక్తి పేరు చెప్పకపోయినా ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీబీడీటీ అధికారిక ప్రకటన లో ఇటీవల ఓ ప్రముఖ కాంట్రాక్టర్ సంస్థపై దాడుల్లో 150 కోట్ల రూపాయలు ఓ రాజకీయ ప్రముఖుడికి ముడుపులు చెల్లించినట్లుగా ఆధారాలు దొరికినట్లు ప్రకటించారు. సంస్థ నవయుగ అని , రాజకీయ ప్రముఖుడు చంద్రబాబని అందరూ గుస గుసలాడుకుంటున్నారు. ఈ వార్త ల్లోని వేడి చల్లారక ముందే ఇంకో వార్త ఈ రోజు ప్రముఖంగా ముందుకొచ్చింది. అది 14 ఏళ్ల క్రితం నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. లక్ష్మీ పార్వతి 2005 లో చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నాడని అవినీతి నిరోధక శాఖ కు కంప్లెయింట్ ఇవ్వటం జరిగింది. దానిపై అవినీతి నిరోధక శాఖ విచారణ జరపగా ముందే చంద్రబాబు నాయుడు హై కోర్టు కెళ్ళి విచారణ జరపకుండా స్టే తీసుకొచ్చుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఆ స్టే అలానే కొనసాగుతుంది. ఇటీవల సుప్రీం కోర్టు సివిల్, క్రిమినల్ కేసుల్లో కూడా ఆరు నెలలకు మించి ఎటువంటి స్టే కోర్టు ఇవ్వరాదని చెప్పటంతో ఈ కేసు విచారణకు నోచుకుంది. వచ్చే సోమవారం అంటే 25వ తేదీ కేసు విచారణకు రానుంది. ఆమేరకు లక్ష్మీపార్వతి కి నోటీసులు పంపించారు. ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు సంభాషణ లపై విచారణ స్వీకరించింది. ఇప్పుడు జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కౌంట్ డౌన్ మొదలయిందని జనం అనుకుంటున్నారు.

తన గ్రహబలం బాగాలేదని , తన అవినీతి చర్యలు బహిర్గతం అయ్యే రోజులు దగ్గరపడ్డాయని, కష్టాలు ఎదుర్కోకతప్పదని తెలిసే తిరిగి మోడీకి, అమిత్ షా కి దగ్గర కావటానికి పడరాని పాట్లు పడటం మనం చూస్తున్నాం. నాగపూర్ వెళ్లి రహస్యంగా ఆర్ఎస్ఎస్ ని కలవటం, మోడీని వ్యతిరేకించి తప్పుచేశానని వైజాగ్ లో ప్రకటించటం, తన విశ్వాస పాత్ర ఎంపీ లను బీజేపీ లోకి పంపించటం లాంటి చర్యలన్నీ ఇందులో భాగమే. అయితే ఇప్పటివరకు మోడీ, అమిత్ షా చంద్రబాబు నాయుడు ని కనుకరించినట్లు ఎక్కడా సూచనలు లేవు. అది చంద్రబాబు నాయుడు కి కంటి కునుపు లేకుండా చేస్తుంది. ముందు ముందు జగన్ లాగానే తాను కూడా చిప్పకూడు తినాల్సివస్తుందనే బాధ, భయం తనని వెంటాడుతున్నాయని ఈ లోపే మోడీ కరుణిస్తాడేమోనని ఆశతో ఎదురుచూపులు చూస్తున్నాడట. అదే సమయంలో న్యాయవ్యవస్థలో తనకున్న పలుకుబడి తనను కాపాడుతుందని ఏడుకొండలవాడిని రోజూ తలుచుకుంటున్నాడని తెలుస్తుంది.

జగన్ పార్టీలో ముఖ్యులు చెప్పేదాన్నిబట్టి ఇప్పటికి బయటికొచ్చింది సముద్రంలో రెట్టలాంటిదని ముందు ముందు ఇంకా ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకోబోతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పై సానుభూతి అట్టడుగు స్థాయిలో ఉండటం కూడా తన అనుచరుల్లో కలవరానికి గురిచేస్తుంది. తన కుప్పిగంతులు,యు టర్న్ లు ప్రజల్లో తనపై క్రెడిబిలిటీ ని పూర్తిగా జీరో స్థాయికి తీసుకెళ్లాయి. తనను ఆకాశానికెత్తే మీడియా, తను ఏమిచేసినా మద్దతుగా నిలిచే తన సామాజికవర్గం తప్ప అన్ని సెక్షన్లలో విశ్వసనీయతను కోల్పోయాడు. ఎన్టీఆర్ పార్టీ ని స్థాపించినప్పటి నుంచి వెన్నంటి వున్నబీసీ సామజిక వర్గం మొట్టమొదటిసారి తెలుగు దేశానికి దూరం కావటం కూడా చంద్రబాబు పుణ్యమే. తప్పుడు వ్యూహాలు, ఎత్తుగడలతో వాళ్లలో విశ్వసనీయతను కోల్పోయాడు. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఒంటరి వాడయ్యాడు. పార్టీ లోని ద్వితీయ, తృతీయ నాయకత్వం కూడా మొట్టమొదటిసారి తన నాయకత్వంపై విమర్శలు చేయటం మొదలయ్యింది. అయితే అది ప్రస్తుతం నాలుగు గోడల మధ్యనే వుంది. త్వరలో పూర్తిగా బట్టబయలయ్యే అవకాశముందని ఊహిస్తున్నారు. పార్టీలోని కాపు సామజిక వర్గ నేతలంతా త్వరలో బీజేపీ లోకి మూకుమ్మడి వలస చేస్తారని అనుకుంటున్నారు. ఇంతమంది ని దూరం చేసుకోవటానికి కారణం తనపై విశ్వసనీయత లేకపోవటమేనని భావిస్తున్నారు. మోడీ ప్రసన్నుడు కాకపోయేటట్లయితే త్వరలో అవినీతి చిట్టాలు, సాక్ష్యాధారాలు తో సహా దర్యాప్తు సంస్థలకు చిక్కటం ఖాయమని అనుకుంటున్నారు. ఈ పరిణామం మోడీకి అనుకూలంగా ఉందని అనుకుంటున్నారు. అటు జగన్ మోహన్ రెడ్డి , ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ మోడీ ప్రసన్నం కోసం తంటాలు పడుతుంటే మోడీకి అంతకంటే ఆనందమేముంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం చంద్రబాబు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనని త్వరలో జైలు కెళ్ళటం ఖాయమని వైస్సార్సీపీ నాయకులు ఆంతరంగిక చర్చల్లో బల్లగుద్ది వాదిస్తున్నారు. పాపం చంద్రబాబు ఒకనాడు సంస్కరణలకు ఆద్యుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఇప్పుడు జైలు ఊసలు లెక్కించాల్సి వస్తుందేమోనని అనుకోవటం బాధాకరం. విధి వైపరీత్యం . చిదంబరం లాంటి ‘మేధావి’ , మాజీ హోం మంత్రికే తప్పనప్పుడు అందరిలోకి సీనియర్ నని చెప్పుకున్నంత మాత్రాన చేసిన పాపాలు వూరికే పోవు కదా. రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుందో వారు చెప్పగలరు?

పవన్ మీటింగ్ కి రాకుండా గుడివాడ వెళ్లి కొడాలినానిని కలిసిన రాపాక

జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దూరంగా ఉన్నారు. అదే సమయంలోనే గుడివాడలో ఎడ్ల పందాలలో ఆయన పాల్గొనడం గమనార్హం. ఆ పార్టీకి, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు మధ్య గ్యాప్ మరింతగా పెరిగినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎడ్ల పందాల ఎప్పుడూ చూడలేదని… వాటిని చూడటానికే ఇక్కడకు వచ్చానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు.

ఏపీ సీఎం జగన్ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆయన మరోసారి సమర్థించారు. ఇది సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రాజధాని రైతులు ధర్నాలు చేసేకంటే… సీఎం జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. జనసేనలో తన అభిప్రాయాన్ని స్వతంత్రంగా చెబుతానని ఎమ్మెల్యే రాపాక స్పష్టం చేశారు.

గత కొంతకాలంగా పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ కీలకమైన రాజధాని విషయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశానికి హాజరు కాకుండా కొడాలినాని నియోజక వర్గంలో హల చల్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆదే విధంగా అక్కడ కోడలినాని ని కలవడం పై అంతర్గత మతలబులు ఏమిటో తేలియాల్సి ఉంది.

“రాపాక-కొడాలినాని” ఈ స్నేహం ఎటువైపు దారితీస్తుందో.. వేచి చూద్దాం..!

ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము టీడీపీకి లేదు!

చాలా పరిణామాల అనంతరం ఈరోజు మీడియా ముందుకొచ్చిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికరమైన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టారు. చంద్రబాబు ఒక స్వార్థపరుడిగా పార్టీని నడిపించారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగకరంగా ఏమి చెయ్యలేదని, అసలు పార్టీని స్థాపించిన మహానుభావుడు ఎన్టీఆర్ లాగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఏ విధంగానూ నడిపించలేదని…. ఒక స్వార్థపూరితమైన అధ్యక్షతే వహించాడని…. అభిప్రాయపడ్డాడు.

నేను (వల్లభనేని వంశీ) ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఇప్పటివరకు చంద్రబాబు తీరుని సహించానని, ఇకపై నా వల్ల కాదు అనే తరహాలో వంశీ విరుచుకుపడ్డాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైస్ జగన్ చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను అభినందిస్తూ నేను ప్రభుత్వం చేసే మంచి పనులకు నా సపోర్ట్ ఎప్పటికి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఇంగ్లీష్ మీడియం విషయమై చంద్రబాబునుద్దేశించి మాట్లాడుతూ “ఏం .. నీకొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తప్పులేదా…? ఇప్పుడు నీ మనమడు చదివేది ఇంగ్లిష్ మీడియం కాదా..? అంతెందుకు నా పిల్లలు కూడా ఇంగ్లిష్ మీడియం చదివారు. ఏం.. తమాషాగా ఉందా…! మన పిల్లలు చదువుకుంటే సరిపోతుందా… మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి బలహీన వర్గాలకు చెందినవారు మరియు ఉన్నత కులంలో పుట్టి ఆర్ధికంగా స్థోమత లేనివారు చదువుకోవద్దా? ” అని ప్రశ్నించారు.

అంతేకాదు ఎన్టీఆర్ చనిపోయిన తరువాత ఇప్పటివరకు టిడిపి పార్టీ మిగతా పార్టీలతో పొత్తులు లేకుండా గెలవడం జరగలేదని, దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. మహా నాయకుడు ఎన్టీఆర్ తదనంతరం పార్టీని ఒంటరిగా గెలిపించే సత్తా చంద్రబాబు కి లేదు. గెలిచిన ప్రతి సారి ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు గెలియించాడే తప్ప ఒంటరిగా ఏమి చెయ్యలేకపోయాడని ఎద్దేవా చేసాడు వంశీ…

అసలే ఈరోజు కృష్ణాజిల్లా లో అత్యధిక ప్రాముఖ్యత (అటు రాజకీయంగా మరియు ఆర్ధికంగా) వున్న నాయకుడు, పార్టీ యువ నేత దేవినేని అవినాష్ చేజారిపోయిన కొన్ని గంటల్లోనే ప్రముఖ నాయకుడు చంద్రబాబు పై విరుచుకుపడుతూ… ఇక తను వైసీపీ లోకి వెళుతున్న సంగతి చెప్పకనే చెప్పాడు.

ఉత్తరాంధ్రలో పరిస్థితి కూడా రోజురోజుకి దిగజారుతోంది. గంటా శ్రీనివాసరావు ఏ క్షణమైనా బీజేపీ లోకి జారుకోవచ్చని వినికిడి … చూడాలి మరి ఎం జరుగుతుందో.. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏమిటో ????

రాజధాని విషయంలో మౌనంగా ఉందాం.. జనసేన నిర్ణయం, షాక్ లో అమరావతి రైతులు!

ఏపీ రాజధాని అమరావతి విషయంలో జనసేన ట్విస్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి రాజధానిని తరలించవద్దని ఆ ప్రాంత ప్రజలంతా ముక్తకంఠంతో కోరుతుంటే.. జనసేన పార్టీ రాజధాని ఆందోళనకు దూరంగా వుండాలని నిర్ణయించింది. శనివారం మంగళగిరిలో భేటీ అయిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఇప్పటికిప్పుడు ఆందోళన చేయడం వల్ల ఉపయోగం లేదని జనసేన పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశంలో రాజధాని అంశంతోపాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అంశంపై సమాలోచనలు జరిపారు. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు స్ఠానిక సంస్థల ఎన్నికల్ల తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సూచించారు.

మరికొందరు నేతలు ఇప్పటికే టీడీపీతో జనసేనను అంటగట్టి వైసీపీ ప్రచారం చేస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోను జతకడితే ఇక రెండు పార్టీలు ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లో పాతుకుపోతుందని అభిప్రాయపడ్డారు. అలాంటి సంకేతాలు వెళ్ళడం దీర్ఘకాలంలో మంచిది కాదని వారు పవన్ కల్యాణ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. చాలా సేపు చర్చ తర్వాత పొత్తుల నిర్ణయం అధినేత పవన్ కల్యాణ్‌కే వదిలేసినట్లు తెలుస్తోంది.

కాగా కీలకమైన రాజధాని అంశంపై కూడా జనసేన సమావేశంలో లోతుగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాజధానిపై ప్రభుత్వం అధికారికంగా స్పష్టమైన నిర్ణయం ప్రకటించాకే కార్యాచరణ రూపొందించాలని పవన్ నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండా రోడ్డెక్కడం వలన ఉపయోగం లేదని, ప్రభుత్వ ప్రకటన తర్వాతనే ప్రత్యక్ష కార్యాచరణ రూపొందిద్దామని పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పటికిప్పుడు రాజధాని అంశంపై ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్న సంకేతాలను పవన్ కల్యాణ్ పార్టీ వర్గాలు పంపినట్లయ్యింది.

పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పయనమయ్యారు. శనివారం మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన జనసేనాని.. అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఢిల్లీకి వెళ్లారు. జనసేనాని ఉన్నట్టుండి హస్తినకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ టూర్‌పై అప్పుడే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

పవన్ పెళ్లిళ్లు – జగన్ కేంటి నొప్పి?

పవన్ కళ్యాణ్ ఏమో తెలుగు బోధన మంచిదా… ఇంగ్లీష్ బోధన మంచిదా… మాట్లాడుతుంటే, జగన్ ఏమో పవన్ పెళ్ళాలు , పిల్లలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది కదూ… ? ప్రాధమిక విద్య బోధన తెలుగులో మంచిదా ఇంగ్లీషులో మంచిదా అన్నప్పుడు, మనం ఎక్కడ అమలుచేయాలనుకుంటున్నాం, ఎవరు బోధిస్తున్నారు, ఎవరికి బోధిస్తున్నారు అనేది ఆలోచించాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూల్స్ కి వెళ్ళేవాళ్ళు ఎవరంటే, ప్రైవేట్ కాన్వెంట్లో చదివించలేని పేద వాళ్ళు లేదా ఇంకో భాషలో చెప్పాలంటే బలహీన వర్గాలకు సంభందించిన విద్యార్థులు మాత్రమే.

జగన్ చెప్పిందాంట్లో నిజం ఉన్నది . ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ లో చదువు చెప్పాలనుకోవటంలో అర్థముంది. ఐతే సమస్యల్లా అమలు చేయడంలోనే. పల్లెటూళ్ళో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకులు తెలుగులో మాత్రమే చెప్పగలరు. విద్యార్థులను, అధ్యాపకులను ఒక్కసారిగా తెలుగు నుంచి ఇంగ్లీష్ లో చెప్పమంటే ఫలితాలు రావు. మన ప్రభుత్వ పాఠశాలల్లో దానికి తగిన వాతావరణం ప్రస్తుతం లేదు. ఆ వాతావరణాన్ని కల్పించటం ఎలా? ఐతే మనకు మన తెలుగు భాషను కాపాడుకోవటం ఎలా ? ఎన్నో ప్రశ్నలు కానీ సరైన సమాధానాలు లేవు . వీటన్నిటి గురించి వేరే వ్యాసంలో చర్చిద్దాం.

ఐతే ఇక్కడ ఎవరి వాదన కరెక్ట్ అనేది పక్కన పెడితే , ఇద్దరూ పరస్పరం వ్యంగంగా మాట్లాడుకోవటం విడ్డురంగా ఉంది. పవన్ తెలుగులోనే బోధించాలి అనటంలో ఆయన స్పష్టంగా ఎందుకు అవసరమో చెప్పలేదు. తెలుగు భాష మీద అందరికీ ప్రేమ ఉంది కానీ ఈ మాట్లాడే ఏఒక్కరి కుటుంబాల్లో తెలుగులో అభ్యసించే వాళ్ళేలేరు. జగన్ పవర్లో లేనంతకాలం తెలుగు మీద విపరీతమైన ప్రేమని ఒలకపోసి అధికారంలోకి రాగానే వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డురంగా ఉంది. జగన్ గారు ఐనా పవన్ పెళ్ళాల గురించి మాట్లాడితే మీరు పలచనైపోతారు గాని అది హుందాగా ఉండదు. ఐనా ఒక భార్యకు విడాకులిచ్చి వేరేవాళ్లను పెళ్లిచేసుకోవటం చెడ్డపనికాదు. ఇంకా చెప్పాలంటే మన రాజకీయనాయకుల్లాగా, సినిమా యాక్టర్లగా ఒకేభార్య కానీ ఎంతోమందితో సంబంధాలు పెట్టుకోవటం కంటే మంచిదేగదా?

తెలుగు రాష్ట్రాలకు చెందిన సీబీఐ ఆఫీసర్ మాకు వద్దు: అమిత్ షాకు విజయ్ సాయిరెడ్డి లేఖ

ఏపీ సిఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి మీద నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ జేడీగా తెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలకు సంబంధం లేని అధికారిని నియమించాలని విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన అమిత్ షా… విజయసాయిరెడ్డి లేఖపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు సూచించారు. ఈ మేరకు సంబంధిత లేఖను విజయసాయిరెడ్డికి కూడా అమిత్ షా కార్యాలయం ప్రత్యుత్తరం ఇచ్చింది.

ఆ లేఖలో ఏముందంటే..

‘ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌లో సీబీఐ జేడీగా నియమించాలి. గతంలో సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేశారు. ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తి, రాజకీయాలతో ముడి పడి ఉన్న అధికారి. కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. లక్ష్మీనారాయణతో పలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న కాలంలో ఆయన ఎస్పీగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించాలి’ అని విజయసాయిరెడ్డి లేఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు.

కైఫీ అజ్మీకి గూగుల్ డూడుల్ నివాళి

కైఫీ అజ్మీకి ఈ రోజు (జనవరి 14)న తన 101 వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ చేసిన డూడుల్ లో నివాళి అర్పించింది.

ఎవరు ఈ కైఫీ అజ్మీ?

భారతీయ కవి, పాటల రచయిత మరియు సామాజిక మార్పు న్యాయవాది, రైతు ఆత్మహత్యలు మరియు వారి హక్కుల గురించి, మహిళల హక్కులు మరియు వారి మత సామరస్యం గురించి పోరాడిన సంఘ సంస్కర్త ఈ కైఫీ అజ్మీ

జననం

భారత్ లోని ఉత్తర ప్రదేశ్ లో అజ్మార్గ్ జిల్లా లో జమీందార్ కుటుంబంలో అజ్మీ అథర్, హుస్సేన్ రిజ్వి అనే దంపతులకు జనవరి 14, 1919 న జన్మించాడు.

రచనలు

అతను తన మొదటి గజల్ ‘ఇట్నా టు జిందగీ మెయి కిసి కి ఖలాల్ పాడే’ ను పదకొండేళ్ళ వయసులో వ్రాసాడు. 1952 లో షాహిద్ లతీఫ్ దర్శకత్వం వహించిన ‘బుజ్దిల్’ అనే చిత్రం లో అతని మొదటి పాట రాసాడు. అతను 1997 ‘చంద్ గ్రాహన్’ అనే చిత్రం కోసం తన చివరి పాట రాశాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు.

19 సంవత్సరాల వయస్సులో అతను కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు మరియు కమ్యూనిస్ట్ నాయకుడు సజ్జాద్ జహీర్ బొంబాయికి ‘కౌమి జంగ్’ పేపర్ కోసం రాయడానికి ఆహ్వానించాడు.

కైఫీ అజ్మీ రంగస్థల నటి షౌకత్ కైఫీని వివాహం చేసుకున్నారు.

అవార్డులు-రివార్డులు

అజ్మి తన రచనలకు అనేక అవార్డులను గెలుచుకున్నారు, M.S. యొక్క స్క్రీన్ ప్లే మరియు డైలాగ్ కొరకు నేషనల్ అవార్డు మరియు ఫిల్మ్ ఫేర్ అవార్డుతో సహా. సత్యూ యొక్క 1974 చిత్రం ‘గార్మ్ హవా’. సాహిత్యం మరియు విద్యకు “పద్మశ్రీ” అవార్డు మరియు సాహిత్య అకాడమీ ఫెలోషిప్ కూడా అందుకున్నారు.

రైతు ఆత్మహత్యలు మరియు వారి హక్కుల గురించి, మహిళల హక్కులు మరియు మత సామరస్యం గురించి అజ్మీ రాశారు. అజ్మి యొక్క ప్రసిద్ధ కవితలలో ఒకటైన “ఉరా రత్” మహిళల సమానత్వం కోసం రాసారు. అతను తన జీవితకాలమంతా విజేతగా నిలిచిన కారణాలలో ఇది ఒకటి.

మరణం

అతను తన జీవితంలో చివరి ఇరవై సంవత్సరాలు అతను జన్మించిన ఉత్తర ప్రదేశ్ లోని మిజ్వాన్ అనే చిన్న గ్రామంలో గడిపాడు. అక్కడ అతను బాలికల కోసం కైఫీ అజ్మీ హయ్యర్ సెకండరీ స్కూల్, బాలికల కోసం కైఫీ అజ్మీ ఇంటర్ కాలేజ్, కైఫీ అజ్మీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ మరియు కైఫీ అజ్మీ ఎంబ్రాయిడరీ మరియు కుట్టు కేంద్రాన్ని నడుపుతున్న మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించారు.

అత్యుత్తమ నివాసయోగ్య నగరం మన హైదరాబాదు

మన హైదరాబాద్ నగరం అగ్ర స్థానాన నిలవటం మనందరికీ ఎంతో గర్వంగా వుంటుంది. అటువంటి సంఘటన ఇప్పుడు మరలా చోటుచేసుకుంది. ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక మింట్ మనదేశంలోని 6 ప్రధాన మెట్రో నగరాలను తీసుకొని వివిధ అంశాల ఆధారంగా అన్నింటిలోకి హైదరాబాద్ అత్యంత నివాస యోగ్య నగరంగా ప్రకటించింది. ఇది మనందరికీ గర్వకారణం. మరి తక్షణం మన మదిలో మెదిలే సమస్య మన హైద్రాబాదులో సమస్యలు లేవా అనేది. ఎన్నో సమస్యలున్నాయి ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, ప్రజా రవాణా అందుబాటు లాంటి అనేక సమస్యలు వెంటాడుతుంటే హైద్రాబాదు ని ఎలా ప్రకటించారనేది మనందరి మదిలో తొలుస్తోంది కదూ . ఒక్కసారి ఏ ప్రాతిపదికన నిర్ణయించారో పరిశీలిస్తే మనకే అర్ధమవుతుంది. రెండోది, మిగతా నగరాలు ఇంతకన్నా అధ్వానంగా ఉన్నాయని అనుకోవాలి. వివరాల్లోకి వెళితే ,

మొత్తం పది అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. పనిదినాల్లో రోడ్ల పై ప్రయాణానికి పట్టే సమయం, ప్రజా రవాణా సదుపాయం, కొత్తగా వచ్చే వలసలు, అన్ని కులాలు, మతాలు కలిసి నివసించే వైవిధ్యం , అందుబాటులో ఇళ్ళు , ఆహార సదుపాయాలు, స్కూళ్ళు ఆసుపత్రులు లాంటి మౌలిక సదుపాయాలు, పచ్చదనం, పరిశుభ్రమైన గాలి, మునిసిపాలిటీ ఆర్ధిక స్తోమత అంశాలు తీసుకున్నారు. ఇందులో రోడ్ల పై ప్రయాణానికి పట్టే సమయం, కొత్తగా వచ్చే వలసలు, అందుబాటులో ఇళ్ళు , మౌలిక సదుపాయాలు అంశాల్లో హైదరాబాదు మిగతా అయిదు నగరాల కన్నా ముందంజలో వుంది. అలాగే మునిపాలిటీ ఆర్ధిక స్తోమతలో అన్ని నగరాలకన్నా వెనకబడివుంది. ప్రజా రవాణా , ఆహార సదుపాయాల్లో చివరినుంచి రెండో స్థానం లో వుంది. మొత్తం మీద చూస్తే హైదరాబాద్ ముందంజ లో వుంది.

కానీ ముఖ్యమైన రోడ్ల పరిస్థితి, మురుగునీటి పారుదల సౌకర్యం , వర్షపు నీటి కాల్వలు లాంటి ముఖ్యమైన అంశాలను ఈ సంస్థ పరిగణనలోకి తీసుకోకపోవటం శోచనీయం. వర్షమొస్తే చాలు భయపడే పరిస్థితి హైదరాబాదు ప్రజలు అనుభవిస్తున్నారు. రోడ్ల మీద ప్రయాణం ఒళ్ళు హూనమవుతుంది. మురుగునీరు అనేకచోట్ల ఇప్పటికీ రోడ్లమీద ప్రవహిస్తూంది. వీటికి ఇప్పట్లో మోక్షం వుండే సూచనలు కన్పించటం లేదు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన దశాబ్దాలనుండి కొనసాగుతూనే వుంది. ప్రభుత్వాలు మారినా, కోట్ల రూపాయల ప్రజా ధనం వరదలై పారినా ఆ మురుగు కంపు మాత్రం వదల్లేదు. హైదరాబాదులోని వందల చెరువులు మాయమయ్యాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కబ్జాదారులకు భయంలేదు. యథేచ్ఛగా చెరువులు మాయమవుతూనే వున్నాయి. ఒకవైపు నంబర్ వన్ ర్యాంకు వచ్చినందుకు సంబరపడాలో , వాస్తవ పరిస్థితులు భిన్నంగా వున్నందుకు బాధపడాలో అర్ధంకాని పరిస్థితి ప్రజలది. ఏడుపుని దిగమింగుకొని హైదరాబాదు ఒకటో ర్యాంకు లో నిలిచినందుకు చప్పట్లు కొడదాం , ఎంతయినా మన హైదరాబాదు ప్రజలుగా గర్వపడాలి కదా

థమన్ దూకుడికి కారణం..? ఆ.. అక్షరమేనా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న థమన్ SS పూర్తి పేరు “ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్”. మొన్నటివరకు తెరమీద SS థమన్ గా పేరువేయించుకున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈమధ్య థమన్ S గా మర్చి వేయిస్తున్నాడు.

పేరు మార్పులో వచ్చిన కారణమో… ఏమో గాని చేతినిండా సినిమాలతో తెలుగు ప్రేక్షకులని తన సంగీతంలో ముంచేయడానికి సిద్దమయ్యాడు. అల‌ వైకుంఠ‌పురములో, వెంకీ మామ, డిస్కోరాజా, ప్రతిరోజు పండగే, మిస్ ఇండియా వంటి వరుస సినిమాలతో చాల హుషారుగా ఉన్నాడు. ఇతను ఒక్క తెలుగు సినిమాలకే కాకుండా తమిళ్ లో కూడా బిజీగానే ఉన్నాడు.

రాబోయే సినిమాల నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి వీడియో యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సృష్టిస్తూ కామెంటర్స్ చేత శభాష్ అనిపించుకుంటున్నాయి. ఈ మధ్య రిలీజ్ ఆయిన అల‌ వైకుంఠ‌పురములో సాంగ్స్ అయితే ఒక్కో వీడియోకి 100 మిలియన్స్ వ్యూస్ పైగా తెచ్చుకున్నాయి.

తన పేరులో ఒక అక్షరం తగ్గిన తరువాత ఈ దూకుడు మరింత ఎక్కువైనట్టుగా ఉంది. వరుస సినిమాలతో రాబోతున్న థమన్ S, తన పేరు బలం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి మరి.

వీడియో:చూస్తుండగానే మనిషి మెడ కొరికి… భయంకరమైన దృశ్యం

ఆయనకి కొంచం దూరంలో అనేమంది ఉన్నారు కానీ.. 4 పులులు చుట్టి ముట్టాయి.. అక్కడున్నవారు ఆయనను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది.. చూస్తున్నడగానే ఆ మనిషిని చంపేసింది పులి. సంగమనేర్ లో జరిగిన ఈ భయంకరమైన దృశ్యం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

దర్బార్ తో దుమ్ములేపిన రజినీకాంత్

రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దర్బార్ సినిమా మోషన్ పోస్టర్ వీడియోను వివిధ భాషల్లో స్టార్ హీరోల చేత రిలీజ్ చేయించారు. ఈచిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ వీడియోను పిన్స్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా యూట్యూబ్ వీడియో లింక్ ని రిలీజ్ చేసారు. యూట్యూబ్ లో రిలీజ్ అయిన దగ్గర్నుండి విసిటింగ్ కౌంట్ స్టార్ట్ అయిపొయింది.

ఇక వీడియో విషయానికి వస్తే పోలీస్ ఆఫిసర్ గెట్ అప్ లో రజిని ఇరగదీసాడు. మాస్ ఎలిమెంట్స్ ఎక్కడా తగ్గకుండా చిత్రాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వావ్ అనిపించేలా ఉంది. మొత్తానికి దర్బార్ మోషన్ వీడియో తో రజిని దుమ్ము లేపేసాడు. మురుగుదాస్ దర్శకత్వ ప్రతిభ గురించి అందరికి తెలిసిందే. 2020 జనవరి 12న రిలీజ్ అవ్వనున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రీయేట్ చేస్తుందో చూడాలి మరి!

జగన్నాటకానికి.. పవన్ వ్యూహం.. ఫలిస్తుందా..?

ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా ప్రారంభమైన రాజధాని మంట ఇంకా రగులుతూనే ఉంది. ఈ విషయాన్ని గూర్చి కొన్ని టీవీ చాన్నాళ్లు, పత్రికలు, ఎంతగా ప్రచారం చేసినా.. అలాగే టీడీపీ నేతలు, అమరావతి రైతులు ఎంతగోల పెట్టినా.. రాజధాని సమస్య అమరావతిని దాటలేదు అనేది వాస్తవం. నిజానికి “రాష్ట్ర రాజధాని” సమస్య కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు అయినా సరే అమరావతి మినహా ఏ జిల్లా ప్రజలు కూడా స్పందించక పోవడం గమనార్హం.

రాజధాని మార్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటీ అంటనట్టే ఉన్నారు అనేది వాస్తవం. మొన్నొక సారి రైతుల దగ్గరికి వెళ్లిన పవన్ మరళా నోరు మెదపలేదు. అయితే ప్రస్తుతం ఆయన మరోసారి రైతుల తరుపున జగన్ సర్కారుపై పోరాటానికి సిద్ధమౌతున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి పంట పండే పొలాలను ఇచ్చిన తర్వాత వాటిని బీడు భూములుగా మార్చారు, కొన్ని చోట్ల రోడ్లు వేశారు, ఎవరి భూమి ఎక్కడ ఉందొ కూడా తెలియని పరిస్థితి. కావున రైతులకు న్యాయం జరగాలని అని జనసేనాని రైతుల తరుపున పోరాటంలోకి దిగుతున్నాడు.

“ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు వైసీపీ పార్టీ చేస్తోందని, జగన్మోహన్ రెడ్డి దిగి రావాలని, రైతుల మధ్యకు వెళ్ళాలని వారి సమస్యలను తెలుసుకోవాలి.దీనిపై ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి అని జనసేన డిమాండ్ చేస్తుంది. జగన్ కి అక్కడ ఆస్తులు లేవని రాజధానిని మారుస్తున్నారా..? లేక చంద్రబాబుకి ఆస్తులు పోతాయని మార్చద్దంటున్నాడా..? అనేది అప్రస్తుతం కానీ రైతుల అస్థిత్వాన్ని కాపాడటానికి రాజధానిని మార్చద్దంటున్నారు పవన్ కళ్యాణ్.

జనసేన పార్టీని, జనసైనికులని అష్ట దిగ్భందన దాడి చేస్తూ.. జగన సర్కార్ ఇప్పటివరకు బాగానే నిలువరించింది అనేది నిజం. కానీ వ్యూహాలకి ప్రతి వ్యూహాలు రచిస్తూ,అన్నిటినీ ఎదుర్కుంటూ,ఎదురునిలవడం ఎలా అనేదే.. జనసేనలో ఉన్న అతిపెద్ద సమస్య. ఈ సమస్యని ఎదిరించి రాజధాని విషయం పై జనసేన ఎంతవరకు విజయం సాధిస్తుందో.. వేచిచూడాలి..

ఉత్తమ్ రాజీనామా? ఇక ఆ.. అవకాశం రేవంత్ కేనా?

ఇటీవల హుజూర్ నగర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని చవిచూసింది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో తదుపరి టీపీసీసీ అధ్యక్షడు ఎవరు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోని తాజా రాజకీయ పరిణామాలను పరిశీలించేందుకు ఏఐసీసీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన పార్టీ పరిస్థితులపై సమాచారం సేకరించి, పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరుపనున్నారు.

మరోవైపు, టీపీసీసీ అధ్యక్ష పదవికి అనేక మంది పోటీపడుతన్నారు. ఇలాంటి వారిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టు విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, సంపత్ కుమార్‌లు పోటీపడుతున్నట్టు సమాచారం.అయితే, వీరిలో అందరికంటే ఎక్కువగా రేవంత్ రెడ్డికే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పైగా, మల్కాజ్‌గిరి ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.

మరి అధిష్టానం ఆలోచనలు ఎలాఉన్నాయో ? ఆ.. పదవికి పోటీ పడుతున్న వారి ఎత్తులు -పైఎత్తులు పాలిస్తాయోలేదో? వేచి చూదాం…!

జగన్‌కు కృతజ్ఞతలు చెప్పిన తమిళనాడు సీఎం

తమిళనాడులో నీటి అవసరాలను మరింత మెరుగుపరిచేలా గోదావరి–కావేరీ నదుల అనుసంధానం పథకం అమలు కోసం తమ కోర్కెను మన్నించి సకాలంలో సహకరించిన ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.
ఇందుకోసం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి వీలైనంత త్వరగా వారి అంగీకారాన్ని పొందాలని కోరుతూ ఉత్తరాల ద్వారా, స్వయంగా కలిసినపుడు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశానని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు.

గత ఏడాది వేసవిలో తీవ్రమైనకరువు పరిస్థితులు నెలకొనడంతో… తెలుగు గంగ ద్వారా తాగునీరు విడుదల చేయాలని తమిళనాడు మంత్రులు ఏపీ సీఎం జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో… తమిళనాడుకు తెలుగు గంగ నీటిని విడుదల చేశారు.