
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఎన్నికల సమయంలో పలు సందర్భాలలో బీజేపీ ని విమర్శించిన పవన్ ఇప్పుడు అదే పార్టీతో కలిసి పనిచేయడం అనేక ఆలోచనలకు తావిస్తుంది. 2019 అక్టోబరులో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సభలో ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.‘‘చస్తే చస్తాం గానీ.. జనసేన పార్టీని ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయం. మనం కలుపుతామా భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని. చస్తే చస్తాం.. ఉంటే ఉంటాం.. పోతే పోతాం.. కానీ తెలుగుజాతి ఉన్నతిని, గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాం’’ అంటూ ప్రజాపోరాట యాత్ర సందర్భంగా ఆయన బీజేపీ, ప్రధాన నరేంద్ర మోదీ గురించి పలుమార్లు పలు విధాలుగా మాట్లాడారు.
అలాగే “పాచిపోయిన లడ్డూ లాంటి ప్రత్యేక ప్యాకేజీ కూడా మోదీ సర్కారు రాష్ట్రానికి సరిగా ఇవ్వలేదు. ఉడుముకు ముఖంపై రాసిన తేనెలా రాష్ట్రం పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన అయోమయ పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను నాలుగేళ్లుగా అమలు చేయలేదు. నన్ను, బీజేపీని, టీడీపీని భాగస్వాములుగా ప్రజలు భావించారు. అందువల్ల వారికి నైతికంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని పవన్ చెప్పిన మాటలకు ఇప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో… బీజేపీ అవకాశవాద పార్టీ అని ఒకసారి, తెలుగు జాతిని అగౌరవపరిచిన పార్టీ బీజేపీ అని మరోసారి పవన్ కళ్యాణ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీని అడగాల్సి ఉంది అని కూడా పవన్ అన్నారు. మరి ఈ మాటలన్నిటికి ఆయన ఎలా స్పందిస్తారో.. వేచి చూడాలి.
Moham umchina tuduchunkuntadu pic.twitter.com/fsGr1R26FU
— VK (@VkMB07) January 16, 2020
అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా కలవడం వెనుక రహస్యం ఏమిటో…?
“బోస్ ఈజ్ రైట్” అని సరిపెట్టుకుంటారా..?
జనసైనికులు సమాధానం ఏమిటి? #ysjagan #BJPAllianceWithJSP #JanaSenaParty #Pawan pic.twitter.com/UpLBKNrqOD
— Jai Jagan (@JaiJaga65249433) January 17, 2020
అప్పుడు తిట్టి, ఇప్పుడు ఇలా కలవడం వెనుక రహస్యం ఏమిటో…?
“బోస్ ఈజ్ రైట్” అని సరిపెట్టుకుంటారా..?
జనసైనికులు సమాధానం ఏమిటి? #ysjagan #BJPAllianceWithJSP #JanaSenaParty #Pawan #JspBjpAlliance pic.twitter.com/cHvNICjPxb
— Jai Jagan (@JaiJaga65249433) January 17, 2020