
పవన్ కళ్యాణ్ ఏమో తెలుగు బోధన మంచిదా… ఇంగ్లీష్ బోధన మంచిదా… మాట్లాడుతుంటే, జగన్ ఏమో పవన్ పెళ్ళాలు , పిల్లలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది కదూ… ? ప్రాధమిక విద్య బోధన తెలుగులో మంచిదా ఇంగ్లీషులో మంచిదా అన్నప్పుడు, మనం ఎక్కడ అమలుచేయాలనుకుంటున్నాం, ఎవరు బోధిస్తున్నారు, ఎవరికి బోధిస్తున్నారు అనేది ఆలోచించాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూల్స్ కి వెళ్ళేవాళ్ళు ఎవరంటే, ప్రైవేట్ కాన్వెంట్లో చదివించలేని పేద వాళ్ళు లేదా ఇంకో భాషలో చెప్పాలంటే బలహీన వర్గాలకు సంభందించిన విద్యార్థులు మాత్రమే.
జగన్ చెప్పిందాంట్లో నిజం ఉన్నది . ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ లో చదువు చెప్పాలనుకోవటంలో అర్థముంది. ఐతే సమస్యల్లా అమలు చేయడంలోనే. పల్లెటూళ్ళో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకులు తెలుగులో మాత్రమే చెప్పగలరు. విద్యార్థులను, అధ్యాపకులను ఒక్కసారిగా తెలుగు నుంచి ఇంగ్లీష్ లో చెప్పమంటే ఫలితాలు రావు. మన ప్రభుత్వ పాఠశాలల్లో దానికి తగిన వాతావరణం ప్రస్తుతం లేదు. ఆ వాతావరణాన్ని కల్పించటం ఎలా? ఐతే మనకు మన తెలుగు భాషను కాపాడుకోవటం ఎలా ? ఎన్నో ప్రశ్నలు కానీ సరైన సమాధానాలు లేవు . వీటన్నిటి గురించి వేరే వ్యాసంలో చర్చిద్దాం.
ఐతే ఇక్కడ ఎవరి వాదన కరెక్ట్ అనేది పక్కన పెడితే , ఇద్దరూ పరస్పరం వ్యంగంగా మాట్లాడుకోవటం విడ్డురంగా ఉంది. పవన్ తెలుగులోనే బోధించాలి అనటంలో ఆయన స్పష్టంగా ఎందుకు అవసరమో చెప్పలేదు. తెలుగు భాష మీద అందరికీ ప్రేమ ఉంది కానీ ఈ మాట్లాడే ఏఒక్కరి కుటుంబాల్లో తెలుగులో అభ్యసించే వాళ్ళేలేరు. జగన్ పవర్లో లేనంతకాలం తెలుగు మీద విపరీతమైన ప్రేమని ఒలకపోసి అధికారంలోకి రాగానే వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డురంగా ఉంది. జగన్ గారు ఐనా పవన్ పెళ్ళాల గురించి మాట్లాడితే మీరు పలచనైపోతారు గాని అది హుందాగా ఉండదు. ఐనా ఒక భార్యకు విడాకులిచ్చి వేరేవాళ్లను పెళ్లిచేసుకోవటం చెడ్డపనికాదు. ఇంకా చెప్పాలంటే మన రాజకీయనాయకుల్లాగా, సినిమా యాక్టర్లగా ఒకేభార్య కానీ ఎంతోమందితో సంబంధాలు పెట్టుకోవటం కంటే మంచిదేగదా?