
చాలా పరిణామాల అనంతరం ఈరోజు మీడియా ముందుకొచ్చిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికరమైన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టారు. చంద్రబాబు ఒక స్వార్థపరుడిగా పార్టీని నడిపించారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగకరంగా ఏమి చెయ్యలేదని, అసలు పార్టీని స్థాపించిన మహానుభావుడు ఎన్టీఆర్ లాగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఏ విధంగానూ నడిపించలేదని…. ఒక స్వార్థపూరితమైన అధ్యక్షతే వహించాడని…. అభిప్రాయపడ్డాడు.
నేను (వల్లభనేని వంశీ) ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఇప్పటివరకు చంద్రబాబు తీరుని సహించానని, ఇకపై నా వల్ల కాదు అనే తరహాలో వంశీ విరుచుకుపడ్డాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైస్ జగన్ చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను అభినందిస్తూ నేను ప్రభుత్వం చేసే మంచి పనులకు నా సపోర్ట్ ఎప్పటికి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఇంగ్లీష్ మీడియం విషయమై చంద్రబాబునుద్దేశించి మాట్లాడుతూ “ఏం .. నీకొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తప్పులేదా…? ఇప్పుడు నీ మనమడు చదివేది ఇంగ్లిష్ మీడియం కాదా..? అంతెందుకు నా పిల్లలు కూడా ఇంగ్లిష్ మీడియం చదివారు. ఏం.. తమాషాగా ఉందా…! మన పిల్లలు చదువుకుంటే సరిపోతుందా… మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి బలహీన వర్గాలకు చెందినవారు మరియు ఉన్నత కులంలో పుట్టి ఆర్ధికంగా స్థోమత లేనివారు చదువుకోవద్దా? ” అని ప్రశ్నించారు.
అంతేకాదు ఎన్టీఆర్ చనిపోయిన తరువాత ఇప్పటివరకు టిడిపి పార్టీ మిగతా పార్టీలతో పొత్తులు లేకుండా గెలవడం జరగలేదని, దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. మహా నాయకుడు ఎన్టీఆర్ తదనంతరం పార్టీని ఒంటరిగా గెలిపించే సత్తా చంద్రబాబు కి లేదు. గెలిచిన ప్రతి సారి ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు గెలియించాడే తప్ప ఒంటరిగా ఏమి చెయ్యలేకపోయాడని ఎద్దేవా చేసాడు వంశీ…
అసలే ఈరోజు కృష్ణాజిల్లా లో అత్యధిక ప్రాముఖ్యత (అటు రాజకీయంగా మరియు ఆర్ధికంగా) వున్న నాయకుడు, పార్టీ యువ నేత దేవినేని అవినాష్ చేజారిపోయిన కొన్ని గంటల్లోనే ప్రముఖ నాయకుడు చంద్రబాబు పై విరుచుకుపడుతూ… ఇక తను వైసీపీ లోకి వెళుతున్న సంగతి చెప్పకనే చెప్పాడు.
ఉత్తరాంధ్రలో పరిస్థితి కూడా రోజురోజుకి దిగజారుతోంది. గంటా శ్రీనివాసరావు ఏ క్షణమైనా బీజేపీ లోకి జారుకోవచ్చని వినికిడి … చూడాలి మరి ఎం జరుగుతుందో.. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏమిటో ????