
ఎన్టీఆర్ కధానాయకుడు , మహానాయకుడు చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ రూలర్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి డబల్ రోల్ తో వివిధ గెటప్పులు మరియు హైవోల్టేజ్ పంచ్ డైలాగ్స్ తో వస్తున్న రూలర్ ని చూస్తే దర్శకుడు కెఎస్ రవికుమార్ కూడా బోయపాటి తరహాలో విపరీతమైన యాక్షన్ సీన్ లను సినిమా మొత్తం నింపాడనిపిస్తుంది.
సరే .. అసలువిషయమేమిటంటే… బాలకృష్ణ నటించిన గత 6 సినిమాల రిలీజ్ డేట్ లను పరిశీలిస్తే , ఒక్క ‘పైసవసూల్’ మినహా అన్నీకూడా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్ కధానాయకుడు కి సీక్వెల్ గా వచ్చిన మహానాయకుడు కేవలం సంక్రాంతికి ఒకనెల గ్యాప్ తర్వాత రిలీజ్ అయింది. అయితే … ప్రతి సంక్రాతి రేస్ లో పాల్గొనే బాలయ్య ఈసారి మాత్రం తప్పుకున్నాడు. రూలర్ ని డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చెయ్యడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు.
ఒక పక్క జనవరి 11న మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’, జనవరి 12న అల్లుఅర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ మరియు జనవరి 13న వెంకటేష్-నాగ చైతన్యల ‘వెంకీ మామ’ సినిమాల రిలీజ్ డేట్ లను ప్రకటించడంతో వారి .. వారి హీరోల అభిమానులు పండగ చేసుకుంటానికి సిద్ధమయ్యారు. కానీ ఈసారి బాలయ్య అభిమానులకు మాత్రం పండగ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఒకవేళ రూలర్ గనుక అనుకున్న విజయం సాధిస్తే మాత్రం నందమూరి అభిమానులకు పండగ సంక్రాంతికి ముందే స్టార్ట్ అవొచ్చు… మరి రూలర్ తో బాలకృష్ణ ఏమి రికార్డ్స్ సృష్టిస్తాడో చూడాలి… !