Home Blog Page 8636

పవన్ జోష్… ఇక చంద్రబాబు పని అయిపోయినట్టేనా!

ఇసుక కొరత వలన ఇబ్బందులు పడుతున్న కార్మికులకు అండగా విశాఖలో జరిగిన జనసేన ‘లాంగ్ మార్చ్’ విజయంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం కనిపిస్తుంది. ఇసుక ఇబ్బందులపై ప్రభుత్వంతో పోరాడటానికి పవన్ కళ్యాణ్ వెంట వచ్చిన ఇసుకేస్తే రాలనంత జనంని చూసి జనసేనని విమర్శించే వాళ్ళు కూడా కొంత ఆలోచనలో పడ్డారు.

పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత మాటలు మినహాయిస్తే లాంగ్ మార్చ్ ‘చలో విశాఖపట్నం’ బాగా జరిగిందని చెప్పాలి. ఇదే రీతిలో గనుక జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఆవేశాన్ని తగ్గించుకొని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ… అప్పుడప్పుడు కాకుండా ఎక్కువశాతం ప్రజలను కలుస్తూ ఉంటే గనుక తనకి సినిమా పరమైన స్టార్ హోదా (అభిమానం) తో పాటు ప్రజా నాయకుడిగా మరింత ప్రజలకు దగ్గరవచ్చు అనడంలో సందేహములేదు.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు తనకి ఎంతో మంది ఉన్నారు. కానీ అది కేవలం ఒక సినిమా స్టార్ గానే , ఒక రాజకీయ నాయకుడిగా ఇంకా తనకి ప్రజల మనస్సులో చోటు సంపాదించుకోవాలిసిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రజల్లో “ఆ…. పవన్ కళ్యాణ్ ఎప్పుడో వస్తాడు …. నాలుగు మాటలు మాట్లాడుతాడు…. వెళ్ళిపోతాడు. అంతేగా….. !! ” అనే భావన ఉంది.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే అత్యధికమగా 18-30 సంవత్సరాల వయసు గలవారి మద్దతు ఎక్కువగా ఉంది. 30-40 సంవత్సరాల వయసు ఉన్నవారు మద్దతు కొంతవరకు ఉంది. ఇకపోతే 50 ఆపైన వయసున్నవారి మద్దతు ఎక్కడో పట్టణాలలో ఉన్నవారు లేదా చదువుకున్నవారిలో కొంత ఉండొచ్చు. కానీ ఈ వయసు కలిగిన పల్లెటూరుల్లో నివసిస్తున్న వారి శాతం చాలా ఎక్కువ వారి ఓట్లు ఎంతో విలువైనవి ప్లస్ వారు ప్రతి ఎన్నికల్లో మిస్ అవ్వకుండా ఓట్లు వేస్తారు. కనుకనే వారి మనసులను కూడా గెలుచుకుంటేనే అనుకున్నది సాధించవచ్చు. దానికి ఒక రాజకీయ నాయకుడిగా తన హోదా ప్రకారం మాట్లాడితే చాలు . వారితో మమేకమై ఉంటే మరీ మంచిది!.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే … ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకోవడం కొంత వరకు టిడిపి కి ఇబ్బందికరంగానే ఉంది . దానికి తోడు చంద్రబాబు వయసు మళ్లడం, వారసుడేమో తండ్రి కి తగ్గ కొడుకుగా లోకేష్ కి రాజకీయ చాతుర్యం లేకపోవడం, పైగా పప్పు అనే ముద్ర పడడంతో… టిడిపి నాయకులకు సరైన భవిష్యత్తు కనిపించక పార్టీ విడిచి వెళ్ళిపోతున్న సంగతి మనకు తెలిసిందే. అంతే గాక ప్రజల్లో కూడా చంద్రబాబు అంటే ఆయనకి ఎటు తోస్తే అటు మాట్లాడతాడు. అందితే జుట్టు అందకుంటే కాళ్లు పట్టుకునే రకం అనే భావన స్వతహాగా చంద్రబాబు తనంతట తానే గత ఎన్నికల సమయంలో మరియు ఎన్నికల తర్వాత తన తీరుని బట్టి ప్రజలకు దూరమైనట్టే!

ఇకపోతే ఇదే ఉత్సహంతో గనుక జనసేనాని ముందుకెళుతూ అనవసరమైన టిడిపి నాయకుల పొత్తులు లేకుండా గనుక వుంటే కచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని వెనక్కి నెట్టడం ఖాయం… ఇంకా నాలుగు సంవత్సరాలకు పైగానే సమయం ఉంది గనుక సరైన ప్రణాళికతో ముందుకెళితే అనుకున్నది సాధించవచ్చు.

జగన్ కి భయపడిన రిలయన్స్

గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి చంద్రబాబుతో అంగీకారం కుదుర్చుకున్న కంపెనీలు ఒక్కొక్కటిగా జారుకుంటున్నాయి. విశాఖలో రూ. 70వేల కోట్లతో పెట్టాలనుకున్న డేటా సెంటర్ పెట్టుబడుల నుంచి అదానీ గ్రూప్ వెనక్కి తగ్గిన .. రెండు, మూడు రోజుల్లోనే… ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.

తిరుపతిలో రిలయన్స్ పెట్టాలనుకున్న ఎలక్ట్రానిక్ సెజ్‌ నుంచి ఆ సంస్థ వైదొలిగింది. తాము పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా లేమని నేరుగా ప్రభుత్వం ముఖం మీదే చెప్పేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడులకు అంగీకారం కుదుర్చుకున్న తర్వాత… చర్చల కోసం ముఖేష్ అంబానీ నేరుగా అమరావతి వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడారు. ఆ తర్వాత ఒప్పందం చేసుకున్నారు. తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఈ సెజ్‌ ఏర్పాటుకు భూమిపూజ జరిగింది. ఇందులో రిలయన్స్‌ సంస్థ సుమారు రూ.15వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఈ సెజ్‌లో ఏటా కోటి జియో సెల్‌ఫోన్లు తయారు చేస్తాం. జియో ఫోన్లు, చిప్‌ డిజైన్‌, బ్యాటరీలు, సెట్‌టాప్‌ బాక్స్‌ల వంటివన్నీ ఈ ఎలక్ట్రాట్రనిక్స్‌ పార్కులో తయారు చేస్తాం” అని అప్పట్లో ముఖేష్ అంబానీ స్వయంగా ప్రకటించారు.

అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించినట్టే చేసి కేవలం 75ఎకరాలకు మాత్రమే అంగీకారం తెలిపింది. అవికూడా వివాదాల్లో ఉన్న భూములు కావడంతో రిలయన్స్ తన పనులను ఎలక్షన్ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వస్తే మొదలుపెడదామని అనుకుంది.

కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రిలయన్స్ .. ప్రాజెక్టును వదులుకోవడానికి సిద్ధపడింది. ఈ ప్రాజెక్ట్ కోసం.. గత ప్రభుత్వం ఇచ్చిన 75 ఎకరాల భూములన్నీ వివాదాల్లో ఉన్నవే. కోర్టు కేసుల్లో పడ్డవే… అందుకే మేము (రిలయన్స్ వర్గాలు ) తీవ్ర అసంతృప్తితో ఉన్నామని చెప్తూ … పెట్టుబడులపై పునరాలోచన నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు.

అయితే జనాలు మాత్రం జగన్ కి భయపడే రిలయన్స్ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుందని, వైస్సార్ మరణించినప్పుడు పరోక్షంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పై వచ్చిన అభియోగాలు ఇంకా జగన్ మర్చిపోయిఉండడని , జగన్ ప్రభుత్వంతో పనిచెయ్యడం ఎప్పటికైనా కష్టమేనని భావించి ఈ ఒప్పందాన్ని ముకేశ్ అంబానీ రద్దు చేసుకొని ఉంటాడని వినికిడి. దీనిని బట్టి చూస్తే రిలయన్స్ ఒకరకంగా జగన్ కి బయపడినట్లే అని తెలుస్తుంది.

చంద్రబాబు ఆర్ఎస్ఎస్ తో రహస్య భేటీ ?

రాజకీయాల్లో చంద్రబాబు తీసుకున్నన్ని యు టర్న్ లు ఎవరూ తీసుకోలేదేమో. ఇందులో రికార్డు కొట్టేసాడు. దానితోపాటు విశ్వసనీయతను పోగొట్టుకున్నాడు. ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు బీజేపీ నుంచి బయటకొచ్చి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో చేరాడు. చేరటమేకాదు బీజేపీ కి తనంత బద్ద వ్యతిరేకి ప్రపంచంలో ఇంకెవ్వరూ వుండరన్నట్లుగా ప్రవర్తించాడు. ముస్లిం సోదరుల దగ్గరకెళ్ళి తనంత సెక్యూలర్ ఎవరూ లేరన్నట్లు మాట్లాడాడు. అందరూ ఈ చంద్రబాబేనా ఇంతకాలం బీజేపీ తో రాసుకు పూసుకు తిరిగింది అని ఆశ్చర్యపోయారు.

ఎన్నికలై పోయాయి. సీన్ మారింది. బీజేపీ తిరిగి అధికారం లోకి వచ్చింది. ఆ రోజునుంచి ఈ రోజు వరకు తిరిగి ప్రతిపక్ష నాయకుల్ని పలకరించిన పాపాన పోలేదు. ఫారూఖ్ అబ్దుల్లా జైలులో వున్నా నాలుగు సానుభూతి మాటలు చెప్పలేదు. శరద్ పవర్ పై సిబిఐ కేసు పెడితే పలకరించను కూడా పలకరించలేదు. అంతటితో ఆగలేదు. తనకుడి భుజం, ఎడమ భుజం లాంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ లను బీజేపీ లో చేర్పించాడు. మొన్నటికి మొన్న వైజాగ్ లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ బీజేపీ నుంచి బయటకొచ్చి తప్పు చేశానని ప్రశ్చాత పడ్డాడు. అమిత్ షా కు పనిగట్టుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇంకోసారి ముక్కునవేలేసుకొని ఆశ్చర్యపోవటం ప్రజలవంతైంది.

అయినా బీజేపీ నాయకత్వం గేట్లు తెరవలేదు. మోడీ, అమిత్ షా లకు కోపం తగ్గినట్లు లేదు. చంద్రబాబు నాయుడుకి నో ఎంట్రీ బోర్డు పెట్టారని తెలుస్తూంది. ఇక ఏం చేయాలో అని బుర్ర బద్దలు కొట్టుకొని ఇంకో బ్రహాస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు. బీజేపీ ఎవరు చెబితే వింటారో వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రహస్యంగా నాగపూర్ వెళ్లి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలకుడు మోహన్ భగవత్ తో రెండు గంటలపాటు భేటీ అయినట్లు సాంఘిక మాధ్యమాల్లో , పత్రికల్లో వచ్చింది. ఇంకోసారి ఆశ్చర్యపోవటం ప్రజల వంతయ్యింది. బీజేపీ ని కలవటం వేరు, ఆర్ఎస్ఎస్ ని కలవటం వేరు. తన పని నెరవేరటం కోసం ఎక్కడికైనా వెళ్తాడని, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడని ఇంకోసారి ప్రజలకు అర్ధమయ్యింది. ఆర్ఎస్ఎస్ మతవాద సంస్థ అని నిన్నటిదాకా బ్రాండ్ వేసి ఇప్పుడు ఒక్కసారి దాని పంచన చేరటం ఏ విధంగా సమర్ధించుకుంటాడో చూడాలి. నాలుక్కి నరం లేదు కదా ఎటయినా తిరుగుతుంది. తెలుగుదేశంలోని ‘ సెక్యూలర్ వాదులు ‘ ఈ చర్యను ఎలా సమర్ధించుకుంటారో చూడాలి. ఈ మధ్య వాళ్ళ అనుకూల మీడియా లో బీజేపీ వ్యతిరేక, మోడీ వ్యతిరేక వార్తలు తగ్గాయి. ఒకవైపు వేమూరి రాధాకృష్ణ అమిత్ షా ని కలవటం , చంద్రబాబు నాయుడు మోహన్ భగవత్ ని కలవటం చూసిన తర్వాత ప్రజలు మా చెవుల్లో పూలు పెట్టారని అనుకుంటున్నారు. సోషల్ మీడియా లో మోడీ వ్యతిరేక వార్తలు, రోజూ పోస్టులు పెట్టే తెలుగు దేశం సెక్యూలర్ వాదుల పోస్టులు మూగపోయాయి. మనదేశంలో సెక్యూలరిజాన్ని వాళ్ళ స్వార్ధం కోసం వాడుకుంటున్నారని చెప్పటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకేం కావాలి? మరి చంద్రబాబు నిరీక్షణ మోడీ, అమిత్ షా కరుణా కటాక్షం కోసం ఫలించేనా?

జేఎన్‌యూ విద్యార్థులపై ముసుగులు ధరించి.. దాడి చేసిన దుండగులు

JNUలో విద్యార్థులపై ముసుగులు ధరించిన దుండగులు ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో JNSU ప్రెసిడెంట్, CSRD ప్రొఫెసర్‌‌కు తీవ్రగాయాలయ్యాయి .

ఇక తెలంగాణాలో జోరుగా ‘నీరా’ అమ్మకాలు

నీరా , ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది కల్లు చెట్టు నుంచి తీసిన ద్రవం. కొద్దిసేపు బయటవుంచగానే కల్లుగా మారుతుంది. ఇప్పుడు కెసిఆర్ గారికి కొత్త ఆలోచన వచ్చింది. కెసిఆర్ గారు కళ్ళు దుకాణాలను ఎక్కడబడితే అక్కడ పెట్టిండు, జనం చెడిపోతుండ్రు అని అందరూ అనుకుంటుంటే జర బాధఒచ్చిందంట . అరె భాయ్ ఇదేంది నేనోదో పాపం మంచిచేస్తుంటే అందరూ నన్ను ఆడిపోసుకుంట్రుండు. అరె తెలంగాణా ని గురించి ఈళ్ళకేం తెలుసు. కల్లు తాగటం నేను నేర్పించానా? గది జమానా నుంచి వుంది. పాపం పగలంతా కష్టపడి పొద్దుగాల ఏదో కొంత ఖుషీ చేసుకుంటుంటే దీన్ని కూడా ఎగతాళి చేస్తుండ్రు. వీళ్లంతా తెలంగాణా ద్రోహులు.

కెసిఆర్ ఈమధ్య పరేషాన్ అవుతున్నాడు. ఇదేంది భాయ్ జగన్ నా దోస్తు అనుకుంటే నాకు రోజూ తలనొప్పి తెస్తుండు . ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశాడు. దిమాక్
వున్నోడు ఎవడన్నా చేస్తాడా ఆ పని. ఆయన చేసి నన్ను పరేషాన్ చేస్తుండు. ఆయన్ని చూసి మావాళ్లు ఒళ్ళు కాల్చుకుంటున్నారు. నాబొందిలో ప్రాణముండగా నేనయితే ఒప్పుకోను. డబ్బులు ఊరకే రావుకదా . వాడెవడు ఆ గుండు గాడు రోజూ యాడ్ లో చెబుతాడుకదా. డబ్బులు చెట్లకు కాయవు కదా. పెట్టుకోక పెట్టుకోక నాతోనే పెట్టుకున్నారు. అసలు ఆర్టీసీ ఎత్తయినైనా ఎత్తేస్తాను కానీ ఈ బుడింగ్ లకు లొంగను కాక లొంగను.

ఈ జగన్ ఏందీ రోజుకొక తలనొప్పితెచ్చి పెడుతుండు. అదేంది లిక్కర్ బ్యాన్ చేస్తాడంట. దిమాక్ ఖరాబయ్యిందా . నాకు దోస్తు కాదు దుష్మన్ అయి కూచున్నాడు. లిక్కర్ ఎక్కడైనా సక్సెస్ అయిందా? నాతో పాటు గుజరాత్ రమ్మను , ఎంత కావాలంటే అంత లిక్కర్ దొరికిద్ది. కుర్రోడు నన్నడగొచ్చు కదా , పనికిమాలిన పనులు చేస్తున్నాడు. నన్ను పరిషాన్ చేస్తుండు. దీనికో కౌంటర్ వేస్తాను. కల్లు దుకాణం పెడితే గొడవ చేస్తున్నారు. నీరా సప్లై చేస్తే . దాంట్లో ఆల్కహాల్ ఉండదు. మన గౌడు సోదరులకు ఆదాయమొస్తుంది. అప్పుడు నన్నేం పీకుతారోచూద్దాం. నన్ను దెబ్బ తీయాలనుకుంటే జరిగిద్దా ? నాకున్న ఐడియాలు ఎవరికీ లేవు. అసలు జనం దుకాణం కి ఎందుకు రావాలి? మనమే సాచెట్లు తయారుచేసి షాపుల్లో పెట్టేస్తే పొయ్యే . కల్లు కి పదిరెట్లు అమ్మకాలు పెరుగుతాయ్ . ఎలా వుంది నా తడాఖా.

అంతాబాగానే ఉందికానీ నీరా కల్లుగా మారిందో లేదో తనిఖీ చేయటమెట్లా? క్వాలిటీ ఇన్స్పెక్టర్లను పెడితే పోయే . మరి వీళ్లకు అర్హత ఏమిటి? ఏముందీ కల్లు తాగే అలవాటుంటే చాలు. రోజుకి ఫ్రీగా ఎంతైనా తాగొచ్చు. మాములుగా తాగి ఆఫిసుకి రాకూడ దంటారు, కానీ ఈ ఉద్యోగానికి తాగితేనే ఆఫీసు. ఇటు వేలమందికి ఉద్యోగాలు, అటు నీరా అమ్మకాలతో ఆదాయం. కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా నీరా అమ్ముతుందంట గదా. వాళ్ళు అమాయకులు లిక్కర్ కిందనే అమ్ముతున్నారు. కెసిఆర్ లాగా జ్యూస్ లాగా అమ్మటంలేదు. మరి కెసిఆర్ కున్న తెలివితేటలు పిన్నరాయి విజయన్ కు లేవాయే . ఏమైనా కెసిఆర్ ముందు ఎవరైనా దిగదుడుపే.

అందుకే సులేమానీని హత్య చేశాం:ట్రంప్‌

జనవరి 3న ఇరాన్‌ లో జరిగిన దాడిపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. కమాండర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీపై దాడిని అధికారికంగా ప్రకటించారు. అమెరికా పౌరులను కాపాడుకోవడంలో భాగంగానే దాడి చేసినట్లు పునరుద్ఘాటించారు. అమెరికా దౌత్యాధికారులు, సైనికులే లక్ష్యంగా సులేమానీ దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అందుకే ఆయన్ని హతమార్చాల్సి వచ్చిందని ప్రకటించారు. ఇటీవల బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి సహా ఇరాక్‌లోని అమెరికా మిత్రపక్షాల సైనిక స్థావరాలపై దాడులకు అతడే సూత్రధారి అని పేర్కొన్నారు. అమెరికా సంకీర్ణ దళాలకు చెందిన వందల మంది సైనికుల మరణాలకు, వేల మంది గాయపడటానికి అతడిదే బాధ్యత అని ఆరోపించారు. న్యూదిల్లీ, లండన్‌లో ఉగ్రదాడులకు ప్రయత్నించారని పేర్కొన్నారు. తమ దౌత్యాధికారులు, సైనికులపై చేయబోయే మరిన్ని దాడులను అడ్డుకోవడానికే తాజాగా దాడి చేశామని సమర్థించుకున్నారు.

ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదన్నారు. ‘‘యుద్ధాన్ని ఆపడం కోసమే తాము ఈ చర్య తీసుకున్నామని.. యుద్ధాన్ని ప్రారంభించడం కోసం కాదు’’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌ ప్రజల పట్ల తమకు అమితమైన గౌరవం ఉందన్నారు. అద్భుతమైన చరిత్ర, అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తులుగా ఇరాన్‌ ప్రజలను ఆయన అభివర్ణించారు. ఇరాన్‌లో శాంతి సామరస్యం కోరుకునే ప్రజల చేతుల్లోనే ఆ దేశ భవిష్యత్తు ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

కొన్నాళ్లుగా ఉప్పు నిప్పుగా ఉన్న అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒక్కసారిగా అగ్గి రాజుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఇరాక్‌లో అమెరికా చేపట్టిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్‌కు శక్తిమంతమైన కమాండర్‌గా ఉన్న జనరల్‌ ఖాసిం సులేమానీ (62) చనిపోయారు. విదేశాల్లోని తమ సిబ్బందిని రక్షించడానికే ఈ చర్యను చేపట్టామని అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ పేర్కొంది. దీనికి తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది.

వివాదాల రాజ్యంతో వర్మ వెటకారం!

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. .ఇటీవల కాలంలో రామ్ గోపాల్‌ వర్మ తన సినిమాలతో కన్నా అవి సృష్టిస్తున్న వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. ఎన్నికలకు ముందు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పేరుతో ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల అనుబంధం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన వర్మ, ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో వివాదాస్పద చిత్రాన్ని రూపొందించాడు.

మొన్న దీపావళి రోజున ఆటంబాంబ్ లాగా రిలీజ్ చేసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్‌ తెలుగు రాష్ట్రల్లో దుమ్మురేపింది. చంద్రబాబు నాయుడు, జగన్, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌, కేఏ పాల్‌ పాత్రధారులను పరిచయం చేస్తూ విడుదల చేసిన ట్రైలర్ విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ ట్రైలర్‌ ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్రైలర్‌ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందంటూ నేతలు ఆరోపిస్తున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఏర్పడిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. కమ్మ సామాజికవర్గం అధిపత్యంలో ఉండే విజయవాడ ప్రాంతంలో రెడ్లు పాగా వేశారని వర్మ చూపించే ప్రయత్నం చేసినట్టు అర్ధమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులతో పాటు, జరుగుతున్న, భవిష్యత్తులో జరగబోయే పరిణామలను జోడించి తీసిన సినిమా అని వర్మ చెప్పారు. మొత్తానికి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో కావలిసిన కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు వర్మ.

తాజాగా ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో పాటు కథపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఈ సినిమా టైటిల్‌పై నిషేధం విధించాలని ఫిర్యాదు చేశారు. కులాల మద్య గొడవల సృష్టిస్తూ.. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సినిమా టైటిల్ ఉందన్నారు. వెంటనే ఈ సినిమా టైటిల్ నిషేధించడంతో పాటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

వర్మ ఏ సినిమా తీసినా సరే దాని వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కినతరువాతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ ద్వారా సంచలనం క్రియేట్ చుసిన వర్మ మాత్రం ఈ సినిమాద్వారా కాస్ట్ ఫీలింగ్ ఉన్న రాజకీయ నాయకులకు సందేశం ఇవ్వబోతున్నానని చెపుతున్నారు. ఈ మధ్య వర్మతో జరిగిన ప్రతి మీడియా చర్చ వేదికల్లో అడిగే ప్రతి ప్రశ్నకు వర్మ ఇచ్చే సమాధానం వెటకారం గా ఉందని చర్చ వేదికలో పాల్గొన్న వారు మరియు నిర్వహించినవారు వాపోయారు.

మరి ఇప్పటికే సంచలనం సృష్టించిన వర్మ , తాను అన్నట్టు సందేశం ఇవ్వబోతున్నాడా? తెలియాలంటే ఈ సినిమా ఎన్నో అవరోధాలను దాటుకొని రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తే గాని తెలియదు.

హుజూర్ నగర్ ఫలితం పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి?

హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికపై ఇంకొన్ని గంటల్లో ఉత్కంఠ వీడబోతుంది. ఈ ఉప ఎన్నిక ఫలితం ఎన్నో విషయాలపై క్లారిటీ ఇవ్వబోతుంది. దాని పర్యవసానాలపై చర్చించుకునేముందు ఒక్కటి మాత్రం స్పష్టత వచ్చింది. అదేంటంటే పోటీ ఇద్దరిమధ్యనే ఉంటుందనేది. బీజేపీ, టీడీపీ పోటీ నామమాత్రంగానే ఉంటుంది. బీజేపీ మొన్న లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన గుడ్ ఇమేజ్ ని కాపాడుకోవాలంటే పోటీ చేయకుండా ఉంటే బాగుండేదని విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ వరకు పోటీ చేయటం కరెక్టు స్ట్రాటజీ నే. ఈ నియోజకవర్గం లో వాళ్లకు మద్దతుగా నిలిచే సామాజిక వర్గం ఒక స్థాయిలో ఓట్లు ఉండటం, టీడీపీ కి నాయకులతో సంబంధం లేకుండా కొంత కేడర్ ఉండటం , అన్నింటికన్నా ముఖ్యంగా మొన్న లోక్ సభ లో పోయిన ప్రతిష్టను కొంతమేర పునరుద్ధరించుకొనే అవకాశం ఉండటం లాంటి కారణాలతో పోటీ చేయటం కరెక్టు ఎత్తుగడగానే భావించాలి. ఒకవేళ ఈ ఉపఎన్నికలో కనీసం పదివేల ఓట్లు సంపాదించుకో గలిగితే ముందు ముందు మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకోవటానికి ఉపకరిస్తుంది. కాబట్టి టీడీపీ పోటీ చేయటం ఓ వ్యూహాత్మక ఎత్తగడే.

మరి బీజేపీ విషయంలో ఏమి స్ట్రాటజీ వుంది? సానుకూల అంశాల కన్నా ప్రతికూల అంశాలే ఎక్కువవున్నాయనిపిస్తుంది. కనీసం ఓ గౌరవప్రదమైన ఓటింగు వస్తే వాళ్ళ ఎత్తుగడ కరక్టే ననుకోవాలి. నామమాత్ర ఓట్లు వచ్చి డిపాజిట్ పొతే అది ప్రతికూల ప్రభావం పడే అవకాశం వుంది. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ పెద్ద రిస్క్ తీసుకుందని చెప్పాలి. ఇటీవల కాలంలో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ దూకుడు అంత పరిణితి తో లేదనిపిస్తుంది. గోదావరి నీళ్లు ఆంధ్రతో పంచుకునే విషయం లో తను మాట్లాడిన తీరు ఫక్తు ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడు మాట్లాడినట్లుగా వుంది . అలాగే ఆర్టీసీ సమ్మెవిషయం లోనూ సూత్రబద్ధంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ విలీనంపై ఓ స్పష్టమైన వైఖరి తీసుకొని వుండాల్సింది. కెసిఆర్ అహంకార పూరిత వైఖరిని గర్హిస్తూనే సమ్మెకు మద్దత్తు తెలపటం వరకూ బాగానేవుంది. ఆర్టీసీ కార్మికులు పండగ సమయంలో సమ్మెకు దిగడం, విలీనంపై పట్టుపట్టటంపై బీజేపీ వైఖరి సూత్రబద్ధంగా లేదు. అంతర్లీనంగా కెసిఆర్ కి గుణపాఠం చెప్పాలనే ఒకే ఒక బలమైన కోరిక అన్ని ప్రతిపక్షాలలో కనబడుతుంది. రేపు ప్రతిపక్షాలు అధికారం లోకి వచ్చినా విలీనం చేయటం అంత తేలికకాదు. అయితే కెసిఆర్ ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఇక ప్రధానపోటీదారుల పరిస్థితులు చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఇది అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నిక. ఒకటి , తన నియోజక వర్గం కావటం , రెండు తన సతీమణి నే పోటీలో ఉంచటం. ఈ ఎన్నిక లో గెలవకపోతే దాని పర్యవసానం చాలా వాటి మీద పడుతుంది. కాంగ్రెస్ లో వున్నన్ని గ్రూపులు ఏ పార్టీలో వుండవు. కాంగ్రెస్ కనుక ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్ష పదవికి ముప్పు వస్తుందనేది ఖచ్చితం. అంతకన్నా ముఖ్యమైనది తెరాస కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్న సమయంలో కాంగ్రెస్ కంచుకోట స్థానంలో ఓడిపోతే అది భవిష్యత్తు సమీకరణాలపై ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్ నైతిక స్థాయి దెబ్బతిని బీజేపీ పుంజుకునే అవకాశాలు పెరుగుతాయి. అందుకని ఈ ఎన్నిక కాంగ్రెస్ కి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అత్యంత పరీక్ష గా చెప్పాల్సి వస్తుంది.

చివరగా తెరాస , కెసిఆర్ పరిస్థితి. ఈ ఎన్నికల్లో గెలిస్తే కెసిఆర్, తెరాస కు పెద్ద మోరల్ బూస్టు అవుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కెసిఆర్ వైఖరి కి ప్రజల ఆమోదముద్ర వేసినట్లవుతుంది. ఈ సమయంలో కెసిఆర్ కి పెద్ద నైతిక విజయమే అవుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం కెసిఆర్ కి దెబ్బనే చెప్పాలి. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఆర్టీసీ కార్మికులు కెసిఆర్ పై దాడిని పెంచే అవకాశముంది. అలాగే తెరాస లో అంతర్గత విభేదాలు మెల్లి మెల్లిగా బయటపడే అవకాశముంది. కాబట్టి కెసిఆర్ కి, తెరాస కి కూడా ఈ ఎన్నిక ప్రతిషాత్మకమనే చెప్పాలి.

ఇన్ని ప్రత్యేకతలు వున్న ఈ ఎన్నిక ఫలితం కొన్ని గంటల్లో రాబోతుంది. ఫలితాన్నిబట్టి పైన చెప్పినవిధంగా పర్యవసానాలు ఉండబోతున్నాయి.

ఎంతపని చేశావ్… చంద్రన్నా..!

ప్రస్తుతం “ఆంధ్రప్రదేశ్ రాజధాని పై జరుగుతున్న పరిస్థుతులన్నిటికి కారణం ఎవరు?” అనే ప్రశ్నకు ఒక్కసారి జవాబును వెతికినట్లైతే.. కొన్ని ఆసక్తిర విషయాలు బయటకు వస్తాయి.

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఏపీకి రాజధాని లేదు. అసలు భారతదేశ చరిత్రలో ఇలాంటి అన్యాయం ఏ రాష్ట్రానికి జరగలేదంటే.. అతిశయోక్తి కాదు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నది తెలంగాణ వాసులు, కానీ అన్యాయం జరిగింది మాత్రం ఏపీ ప్రజలకు..! ఎవరు అంగీకరించినా.. అంగీకరించక పోయినా.. ఇదే నిజం. రాజధానిలేని రాష్ట్రాన్ని తీసుకోవడమే ఒక తప్పైతే.. రాజధాని నిర్మించుకోవడంలో సొంత పెత్తనాలకుపోయి.. ప్రతిపక్షాల మాటలు, కమిటీల నివేదికల పట్టికుంచుకోకుండా అమరావతిలో రాజధాని నిర్మించటం చంద్రబాబు చేసిన మరో తప్పు. ఆయనేదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా “అమరావతి చంద్రబాబు మానస పుత్రిక” అని, “చంద్రబాబు సీఎం కాకపోతే ఏపీకి రాజధానే లేదన్నట్లుగా..” సొంత డబ్బాలు కొట్టుకున్నారు టీడీపీ నేతలు.

సరే.. టీడీపీ నేతలు చెప్పిందే కొద్దిసేపు నిజం అనుకుంద్దాం.. 10 ఏళ్ళు సీఎం చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన తర్వాత కూడా ప్రజలు ఆయనను నమ్మి మళ్ళీ సీఎం పీఠం ఎక్కించారు. ఆ విధంగా రాష్ట్రాన్ని మరో 5 ఏళ్ళు పాలించారు. మరి 5 ఏళ్లలో ఆయన చేసింది ఏమిటంటే.. ఏపీ రాజధానిని సింగపూరు చేస్తా.. టోటల్ గా రాష్ట్రాన్నిజపాన్ చేస్తా.. అని రంగు రంగుల డిజైన్ లతో , ఉహకందని గ్రాఫిక్స్ తో తనకు అనుకూలమైన మీడియా ద్వారా ప్రజలకు చూపిస్తూ… 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు. దాదాపు 5600 కోట్లు పెట్టి అమరావతిలో తాత్కాలిక భవనాలు కట్టారు. ఇదే రాజధాని అని చెప్పి పెద్ద పెద్ద గ్రాఫిక్స్ పెట్టి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసాడు. అసలు అంత ఖర్చుపెట్టి తాత్కాలిక భవనాలు కట్టకపోతే.. అదేపెట్టుబడితో శాశ్వత భవనం (అసెంబ్లీ లాంటి) ఒక్కటి కట్టినా.. రాజధానికి ఒక రూపు వచ్చేదిగా..అని .. అనేకమంది విశ్లేషకుల అభిప్రాయం.

అంతేకాకుండా.. ఈ మధ్య ఒక ప్రముఖ జాతీయ మీడియాలో వచ్చిన కధనం ప్రకారం.. అమరావతి రాజధాని ప్రక్రియ ఇప్పటిదాకా కొలిక్కి రాకపోవటం జగన్ కి అనుకూలంగా మారిందని విశ్లేషించింది. అమరావతి రాజధాని గా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపలే ప్రకటించి అసెంబ్లీ లో తీర్మానం చేయించగలిగినా కేంద్ర స్థాయిలో పార్లమెంటు ఆమోదం తీసుకొని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చివుంటే తిరిగి దాన్ని తిరగదోడే అవకాశం ఉండేది కాదని ఆ పత్రిక తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం మూడు సంవత్సరాల్లోపు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చివుండాల్సిందని కూడా తెలిపింది. హైద్రాబాదులోని వుమ్మడి ఆస్తుల విషయం ఎటూతేలకపోవటంతో పునర్విభజన చట్టం ప్రకారం హైద్రాబాదు పది సంవత్సరాలవరకు వుమ్మడి రాజధాని గా హక్కులువుండటంతో చంద్రబాబు నాయుడు సందిగ్ధంలో పడ్డట్టు అదే ఇప్పుడు తనకు గుదిబండలాగా మారిందని వ్యాఖ్యానించింది.

చివరిగా చెప్పేది ఏమిటంటే.. ఆనాడు చంద్రబాబు చేసిన తప్పులే నేడు 3 రాజధానులు చెయ్యడానికి ఇప్పటి ప్రభుత్వానికి దొరికిన అవకాశం.

పవన్ కళ్యాణ్… నువ్వు మారాలి

పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఎప్పటిలాగే అప్పుడప్పుడూ వార్తల్లోకి వస్తున్నాడు. నవంబర్ మొదటివారంలో వైజాగ్ లో ప్రదర్శన తీస్తాడట. భవన కార్మికుల సమస్యలపై ఈ నిరసన ప్రదర్శన ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఇసుక కొరతతో నిర్మాణరంగం కుదేలయింది కాబట్టి ఈ ప్రదర్శన ఉంటుందని తెలుస్తుంది. ( అప్పటికి ఈ ఇసుక కొరత వుంటే మరి). కానీ ఇప్పటికే ఈ సమస్యపై తెలుగు దేశం పెద్దఎత్తున ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారానికి వూతంగానా లేక స్వతంత్రంగానా అనేది ప్రజల మనస్సులో తొలుస్తున్న ప్రశ్న.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజల్లో, అభిమానుల్లో విపరీతమైన క్రేజు ఉండేది. మొదటి సారి ఎన్నికల్లో పోటీచేయకుండా తెలుగుదేశం-బీజేపీ కి మద్దతిచ్చాడు. తర్వాత నాలుగు సంవత్సరాలు అప్పుడప్పుడూ నేనూ వున్నానని ప్రకటనలతో, చంద్రబాబుతో ఒకటి రెండు సార్లు సమావేశాలతో గడిచిపోయింది. ఎన్నికల సంవత్సరం రంగంలోకి దిగాడు. మరి ప్లానింగ్ లో లోపమో లేక మరే కారణమో తెలియదుకానీ అన్ని జిల్లాలు పర్యటించలేకపోయాడు. కేవలం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు మాత్రమే విస్తారంగా అంటే అన్ని మండలాలకు వెళ్లగలిగాడు. మూడో ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చినప్పుడు అన్ని ప్రాంతాల ప్రజలను కలవటం మొట్టమొదట చేయాల్సిన పని. అదే నెరవేరలేదంటే ఎక్కడో లోపముంది. అది నాయకుడులోనా మరే కారణమా అనేది విశ్లేషించాలి. మొత్తం రాష్ట్రం విస్తృతంగా పర్యటించటానికి ఎంత టైం పడుతుందో నాయకుడికి తెలియదని అనుకోలేము. మరి ఎందుకు ముందుగా క్యాంపైన్ మొదలుపెట్టలేదో పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాతకూడా ప్రజలకు చెప్పలేదు.

రెండోది, అందరూ అడుగుతున్నది ఒకటే ప్రశ్న . ఎన్నికలకు వారం ముందుగా ఒక్కసారి ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ నుంచి జగన్ వైపు ఎక్కుపెట్టాడో ఈరోజుకీ వివరణ ఇవ్వలేదు. మంగళగిరి సీటు పోటీపెట్టకుండా సిపిఐ కి కేటాయించినప్పుడే అభిమానులు కంగుతిన్నారు. అసలు మంగళగిరి విషయంలో సిపిఐ నారాయణ తో చంద్రబాబు నాయుడు లాబీ చేసి ఆ సీటు పట్టుబట్టేటట్టు తెరవెనుక రాజకీయం చేసాడని తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సిపిఐ తోటి అడిగించుకొని సీటు వదిలేసాడని అనుకుంటున్నారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన చింతల పార్ధసారధి ఇంటర్వ్యూ చూస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి పారదర్శకంగా లేకపోవటంతో ఈ అనుమానాలే నిజమని ప్రజలు, అభిమానుల్లో ఒకవర్గం నమ్ముతుంది. ఈరోజుకీ ప్రజలకు అందుబాటులో లేకపోవటం, ముఖ్య అనుచరుల్లో ఒక్కొక్కరూ వెళ్ళిపోవటం, వెళ్ళిపోతూ వాళ్లు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు చూస్తుంటే ఇందులో ఎంతోకొంత నిజముందని అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ ఎన్నో కోట్ల ఆదాయాన్ని వదులుకొని ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చాడని అందువలన ఆయనలాంటి నిస్వార్ధపరుణ్ణి సపోర్ట్ చేయాలని ఆయన్ని అభిమానించే ప్రజానీకం ఇప్పటికీ చెబుతున్నారు. కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని వచ్చాడనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ స్ఫూర్తిని ఎవరైనా అభినందించాలి. అయితే సమస్యల్లా ఎన్నికల్లో గెలవటానికి, రాజకీయాల్లో రాణించటానికీ ఆ క్వాలిటీ ఒక్కటే సరిపోదు. ఉదాహరణకు మోడీ, మన్మోహన్ సింగ్ ఇద్దరూ వ్యక్తిగతంగా అవినీతిపరులు కాదని ప్రజలు ఈరోజుకీ విశ్వసిస్తున్నారు. కానీ ప్రజలు మోడీకే పట్టంకట్టారు, కడుతున్నారు. కారణం ఆయనకు దేశ సమస్యలపై వున్న దార్శనికత , దృఢ నిర్ణయాత్మక శక్తి , రాజకీయ చాణక్యం అన్నీ కలగలిపి ఆయనకు నీరాజనం పడుతున్నారు. వాటితో పాటు తన నిజాయితీ అదనపు విలువను జోడిస్తుంది. కాబట్టి ప్రజా క్షేత్రం లో నిలదొక్కుకోవటానికి నిజాయితీతో పాటు ప్రజలను, రాజకీయాలను నడిపించగల సామర్ధ్యం చాలా అవసరం. నాయకత్వ సామర్ధ్యంతో పాటు నిజాయితీ , ప్రజాకర్షణ అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి. మొట్టమొదట కావాల్సింది ప్రజలకు నాయకుడిమీద నమ్మకం కుదరాలి. తనతో నడిచే క్యాడర్ కు పూర్తి విశ్వాసం ఉండాలి. తను తీసుకున్న కొన్ని వైఖరులు ప్రజల్లో అనుమానాలకు దారితీసినప్పుడు తను అలా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో, ఎందుకు వ్యవహరించవలిసి వచ్చిందో ఎప్పటికప్పుడు పారదర్శకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రజాక్షేత్రంలో ఉంటుంది. అంతేగాని ఆ అవసరం నాకు లేదనుకుంటే పొరపాటు. నిన్నే నమ్ముకొని నడిచిన వ్యక్తులు ఒక్కొక్కరూ దూరమవుతుంటే ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంతేగాని నేను నిజాయితీ పరుణ్ణి ఎవరు వెళ్లినా పర్వాలేదు నా వెనుక జనం వున్నారనుకుంటే అది ఆత్మహత్య సదృశ్యకమవుతుంది. పవన్ కళ్యాణ్ ముందుగా ప్రజలకు అందుబాటులో , పిలిస్తే పలికే విధంగా ఉండేటట్లు మారితేనే రాజకీయాల్లో రాణిస్తాడు. ఆ లోపాన్ని సరిదిద్దుకోకుండా ఇలానే ముందుకు వెళితే 2019 ఫలితమే తిరిగి రిపీట్ అవుతుంది. ఒక శ్రేయోభిలాషిగానే ఈ విమర్శ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజుల్లో రాజకీయాల్లో నిజాయితీ అనేది భూతద్దం వేసి వెదికినా కన్పించటం లేదు. ఆ అరుదైన క్వాలిటీ వున్న పవన్ కళ్యాణ్ ఫెయిల్ కాకూడదనే భావనతోనే ఈ విమర్శ చేస్తున్నాం. దీన్ని పాజిటివ్ గా తీసుకుంటారని ఆశిద్దాం.

చిరంజీవిని మించిపోయిన రామ్ చరణ్

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి వున్న ఇమేజ్ గురించి మనఅందరికి తెలిసిందే. ఇప్పటికి చాలామంది మన తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుకుంటే ముందుగా వారి నోటి వెంట ఠక్కున వచ్చే కధానాయకుల పేర్లు NTR, ANR. వీరి పేర్లు పలుకుతూనే వెంటనే మెగాస్టార్ చిరంజీవి అంటారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత చాలమంది టాప్ హీరోలు ఉన్నప్పటికీని ఆ ఇద్దరి హీరోల పేర్లు తర్వాత చిరంజీవి పేరు స్మరిస్తారు. అంతలాగ చిరంజీవి తన ముద్రను అటు తెలుగు సినిమా పరిశ్రమపై ఇటు అభిమానుల హృదయాలపై ముద్రించారు అనడంలో సందేహం లేదు.

విషయానికి వస్తే… అంత ఇమేజ్ ఉన్న చిరంజీవి ప్రజాసేవకై రాజకీయాల్లోకి వెళ్ళి తిరిగి మళ్ళి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి తన సత్తా ఏమిటో మరో సారి తెలుగు సినిమా ప్రేక్షకులకు చూపిస్తున్నారు. అయితే రాజకీయాలను వదిలి మళ్ళి సినిమాలకు వచ్చిన చిరంజీవి కొన్ని ఆలోచనలతో ఇబ్బంది పడిన విషయాన్ని అయన మీడియా లో కూడా వివరించారు. అలాంటి చిరంజీవికి తనయుడు వెన్నంటే వుండి, చిరంజీవిని తన తండ్రిలా కాకుండా ఒక హీరోలాగానే చూసాడనిపిస్తుంది.

ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే… చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఆ తర్వాత వచ్చిన 151వ హిస్టారికల్ మూవీ ‘సైరా’ కి నిర్మాత చిరు తనయుడు రాంచరణ్. తన తండ్రి నటించబోయే ప్రతి సినిమాలను తానే భుజాలపై వేసుకొని దగ్గరుండి పర్యవేక్షిస్తూ కావలిసిన జాగ్రత్తలు తీసుకుంటూ రెండు సినిమాలను హిట్ చేసాడు అనడంలో సందేహంలేదు.

సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమైనవాడో, అదేరీతిగా ప్రొడ్యూసర్ కూడా అంతే సమానంగా ముఖ్యమైనవాడు. ఒక సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలంటే మంచి డైరెక్టర్ మంచి కథతో స్క్రీన్-ప్లే తో సినిమాను చిత్రీకరించాలి, జనాన్ని మెప్పించాలి. మరి ఆ డైరెక్టర్ అలా సినిమాని తీయాలంటే మంచి నిర్మాత చాలా అవసరం, అప్పుడే ఆ చిత్రం సక్సెస్ అవుతుంది.

డైరెక్టర్ , నిర్మాతలకు వున్న విలువల గురించి తెలుసుకోవాలంటే పాత తరం సినిమాల హీరోలు , ఆర్టిస్టుల ఇంటర్వూస్ చూస్తే వాళ్ళే చెపుతారు… దర్శక-నిర్మాతలు ఒక సినిమా కోసం ఎంత కష్టపడేవాళ్ళని.

రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన గత రెండు సినిమాలను పరిశీలిస్తే తాను దర్శకులకి ఎంత సహకరించాడో , సినిమా నిర్మాణ విలువలను ఎప్పటికప్పుడు ఎలా కేర్ తీసుకొనివుంటాడో అనే విషయాలు మనకి ఆ సినిమాలు సాధించిన విజయాలే చెపుతున్నాయి. ఎన్నో సినిమాల్లో నటించిన చిరులో కనిపించని ఒక మంచి నిర్మాత మనకు రామ్ చరణ్ లో కనిపిస్తున్నాడు. కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో చిరంజీవి అంటూ ఉండేవారు.. రామ్ చరణ్ ఎప్పటికైనా నన్ను మించిపోతాడు అని.

తండ్రి (చిరు) పట్ల రామ్ చరణ్ కి ఉన్న ప్రేమ ఒక ఎత్తైతే , తనకి తానుగా సినిమా నిర్మాణ సామర్ధ్యాన్ని బాగా పెంచుకున్నాడనే చెప్పాలి. అందుకే చిరంజీవి ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించే 152వ సినిమాకు కూడా రామ్ చరణ్ నిర్మాతగా ఉన్నాడు. ఎటూ.. కొరటాల శివ మంచి దర్శకుడని ఇప్పటికే నిరూపించుకున్నాడు. కాబట్టి ఒక మంచి దర్శకుడుకి ఒక మంచి నిర్మాత తోడైనాడు, హీరో ఏమో మెగాస్టార్. ఇంకేముంది మంచి సబ్జెక్టుని తెరకెక్కిస్తే సినిమా హిట్టే…..

జగన్ చేతికి బోస్టన్ కమిటి నివేదిక

ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్‌కు రాజధాని అంశానికి సంబంధించి రూపొందించిన తమ నివేదికను బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ప్రతినిధులు అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని వారు కలిశారు. ఈ నివేదికలో మూడు రాజధానులు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సిఫారసులు ఉన్నాయి. ఇందులోని వివరాలను జగన్ కు బీసీజీ ప్రతినిధులు వివరించారు. కాగా, జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై ఈ నెల 6న హైపవర్ కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 20 లోగా హైపవర్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

కెసిఆర్ Vs జగన్

రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిపాలనలో ఎవరిపంధాలో వాళ్ళు వెళ్తున్నారు. కెసిఆర్ మూడు నెలల ముందుగానే రెండోసారి అధికారం చేపట్టాడు. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటింది. ఈ కొద్ది సమయంలోనే ఇద్దరి పరిపాలనలో తేడాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. నాలుగు నెలలు చాలా తక్కువ సమయమైనా ఈ నాలుగు నెలల్లోనే కొన్ని ప్రత్యేకతలను గమనించవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

ముందుగా ఇద్దరి మధ్య సామీప్యతలేమిటో చూద్దాం. మనస్తత్వం రీత్యా ఇద్దరూ చాలా ఫర్మ్ గా వుంటారు. వాళ్ళు అనుకున్నది అమలుచేయటానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఖాతరు చేయరు. అది గట్టి నాయకత్వానికి చిహ్నం. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఈ లక్షణం ఒక్కోసారి బెడిసి కొడుతోంది. ఇకపోతే ఇద్దరూ పత్రికా స్వేచ్ఛను నియంత్రించాలనే చూస్తారు. కెసిఆర్ రాంగానే టీవీ 9, ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి చానళ్లను బ్యాన్ చేస్తే జగన్ టీవీ 5, ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి చానళ్లను బ్యాన్ చేసాడు. మూడో కామన్ పాయింట్ ఇద్దరూ తమ స్వంత ఐడియాలను అమలుచేయాలని చూస్తారు. కెసిఆర్ రైతుబంధు లాగే జగన్ గ్రామ సచివాలయ నమూనాను తీసుకొచ్చాడు. నాలుగోది ఇద్దరూ సంక్షేమ పథకాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అయిదోది, ఇద్దరూ కుటుంబానికి ప్రాముఖ్యతను ఇస్తారు. కెసిఆర్ ఏకంగా కుటుంబ పరిపాలననే తీసుకొచ్చి పెడితే జగన్ తన తండ్రి పేరుమీదే రాజకీయాల్లోకి ప్రవేశించాడు.

ఇక వైరుధ్యాలు చూస్తే కొన్ని కొన్నింటిలో బాగానే తేడా వుంది. కెసిఆర్ ఆదాయం కోసం మద్యాన్ని ఏరులై పారిస్తుంటే జగన్ ఆదాయం పోయినా పర్వాలేదు మద్యాన్ని నియంత్రించాల్సిందేనని దృఢంగా వున్నాడు. రెండోది, జగన్ విద్యారంగంపై శ్రద్ధాశక్తులు బాగాచూపిస్తుంటే కెసిఆర్ దాని ఊసే ఎత్తటం లేదు. మూడోది, ఆర్టీసీ విషయంలో జగన్ ఏకంగా దాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే కెసిఆర్ ఆర్టీసీ కార్మికులపై కత్తి ఝుళిపించాడు. విలీనం ప్రసక్తే లేదంటున్నాడు. కెసిఆర్ రెండోసారీ ఎన్నికల్లో రుణమాఫీ ప్రకటిస్తే జగన్ రుణ మాఫీకి బద్ధవ్యతిరేకంగా వున్నాడు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని దీర్ఘకాలంగా నడిపి నాయకుడిగా నిరూపించుకున్నాడు కానీ జగన్ నాయకుడుగా సక్సెసా ఫేయిల్యూరా అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్ళు వేచిచూడాల్సి వుంది. అలాగే జగన్ భవిష్యత్తు కోర్టు కేసుల వలన అనిశ్చితి గా ఉంటే కెసిఆర్ నిండుకుండలాగా భవిష్యత్తు ఉండటం వలన కొడుకుని సీటు పై ఎలా కోర్చోబెట్టాలా అని ఆలోచిస్తున్నాడు. మొత్తం మీద చూస్తే ఎవరి ప్రత్యేకతలు వాళ్లకు వున్నాయి. ఇంకో ఆర్నెల్లయినా గడిస్తేగాని వివరంగా పోలిక చేయటం కుదరదు. అప్పటివరకూ ఈపోలికలతో సరిపెట్టుకుందాం.

ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం!

జనవరి 3 (శుక్రవారం) ఒక సంచలన వార్త వింటూ పలు దేశాల్లో ప్రజలు వణికిపోయారు. ఇరాన్ రాజధాని బాగ్దాద్‌ విమానాశ్రయంపై అమెరికా చేసిన రాకెట్ దాడి ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇరాన్‌లో రెండో అత్యంత శక్తిమంతమైన నేత ఖాసీం సులేమాని ఈ దాడిలో హతమవడమే ఈ ఆందోళనకు కారణం. ఇరాన్‌ రివల్యూషనరీ గార్ట్స్‌లోని ఆత్యంత శక్తిమంతమైన ‘ఖుద్స్‌ ఫోర్స్‌’కు జనరల్‌గా వ్యవహరిస్తున్న ఖాసీం సులేమానికి.. ఇరాన్‌తో పాటు మరో నాలుగు దేశాల్లో పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సులేమాని అనుచరులు ప్రతీకార చర్యలతో రగిలిపోతున్నారు.

ఈ విషయంపై స్పందించిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖామేనీ… స్థానిక మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నో ఏళ్లుగా ఇరాన్‌ మంచి కోసం అవిశ్రాంత కృషి చేసిన సోలేమన్‌కు నేడు అమరత్వం సిద్ధించింది. ఆయన వెళ్లిపోయాడు గానీ ఆయన చూపిన దారిలో సాగడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆయన రక్తంతో చేతులు తడుపుకొన్న నేరగాళ్లపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుని తీరతాం. మా శత్రువులు ఒక విషయం తెలుసుకోవాలి. మీరిలా చేసినందుకు జీహాద్‌ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. పవిత్ర యుద్ధంలో మాకోసం విజయం ఎదురుచూస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

అమెరికాతో ఇప్పటికే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరాన్.. సులేమాని హత్యతో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఇరాన్‌కు పొరుగు దేశాల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాక్ దేశాల్లో సులేమాని అనుచరులు, అతడిని అభిమానించే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా అమెరికాపై ప్రతీకార దాడులకు దిగవచ్చని భావిస్తున్నారు.

ఒకవేళ ఇరాన్, అమెరికా మధ్య యుద్ధమే వస్తే.. ప్రపంచం రెండుగా విడిపోతుంది. అగ్రరాజ్యానికి అండగా పలు దేశాలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారీ విధ్వంసం తప్పదు. ఈ వార్తలతో పలు దేశాల్లో సామాన్య జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు గూగుల్‌లో, అటు సోషల్ మీడియాలో ‘వరల్డ్ వార్ 3’ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. మూడో ప్రపంచ యుద్ధం రాకపోయినా.. 2001 సెప్టెంబర్ 11 తరహా దాడులు జరగవచ్చేమోనని అమెరికన్లను భయం వెంటాడుతోంది. ఇరాక్ వదిలి వెళ్లిపోవాలంటూ బాగ్దాద్‌లో యూఎస్ ఎంబసీ అమెరికన్లను హెచ్చరించింది.

మూడో ప్రపంచ యుద్ధం, ఇరాన్ పేరుతో చాలా మంది గూగుల్‌లో శోధిస్తున్నారు. గూగుల్‌లో శుక్రవారం అత్యధిక మంది సెర్చ్ చేసిన రెండో పదం ఇరాన్ కావడం గమనార్హం. అమెరికాలోనే ఈ పదాన్ని అత్యధిక మంది శోధించడం మరో విశేషం. ఇక ఇరాన్‌పై అమెరికా రాకెట్ లాంచర్ దాడి జరిగిన గంటల వ్యవధిలోనే గూగుల్‌లో‘వరల్డ్ వార్ 3’ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ట్విటర్‌లో మాత్రం ఎక్కువ మంది ఈ అంశంపై సరదా మీమ్స్ పెడుతున్నారు.

రాకెట్ దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. విమానాశ్రయ కార్గో హాల్‌ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు ఇరాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడింది ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

రెండు రోజుల కిందట ఇరాన్ మద్దతుదారులు ఇరాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌లో తమ రాయబార కార్యాలయంపై దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వెంటనే అక్కడకు అదనపు బలగాల్ని పంపారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.

ఇరాన్ – అమెరికా మధ్య 2006 నుంచి ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ చేపట్టిన చర్యల వెనుక సులేమాని కీలకంగా వ్యవహరిస్తు వచ్చారు.

జగన్ హడావుడి వెనక ఆంతర్యమేంటి?

జగన్ దూకుడు చూస్తుంటే అయిదేళ్ల ఎన్నికల ప్రణాళిక సంవత్సరంలోపే అమలు చేసేటట్లు వున్నాడనిపిస్తుంది. అందరికీ అర్ధంకాని విషయమేమంటే ఇన్ని పధకాలు ఫాస్ట్ ట్రాక్ లో అమలుచేయటానికి కావాల్సిన డబ్బులు ఎక్కడనుంచి వస్తున్నాయనేది. ఇందులో మాయల మంత్రం ఏమీలేదు. ఉన్న డబ్బుల్లో ఒకచోటపెంచాలంటే ఇంకోచోట తగ్గించాలి. లేకపోతే అప్పన్నా తీసుకురావాలి. అయితే మనమిష్టమొచ్చినట్లు అప్పు చేయటానికి నిబంధనలు ఒప్పుకోవు. ఎఫ్ ఆర్ బి ఎం షరతులకు లోబడే అప్పులు తెచ్చుకోవాలి. రెండోది అప్పు ఇచ్చేవాడు మన ట్రాక్ రికార్డు చూస్తాడు. అది ప్రభుత్వమైనా సరే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంకు ని అప్పు అడిగితే వాళ్ళు మీ ట్రాక్ రికార్డు బాగాలేదని కొర్రీ వేయటం అన్ని పేపర్లలో చూసాం.

బడ్జెట్ లో కేటాయించిన నిధులు మిగతా శాఖలకు తగ్గిస్తేనే సంక్షేమ పథకాలకు తరలించొచ్చు. లేకపోతే డబ్బులు ఆకాశం నుండి ఊడిపడవుకదా. ఒక విషయం లో కొంత వెసులుబాటు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎన్నికలముందు రుణమాఫీ మొదలుపెట్టాడు. కానీ జగన్ ఆ పధకానికి నిధులు ఆపేశాడు. అందులో కొంత నిధులు మిగిలి ఉండొచ్చు. రుణ మాఫీ పధకం దేశ ఆర్ధిక వ్యవస్థకు చేటు చేసిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా బ్యాంకుల పాలిట శాపంగా మారింది. ఆ విధంగా చూస్తే జగన్ మొదట్నుంచి తీసుకున్న ఖచ్చితమైన వైఖరి అభినందనీయం. అయితే ఒకసారి ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత దాన్ని మధ్యలో ఆపేస్తే రైతుల పరిస్థితి ఏంటి ? రెండు ప్రభుత్వాల మధ్య రైతు నలిగిపోతున్నాడని మరిచిపోవద్దు. ఏమైనా అది ఒక్కటే మనకు తెలిసి వెసులుబాటు వున్నది. మరి మిగతా డబ్బులు ఎలా సమకూరుస్తున్నాడంటే ఖచ్చితంగా మిగతా రంగాలకు కోత పెట్టి ఈ సంక్షేమ పథకాలకు సర్దుతున్నాడనే చెప్పాలి.

అయితే ఇంత హడావుడి ఎందుకు పడుతున్నట్లు? ఇంకా నాలుగున్నర సంవత్సారాలు సమయమున్నా అన్ని వాగ్దానాలు ముందుగానే అమలుచేయాలనుకోవటం, వాగ్దానం చేసిన దానికన్నా ఎక్కువ కేటాయించటం చూస్తుంటే తనలో ఏదో ఆదుర్దా ఉందని అర్ధమవుతుంది. అన్ని పధకాలు ఇప్పుడే ఒకే సంవత్సరం లో అమలు చేయాలని అనుకోవటం వెనక ఏదో పరమార్థముందని అందరూ అనుకుంటున్నారు. వస్తున్న వార్తలను బట్టి త్వరలో సంవత్సరం లోపలే తనపై వున్న కేసుల పై తీర్పు వచ్చే అవకాశం వుంది. అదేజరిగితే శిక్షలు పడే అవకాశాన్ని కొట్టిపారవేయలేము. అటువంటప్పుడు మరలా జైలు కెళ్ళాల్సివస్తే తను చేసిన ఈ మంచి పనులే తనను ప్రజలు గుర్తుంచుకునే చేస్తాయని అనుకుంటూ వుండొచ్చు . అదే జరిగితే ఎన్నాళ్ళు జైల్లో వున్నా తిరిగి ఎన్నికలప్పటికీ తననే ఎన్నుకుంటారని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. అందుకోసమే బయటవున్న సమయంలోనే త్వర త్వరగా అన్ని సంక్షేమ పధకాలు అమలుచేయగలిగితే ప్రజల గుండెల్లో నిలిచిపోవచ్చని అనుకుంటున్నాడు.

అంతవరకూ బాగానే ఉందికానీ మధ్యలో చిన్న తిరకాసు వచ్చింది. నిన్న ప్రారంభించిన రైతు భరోసా పధకాన్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వ పధకంగానే ప్రచారం చేసుకోవాలనుకున్నాడు. అయితే బీజేపీ వాళ్ళు జగన్ పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ఈ పధకం లో 6000 రూపాయలు మోడీ ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నుంచి ఇస్తున్నప్పుడు కేవలం రాష్ట్రప్రభుత్వ పథకంగా ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. ఇంతలో వేమూరి రాధాకృష్ణ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ని కలవటం తో జగన్ లో కలవరం మొదలయ్యింది. ఈ సమయం లో బీజేపీ కి కోపం తెప్పించటం కొరివితో తల గోక్కున్నట్లేనని గ్రహించాడు. అందుకే చివరి క్షణం లో హడావుడిగా పధకానికి రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వ సంయుక్త పథకంగా మార్పుచేసి వైస్సార్ ఫోటో తో పాటు మోడీ ఫోటోని కూడా జత చేసి ప్రకటించటం జరిగింది. కాబట్టి తన హడావుడి కి కొంత బ్రేకులు వెయ్యటం లో బీజేపీ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. జగన్ హడావుడి చూస్తుంటే ముందు ముందు ఏదో జరగబోతుందని అందరూ అనుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదనిపిస్తుంది.

బీజేపీ – టీడీపీ తిరిగి ఒకటవుతున్నారు

బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పంధా అవలంభిస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలో ఎంతప్రయత్నిస్తున్నా ఎదగటంలేదనే ఆవేదన వాళ్లలో బలంగా వుంది. అందుకే ఏదోవిధంగా బలపడాలనే తాపత్రయం ఎక్కువయ్యింది. ఆ ఆతురత ఆంధ్ర రాష్ట్రంపై కూడా పడింది. వాస్తవానికి దక్షిణాదిలో అతి తక్కువ ప్రజాదరణ బీజేపీ కి ఆంధ్రప్రదేశ్ లోనే వుంది. దానికి అనేక కారణాలు వున్నాయి. విభజనలో ఇచ్చిన హామీలు అమలుచేయలేదనేది ప్రధానమైన అంశం. దానికి తోడు తెలుగు మీడియా , ఒక సంవత్సరం నుంచి తెలుగుదేశం తీసుకున్న వైఖరి కూడా తోడయ్యి ప్రజల్లో బీజేపీ ని విలన్ గా నిలబెట్టాయి. ఆ ప్రతికూల వాతావరణం నుంచి ఇప్పట్లో బయటకొచ్చే పరిస్థితి కనబడటం లేదు.

అందుకనే తెరచాటు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. ఇతర పార్టీల నాయకులకు గాలంవేస్తుంది. చేపలు ఒక్కొక్కటి వలలో పడుతున్నాయి. ముందుగా వ్యాపార ప్రయోజనాలున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళను చేర్చుకుంది. అందులో ఓ పెద్ద ఎత్తుగడే ఉందంటున్నారు. చంద్రబాబునాయుడే వాళ్ళను పంపించాడని ప్రజలు గాఢంగా నమ్ముతున్నారు. తర్వాత పరిణామాలు కూడా అది నిజమేనని చెబుతున్నాయి. ఇటీవలే చంద్రబాబునాయుడు విశాఖపట్నం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నుంచి బయటకు రావటం పెద్దతప్పేనని ప్రకటించాడు. బీజేపీ కి దగ్గరకావాలనే తహ తహ చంద్రబాబునాయుడు మాటల్లో స్పష్టంగా కనబడుతుంది. ఇక రెండోవైపు చూస్తే ఆంధ్ర రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ పై ఒంటికాలు మీద లేస్తున్నారు. ఇది ప్రసుతమున్న రాజకీయ పరిస్థితి. ఇక తెరచాటు రాజకీయాలేంటో చూద్దాం.

ఇటీవల ఆంధ్ర జ్యోతి , ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి ల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దాదాపు 45 నిముషాలపాటు అమిత్ షా తో భేటీ కావటం సంచలనంగా మారింది. బీజేపీ మీద అవకాశం దొరికితే కత్తులునూరే రాధాకృష ఒక్కసారి బీజేపి అధ్యక్షుడిని కలవటం సంచలనం కాకమరేంటి. దీనివెనకున్న రాజకీయంపై ఆంధ్ర దేశం లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. రాధాకృష్ణ వెళ్ళింది చంద్రబాబునాయుడు దూతగానేనని ప్రచారం జోరందుకుంది. చంద్రబాబునాయుడు ఒకేసారి ప్రత్యక్షంగా అమిత్ షా ని కలవలేడు కాబట్టి రాధాకృష్ణతో రాయబారం నెరపుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని అనుకోవటం విన్నాం కానీ ఇంతగా ప్రజల్ని వెర్రిపప్పులు చేస్తారని తెలియదు. మొన్నటి లోక్ సభ ఎన్నికలకు ముందు వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు రోజూ మోడీపై దుమ్మెత్తి పోయటం ఇంకా జనం మరిచిపోక ముందే ప్లేటు ఫిరాయిస్తారని ఎవరూ అనుకోలేదు. ఇంతవరకు ఓకే . మరి దీని పర్యవసానం బీజేపీ లో ఇంకోలా వుంది.

బీజేపీ ఆంధ్ర రాజకీయాల్లో ఓ వ్యూహాన్ని అనుసరించింది. బలీయమైన రెండు ప్రదాన సామాజిక వర్గాలైన రెడ్లు, కమ్మలు రెండు ప్రధానపార్టీలకింద సమీకరించబడటం తో సంఖ్యాపరంగా ఎక్కువగావున్న కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు తీయాలని వ్యూహం పన్నింది. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ ప్రవేశంతో అయోమయం ఏర్పడింది. అయినా వేరే ప్రత్యామ్నాయం లేకపోవటంతో కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పదవిని కట్టబెట్టి కాపులకు దగ్గరకావాలనే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు కొత్త సమీకరణలతో కమ్మ సామాజిక వర్గానికి దగ్గరవుతున్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర బీజేపీ లో ఇంకో కులపోరాటానికి తెరతీస్తోంది. కమ్మ సామాజిక వర్గం దగ్గరయితే కాపులు బీజేపీ కి దూరమయ్యే అవకాశముంది. అది జగన్ కి లాటరి టిక్కెట్టు తగిలినట్లే.

కాపులు స్వతంత్రంగా ఎదగాలని బలంగా కోరుకుంటున్నా అది ఇంతవరకు సాధ్యం కాలేదు. చిరంజీవి పై నమ్మకం పెట్టుకొని చివరకు నిరాశ చెందారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైపు కొంతమేర మొగ్గుచూపినా చివరలో తను వేసిన తప్పటడుగులతో కాపులు చీలిపోయారు. అయితే మెల్లి మెల్లిగా బీజేపీ వైపు మొగ్గు చూపటం మొదలయ్యింది. ఇటీవలే జనసేన నుంచి చింతల పార్ధసారధి కూడా బీజేపీ లో చేరటం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కాపుల్లో పునరాలోచన లోకి నెట్టాయి . కమ్మ సామాజిక వర్గం దగ్గరయితే తిరిగి నాయకత్వం వాళ్ళ కిందకే వెళ్తుందనేది కాపుల్లో వుంది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ కమ్మ సామాజిక వర్గ చేరికను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది చివరకు బీజేపీ కి పెద్ద తలనొప్పిగా మారబోతుందని అనుకుంటున్నారు. ఈ కొత్త కలయిక సామాజిక సమీకరణాల్లో జగన్ కి మేలు చేస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. కొద్దీ రోజులు పోతేగానీ వీటిపై మరింత స్పష్టత రాదు. అప్పటిదాకా వేచివుండాల్సిందే.

2019 తెలంగాణలో ముఖ్యమైన తీపి-చేదు జ్ఞాపకాలు

మరికొన్ని గంటలలో ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ నేపథ్యంలో 2019లో తెలంగాణలో ఎన్నో శుభ-అశుభ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిలో కొన్ని ఆనందభరిత ఘటనలు ఉన్నాయి. అదే సమయంలో మరికొన్ని విషాద ఘటనలు ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కసారి గుర్తుచేసుకుందాం..

  • తొలిసారి రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కింది. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మంత్రులు అయ్యారు.
  • గోదావరి నదిపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వర ప్రాజెక్టు జూన్ 21న అధికారికంగా ప్రారంభమైంది. ప్రాజెక్టుతో 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
  • ఇంటర్ బోర్డులో పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. 99 మార్కులు వచ్చిన విద్యార్థికి సున్నా మార్కులు వేయడం వివాదాస్పదం అయ్యింది. ఫలితాలు వెల్లడయ్యాక 23 మంది విద్యార్థులు ఆత్యహత్యకు పాల్పడ్డారు.
  • సచివాలయం, అసెంబ్లీ భవనాలను కొత్తగా నిర్మించాలని కేసీఆర్ ఈ ఏడాది జూన్‌లో ముందడుగు వేశారు. ఎర్రమంజిల్‌లోని చారిత్రక పాత భవనాలను కూల్చి, వాటి స్థానంలో అసెంబ్లీ, పాత సచివాలయాన్ని పడగొట్టి, అక్కడే కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించారు.
  • తక్కువ భూసేకరణతో, గోదావరి జలాలను కృష్ణా నదికి చేర్చాలనే ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌- కేసీఆర్ మధ్య జరిగిన చర్చలు ఈ ఏడాది ప్రత్యేకంగా నిలిచాయి.
  • యాదగిరి గుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రాన్ని, కారు బొమ్మను చెక్కడం టీఆర్‌ఎస్ సర్కారును ఇరుకున పెట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వాటిని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.
  • ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 52 రోజుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ ఛార్జీలు చెల్లించి గమ్యస్థానాలకు చేరాల్చిన పరిస్థితి వచ్చింది. మొదట్లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. చివరికి సమ్మె విరమించడంతో వారిపై వరాల జల్లు కురిపించారు. అయితే.. సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడి.. కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున భారం పడింది.
  • దిశ ఘటన యావత్తు దేశాన్ని కదిలించింది. దిశపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేయడాన్ని భారతావని తీవ్రంగా ఖండించింది. నిందితులను పట్టుకుని, ఘటన జరిగిన స్థలంలోనే వారితో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేప్పుడు ఎదురు తిరగడంతో ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. ఈ ఘటన తెలంగాణకు, దేశానికి మరకగా మిగిలింది.
  • ఆసిఫాబాద్ జిల్లాలో సమత హత్యాచారం జరిగింది. ముగ్గురు కామాంధులు ఓ గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ రెండు ఘటనలు కొద్ది రోజుల వ్యవధిలోనే జరగడంతో మహిళల భద్రతపై రాష్ట్రంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.