Home Blog Page 8634

జగన్ కి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ నిర్ణయం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న డయ్యూ డామన్ – దాద్రా నగర్ హవేలీలకు డామన్‌ను రాజధానిగా మోదీ సర్కార్ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియా ద్వారా తెలియజేసారు.

ఈ నిర్ణయం ఏపీకి కూడా వర్తిస్తుందని అప్పుడే చర్చ మొదలైంది. ఇదే నిర్ణయాన్నే ప్రధాని ఏపీకి కూడా అమలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తారని తెలుస్తోంది. ఇంకా మూడు రాజధానులకు కేంద్రం మద్దతు వుందనే వైసీపీ ప్రచారానికి కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ తగిలింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

Read More:Assembly approves Inquiry Bill on Insider Trading

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. రాజధానిని ఒక ప్రాంతం నుంచి మరో రెండు ప్రాంతాలకు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే నిర్ణయానికి కేబినేట్, అసెంబ్లీ ఆమోదం తెలిపినా.. మండలి మాత్రం ఆమోదించలేదన్న విషయం తెలిసిందే.

Read More: వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం

తెలంగాణ పట్టణఎన్నికలు బీజేపీ,కాంగ్రెస్ కి జీవన్మరణ సమస్య

తెలంగాణాలో ఈ సీజన్ కి చివరిగా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఎటూ అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికలు అయిపోయాయి. ఈ మున్సిపల్ ఎన్నికలతో ఇంకో నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఎన్నికలు వుండవు. కేవలం కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తప్ప. చివరగా జరగబోయే ఈ మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తయారవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో తెరాస పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. దూరంగా రెండో స్థానంలో కాంగ్రెస్ నిల్చింది. బీజేపీ తన ఉనికిని చాటుకోలేకపోయింది.

మరి పురపాలక సంఘాల ఎన్నికల పరిస్థితి ఎలా వుండబోతుందనేది ప్రతి ఒక్కరి మనస్సులో ఉత్కంఠ రేపుతోంది. తెరాస మాత్రం పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇక్కడా వస్తాయనే ధీమాగా వుంది. పరిశీలకుల అంచనా ప్రకారం ఆ మోతాదులో ఫలితాలు గంపగుత్తగా ఒకవైపు ఉండకపోయినా తెరాస తన ఆధిక్యతను చాటుకుంటుందనే భావిస్తున్నారు. ఇవి పట్టణ ఓటర్లకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రతిపక్షాలకు కూడా కొంత బలం చేకూరుతుందని భావిస్తున్నారు.

ముఖ్యంగా ఈ ఎన్నికలు తెరాస కు ఎవరు ప్రత్యామ్నాయ పార్టీ యో నిర్ణయించే ఎన్నికలుగా పరిశీలకులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత దేశంలో, రాష్ట్రం లో జరిగిన పరిణామాలు ఈ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. ముఖ్యంగా దేశంలో ఆ తర్వాత వచ్చిన రామమందిర తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం ప్రభావం పట్టాన ఓటర్లపై ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులూ నమ్ముతున్నారు. అదీకాక బీజేపీ కి మొదట్నుంచి పట్టణాల్లోనే ఎంతోకొంత బలం వుండటంకూడా పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వీటితోపాటు కెసిఆర్ కనక ఒవైసీ తో బహిరంగంగా కలిసి పనిచేసేటట్లయితే అది బీజేపీ కి లాభం చేకూరుతుందని బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా ఇది పట్టణ ఓటర్లలో హిందూ ఓటర్లు బీజేపీ వైపు సమీకరించబడే అవకాశం ఉందని నమ్ముతున్నారు.

ఇక కాంగ్రెస్ కి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. ఎందుకంటే ఇందులోకనక బీజేపీ రెండో పార్టీగా అవతరిస్తే కాంగ్రెస్ కి దెబ్బతగిలే అవకాశం వుంది. మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీకి మారే అవకాశం వుంది. అదేజరిగితే కాంగ్రెస్ కోలుకోవటం కష్టమే అవుతుంది. అందుకనే ఎలాగైనా రెండో స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ లో ఇప్పటికీ జనాకర్షణ గల నాయకులు చాలా మందివున్నారు. ఈ జనాకర్షణ ఓట్లు రాలుస్తుందో లేదో చూడాలి. ఏదిఏమైనా ఈ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ కు కీలకంగా మారాయి. రెండు పార్టీలు రెండో స్థానంకోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు రెండో పార్టీగా రాగలిగితే ఆ పార్టీకి 2024 లో భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు తెరాస కన్నా బీజేపీ, కాంగ్రెస్ కి కీలకంగా మారాయి. జనవరి 25వ తేదీనగాని వీటి భవిష్యత్తు తేలదు. ఆ ఫలితం కోసం వేచి వుందాం.

పవన్ కళ్యాణ్ కి తిక్క.. జగన్ కేమో…

ప్రత్యేక రాయలసీమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి టెంకాయ కొట్టారనీ, మరో యేడాది లేదా ఐదేళ్ళలో అయినా ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు ఖాయమని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. అలాగే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిక్క వ్యక్తి, ఆయన చెప్పేంత వరకు ఎవరికీ ఏది తెలియదని అనుకుంటారని ఎద్దేవా చేశారు.

వైకాపా సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుపై జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ, రాజధాని విషయంలో అసెంబ్లీ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని చెప్పారు. అయితే, తమకు కేంద్రంతో పాటు.. న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.

Read More: వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం

ముఖ్యంగా, ఏపీలో సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్రం వేచి చూసే ధోరణని అవలంబిస్తోందని చెప్పారు. సచివాలయంతో సామాన్య ప్రజలకు పని లేదని అపరచాణుక్యులైన మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. రాయలసీమ నుంచి విశాఖకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. హైకోర్టుతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు.

అలాగే, రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్నన వారిలో ఆడ, మగ అనే తేడా లేకుండా పోలీసులు చావబాదుతున్నారని… బ్రిటీష్ వారి హయాంలో కూడా ఇలా జరగలేదని అన్నారు. ప్రత్యేక రాయలసీమకు జగన్ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారని… రెండేళ్లకో, ఐదేళ్లకో ప్రత్యేక రాయలసీమ వచ్చి తీరాల్సిందేనని చెప్పారు. జగన్ తాను అనుకున్నదే జరగాలని అనుకుంటున్నారని… ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదనుకుంటున్నారని జేసీ విమర్శించారు. వేసుకున్న బట్టలు విప్పేసి తిరుగుతామంటే ఎవరూ ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు.

Read More:
మా నాయకులు కోర్టుకు వెళ్లడం వల్లే ప్రజలు 151 సీట్లు ఇచ్చారు!

“నాకు తెలిసి ఎక్కడా కూడా చిన్న రాష్ట్రంలో మూడు రాజధానులు లేవు. ఏందో ఇక్కడ మనోళ్లు జగన్‌కు పెద్ద ఎత్తున పట్టం కట్టారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. శాసనసభను అందరూ గౌరవించాలి. ఆయన శాసించినా సులభంగా రాష్ట్రంలో మూడు రాజధానులు జరగవు. హైకోర్టు కర్నూలుకొస్తే ఏం లాభం? మా జతగాళ్ల రెండు లాడ్జిలు ఫుల్‌ అవుతాయి తప్పా మరేమీ ఉండదు. రాజధానికి బ్రెయిన్‌ లాంటిది సచివాలయం. బ్రెయిన్‌ లేకపోతే ఏం ఉపయోగం? అందుకే జగన్‌ తెలివిగా అమరావతే రాజధానిగా పెడుతారు. బ్రెయిన్‌ మాత్రం విశాఖకు తీసుకెళ్తున్నారు.

Read More:ఆంధ్ర రాజధాని అంశంలో రాజకీయకోణం

క్రమశిక్షణ, సిగ్గు, మానం, అభిమానం ఆయనకు లేవు. దొందూ… దొందే? మా టీడీపీ వాళ్లు ముందుగా కొన్నెకరాలు కొన్నారు. ఆ లిస్టును ఇప్పుడు ప్రకటించారు. వీళ్లిప్పుడు దోచుకోవాలనే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పవన్‌ ఓ తిక్కాయన. ప్రధాని నరేంద్ర మోడీకి మూడు రాజధానులు విషయం చెప్తానంటున్నాడు. మోడీకి అన్నీ తెలుసు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. కేంద్రం అన్నీ చూస్తూనే ఉంది. కళ్లు ఎప్పుడు తెరుస్తుందో చూడాలి’ అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

జగన్ కోరిక మేరకు కొత్త ‘జెడి’ నియామకం.. ఊరట లభిస్తుందా?

కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) జాయింట్‌ డైరెక్టరు (జెడి)గా ఐపిఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌ నియమితులయ్యారు. మనోజ్‌ 1994 గుజరాత్‌ కేడర్‌ ఐపిఎస్‌ అధికారి. ఆయన ఐదేళ్ల పాటు సిబిఐలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ సిఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి మీద నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ జేడీగా తెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలకు సంబంధం లేని అధికారిని నియమించాలని విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే..

ఆ లేఖలో ఏముందంటే…

‘ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌లో సీబీఐ జేడీగా నియమించాలి. గతంలో సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేశారు. ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తి, రాజకీయాలతో ముడి పడి ఉన్న అధికారి. కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. లక్ష్మీనారాయణతో పలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న కాలంలో ఆయన ఎస్పీగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించాలి’ అని విజయసాయిరెడ్డి లేఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు.

ఫొటోల కోసం, పూలదండల కోసం పని చేయకండి

కేంద్రంలో, పలు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉండడంతో సహజంగా వరించి అధికార ఆర్భాటాల మోజులో చిక్కుకోవద్దని స్వయంసేవక్ లను ఆర్ ఎస్ ఎస్ అధినేత డా. మోహన్ భగవత్ సున్నితంగా వారించారు. ఫొటోల కోసం, పూలదండల కోసం పని చేయకండి, అది మన పద్ధతి కాదని అంటూ సున్నితంగా మందలించారు.

ఆరెస్సెస్‌ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర శివారులోని భారత్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో స్వయం సేవకులకు మాట్లాడుతూ సార్వజనిక ఉత్సవంలో భాగంగా బ్యానర్లు వేయించడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హితవు చెప్పారు.

‘‘క్రమశిక్షణతో కూడిన శక్తిమంతమైన సమాజ నిర్మాణమే సంఘ్‌ లక్ష్యం. స్వయం సేవకులు కష్టాలను ఎదిరించి ధైర్యంగా ముందుకు సాగాలి. విశ్వగురు స్థానంలో ఉండిన భారత దేశం పరమ వైభవం సాధించడమే స్వయం సేవకుల అంతిమ లక్ష్యం కావాలి” అంటూ ఉద్భోదించారు. వారి ప్రతి అడుగును సమాజం గమనిస్తుందని గుర్తించాలని హెచ్చరించారు.

.

ఆత్మ సమర్పణ భావంతో చేసే ప్రతి పని విజయవంతమవుతుందని స్పష్టం చేసారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సంఘ్‌ శాఖలు మరింత విజయవంతంగా అన్ని గ్రామాలు, బస్తీలకు చేరాలని సూచించారు. కొత్తగా వచ్చిన స్వయం సేవక్‌లను నిలబెట్టుకోవాలని, పని విస్తృతిని పెంచుకోవాలని చెప్పారు.

సమాజంలో స్వయంసేవకుల ప్రవర్తన, భాష, సమాజ మేలు కోరే ఆలోచనలు, వాటిని తెలియచేసే విధానం కార్యవిస్తరణలో కీలకమని వాటిని విస్మరించకూడదని హితవు చెప్పారు.

పవన్ కి అండ బీజేపీ – బీజేపీకి దండ పవన్

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడవక ముందే.. రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణానికి జనసేన-బీజేపీ కూటమి కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుంటూ.. గత కొంతకాలంగా వైసీపీ నేతలు తీవ్రమైన దూకుడునే ప్రదర్శించారు. ఆయనను వ్యక్తిగతంగా విమర్శించడమే కాకుండా ఆ పార్టీ శ్రేణులపై అక్కడక్కడా దాడులకు పాల్పడుతున్న ఉదంతాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. దాంతో ఒక బలమైన రాజకీయ అండ తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కు ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపితే.. అధికార వైసీపీని దీటుగా ఎదుర్కోగలమనే అంచనాకు పవన్ వచ్చారు. కాబట్టి ఒక రాజకీయ అనివార్యతే బీజేపీతో వెళ్లేందుకు జనసేనకు మార్గం వేసిందని చెప్పొచ్చు.

పరస్పర ప్రయోజనాల కోసమే ఈ రెండు పార్టీలు కలిశాయి. బీజేపీతో కలవడం పవన్ కు ఎంత అవసరమో.. బీజేపీకి కూడా అంతే అవసరం. ఎందుకంటే గత కొంతకాలంగా దక్షిణ భారతంలోకి ప్రవేశించాలని కమల నాథులు చేయని ప్రయత్నం లేదు. ప్రస్తుతం బీజేపీకి అవకాశం వచ్చింది. పవన్ కలయికతో బీజేపీకి ఒక ప్రచారసారథి, జనాన్ని ఆకర్షించి, పార్టీ విస్తరణకు దోహదపడగల వ్యక్తి లభించినట్లయింది. అలాగే బీజేపీ అండతో జనసేనకు నైతిక స్థైర్యం లభించినట్లయింది.

ఈ కూటమికి మొదటి టార్గెట్ అధికార వైసీపీనే. అయినప్పటికీ పవన్ కల్యాణ్ పైనే ఇప్పటికీ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ పై దూకుడు ప్రదర్శించలేకపోతోంది. ఇక్కడే వైసీపీ రాజకీయ వ్యూహం తేటతెల్లమవుతోంది. ఇప్పుడు కొత్త కూటమి రూపంలో కార్యాచరణకు దిగి కేంద్రం సహకారంతో జగన్ దూకుడుకు ముకుతాడు వేయగలిగితే ఆ క్రెడిట్ కచ్చితంగా జనసేన,బీజేపీలకు దక్కుతుంది. ఈ కూటమి జగన్ సర్కార్ ని నిలువరించి బలోపేతమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందో.. లేదో..? తీయాలంటే.. కొంతకాలం వేచి చూడాలి.

పెట్టుబడులకు.. భారత్ బెస్ట్.. భారత్ లో తెలంగాణ బెస్ట్

పెట్టుబడులకు ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలోనే అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఉండగా, ఇండియా వరకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో అత్యంతమైన ప్రాంతం హైదరాబాద్ నగరమని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తార క రామారావు అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.

స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ మంగళవారం వివిధ దేశాల నుంచి హాజరైన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సీఎన్‌బీసీ టీవీ-18, సీఐఐ సంయుక్త అధ్వర్యంలో‘ది ఇన్‌వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్’ అంశం పై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్‌లో ఆయన మాట్లాడారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని, 20 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న యువత ఇండియాకు అద్భుతమైన బలమన్నారు. తమ దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. తమ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టాప్-5 ఐటీ దిగ్గజాలు తమ కేంద్ర కార్యాలయాల తర్వాత హైదరాబాద్‌ను అతి పెద్ద కార్యస్థానంగా ఎంచుకున్నట్టు కేటీఆర్ వివరించారు.

ప్రపంచంలోనే నివాసానికి హైదరాబాద్ నగరం అత్యుత్తమంగా మెర్సర్ ఐదు సంవత్సరాలుగా గుర్తిస్తూ వచ్చిందన్నారు. దీంతో పాటు ఇటీవల ప్రపంచంలోని 130 నగరాలలో అత్యంత డైనమిక్ నగరంగా హైదరాబాద్‌ను జీఎల్‌ఎల్ సంస్థ గుర్తించిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ హైదరాబాద్‌లో తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించడంతో పాటు వౌలిక సదుపాయాలు మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇండియాతో పాటు రాష్ట్రాలు కూడా మరింత బలోపేతం కావాలంటే ఇన్నోవేషన్, ఇన్‌క్లూజివ్ గ్రోత్, ఇన్‌ఫ్రాస్ట్రకర్చర్ మూడింటిని పాటించాలన్నారు. ప్యానల్ డిస్కషన్ అనంతరం దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో పలు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కలిశారు. వీరిలో రోషే కంపెనీ చైర్మన్ క్రిష్ట్ఫోర్ ప్రాన్జ్, హెచ్‌పీ సీఈవో విశాల్ లాల్, అపోలో టైర్స్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ కన్వర్, కాల్ల్స్ బెర్గ్ గ్రూప్ చైర్మన్ పెమ్లింగ్ బెసెన్ బాచర్, పీ అండ్ జీ దక్షిణాసియా సీఈవో మాగెశ్వరన్ సురంజన్ తదితరులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

హైదరాబాద్ నగరం ఫార్మా హబ్‌గా మారిందని, ఫార్మాసిటీ, మెడికల్ డివైస్ పార్క్‌లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్, లైఫ్ సైనె్సస్ రంగాలలో పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు.

కెసిఆర్ కి ఒవైసీ గండం?

కెసిఆర్ తెలంగాణలో తిరుగులేని నాయకుడుగా రోజు రోజుకీ ఓ వైపు ఎదుగుతుంటే రెండోవైపు ఆయనకు ఒవైసీ గండం గ్రహణంలాగా పట్టుకున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆసుపాసుల్ని పూర్తిగా ఆపోసన పట్టిన కెసిఆర్ కి తెలంగాణ అభివృద్ధికి ఎక్కడ ఏ చర్యలు తీసుకోవాలో బాగా తెలుసు. ముఖ్యంగా నీటిపారుదలరంగంలో తనదైన ముద్రవేస్తూ ముందుకు వెళ్తున్నాడు. మొదట్లో తుమ్మడిహట్టి నుంచి కాళేశ్వరం మార్చినందుకు వచ్చిన వివాదం క్రమక్రమంగా తగ్గుముఖంపట్టింది. ఎప్పుడయితే నీటిపారుదల ప్రాజెక్టులకు ఎక్కువ నిధులుకేటాయించి కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులు పెట్టించాడో అప్పుడే రైతుల్లో సానుకూల వాతావరణం పెరుగుకుంటూ వచ్చింది. ఇంకో సంవత్సరానికి మొత్తం ప్రాజెక్టు ఫలితం రైతులకు చేరితే తనకు రాజకీయంగా తిరుగువుండదని అందరూ అనుకుంటున్నారు.

నిజంగాకూడా పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఇదే వూపులో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తిచేస్తే తనను ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజించుకుంటారు. ఒకసారి కాళేశ్వరం పూర్తయితే ఆ ప్రభావం దక్షిణ తెలంగాణ ప్రజలపై కూడా పడుతుందని మరచిపోవద్దు. పాలమూర్-రంగారెడ్డి, దిండి , సీతారామ ప్రాజెక్టులు కూడా పూర్తిచేస్తాడనే విశ్వాసం బలపడుతుంది. ఇవి రాజకీయంగా కెసిఆర్ కి అనుకూల పవనాలు. తనహయాంలో ఇన్ని ప్రాజెక్టులు పూర్తయితే ఒడిశాలో నవీన్ పట్నాయక్ లాగా దీర్ఘకాలం తెలంగాణాలో స్థిరపడే అవకాశం వుంది. ప్రజల్లో నవీన్ పట్నాయక్ పై వున్న సదభిప్రాయం కెసిఆర్ పై లేకపోయినా నీటిపారుదల ప్రాజెక్టులే తనని ఆ స్థాయిలో నిలబెడతాయని భావిస్తున్నారు.

అంతవరకు బాగానే వున్నా కెసిఆర్ అనవసరమైన రిస్కు తీసుకుంటున్నట్లు కనబడుతుంది. మొదట్నుంచీ రాజకీయాల్లో ధీటైన ఎత్తుగడలతో ప్రత్యర్థిని దెబ్బతీయటం కెసిఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. దానికోసం అవసరమైతే విలువలను పక్కనపెట్టయినా ఎత్తుగడలు వేయటంలో తనకు మించినవాడు లేడు. దీంట్లో భాగంగానే తెలంగాణాలో ముస్లిం సామాజిక వర్గాన్ని జాగ్రత్తగా దగ్గరకు తీసి వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనటం జరిగింది. అదేసమయంలో కేంద్రంలోని బీజేపీ తోకూడా సఖ్యతగా మెలుగుతూ కేంద్రం దగ్గర పనుల్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నాడు. అయితే ఇది ఇటీవల ఇబ్బందిగా మారింది. ఒవైసీ కి బిజెపి కి పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుందని తెలుసు. కేంద్రం లో మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ముస్లిం సామాజిక వర్గంలో కొంతమేర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. అంతకుముందు ముమ్మూరు తలాక్ , ఆర్టికల్ 370 బిల్లులపై కెసిఆర్ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయటం తన మిత్రుడు ఒవైసీకి, ముస్లిం సామాజిక వర్గానికి కొంత అసంతృప్తిని కలిగించాయి. అయినా మొత్తం మీద రాష్ట్రంలో కెసిఆర్ ముస్లిం అనుకూల విధానాలు తీసుకోవటంతో కొంతవరకు సర్దుకుపోయింది.

కానీ ఇప్పుడు పౌరసత్వ చట్టం, ఎన్ పి ఆర్ , ఎన్ ఆర్ సి లపై ఏదోఒక వైపు మొగ్గాల్సిన పరిస్థితి కెసిఆర్ కి ఏర్పడింది. అందుకనే పౌరసత్వ బిల్లుపై బీజేపీ కి వ్యతిరేకంగా వోటువేయటం జరిగింది. ఇప్పుడు ఒవైసీ దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ప్రచారం చేపట్టటం తో పాటు కెసిఆర్ పై ఒత్తిడి పెంచటం జరిగింది. నిన్న ఒవైసీ ముస్లిం మత పెద్దల్ని తీసుకొని కెసిఆర్ తో మూడు గంటలు సమావేశం వేశాడు. కెసిఆర్ ని పూర్తిగా ఈ ప్రచారంలో భాగంగా మద్దత్తు కావాలని కోరినట్లు తెలుస్తుంది. కెసిఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. దీంట్లో భాగంగానే రేపు నిజామాబాదు లో జరిగే బహిరంగ సభకు తెరాస ప్రతినిధులు కూడా హాజరవుతారని తెలుస్తుంది. ఇదే జరిగితే కెసిఆర్ పెద్ద రిస్కు తీసుకున్నట్లే. ఇప్పటివరకు కెసిఆర్ ఒవైసీ పరోక్ష మద్దత్తు మాత్రమే తీసుకున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా తనతో కలిసి ప్రయాణం చేస్తే ఇది బీజేపీ కి ఓ లాటరీ తగిలినట్లే. కెసిఆర్ కి వ్యతిరేకంగా ఏదైనా ఘటన కోసం ఎదురుచూస్తున్న బీజేపీ కి ఓ ఆయుధాన్ని కెసిఆర్ ఇచ్చినట్లే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుత సమస్య సమాజం లో మత పరమైన సమీకరణలకు వూతమిస్తుంటే కెసిఆర్ ఓ మతానికి పూర్తి మద్దత్తు ప్రకటించినట్లుగా బీజేపీ ప్రచారం చేసే అవకాశాలు మెండుగా వున్నాయి.

పౌరసత్వ బిల్లుని వ్యతిరేకించటం వేరు , ఒవైసీ తో కలవటం వేరు. ఈరెండింటిలో తేడా వుంది. ఇదే నిజామాబాద్ జిల్లా భైన్సాలో అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ మతస్థులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కేసులు ఎదుర్కుంటున్న సంగతి అందరికీ తెలుసు. ప్రజల్లో ఆ జ్ఞాపకాలు చెరిగిపోకముందే తిరిగి నిజామాబాదు లోనే ఈ బహిరంగ సభ జరగటం మెజారిటీ ప్రజలకు సమ్మతం కాదు. మరి ఈ సమావేశంలో తెరాస ప్రతినిధులు కూడా పాల్గొంటే అది ఆత్మహత్యా సదృశమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. సమస్య ఏదైనా ఒవైసీ తో కలిసి సభను పంచుకోవటం కెసిఆర్ తీసుకుంటున్న పెద్ద రిస్కుగా భావించాలి. ఇది కెసిఆర్ వ్యూహాత్మక తప్పిదమవుతుందని అనుకుంటున్నారు. పొరపాటున సభలో ఒవైసీ ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది దావానలం లాగా మారుతుందని అందరికీ తెలుసు. ఇప్పుడు పూర్తి అనుకూల రాజకీయ వాతావరణంలో వున్న కెసిఆర్ కి ఇంత పెద్ద రిస్కు తీసుకోవాల్సిన అవసరం లేదు. కెసిఆర్ ఎత్తుగడల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడని అందరూ భావిస్తున్న తరుణంలో ఇంత పెద్ద రిస్కు తీసుకుంటాడో లేదో వేచి చూద్దాం.

వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో కార్యకర్తలకు మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందులో ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి తగలబడటం. ఇది సోషల్ మీడియా లో వైరల్ అయింది

Read More:
జగన్ కి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ నిర్ణయం

మెగా ఫామిలీ ఐక్యంగా ఉంటుందా?

 

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని ప్రకంపనలు అన్ని పార్టీల్లో, అన్ని వర్గాల్లో చీలిక తెచ్చాయి. మూడు రాజధానుల ప్రకటన తెలుగుదేశంలోనూ ఉత్తరాంధ్ర పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తుంది. ఇక జాతీయపార్టీ బీజేపీ లో ఎవరికితోచినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. సుజనాచౌదరి, పురందేశ్వరి మూడు రాజధానులపై వ్యతిరేకత వ్యక్తం చేయగా పార్టీ అధికార ప్రతినిధి జి వి ఎల్ నరసింహారావు స్వాగతించారు. కన్నా లక్ష్మీనారాయణ , బీజేపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తూ మాట్లాడాడు. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ రాష్ట్ర విభాగం నిట్ట నిలువునా చీలిందని చెప్పొచ్చు.

ఇంకో విశేషమేమంటే మెగా కుటుంబం కూడా దీనికి మినహాయింపు కాదు. మూడు రాజధానుల విషయమై మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ జగన్ నిర్ణయాన్ని విమర్శించాడు. ఒక రాజధానికే దిక్కు లేదు, మూడు రాజధానులా అని హేళన చేశాడు. ఆ తర్వాత రెండురోజులకి మెగాస్టార్ చిరంజీవి పత్రికా ప్రకటన విడుదల చేయం జరిగింది. జగన్ నిర్ణయాన్ని ఎటువంటి మినహాయింపులు లేకుండా సమర్ధించటమే కాకుండా దానికి కారణాలను తనదైన రీతిలో వివరించాడు. కాకపోతే భూములిచ్చిన రైతుల విషయంలో ఏదయినా చేయాలని చెప్పటం జరిగింది. ఇక మధ్య సోదరుడు నాగబాబు కూడా తనదైన రీతిలో స్పందించాడు. తన ప్రకటన స్థూలంగా చూస్తే పవన్ కళ్యాణ్ వైఖరిని సమర్ధించినట్లుగా వుంది.

మరి ఇప్పుడు మెగా అభిమానుల పరిస్థితేమిటి? పోయిన ఎన్నికల్లో మెగా కుటుంబం ఒకటిగా జనసేనకు మద్దతిచ్చింది. చిరంజీవి ప్రత్యక్షంగా జనసేనకు ప్రచారం చేయకపోయినా తన పరోక్ష మద్దత్తు జనసేనకె ఉన్నట్లు అందరూ అనుకున్నారు. రామ్ చరణ్ స్వయంగా పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళటం దీనికి ఊతమిచ్చింది. ఇప్పుడు చిరంజీవి బహిరంగంగా మద్దత్తివ్వటం మెగా అభిమానుల్ని ఇరకాటంలో పెట్టింది. దీనికి తెరవెనక కారణాలపై రక రకాలుగా విశ్లేషించుకుంటున్నారు. వాస్తవాలేమిటో ఇంకొన్నిరోజులు పోతే గానీ బయటకి రావు. ఈ పరిణామం తో మెగా అభిమానులు పెద్ద ఇరకాటంలో పడ్డట్లే. ముందు ముందు ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

చిరంజీవిని దగ్గరగా చూసేవాళ్ళు అనుకోవటం ఇది చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెబుతున్నారు. చిరంజీవి స్వతహాగా పవన్ కళ్యాణ్ లాగా దుందుడుకు స్వభావం కలిగినవాడు కాదు. ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలకు పైగా ఆంధ్రాలో అధికారంలో ఉంటుంది. ప్రభుత్వంతో వైరం పెంచుకోవటం తన మనస్తత్వానికి సరిపడదు. పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో వుండి జగన్ పై కక్షపెంచుకోవటంతో ఆ ప్రభావం తనపై పడకూడదని అనుకొనివుండొచ్చు. అందుకనే అమరావతి వెళ్ళల్లా జగన్ని అభినందించి వచ్చాడు. అయితే వెళ్లేముందు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి అక్కడ్నుంచి జగన్ దగ్గరకు వెళ్ళాడు. అంటే రాజకీయాలు వేరు, కుటుంబం వేరనే సంకేతం ఇచ్చాడు. ఇప్పుడుకూడా అదే సంకేతమిచ్చాడని అనుకోవాలా? లేక ఇంకేమైనా ఉందా అనేది తెలియటంలేదు. ఒకటిమాత్రం నిజం. చిరంజీవి దాసరి నారాయణరావు బతికున్నప్పుడు తన ఇంట్లో కాపు నాయకుల సమావేశానికి హాజరయ్యాడు. ఆ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే అధికారం అమరావతిలో కేంద్రీకరించటం కాపునాయకులకు ఇష్టం లేదని అనుకోవాలా? కొద్దిరోజులు పోతేగానీ మరికొన్ని విషయాలు బయటకి రావు. ఎందుకంటే జగన్ కాపు నాయకులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయటం ఇటీవలే జరిగింది. అందుకనే జగన్ విషయంలో చిరంజీవికి సానుభూతి ఉందని అనుకోవాల్సివస్తుంది.

ఏది ఏమైనా చిరంజీవి-పవన్ కళ్యాణ్ భిన్న వైఖరులు మెగా అభిమానుల్లో కలకలం లేపింది. కొన్నాళ్ళు పోతేగానీ ఇది ఎక్కడకు దారితీస్తుందో తెలియదు. అప్పటిదాకా వేచిచూడక తప్పదు.

జనసేన – బీజేపీ కలయిక.. పవన్ కళ్యాణ్ కి నష్టమా..?

 

 

2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ త్రయం కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.. అప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు కేంద్రంలో మోడీకి అధికార పగ్గాలు ఇచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తారని చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారు ఏపీ ప్రజలు. ఆ విధంగా రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ఎన్నికల్లో రెండు పార్టీలు ఘన విజయం సొంతం చేసుకున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న మోడీ రాష్ట్రానికి మొండి చేయి చూపించారు. నాటి ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. ఎప్పుడూ కూడా ప్రత్యేక హోదాపై బీజేపీని నిలదీయలేదు. అదేతరహాలో 5సంవత్సరాలు కాలయాపన చేసిన చంద్రబాబు 2019 ఎన్నికల సమయానికి బీజేపీపై ఫైర్ అయ్యారు.
5 సంవత్సరాలు మౌనంగా ఉన్న బాబు ఒక్కసారిగా బీజేపీపై మండి పడటం ఏమిటా.. అని అందురు ఒకింత ఆశ్చర్యానికి గురైయ్యారు. ప్రజలు మరీ.. బుర్రలులేని గొర్రెలనుకున్నారో ఏమో కానీ బాబు ఎన్నికల సమయంలో బీజేపీ పై తన విశ్వరూపం చూపించారు. కానీ ప్రజలు అటు బీజేపీని, ఇటు చంద్రబాబును నమ్మలేదు. జగన్ కి పట్టం కట్టిన విషయం తెలిసిందే..

2014 నుంచి జరుగుతున్న తంతు మొత్తాన్ని చూసిన పవన్ కూడా బీజేపీ, టీడీపీపై విమర్శల దాడి చేశారు. కానీ మరలా టీడీపీ చేసిన తప్పే జనసేన చేయడం ఆశ్చర్యం. బీజేపీని నమ్మిన టీడీపీ 2019లో తగిన మూల్యం చెల్లించుకున్న విషయం తెలిసందే. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ కలవడం మంచిది కాదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

దేశరాజకీయాల్లో కొత్త సమీకరణాలు రాబోతున్నాయా?

దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రాబోతున్నాయనిపిస్తుంది. పౌరసత్వ చట్టం దీనికి నాంది కాబోతుందా? అవుననే అనిపిస్తుంది. కాంగ్రెస్ అనుకున్నదొకటి అయినదొకటిలాగా వుంది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని లబ్ది పొందాలని అనుకున్నా మొత్తం ఆందోళన ఇప్పుడు ముస్లిం మత సంస్థల చేతుల్లోకి వెళ్ళింది. ఇది ఆందోళనకర విషయం. పైకి చూడటానికి కాంగ్రెస్ కి అన్నీ అనుకూలంగా అనిపిస్తున్నా లోపల కాంగ్రెస్ కి భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది. అదేంటో చూద్దాం.

ఇప్పటివరకు దేశరాజకీయాల్లో ముస్లింలు కాంగ్రెస్ గొడుగు కిందగాని, ప్రాంతీయపార్టీలైన సమాజ్ వాది , ఆర్జేడీ , టీఎంసీ లాంటి పార్టీల కిందగాని సమీకరించబడుతున్నారు. మొట్టమొదటిసారి ముస్లింలు స్వతంత్రంగా ఆందోళన చేస్తున్నారు. బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రేరేపిత ఆందోళన కాదు. మొదట్లో అగ్గిరాజేయటానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసినమాట వాస్తవం. కానీ ఇప్పటి ఆందోళన ప్రతిపక్ష పార్టీల చేతుల్లోనుంచి మత సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందనేది వాస్తవం. ఇది స్వతంత్రం తర్వాత అతి పెద్ద మార్పుగా భావించవచ్చు. అయితే ఇప్పటివరకు దీనికి ఒక నాయకుడంటూ లేడు . ముందు ముందు ఈ ఆందోళనలోనుంచే వచ్చే అవకాశం వుంది. ముఖ్యంగా దళిత్-ముస్లిం ఫ్రంట్ ఏర్పడే అవకాశాలు దేశంలో మెండుగా వున్నాయనిపిస్తుంది.

ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూస్తే స్వాతంత్రానికి ముందు ముస్లింలు స్వతంత్ర సంస్థలు కలిగివుండేవి. పంజాబ్ లో యూనియనిస్ట్ పార్టీ ముస్లిం ఆధిక్యతలో ఉండేది. అలాగే తూర్పులో బెంగాల్లో కూడా రాను రానూ ముస్లింలు స్వతంత్ర సంస్థల్లో ఉండేవారు. విభజన తర్వాత ముస్లిం మెజారిటీ ప్రాంతాలు పాకిస్తాన్ కి వెళ్లిపోవటంతో ఇక్కడేవున్న ముస్లింలు కాంగ్రెస్ కిందనే వున్నారు. బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత ముస్లింలు కాంగ్రెస్ కి దూరంగా జరిగారు. అలాగే బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రం లో ముస్లింలు సిపిఎం కింద వుండి టీఎంసీ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయారు. అస్సాం లో మొదట్నుంచి కాంగ్రెస్ కింద వున్నా గత రెండు లోక్ సభ ఎన్నికల్లో ముస్లిం స్వతంత్ర పార్టీ అల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కింద ఎక్కువమంది సమీకరించబడ్డారు. ప్రస్తుతానికి బెంగాల్, అస్సాం లో ఇప్పుడున్న సమీకరణాల్లో ముస్లింల లో మార్పు రాకపోయినా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో సమీకరణాల్లో మార్పులొచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. ఇదే జరిగితే రాజకీయాల్లో పెనుమార్పుగానే పరిగణించవచ్చు.

ఇప్పుడే అందినవార్తల ప్రకారం ఝార్ఖండ్ లో బీజేపీ ఓడిపోయి జేఎంఎం -కాంగ్రెస్ -ఆర్జేడీ అధికారంలోకి రావచ్చని తెలుస్తుంది. ఒకవేళ అదిజరిగినా కాంగ్రెస్ కి పెద్ద ఒరిగేమీ లేదు. కాంగ్రెస్ అక్కడ మైనర్ పార్ట్నర్ మాత్రమే. కాంగ్రెస్ దేశంలో తిరిగి అతి పెద్ద పార్టీగా ఏర్పడే అవకాశాలు కన్పించటం లేదు. సమీప భవిష్యత్తులో బీజేపీ నే అతిపెద్ద జాతీయ పార్టీగా ఉండబోతుంది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ల్లో ఎక్కడా మెజారిటీ మాట అటుంచి కనీసం పెద్ద పార్టీగా కూడా ఎదగలేక పోతుంది. కాబట్టి కాంగ్రెస్ భవిష్యత్తు ఇప్పటికీ అగమ్యగోచరమే. ఒకవేళ నిజంగానే ముస్లింలు దళితులూ ఒకటై కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ కి ఇప్పుడున్న అవకాశాలు కూడా వుండవు. జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ కి పెద్ద దెబ్బగానే భావించాలి. ఈ ఆందోళన నుంచి రాబోయే పరిణామాలు ఎలావుంటాయో వేచి చూద్దాం.

అమిత్ షా ఆఫర్.. పట్టుకున్న పవన్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలో బలమైన రాజకీయ వ్యక్తిత్వంగా ఎదిగారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. 2019 ఎన్నికలలో జనసేన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ, పవన్‌కు ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ప్రధాన రాజకీయ ప్రతిపక్ష పార్టీ టిడిపి ప్రజల ఆశగా తనను తాను చూపించుకునే పరిస్థితిలో లేదు. ప్రజలలో టిడిపిపై ఉన్న వ్యతిరేకత భావమే జనసేన బలపడటానికి కారణమైంది. ప్రస్తుతం ప్రజలు జనసేన ను నమ్మినంతగా టీడీపీని నమ్మలేక పోతున్నారు.

పవన్ కళ్యాణ్ 2015 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించారు, కానీ ఇప్పటివరకు కేడర్‌ను నిర్మించడంలో విఫలమయ్యారు. దానికి ప్రధాన కారణం పార్టీలో బలమైన నాయకులు లేకపోవడం. ఎటు చూసినా పవన్ కల్యాణే చేయాలి, ఆయనే పార్టీలో ఉన్న ఏ సమస్యనైనా పరిష్కరించాలంటే కష్టం.

ఇది కూడా చదవండి: జనసేనాని రాజకీయ ప్రస్థానంపై విశ్లేషణ

ఏపీ ప్రజలలో వైసీపీ పై నమ్మకం ఇంకా తగ్గలేదు అందుకు కారణం లేకపోలేదు. జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ.. రావడమే. జగన్ ప్రభుత్వాన్ని కిందికి లాగడానికి అటు ప్రతిపక్షానికి గాని, ఇటు పవన్ కి గాని బలమైన పాయింట్ లేదు. జగన్‌పై పోరాడటానికి మరియు ప్రజలలో అతన్ని అపరాధిగా నిరూపించడానికి పవన్ కళ్యాణ్‌కు బలమైన పాయింట్ అవసరం. వైయస్ జగన్ మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసినట్లు పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో కూడా జగన్ గెలవడానికి ఈ పథకాలు సహాయపడతాయి. 2004 లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కూడా ఇలానే జరిగింది. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలే 2009లో ఆయనకు పట్టం కట్టిపెట్టాయి. జగన్ విషయం లో కూడా ఇలానే జరిగే అవకాశం లేకపోలేదు.

జగన్ వేగాన్ని ఆపడానికి పవన్ మద్దతు కావాలి కాబట్టి బిజెపి వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. దేశమంతా మోడీ గాలి వీస్తున్నప్పటికీ.. చాలా రాష్ట్రాలను బీజేపీ పాలించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంలో బీజేపీ విఫలమైంది. ఏపీ ప్రజలు బిజెపిని తిరస్కరించారు, దానిని రేసులో కూడా పరిగణించలేదు. తమ పార్టీకి ప్రాతినిధ్యం వహించడానికి బిజెపికి బలమైన నాయకుడు కావాలి. పవన్ కళ్యాణ్‌కు బలమైన మద్దతు మరియు అతనికి మద్దతు ఇవ్వడానికి ఒక స్థిర కార్యకర్త అవసరం.

ఇప్పుడు, ఇది వారిని ఏకం చేస్తుంది, పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు బిజెపి సిఎం వ్యక్తిగా ప్రాతినిధ్యం వహించినట్లయితే.. బీజేపీ- జనసేన కూటమికి ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటన ఈ వ్యూహాన్ని బలపరిచింది. జగన్‌పై పవన్‌ ఎక్కువ సమయం బెదిరింపులతో వ్యాఖ్యలు చేశారు. “ఢిల్లీలో నాకు బలమైన వ్యక్తులు ఉన్నారు, వారు నన్ను చాలా ఆరాధిస్తారు, జగన్ రెడ్డి కొంచం జాగ్రత్త వహించండి” అని పవన్ అన్నారు. అంటే పవన్‌కు బిజెపి నుండి బలమైన మద్దతు ఉంది అని అర్థమౌతుంది. అదే ఈ రోజు చిగురించింది. మరి 2024లో ఆ ఫలాలు ఎలా ఉంటాయో.. వేచి చూడాలి..

జగన్ పైపైకి బాబు కిందికిందికి

ఆరు నెలల జగన్ పరిపాలన ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించింది. సంక్షేమమంటే ఏంటో జగన్ చూపిస్తున్నాడు. ఓ విధంగా వాళ్ళ నాన్నను మించిపోయాడని చెప్పొచ్చు. కాకపోతే ఇన్ని పధకాలు అమలుచేయటానికి డబ్బులు ఎక్కడనుంచి వస్తున్నాయనేది ? ఆంధ్ర రాష్ట్రం పూర్తి లోటు లో నడుస్తుందని ఒకవైపు చెబుతూనే రెండోవైపు ఏ రాష్ట్రమూ అమలుచేయనన్ని సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ముందుగా ఆర్ధిక పరిస్థితి ని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతయినా వుంది. అయితే ఒక్కటిమాత్రం నిజం. సామాన్య ప్రజానీకం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏంటి ఎలా నడుపుతున్నారు అనే చర్చలోకి వెళ్లే అవకాశం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తన జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయనే దానిపైనే వాళ్ళు ప్రభావితమవుతారు. ఆ కోణంలో చూస్తే జగన్ ప్రజల మనసుల్ని దోచుకుంటున్నాడని చెప్పొచ్చు.

నిన్న కాబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఏ ఒక్కరూ అభినందించకుండా ఉండలేరు. మహిళలపై అత్యాచారం కేసులు 21 రోజుల్లో పూర్తి కావాలని , శిక్షలో భాగంగా వురి శిక్షను చేర్చటం , ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పటం నిజంగా అభినందనీయం. ఈ చట్టం ఓ విధంగా దేశం మొత్తానికి మోడల్ చట్టంగా నిలిచే అవకాశముంది. దీని అమలు కూడా ఇంతే చిత్తశుద్ధి తో చేస్తారని ఆశిద్దాం. అలాగే అస్సైన్డ్ భూముల విషయం లో తీసుకున్న నిర్ణయం సాహసోపేతంగా వుంది. ఇంతవరకు ఈ ఆరునెలల్లో తీసుకున్న నిర్ణయాలు చూస్తే జగన్ పరిపాలన వాళ్ళ నాన్నను మరిపించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మద్యపాన నియంత్రణ, గ్రామ సచివాలయవ్యవస్థ , ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సౌకర్యాల కల్పన, ఇంగ్లీష్ మీడియం లో బోధన అత్యంత ముఖ్యమైనవి. ఇక సంక్షేమ పధకాల గురించి సరే సరి. రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వానికి, గృహ లబ్దిదారులకు లబ్ది చేకూర్చటం కూడా మన్ననలు పొందాయి. కాకపోతే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ విద్యుత్తు పునరుత్పాదక ప్రాజెక్టులకు వర్తించకుండా ఉంటే మంచిది. లేకపోతే కేంద్రంతో పెద్ద వివాదం లోనే చిక్కుకోవాల్సి వస్తుంది. అందునా మొత్తం విదేశీ పెట్టుబడుల పై ప్రభావం పడుతుంది.

ఇక చంద్రబాబు నాయుడు పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా వుంది. యు టర్న్ బాబుగా అందరి చేత పిలిపించుకుంటున్న సంగతి తెలిసిందే. మళ్ళా ఈ రోజు అసెంబ్లీ లో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై యు టర్న్ తీసుకోవటం చూస్తుంటే చంద్రబాబు మానసిక పరిస్థితి పై ఆందోళనగా వుంది. ఏ రోజు ఏం మాట్లాడతాడో తెలియదు. నిన్నటిదాకా జగన్ తీసుకున్న నిర్ణయంపై నిప్పులు చెరిగి ఈ రోజు నేను ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకం కాదు అని చెప్పటం తనకే చెల్లింది. తనని చూస్తే జాలేస్తుంది. గౌరవంగా తప్పుకొని వేరే వాళ్లకు ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోబెడితే హుందా గా ఉంటుంది. ఎందుకంటే పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేంకదా . లేదంటే ఇంకేదైనా వ్యాపకం చేసుకుంటే మంచిదేమో ఆలోచించాలి. ఏ కోణం లో చూసినా తనకు, తన పార్టీ కి సమీప భవిష్యత్తు లో భవిష్యత్తు లేదనిపిస్తుంది. ఇప్పటికే తన ముఖ్య అనుయాయులని బీజేపీ లోకి పంపించిన విషయం ప్రజలందరికీ తెలుసు. అటువంటప్పుడు సామాన్య కార్యకర్తల్లో మాత్రం ఎందుకు విశ్వాసముంటుంది. ఏదో అచ్చన్నాయుడు లాంటి భారీ పర్సనాలిటీలు మద్దత్తు తో పార్టీని నడపటం అంట తేలిక కాదు.

ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే ఈ ఆరు నెలలల్లోనే జగన్ పైపైకి చంద్రబాబు కింది కింది కి వడివడిగా అడుగులు పడ్డాయి. ఇదే కొనసాగితే వచ్చే ఆరు నెలల్లో పరిస్థితుల్లో ఇంకెన్ని మార్పులొస్తాయో.

పవన్ బీజేపీతో కలిశాడు.. మరి నా పరిస్థితి ఏంటి?

2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు అతివేగంగా మార్పు చెందాయి. 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అండతో బీజేపీ దండతో అధికార పీఠం ఎక్కిన చంద్రబాబు 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి అనూహ్యమైన అపజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..

టీడీపీ, తన అధికారాన్ని కోల్పోయి దాదాపు 7నెలలు అయింది.. ఈ ఏడు నెలల కాలంలో టీడీపీ పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఒకవైపు ఎన్నికల మ్యానిఫెస్టోని జగన్ అమలుపరుస్తూ… ప్రజల్లో నమ్మకాన్ని మరింతగా పెంచుకుంటూ పోతున్నారు. మరోవైపు టీడీపీలో ఉన్న బలమైన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని విడిచిపెట్టి బీజేపీలో, వైసీపీలో చేరుతుంటే.. ఏమి చేయాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు ప్రతిపక్ష నేత. ఎంతో కొంత సపోర్ట్ చేసే పవన్ కూడా ఇప్పుడు బీజేపీలో కలవడంతో టీడీపీకి “మూలిగే నక్క మీద తాటికాయ” పడినట్లు అయింది.

“ఉన్నోడు పోయే.. ఉంచుకున్నోడు పోయే” అంటే ఇదేనేమో.. టీడీపీలో ఎంతకాలంగా ఉన్న నాయకులు పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలో చేరారు. జనసేన స్థాపించిన రోజు నుంచి సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీలో కలవడంతో టీడీపీకి మరింత గడ్డు కాలం ప్రారంభమైందని చెప్పొచ్చు.

కళ్ళు పెద్దవి చేస్తే బయపడతామా? ఈరోజు అసెంబ్లీలో మళ్ళీ రిపీట్!

 

ఈరోజు అసెంబ్లీలో ఇంగ్లిష్-తెలుగు మీడియం స్కూల్ విషయమై జరిగిన చర్చలో అటు అధికార పక్ష నేత సీఎం వైస్ జగన్ కి మరియి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మధ్య జరిగిన మాటల యుద్ధం లో పాత డైలాగ్ ఒకటి మళ్ళి రిపీట్ చేసారు జగన్. చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడుతూ “ఈ పెద్దమనిషికి… ఎమన్నా ఉందా ? అదేమానంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు. అసలు ఈ పెద్దమనిషికి బుద్ది ఏమైనా ఉందా? ఏమైనా ఉందా.. ? ఏమైనా ఉందా… ?” అంటూ చంద్రబాబు నాయుడిని జగన్ విమర్శిస్తూ ఉండగా… ఒక్కసారిగా రగిలిపోయిన చంద్రబాబు నాయుడు కోపంతో జగన్ వంక చూసారు. అది గమనించిన జగన్ ” ఏం … కళ్ళు పెద్దవి చేస్తే బయపడతామా? బయపడతామా… ? బయపడతామా…. ? అంటూ ” ఒకప్పుడు అసెంబ్లీ లో జరిగిన సన్నివేశాన్ని తిరిగి ఈ రోజు రిపీట్ చేసారు జగన్. ఇదే డైలాగ్ ని రామ్ గోపాల్ వర్మ తీసిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రంలో కూడా పెట్టాడు.

జనసేనాని రాజకీయ ప్రస్థానంపై విశ్లేషణ

రాష్ట్ర విభజన, ప్రజారాజ్యం పార్టీ చేదు అనుభవాలతో మర్చి 14, 2014న పవన్ కళ్యాణ్ ఎన్నో అవాంతరాలు, అపనమ్మకాల మధ్య జనసేన పార్టీ పెట్టారు. దింతో జనసేనపై మెగా అభిమానులు కూడా అంత ఆసక్తి చూపలేదు అయినా వెనుకడుగు వేయకుండా పార్టీని స్థాపించి పవర్ స్టార్ కాస్త జనసేనానిగా మారారు.

ఇక సాధారణ ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉండడం పార్టీ నిర్మాణం లేకపోవడంతో 2014 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చిన జనసేనాని మొదటి నుండి కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత, మోడీ నాయకత్వం పై ప్రజలు సానుకూలంగా ఉండడంతో జనసేనాని వెంటనే గుజరాత్ వెళ్లడం, మోడీ, బీజేపీకి భేషరతు మద్దతు ప్రకటించి ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తానని మాటిచ్చారు.

ఇది కూడా చదవండి: అమిత్ షా ఆఫర్.. పట్టుకున్న పవన్

అప్పటికే చుక్కాని లేని నావలా ఉన్న టీడీపీ 2009-14 మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు అలాంటి సమయంలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులకి కూడా నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ బీజేపీతో జట్టు కట్టడంతో వెంటనే చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకోవాలని నిర్ణయించాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అటు బీజేపీ తో పాటు నాకు ప్రచారం చేసి పెట్టాలని స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి దేహి అని అర్ధించడంతో అనుభవంలో జగన్ కన్నా చంద్రబాబు మేలని విడిపోయిన రాష్ట్రానికి తన అనుభవంతో న్యాయం చేస్తాడని టీడీపి-బీజేపీ కూటమికి ప్రచారం చేయడంతో 1.7 శాతం ఓట్ల తేడాతో కూటమి గెలిచింది ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టడం ప్రజా వ్యతిరేక పాలన వల్ల 2019 లో టీడీపీ కి వ్యతిరేకంగా పోటీచేసిన జగన్ బృందం చేసిన టీడీపీ-జనసేన కుమ్మక్కు ప్రచారం వల్ల జనసేన అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు తన అసలు బలం తెలిసి భవిష్యత్ లో జనసేనతో కలిసి పోటీ చేయాలి అని ఆలోచన చేసి ప్రతి సభలో వైసీపీ పవన్ కళ్యాణ్ పై చేసే విమర్శలు తిప్పి కొట్టినట్టు నటించి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను తన వైపు లాక్కోవాలని అనుకున్నాడు అయితే ఇవన్నీ తెలిసిన మౌనంగా ఉంటూ వైసీపీ యొక్క అధికారం తెచ్చిన అహంకారం ఎదుర్కోవాలంటే కేంద్రంలో బలమైన,నమ్మకమైన బీజేపీతో జట్టు కట్టాలని భావించాడు. బీజేపీ మరియు మోడీని 2019 ఎన్నికల్లో అణిచివేయాలని చూసిన చంద్రబాబుని ఇక జీవితంలో కలిసేది లేదని అమిత్ షా ప్రకటించడం ఈ రోజు జరిగిన పొత్తుకు సంబంధించిన ప్రెస్ మీట్ లో కూడా విస్పష్టంగా బీజేపీ-జనసేన కూటమి టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో కలుపుకునేది లేదని నిర్ణయించడంతో పవన్ కళ్యాణ్ ఉన్న టీడీపీ అనుకూల ముద్ర ప్రజలు పట్టించుకోరు అలాగే భవిష్యత్ లో వైసీపీ ప్రజా వ్యతిరేక పోరాటంలో బలమైన బీజేపీ కూడా కలిసి ఉండడం తో ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లయింది

Read More: పవన్ కి అండ బీజేపీ – బీజేపీకి దండ పవన్