
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ ని రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పుడు… ఇంకేముంది వర్మ అసలే మామూలోడు కాదు, ఇలాంటి టైటిల్ తో సినిమా తీస్తున్నాడంటే మనకి తెలియని రాజకీయ రహస్యాలేవో ఈ సినిమాలో ఖచ్చితంగా చూపిస్తాడని అని అనుకొని వుంటారు సినిమా ప్రేక్షకులు మరియు రామ్ గోపాల్ వర్మ అభిమానులు. తర్వాత కొన్ని రోజులకు ఫస్ట్ లుక్ పోస్టర్ లు , ట్రైలర్ లు చూసి ఇంకేముంది ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులను అందరిని పిచ్చపిచ్చాగా ట్రోల్ చేసేసాడు వర్మ , ట్రయిలర్ ఇలా ఉంటె మరి అసలు సినిమాలో ఇంకేమి చూపిస్తాడో అనుకున్నారు సగటు ప్రేక్షకులు. ట్రయిలర్ తర్వాత వచ్చిన టాక్ తో ఈ చిత్రంపై ఎన్నో విమర్శలు , పోలీస్ కేసులు మరియు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పై పెద్ద రాద్ధాంతం జరిగి చివరికి హై-కోర్ట్ వరకు వెళ్లి ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ ని ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ గా మార్చారు.
అసలు విషయమేమిటంటే. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా అసలు రామ్ గోపాల్ వర్మ కి అయినా అర్దమయ్యిందా? లేదా వూరికే కాలక్షేపానికి తీసాడా అనే సందేహం కలగక మానదు. ఈ చిత్రంలో నటించిన 3-4 క్యారెక్టర్స్ తప్ప అది కూడా వాళ్ళు రియల్ క్యారెక్టర్స్ కి కొంచెం దగ్గరగా ఫీల్ అయ్యేలా నటించడం మినహా ఈ సినిమాలో చూడడానికి ఏమి లేదు. అసలు ఈ సినిమా గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పడం అనవసరం. సినిమా చూడడం కంటే ట్రైలర్ ని మరోసారి చూడడం బెటర్.