
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దూరంగా ఉన్నారు. అదే సమయంలోనే గుడివాడలో ఎడ్ల పందాలలో ఆయన పాల్గొనడం గమనార్హం. ఆ పార్టీకి, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు మధ్య గ్యాప్ మరింతగా పెరిగినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎడ్ల పందాల ఎప్పుడూ చూడలేదని… వాటిని చూడటానికే ఇక్కడకు వచ్చానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం జగన్ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆయన మరోసారి సమర్థించారు. ఇది సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రాజధాని రైతులు ధర్నాలు చేసేకంటే… సీఎం జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. జనసేనలో తన అభిప్రాయాన్ని స్వతంత్రంగా చెబుతానని ఎమ్మెల్యే రాపాక స్పష్టం చేశారు.
గత కొంతకాలంగా పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ కీలకమైన రాజధాని విషయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశానికి హాజరు కాకుండా కొడాలినాని నియోజక వర్గంలో హల చల్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆదే విధంగా అక్కడ కోడలినాని ని కలవడం పై అంతర్గత మతలబులు ఏమిటో తేలియాల్సి ఉంది.
“రాపాక-కొడాలినాని” ఈ స్నేహం ఎటువైపు దారితీస్తుందో.. వేచి చూద్దాం..!
