
తమిళనాడులో నీటి అవసరాలను మరింత మెరుగుపరిచేలా గోదావరి–కావేరీ నదుల అనుసంధానం పథకం అమలు కోసం తమ కోర్కెను మన్నించి సకాలంలో సహకరించిన ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.
ఇందుకోసం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి వీలైనంత త్వరగా వారి అంగీకారాన్ని పొందాలని కోరుతూ ఉత్తరాల ద్వారా, స్వయంగా కలిసినపుడు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశానని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు.
గత ఏడాది వేసవిలో తీవ్రమైనకరువు పరిస్థితులు నెలకొనడంతో… తెలుగు గంగ ద్వారా తాగునీరు విడుదల చేయాలని తమిళనాడు మంత్రులు ఏపీ సీఎం జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో… తమిళనాడుకు తెలుగు గంగ నీటిని విడుదల చేశారు.