Home Blog Page 8534

బ్యాంక్ ఖాతాల్లో రూ.1500 జమ చేస్తున్నాం: కేటీఆర్


తెలంగాణ కరోనాతో ప్రజలు ఇబ్బందుల దృష్టిల్లో ఉంచుకొని తెల్లరేషన్ కార్డుదారులకు రూ.1500 పంపిణీ చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,112కోట్ల రూపాయాల నిధులను సమకూర్చింది. సోమవారమే ఈ నిధులను ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. మంగళవారం అంబేద్కర్ జయంతి బ్యాంకులకు సెలవు కావడంతో బుధవారం నుంచి రేషన్ కార్డు దారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ కానున్నాయి.

రాష్ట్రంలోని 87.59లక్షల తెల్లకార్డులు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటిలో 74లక్షల పైచిలుకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు క్లియర్‌గా ఉన్నాయని చెప్పారు. రేషన్ కార్డుకు మ్యాపింగ్ అయిన బ్యాంక్ ఖాతాల్లో రూ.1500 నగదు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఆధార్‌ నంబర్‌తో మ్యాపింగ్‌ ఉంటే ‘యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌ సిస్టమ్‌’ ద్వారా చివరి ట్రాన్సాక్షన్‌ ఏ అకౌంట్‌తో చేస్తే ఆ అకౌంట్లో నగదు జమ అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మంగళవారం మంత్రి కేటీఆర్‌ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా రేషన్‌కార్డుతో ఆధార్‌ సీడింగ్‌ అయి, బ్యాంకు అకౌంట్‌ నెంబర్ లేనివారికి రెండో దశలో పౌరసరఫరాల శాఖ డబ్బులు పంపిణీ చేయనుంది.

ఆ జిల్లాలో సరి, బేసి విధానం…!


కోవిడ్ – 19 కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో అక్కడి అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో వాలు కాలుష్యం అధికమైనప్పుడు ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఇది పోలి ఉంది. నిత్యావసరాలు నిమిత్తం మార్కెట్లు షాపులు ఇంక మీదట సరి సంఖ్య దినాలలో (2,4,6,8,10,12,14,16,18,20, 22,24,26,28,30 తేదీలలో)పనిచేస్తాయని, బేస్ సంఖ్య దినాలలో(1,3,5,7,9,11,13, 15,17,19,21,23,25,27,29,31 తేదీలలో) మార్కెట్లు, షాపులు ఉండవని గుంటూరు అర్బన్ పోలీసు అధికారి డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ తెలిపారు. ప్రజలందరూ గమనించి ఈ రోజు 14 వ తారీఖున సరి సంఖ్య అయినందున మార్కెట్, షాపులు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు తీసి ఉంటాయని, రేపు 15 వతేదీ నాడు మూసి ఉంటాయి కనుక కావలసిన అవసరాలు రేపటి రోజునే సమకూర్చుకోవాలని సూచించారు.

అదేవిధంగా రోజు మార్చి రోజు మార్కెట్లో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి గనుక కావలసిన పాలు, కూరగాయలు తెచ్చుకో వలసినదిగా, అదే విధంగా ద్విచక్ర వాహనం పైన ఒక్కరు, కారు వంటి వాహనం పైన ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ఎవరు ఇంటి నుండి ఎవరు బయటకు రాకూడదని, నిత్య అవసరాల నిమిత్తం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి, రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన చోట్ల తీసుకొని త్వరగా ఇంటికి చేరుకోవాలని, మాస్కులు లేకుండా ఎవరు బయట తిరుగరాదని, మిగిలిన సమయాలలో మందుల షాపులు, అత్యవసర ఆసుపత్రులు మినహా మిగిలినవన్నీ మూసి వేయబడతాయని, గవర్నమెంట్ ఉద్యోగులు, ఆఫీసులకు వెళ్లేవారు ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు వెళ్లి, సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపుగా ఇండ్లకు చేరుకోవాలని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇతరులు ఎవరు తిరుగరాదని, నిబంధనలు ఉల్లంఘించే వారి పైన వాహనాలు స్వాధీనం చేసుకుని, సంబంధిత చట్టాల మేరకు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మరోవైపు జిల్లాలో కోవిడ్ – 19 పాజిటివ్ కేసులు సోమవారం రాత్రి వరకూ 93 నమోదు అయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా వైరస్ బాధితులు ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. సామాజిక దూరం పాటించడంతోపాటు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ లు, శానిటైజర్ వాడటం పై అవగాహన కల్పిస్తున్నారు.

ఎన్టీఆర్ కు అదిరిపోయే గిప్ట్ రెడీ చేసిన ‘ఆర్ఆర్ఆర్’


దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ‘బహుబలి’ సీరిస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే మూవీలో కన్పిస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉంటుందోనని నందమూరి, మెగా అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తునారు. ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

‘భీమ్ ఫర్ రామరాజు’ పేరిట ‘ఆర్ఆర్ఆర్’ బృందం విడుదల చేసిన వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. ఈ వీడియో చరణ్ లుక్, చరణ్ పాత్రను రివీల్ చేసి అభిమానులను రాజమౌళి, ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేశారు. అదేవిధంగా మే20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ ఫస్టు లుక్, వీడియో విడుదల కానుంది. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఎలివేషన్ షాట్స్, మోషనల్ కంటెంట్ అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో చరణ్ వాయిస్‌ ఓవర్ ఉండకపోవచ్చని సమాచారం. ఈ వీడియోలో ఎన్టీఆర్ యే కొన్ని పవర్ ఫుల్ డైలాగ్‌లను చెబుతారని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా పులితో ఎన్టీఆర్ ఫైట్ కి సంబంధించిన విజువల్స్ ను కూడా రివీల్ చేయబోతున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్టు లుక్, వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ బృందం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

జగన్ అంచనాలను తలకిందులు చేసిన మోదీ


ప్రధాని నరేంద్ర మోడీ మూడు వారల లాక్‌డౌన్ ను సడలిస్తారనే ధీమాతో ఎన్నో రాజకీయ ప్రణాళికలు వేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికు మే 3 లాక్‌డౌన్ ను పొడిగిస్తూ ప్రకటించడం తీవ్ర ఆశాభంగం కలిగించినట్లయింది.

సడలింపు వైపే ప్రధాని సుముఖంగా ఉన్నారని అంచనాకు వచ్చిన జగన్ సహితం అందుకు బలం చేకూర్చడం కోసమని లాక్‌డౌన్ ను రెడ్ జోన్ లకు పరిమితం చేయాలి అంటూ వట్టిదే తెచ్చే ప్రయత్నం చేశారు.

చివరకు గత రాత్రి కూడా ప్రధానికి వ్రాసిన లేఖలో లాక్‌డౌన్ కారణంగా వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఎంతో నష్టం కలుగుతున్నదని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానికి మరో లేఖ వ్రాసారు.

దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ కొనసాగింపుకు సుముఖత వ్యక్తం చేస్తూ నిర్ణయాలు తీసుకున్నా, జగన్ మాత్రం “అంతా మీ ఇష్టం.. మీరు యెట్లా చెబితే అట్లా” అంటూ ప్రధానిపైకి భారం వేసి డొంకతిరుగుడు రీతిలో వ్యవహరించారు.

అయితే ఒక విధంగా ఇప్పటికి సగంకు పైగా రాష్ట్రాలు లాక్‌డౌన్ పొందిస్తు నిర్ణయం ఇప్పటికే తీసుకోవడంతో ప్రధానికి పొడిగింపుకన్నా మరో మార్గం లేకపోయింది. అయితే ఏప్రిల్ 20 తర్వాత పెద్ద ఎత్తున సడలింపు ఉండగలదని సంకేతం ఇచ్చారు.

కనీసం ఈ విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇస్తారని జగన్ అనుకున్నారు. అందుకనే గత వారం రోజులుగా ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతున్నా తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారు.

పలు జిల్లాల్లో ఒక వంక కరోనా పరీక్షలను తగ్గిస్తూ, జరిగిన పరీక్షలకు సహితం నివేదికలు రాకుండా జాప్యం చేస్తూ వచ్చారు. రెడ్ జోన్ లలో ఇంటింటికి పరీక్షా చేస్తామని ప్రకటించి కూడా ఎక్కడా ప్రారంభించలేదు. పలు కరోనా సంబంధింత మరణాలను సాధారణ మరణాలుగా చూపుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

లాక్‌డౌన్‌పై రాష్ట్రాలకే విచక్షణాధికారాలు ఇస్తారన్న అంచనాలన్నీ తలకిందులయ్యాయి. నెలాఖరు లోగా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నియామకంపై హై కోర్ట్ తీర్పు ఇచ్చేలోగా ఏదో విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని వేసుకున్న అంచనాలు సహితం తలకిందులయిన్నట్లు అయింది.

రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్లను కూడా కుదించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు పురఃటి చేయాలి అనుకున్నారు. కానీ ప్రధాని ప్రకటనతో జగన్‌ ప్రయత్నాలకు గండి పడిన్నట్లు అయింది. పైగా రాస్త్రాలు, జిల్లాలు, ప్రాంతాల వారీగా లాక్‌డౌన్ అమలును సునిశితంగా కేంద్రం పరిశీలిస్తోందని ప్రధాని చెప్పడం కూడా ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిక వంటిదే కాగలదు.

స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాజధాని తరలింపు ప్రయత్నాలకు సహితం ప్రస్తుతానికి గండి పడినట్లే కాగలదు. ఇప్పటికి కరోనా పరీక్షలు, లాక్‌డౌన్ అమలు పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తున్నట్లు కేంద్రం సున్నితంగా మందలిస్తూ వస్తున్నది. అటువంటి పరిస్థితి తమకు కూడా ఎక్కడ వస్తుందో అని ఇప్పుడు ఏపీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఏపీలో లాక్ డౌన్ సడలింపు… ఇక జోరుగా పాస్ లు


మొదటి నుండి లాక్ డౌన్ పొడగింపుకు విముఖంగా ఉంటూ, దానిని రెడ్ జోన్ లకు పరిమితం చేయాలని కోరుతున్న ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా లోక్ డౌన్ పొడిగుంపును ప్రకటించడానికి ఒక పూట ముందే పౌరుల కదలికలను సులభతరం చేస్తూ ప్రకటించారు. `అత్యవసర’ పనుల నిమిత్తం పోలీసుల నుండి పాస్ లు తీసుకొని రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

దేశ‌మంతా ప్ర‌జా ర‌వాణా పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఇళ్ల‌కు ప‌రిమితమై ఉండాల‌ని ప్ర‌ధానమంత్రి స‌హా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా ప‌దేప‌దే కోరుతున్నారు. నిత్య‌వ‌స‌రాలు, అత్య‌వ‌స‌రాల‌కు త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో అత్య‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు వెళ్లే వారికి స‌మ‌స్య లేకుండా ఉండేందుకు ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

వైద్యం చేయించుకోవ‌డం కోసం, స్వ‌చ్ఛంద సేవ చేసేవాళ్లు, ప్ర‌భుత్వ విధులు నిర్వ‌ర్తించే వాళ్లు, ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల‌తో అత్య‌వ‌స‌రంగా ప్ర‌యాణం చేయాల్సిన వారికి కోవిడ్-19 ఎమ‌ర్జెన్సీ పాసుల‌ను జారీ చేసేందుకు సిద్ధ‌మైంది. అత్య‌వ‌స‌రంగా ప్ర‌యాణాలు చేయాల్సిన వాళ్లు ఇబ్బందులు ప‌డ‌కుండా పాసులు జారీ చేయాల‌ని ప్ర‌భుత్వం సూచించిన‌ట్లు ఏపీ డీజీపీ ఆఫీస్ వెల్ల‌డించింది.

పాసులు అవ‌స‌ర‌మైన‌వారు.. పేరు, అడ్ర‌స్, ఆధార్‌ కార్డు, వారు ప్రయాణించే వాహనం నంబర్‌, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే వివరాలను అంద‌జేస్తే జిల్లా ఎస్పీ కార్యాల‌యం నుంచి పాస్ జారీ అవుతుంద‌ని తెలిపింది. ఎవ‌రైనా తప్పుడు సమాచారం ఇచ్చి పాస్ కోసం ప్ర‌య‌త్నిస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని పోలీసు శాఖ హెచ్చ‌రించింది.

పాస్ ల కోసం వివ‌రాల‌ను పంపి దరఖాస్తు చేసుకోవాల్సిన జిల్లా ఎస్పీల వాట్సాప్‌ నెంబర్లు, మెయిల్ ఐడీల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ప్రయాణించేటప్పుడు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని, ఎస్పీ వాట్సాప్‌ నెంబర్ లేదా మెయిల్‌ ఐడీ నుంచి వచ్చిన పాసులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, ఫార్వార్డ్ చేసుకుని ఇత‌రులు వాడుకునేందుకు వీలుకాద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ విధంగా ఈ పాస్ లకు గేట్లు తెరిచింది. లాక్ డౌన్ ఉధృతంగా అమలులో ఉన్నప్పుడే అధికార పక్ష నాయకులు విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు వారికి సన్నిహితంగా ఉన్నవారందరూ పాస్ లు పొంది రాజమార్గంలో ప్రయాణం చేసే అవకాశం లభిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

కరోనా వేళ.. మోదీ సప్తపది..


దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. నేటితో కేంద్రం విధించిన 21రోజుల లాక్డౌన్ ముగుస్తుండటంతో ప్రధాని మోదీ నేడు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ పరిస్థితులపై మాట్లాడారు. మోదీ ప్రసంగం చూసినట్లయితే దేశ ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేశారు. లాక్డౌన్ అమలుతో ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్నప్పటికీ లాక్డౌన్ అమలుకే ఆయన మొగ్గుచూపారు. దేశంలో లాక్డౌన్ మే3వరకు కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు. అంటే మరో 19రోజులపాటు లాక్డౌన్ అమలు కొనసాగనుంది.

దేశంలో కరోనా కట్టడి వచ్చే వారం రోజులు చాలా కీలకమని ఆయన తెలిపారు. ఏప్రిల్ 20వరకు లాక్డౌన్ అమలును మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 20తర్వాత దేశంలో కరోనా పరిస్థితులను చూసి అవసరమైతే దేశంలో కొన్ని సడలింపులు ఇస్తామని ఆయన చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారత్ కరోనా వైరస్ ను చాలా వరకు కట్టడి చేసిందన్నారు. కరోనా విషయంలో భారత్ ముందే మేల్కొందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడి చేసేందుకు లాక్డౌన్ కొనసాగింపు ముఖ్యమని తెలిపారు. ముఖ్యమంత్రులు, వైద్యాధికారులు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కరోనా కట్టడికి మోదీ సప్తపది..
1. వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపట్ల ప్రత్యేక శద్ధ చూపించాలి.
2. లాక్ డౌన్, సామాజిక దూరం పాటించాలి. మాస్కులను ధరించాలి
3. ప్రతీఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి.
4. ఆరోగ్య సేతు మొబైల్ యాప్ డౌన్ చేసుకొండి. కేంద్రం మార్గదర్మకాలను పాటించాలి.
5. పేదలకు, అన్నర్థులకు మరింత సేవ చేయాలి.
6. ఏ ప్రైవేట్ సంస్థ కూడా ఉద్యోగులను తొలగించొద్దు.
7. మెడికల్ సిబ్బంది, పోలీస్, శానిటైజ‌ర్ సిబ్బందిని గౌరవించాలి.

బీజేపీ తీరు సరైనదేనా..?


బీజేపీ రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధానాలకు పొంతన కుదరడం లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండారంటారు. అదేవిధంగా అధికార దాహానికి విలువలు, సిద్ధాంతాలు అవసరం లేదనేది ఇప్పుడు పార్టీ బాగా అలవాటు చేసుకున్నాయి. ఏ స్థాయిలో ఎవరితో అవసరం ఉంటే వారితో అంటకాగుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు మించి సీట్లు సాధించి అధికారం చేపట్టింది. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు సాధించి అధికారం చేపట్టింది. 23 ఎంపీ స్థానాలు సాధించింది.

కొద్ది నెలల కిందట బీజేపీ సినీనటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకులు ఎండగడుతున్నారు. జాతీయ స్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ పరిస్థితి బీజేపీ, వైసీపీ పొత్తు పెట్టుకున్నట్లుగా ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులకు జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా మద్దతు పలుకుతున్నాయి. ఈ విధానం రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చేసేదేమీలేక మిన్నకుండి పోతున్నారు.

రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కొంత కాలంగా రైతుల దీక్షకు మద్దతు తెలిపి, కేంద్రం జోక్యం చేసుకుంటోందని ప్రకటించినా ఇంతవరకూ కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఐఏఎస్ లు, ఐపీఎస్ ల సస్పెన్షన్ల పేరుతో కక్ష సాధింపు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను మార్చడంలోను ఇదే జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలపై ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం తప్పు పడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.

రాష్ట్రంలో బీజేపీ, జనసేనకు ఉమ్మడి ప్రత్యర్థిగా వైసీపీపై అస్త్రాలు ఎక్కు పెడుతుంటే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యవహార శైలి సమస్యగా మారింది. గత ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ సహకరించాడు. పవన్ జనసేన పార్టీని స్థాపించిన అనంతరం జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు పవన్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఏమైనా బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయిలో వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు తప్పుబడుతున్నారు.

అందుకే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం!

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తొలి కరోనా కేసు కనుగొన్న తరుణంలోనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకొని అత్యంత కఠినమైన ఆంక్షలు విధించారు. అయినా కరోనా విజృభన తగ్గలేదు. కానీ ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు భారత్ కొంచం మెరుగైన స్థితిలో ఉంది. కోవిద్19 అరికట్టడానికి ప్రధాని మోదీ గత నెల 24 న దేశవ్యాప్తంగా 21 రోజుల కర్ఫ్యూ ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ఫ్యూ సడలించినట్లయితే, కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ప్రధాని మోడీ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలా రాష్ట్రాల సీఎం లు కర్ఫ్యూను పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి మే 3వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. “దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే లాక్‌ డౌన్‌ నిర్ణయం తీసుకున్నాం. ప్రజల సహకారంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రిస్తున్నాం. మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయకపోతే పరిస్థితులు మరింత దయనీయంగా మారేవి” అని మోడీ అన్నారు.

అత్యంత కఠిమైన ఆంక్షల మధ్య లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నప్పటికీ మహమ్మారి తన పంజా విసురుతోంది. ప్రపంచ దేశాలకు సవాల్‌ విసురుతోంది. ఈ తరుణంలో ప్రజల కష్టాల్ని ఎలా తగ్గించాలి.. తీవ్రతను కనిష్ఠానికి ఎలా పరిమితం చేయాలని నిరంతరం రాష్ట్రాలతో చర్చించి మే 3వరకు పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాం” అని మోడీ తెలిపారు.

హైదరాబాద్ నగరంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్


తెలంగాణలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా హైదరాబాద్ నమోదవుతూ ఉండడం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పరిస్థితులపై సమీక్ష జరుపుతూ కరోనా వైరస్‌ సోకినవారిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నందున హైదరాబాద్‌ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దొన్ని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్‌ను ఒక్కో యూనిట్‌గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాస్క్ ధరించి, శానిటైజర్ ఉపయోగించారు.సోమవారం కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఒకరు మరణించారని అధికారులు సీఎంకు వెల్లడించారు.

‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా సోకే అవకాశాలు కూడా హైదరాబాద్‌లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి” అని సూచించారు.

నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించాలి. ప్రతీ యూనిట్ కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాలి. మున్సిపల్ యంత్రాంగమంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతా ఒకో డీఎంఅండ్హెచ్ఓ ఉన్నారు. 17 సర్కిళ్లకు వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారిని నియమించాలని కేసీఆర్ వివరించారు.

‘పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయి. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు. బయట వారిని లోపటికి పోనీయవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రతీ కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

అత్యధిక జనసమ్మర్థం ఉండే జిహెచ్ఎంసిలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,ఇతర సీనియర్ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతి భవన్ లోనే జిహెచ్ఎంసిలోని సర్కిళ్ల వారీగీ ప్రత్యేక సమీక్ష జరపాలని, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నిఖిల్ కూడా పాన్ ఇండియా మూవీ అంటున్నాడు


రోజు రోజుకి పెరుగుతున్నపాన్ ఇండియా చిత్రాల లిస్ట్ లో మరో తెలుగు చిత్రం చేరుతోంది. యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది ‘అర్జున సురవరం’తో సక్సెస్ సాధించిన తరవాత రెట్టించిన ఉత్సాహం తో కొత్త చిత్రాలు చేస్తున్నాడు. ప్రసుతం నిఖిల్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి సుకుమార్ , బన్నీ వాస్ నిర్మాతలుగా ` కుమారి 21 ఎఫ్ ` ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘18 పేజీస్’ కాగా.. మరో చిత్రం ‘కార్తికేయ’ సీక్వెల్ గా రానున్న ‘కార్తికేయ 2’ చిత్రం. కాగా ఈ ‘కార్తికేయ 2’ మూవీ కోసం నిఖిల్ 6 ప్యాక్ చేస్తుండటం విశేషం. కాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. నిఖిల్…..

ఇటీవల జరిగిన ఓ సంభాషణలో `ఇతర భాషల్లో నటించే అవకాశం ఉందా? ‘ అని అడిగితే.. అలాంటి ఆలోచన లేదని చెప్పిన నిఖిల్ అయితే కార్తికేయ 2 చిత్రాన్ని మాత్రం నాలుగైదు భాషల్లో విడుదల చేయాలను కుంటున్నట్లు చెప్పాడు. అంతే కాకుండా అన్నీ భాషల్లో తానే డబ్బింగ్ చెప్పాలను కుంటున్నాడట. నిఖిల్. దానికి కారణం చెబుతూ ‘కార్తికేయ 2’ యూనివర్సల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందు తుంది. అని తెలిపాడు … ఆ లెక్కన ‘కార్తికేయ 2’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించి తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువదించి విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని రూఢీగా తెలుస్తోంది . వెరసి కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుందన్న విషయం కంఫర్మ్ అయినట్టే …

మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు


నేటి రాత్రితో ముగియనున్న మూడు వారల లాక్‌డౌన్ ను మరో 19 రోజుల పాటు, మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ప్రకటించారు. ప్రధాని మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మే 20 తర్వాత దశల వారిగా సడలింపగలమని చెప్పారు. అయితే సడలింపు ఏ విధంగా ఉంటుందో మాత్రం వివరించలేదు. అయితే మార్గదర్శక సూత్రాలను రేపు ప్రకటిస్తామని చెప్పారు.

వచ్చే వారం రోజుల పాటు లాక్‌డౌన్ అమలు మాత్రం మరింత కఠినంగా ఉండగలదని సంకేతం ఇచ్చారు. ఏ విధంగా అమలు చేశారో అన్నదానిని బట్టి సడలింపు ఉండవచ్చనే అభిప్రాయం కలిగించారు. దేశం అంతటా ఎవ్వరెవ్వరు, ఎక్కడెక్కడ, ఏ విధంగా దీనిని అమలు పరుస్తున్నారో కేంద్రం ఒక కంట సునిశితంగా గమనిస్తూనే ఉంటుంది సుమా అంటూ సున్నితంగా హెచ్చరించారు.

ప్రతి రాష్ట్రంలో, జిల్లాల్లో, ప్రాంతంలో, ఆసుపత్రిలో ఏ విధంగా అమలు చేస్తున్నారేమో కేంద్రం సునిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. చాలా ముందుగా కరోనా ఆకట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని పేర్కొంటూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకముందే స్క్రీనింగ్ ప్రారంభించామని, పాజిటివ్ కేయూస్లు 500 కు చేరుకోక ముందే లాక్‌డౌన్ ప్రకటించామని ప్రధాని గుర్తు చేశారు.

ఇప్పటి వరకు దేశ ప్రజలు లాక్‌డౌన్ అమలు కోసం సహకరించినందుకు శిరసు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రధాని మోదీ తెలిపారు. దేశం కోసం ప్రజలు సైనికుల్లా పనిచేస్తున్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని కొనియాడారు.

కరోనాపై భారత్ బలంగా పోరాడుతోంది. ప్రజలు ఎన్నో కష్టాలు పడి భారత్‌ను రక్షించారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఒక్కతాటిపై ఉంది. అందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలని ప్రధాని తెలిపారు.

‘‘కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం కరోనా కట్టడిలో ముందుంది. 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశం సమర్థంగా అమలు చేసింది. ఇతర దేశాల్లో మన కంటే 20, 30 శాతం ఎక్కువ కేసులు ఉన్నాయి…’’ అని ప్రధాని వివరించారు.

బన్నీ చిత్రంలో బహు భాషా నటులు


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘పుష్ప’ మూవీ భారీ బడ్జట్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా తయారౌతోంది . పాన్ ఇండియా సినిమాగా ` పుష్ప ` చిత్రాన్ని ఆవిష్కరించడానికి సుకుమార్ యూనిట్ బాగానే కష్టపడుతున్నారు. ఆ క్రమంలో పాన్ ఇండియా స్థాయి నటీనటులను ఈ చిత్రం లోకి తీసు కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ` పుష్ప` చిత్రం లో కన్నడ స్టార్ హీరో దర్శన్ ని నటింప చేయాలని సుకుమార్ ప్రయత్నిస్తున్నాడట..కాగా అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ `ఊర్వశి రౌటెలా` ను ఫైనల్ చేసిందట చిత్రబృందం.

మైత్రీమూవీస్, ముత్యం శెట్టి మీడియా బ్యానర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ నటుడిని విలన్ గా నటింప చేయాలనుకుంటున్నారట..ఇకపోతే చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమా కోసం బన్నీ చిత్తూరుజిల్లా యాసను ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. కాగా ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.. మొత్తానికి అన్నిభాషల సినీ ఇండస్ట్రీస్ నుండి `స్టార్ ` లను తీసుకుని `పుష్ప’ సినిమా రేంజ్ ను పెంచుతున్నారు. ఇక కరోనా ప్రభావం తగ్గగానే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవడమే తరువాయి . ..

చిన్న ఎన్ టి ఆర్ సినిమాలో చిన్న సునీల్ దత్


ఆర్ ఆర్ ఆర్ అలియాస్ రౌద్రం రణం రుధిరం చిత్రం ఎపుడు పూర్తి అవుతుందో ఇంకా తేలక పోయినా తారక రాముడు మాత్రం తన తదుపరి చిత్రానికి సంబందించిన తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి బిజీ గా ఉన్నాడు. అల వైకుంఠపురంలో, అరవింద సమేత వంటి చిత్ర మకుటాల మాదిరిగానే మాటల మాంత్రికుడి కొత్త చిత్రానికి `అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ పేరు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయడం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రస్తావించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాస్తున్నాడట.

అది పక్కా రాజకీయ చిత్రంగా ఉండబోతోంది. దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటుందట. రాజకీయాలకి ఓ కొత్త ఒరవడిని ఆపాదించేలా ఎన్టీఆర్ పాత్రను రాస్తున్నాడట త్రివిక్రమ్.శ్రీనివాస్. ఇద్దరు హీరోయిన్స్ తో నిర్మించ బోతున్న ఈ చిత్రం లో అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ అనుకొంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన బుట్టబొమ్మ పూజా హెగ్డేను తీసుకోవాలనే అనుకొంటున్నారని తెలుస్తోంది.

మోడీ సందేశం..లాక్ డౌన్ సడలింపు పై కీలక నిర్ణయం?


కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ఈ రోజుతో ముగియడంతో ప్రధానమంత్రి మోడీ ఈ రోజు (ఏప్రిల్ 14) ఉదయం 10:00 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై ముఖ్యమైన సమాచారాన్ని ప్రధాని ప్రకటింటిస్తారని అందరూ భావిస్తున్నారు.

కర్ఫ్యూ పొడిగించబడుతుందా?

కరోనావైరస్ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనిని అరికట్టడానికి ప్రధాని మోదీ గత నెల 24 న దేశవ్యాప్తంగా 21 రోజుల కర్ఫ్యూ ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ఫ్యూ సడలించినట్లయితే, కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ లాక్ డౌన్ పొడిగించినట్లయితే ఆర్థిక వ్యవస్థ తీవ్ర క్షీణతకు గురవుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు..

ప్రధాని మోదీ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలా రాష్ట్రాల సీఎం లు కర్ఫ్యూను పొడిగించాలని డిమాండ్ చేశారు. ఒరిస్సా, తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూను 30 కి పొడిగిస్తూ ఇప్పటికే ప్రకటించారు.

“ప్రధానమంత్రి ఇటీవల అన్ని రాష్ట్రాల సీఎంలతో సంప్రదించినందున ప్రజల జీవితాలు ముఖ్యమైనవి; వారి జీవనోపాధి కూడా ముఖ్యం. ” కాబట్టి కర్ఫ్యూను మరో 15 రోజులు పొడిగించినప్పటికీ, వైరస్ ప్రభావిత ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించి కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని” కేంద్ర వర్గాలు వేల్లడించాయి.

ఇందుకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వైరస్ ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో తీవ్రమైన ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. కూరగాయలతో సహా అవసరమైన వస్తువులను ఒక నిర్దిష్ట బహిరంగ ప్రదేశంలో ఒక నిర్దిష్ట సమయంలో విక్రయించడానికి అనుమతిస్తారు. ట్రాఫిక్ ఫ్రీజ్, షాపుల షట్డౌన్ వంటి చర్యలు కొనసాగుతాయి.
కరోనా లేని రాష్ట్రాల్లో, ఆర్థిక కార్యకలాపాలు తక్కువ పరిమితితో కొనసాగడానికి అనుమతించబడతాయి. అదే సమయంలో, ముందస్తు హెచ్చరిక చర్యలు కొనసాగుతాయి.
కరోనా ప్రభావం 500 కన్నా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో, పరిమితులు కొంతవరకు సడలించబడతాయి. కొన్ని పరిశ్రమలు తగిన భద్రతా లక్షణాలతో పనిచేయడానికి అనుమతించబడతాయి.

ప్రధాని ప్రసంగం తరువాత, కొత్త కర్ఫ్యూ సమయంలో ఎలాంటి ఆంక్షలు సడలించబడతాయనే దానిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తరపున వివరణాత్మక ప్రకటన జారీ చేయబడుతుంది. ప్రధాని కార్యాలయ అధికారులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే


రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ అమరవతినే రాజధానిగా కొనసాగించాలని, కరోనా సాయం రూ. 5 వేలు చెల్లించాలని, పలు ఇతర సమస్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు నివాసాల్లోనే 12 గంటల నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి మద్దత్తుగా ఆ పార్టీకి చెందిన నాయకులు వారి ఇళ్లలోనే దీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కృష్ణా జిల్లా మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విజయవాడలో బెంజిసర్కిల్ సమీపంలోని వారి నివాసంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా సాయం ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు అందించడం, అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని, చంద్రన్న బీమా పథకం కొనసాగిఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరోవైపు రాజధానిని అమరావతిలో కొనసాగించాలంటూ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామలోని తన నివాసంలో 12 గంటల దీక్ష చేపట్టారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఆంధ్రప్రదేశ్ ని మంచి అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని నమ్మబలికి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా పరిపాలనను కొనసాగిస్తున్నాడని విమర్శించారు.

రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైయ్యారని చెప్పారు. ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంటే జగన్ మాత్రం తాను నిర్ణయించుకున్న ముహూర్తానికి రాజధానిని తరలించాలని చూస్తున్నాడని చెప్పారు.

మహేష్ స్పీడుకు కరోనా బ్రేక్..


సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా విజయాలతో దూకుడు మీద ఉన్న సంగతి తెల్సిందే. ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు. తాజాగా మహేష్ నటించిన ‘సరిలేరునీకెవ్వరు’ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరునీకెవ్వరు’ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ అందించిన విజయంతో మహేష్ కొన్నిరోజులు ఫ్యామిలీతో విదేశాలకు విహారయాత్రకు వెళ్లిచ్చొన సంగతి తెల్సిందే. దీంతో మహేష్ తదుపరి మూవీపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

విదేశాలను నుంచి వచ్చాక మహేష్ కొత్త మూవీ స్టార్ అవుతుందని అందరూ భావించారు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడటంతో మహేష్ మూవీ పట్టాలెక్కలేదు. కాగా మహేష్ తో మూవీ చేసే దర్శకుడి పేరు ఇంకా ఖరారు కాకపోవడం మరింత ఆసక్తిని రేపుతోంది. మహేష్-దర్శకుడు పర్శురాం కాంబినేషన్లో మూవీ రానుందని ప్రచారం జరుగుతుంది. అలాగే వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తారని గాసిప్స్ విన్పిస్తున్నాయి.

‘సరిలేరునీకెవ్వరు’ మూవీ పూర్తికాగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించాల్సి ఉండేది. దర్శకుడు వంశీ స్క్రిప్ట్ లేట్ చేయడంతో ఈ మూవీ పక్కన పడినట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ దర్శకుడు పర్శురాం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ పూర్తికాగానే త్రివిక్రమ్ మూవీతో స్టార్ కానుంది. అదేవిధంగా దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పూర్తికాగానే మహేష్ తో రాజమౌళి మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టిన మహేష్ కు కరోనా ఎఫెక్ట్ దెబ్బకొట్టింది. ఈ ఏడాది వరుస సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన మహేష్ కు కరోనా రూపంలో ప్లాన్ రివర్స్ అయింది. వరుసపెట్టి సినిమా చేద్దామనుకున్న మహేష్ బాబు స్పీడుకు కరోనా బ్రేక్ వేసినట్టయింది.

‘పుష్ప’ మూవీ నుంచి తప్పుకున్న తమిళ స్టార్!


దర్శకుడు సుకుమార్ తాజా చిత్రం ‘పుష్ప’. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లలో ఈ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు ఇటీవలే చిత్రబృందం రిలీజ్ చేసింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. స్టైలీష్ గా కనిపించే అల్లు అర్జున్ ఈ మూవీలో డీగ్లామర్ గా కనిపించనున్నాడు. తొలిసారి బన్నీ తనశైలి భిన్నమైన పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో కీ రోల్ చేస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

ఇటీవల శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ‘పుష్ప’ మూవీలో కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే. తమిళంలో విజయ్ సేతుపతి చాలా బీజీగా స్టార్. ఆయన చేతినిండా పలు సినిమాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఈ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన ఈ మూవీకి డేట్లు సర్దుబాటు చేయలేక సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు దర్శకుడు సుకుమార్ కు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

‘రంగస్థలం’ మూవీతో చెర్రీకి ఘనవిజయం అందించిన సుకుమార్ బన్నీకి ‘పుష్ప’తో భారీ హిట్టిచ్చే ప్లాన్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లలో తెరకెక్కుతున్న మూడో చిత్రం పుష్ప. బన్నీ తొలిసారి గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీని విజయ్ సేతుపతి తప్పుకోవడంతో ఆయన పాత్రకు మరో తమిళ నటుడిని ఎంపిక చేసే పనిలో సుకుమార్ పడ్డారు. ఈ పాత్ర కోసం అరవింద స్వామి, బాబీ సింహా పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.