
దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ‘బహుబలి’ సీరిస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే మూవీలో కన్పిస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉంటుందోనని నందమూరి, మెగా అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తునారు. ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
‘భీమ్ ఫర్ రామరాజు’ పేరిట ‘ఆర్ఆర్ఆర్’ బృందం విడుదల చేసిన వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. ఈ వీడియో చరణ్ లుక్, చరణ్ పాత్రను రివీల్ చేసి అభిమానులను రాజమౌళి, ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేశారు. అదేవిధంగా మే20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ ఫస్టు లుక్, వీడియో విడుదల కానుంది. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఎలివేషన్ షాట్స్, మోషనల్ కంటెంట్ అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో చరణ్ వాయిస్ ఓవర్ ఉండకపోవచ్చని సమాచారం. ఈ వీడియోలో ఎన్టీఆర్ యే కొన్ని పవర్ ఫుల్ డైలాగ్‌లను చెబుతారని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా పులితో ఎన్టీఆర్ ఫైట్ కి సంబంధించిన విజువల్స్ ను కూడా రివీల్ చేయబోతున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్టు లుక్, వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ బృందం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.