
రోజు రోజుకి పెరుగుతున్నపాన్ ఇండియా చిత్రాల లిస్ట్ లో మరో తెలుగు చిత్రం చేరుతోంది. యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది ‘అర్జున సురవరం’తో సక్సెస్ సాధించిన తరవాత రెట్టించిన ఉత్సాహం తో కొత్త చిత్రాలు చేస్తున్నాడు. ప్రసుతం నిఖిల్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి సుకుమార్ , బన్నీ వాస్ నిర్మాతలుగా ` కుమారి 21 ఎఫ్ ` ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘18 పేజీస్’ కాగా.. మరో చిత్రం ‘కార్తికేయ’ సీక్వెల్ గా రానున్న ‘కార్తికేయ 2’ చిత్రం. కాగా ఈ ‘కార్తికేయ 2’ మూవీ కోసం నిఖిల్ 6 ప్యాక్ చేస్తుండటం విశేషం. కాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. నిఖిల్…..
ఇటీవల జరిగిన ఓ సంభాషణలో `ఇతర భాషల్లో నటించే అవకాశం ఉందా? ‘ అని అడిగితే.. అలాంటి ఆలోచన లేదని చెప్పిన నిఖిల్ అయితే కార్తికేయ 2 చిత్రాన్ని మాత్రం నాలుగైదు భాషల్లో విడుదల చేయాలను కుంటున్నట్లు చెప్పాడు. అంతే కాకుండా అన్నీ భాషల్లో తానే డబ్బింగ్ చెప్పాలను కుంటున్నాడట. నిఖిల్. దానికి కారణం చెబుతూ ‘కార్తికేయ 2’ యూనివర్సల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందు తుంది. అని తెలిపాడు … ఆ లెక్కన ‘కార్తికేయ 2’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించి తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువదించి విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని రూఢీగా తెలుస్తోంది . వెరసి కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుందన్న విషయం కంఫర్మ్ అయినట్టే …