
ప్రధాని నరేంద్ర మోడీ మూడు వారల లాక్‌డౌన్ ను సడలిస్తారనే ధీమాతో ఎన్నో రాజకీయ ప్రణాళికలు వేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికు మే 3 లాక్‌డౌన్ ను పొడిగిస్తూ ప్రకటించడం తీవ్ర ఆశాభంగం కలిగించినట్లయింది.
సడలింపు వైపే ప్రధాని సుముఖంగా ఉన్నారని అంచనాకు వచ్చిన జగన్ సహితం అందుకు బలం చేకూర్చడం కోసమని లాక్‌డౌన్ ను రెడ్ జోన్ లకు పరిమితం చేయాలి అంటూ వట్టిదే తెచ్చే ప్రయత్నం చేశారు.
చివరకు గత రాత్రి కూడా ప్రధానికి వ్రాసిన లేఖలో లాక్‌డౌన్ కారణంగా వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఎంతో నష్టం కలుగుతున్నదని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానికి మరో లేఖ వ్రాసారు.
దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ కొనసాగింపుకు సుముఖత వ్యక్తం చేస్తూ నిర్ణయాలు తీసుకున్నా, జగన్ మాత్రం “అంతా మీ ఇష్టం.. మీరు యెట్లా చెబితే అట్లా” అంటూ ప్రధానిపైకి భారం వేసి డొంకతిరుగుడు రీతిలో వ్యవహరించారు.
అయితే ఒక విధంగా ఇప్పటికి సగంకు పైగా రాష్ట్రాలు లాక్‌డౌన్ పొందిస్తు నిర్ణయం ఇప్పటికే తీసుకోవడంతో ప్రధానికి పొడిగింపుకన్నా మరో మార్గం లేకపోయింది. అయితే ఏప్రిల్ 20 తర్వాత పెద్ద ఎత్తున సడలింపు ఉండగలదని సంకేతం ఇచ్చారు.
కనీసం ఈ విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇస్తారని జగన్ అనుకున్నారు. అందుకనే గత వారం రోజులుగా ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతున్నా తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారు.
పలు జిల్లాల్లో ఒక వంక కరోనా పరీక్షలను తగ్గిస్తూ, జరిగిన పరీక్షలకు సహితం నివేదికలు రాకుండా జాప్యం చేస్తూ వచ్చారు. రెడ్ జోన్ లలో ఇంటింటికి పరీక్షా చేస్తామని ప్రకటించి కూడా ఎక్కడా ప్రారంభించలేదు. పలు కరోనా సంబంధింత మరణాలను సాధారణ మరణాలుగా చూపుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
లాక్‌డౌన్‌పై రాష్ట్రాలకే విచక్షణాధికారాలు ఇస్తారన్న అంచనాలన్నీ తలకిందులయ్యాయి. నెలాఖరు లోగా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నియామకంపై హై కోర్ట్ తీర్పు ఇచ్చేలోగా ఏదో విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని వేసుకున్న అంచనాలు సహితం తలకిందులయిన్నట్లు అయింది.
రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్లను కూడా కుదించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు పురఃటి చేయాలి అనుకున్నారు. కానీ ప్రధాని ప్రకటనతో జగన్ ప్రయత్నాలకు గండి పడిన్నట్లు అయింది. పైగా రాస్త్రాలు, జిల్లాలు, ప్రాంతాల వారీగా లాక్‌డౌన్ అమలును సునిశితంగా కేంద్రం పరిశీలిస్తోందని ప్రధాని చెప్పడం కూడా ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిక వంటిదే కాగలదు.
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాజధాని తరలింపు ప్రయత్నాలకు సహితం ప్రస్తుతానికి గండి పడినట్లే కాగలదు. ఇప్పటికి కరోనా పరీక్షలు, లాక్‌డౌన్ అమలు పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తున్నట్లు కేంద్రం సున్నితంగా మందలిస్తూ వస్తున్నది. అటువంటి పరిస్థితి తమకు కూడా ఎక్కడ వస్తుందో అని ఇప్పుడు ఏపీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.