
దర్శకుడు సుకుమార్ తాజా చిత్రం ‘పుష్ప’. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లలో ఈ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు ఇటీవలే చిత్రబృందం రిలీజ్ చేసింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. స్టైలీష్ గా కనిపించే అల్లు అర్జున్ ఈ మూవీలో డీగ్లామర్ గా కనిపించనున్నాడు. తొలిసారి బన్నీ తనశైలి భిన్నమైన పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో కీ రోల్ చేస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
ఇటీవల శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ‘పుష్ప’ మూవీలో కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే. తమిళంలో విజయ్ సేతుపతి చాలా బీజీగా స్టార్. ఆయన చేతినిండా పలు సినిమాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఈ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన ఈ మూవీకి డేట్లు సర్దుబాటు చేయలేక సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు దర్శకుడు సుకుమార్ కు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
‘రంగస్థలం’ మూవీతో చెర్రీకి ఘనవిజయం అందించిన సుకుమార్ బన్నీకి ‘పుష్ప’తో భారీ హిట్టిచ్చే ప్లాన్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లలో తెరకెక్కుతున్న మూడో చిత్రం పుష్ప. బన్నీ తొలిసారి గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీని విజయ్ సేతుపతి తప్పుకోవడంతో ఆయన పాత్రకు మరో తమిళ నటుడిని ఎంపిక చేసే పనిలో సుకుమార్ పడ్డారు. ఈ పాత్ర కోసం అరవింద స్వామి, బాబీ సింహా పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.