Home Blog Page 8533

Shriya Saran Latest Photo Shoot Stills

ఏపీలో వైఎస్సార్ జనతా బజార్లు!


రాష్ట్రంలో పండించిన పంటలను బయట మార్కెట్లకు పంపించడమే కాకుండా స్థానిక మార్కెట్లపైన కూడా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టర్ లు, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, రైతు బజార్ల, వార్డులు స్థాయి, గ్రామస్థాయిల వరకూ అరటిని పంపి తక్కువ ధరకే ప్రజలకు అమ్ముతున్నామని చెప్పారు. ఈ ఆలోచన వెయస్సార్‌ జనతా బజార్లకు దారితీస్తుందన్నారు. వచ్చే ఏడాదిలోగా ఈ బజార్లకు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. కరోనా విపత్తు కారణంగా మనం తీసుకునే చర్యల రూపంలో వైయస్సార్‌ జనతాబజార్లకు బీజం వేశామని తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో రద్దీని తగ్గించాలంటే ప్రతిరోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలన్నారు. జోన్లలోకూడా రోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచడం వల్ల జనం గుమిగూడకుండా చూసుకోవచ్చని, లేకపోతే రద్దీ ఉండి మళ్లీ లాక్‌డౌన్‌ ఉద్దేశాలు నెరవేరవన్నారు. హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హోండెలివరీ లాంటి మార్గాలను ఎంచుకంటే మంచిందని చెప్పారు.

క్వారంటైన్‌లో ఉన్న వారికి మంచి సదుపాయాలు కల్పించాలని కోరారు. పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌ మెంట్‌ చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్‌ సదుపాయం ఉండాలని, ఎవరైనా పేషెంట్‌ వస్తే… అతనికి కరోనా ఉందా? లేదా? అన్నది ఎవ్వరికీ తెలియకూడదని సూచించారు.

రైతులు ఇబ్బంది పడకుండా మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి, రవాణాను అందుబాటులోకి తీసుకురావడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. ఇలాంటి సమయంలో ఆహారంలేని పరిస్థితి ఉండకూడదని, ఎవరు రేషన్‌ అడిగినా ఇవ్వమని ఆదేశించారు. ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదన్నారు. మొదటిసారి ఫాంగేట్‌ పద్దతిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. గ్రామంలో రైతులు ఏమైనా ఇబ్బందులు పడితే వెంటనే ఆ సమాచారం రావాలని సూచించారు.
అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ తనకు ఇచ్చిన ట్యాబ్‌ ద్వారా ఈ సమాచారాన్ని నివేదించాలని, ఈ సమాచారం పైస్థాయిలో ఉన్నవారికే కాకుండా జిల్లా కలెక్టర్లకూ రావాలన్నారు.

ఆక్వా రంగంపై ఆక్వా అసిస్టెంట్‌ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి నిరంతరం ఇది జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటేనే ఏ వైరస్‌ అయినా, బాక్టీరియా అయినా ప్రబలకుండా ఉంటుందనే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. రైతు భరోసాకేంద్రాలు, విలేజ్‌ క్లినిక్కులు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలన్నారు. వీటిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి ఆర్బీకేలు జూన్‌ నుంచి పనిచేయాలని, 2021 మార్చి నాటికి ఇవి పూర్తికావాలని సూచించారు.

ఉస్మానియాలో పిజి డాక్టర్లపై దాడి


గాంధీ ఆసుపత్రిలో గత నెలలో కరోనా ఐసోలేషన్ వార్డ్ లో డాక్టర్లపై రోగులు దాడి చేసిన సంఘటనను మరవక ముందే తాజాగా ఉస్మానియా ఆసుపత్రిలో పీజీ డాక్టర్లపై దాడి జరిగింది.

మంగళవారం ఉదయం ఉస్మానియాలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో వాళ్ళను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.అయితే, ఐసోలేషన్ వార్డులోని ఇద్దరికి పాజిటివ్ రావడంతో.. అదే వార్డులో ఉన్న కరోనా అనుమానితుడు అన్వర్ అలీ తండ్రి డాక్టర్స్ పై దాడి చేశాడు.

పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో తన కొడుకును ఇంటికి తీసుకుపోతానని డాక్టర్స్ తో తండ్రి ఘర్షణకు దిగాడు. రిపోర్ట్స్ వచ్చేవరకు ఇక్కడే ఉండాలని వైద్యులు స్పష్టం చేయడంతో పేషంట్ తండ్రి, డాక్టర్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

ఈ ఘర్షణలో పిజి డాక్టర్ల పై దాడి చేసిన రోగిపై తండ్రితో విచారం వ్యక్తం చేయించి, వివాదానికి తెరదింపేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నించినట్లు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదని చెబుతున్నారు.

గాంధీ ఆసుపత్రిలో గాని, ఆ తర్వాత రాష్ట్రంలో ఇతరత్రా గాని కరోనా వైద్యంలో ఉన్న సిబ్బందిపై జరుగుతున్న దాడులకు పాల్పడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతూ ఉండడంతో ఇటువంటి దాడులు జరుగుతున్నాయి.

క్వారంటైన్ పై వైసీపీ ఎమ్మెల్యేతో మంత్రి మోపిదేవి వార్


గుంటూరులో కరోనా వైరస్ మొదట్లో కారకుడిగా స్థానిక వైసిపి ఎమ్యెల్యే ముస్తఫా బావమరిదిని భావిస్తారు. ఢిల్లీలోని తబ్లిగ్ సదస్సుకు వెళ్లి వచ్చి ఇక్కడకు వైరస్ ను తీసుకొచ్చాడు. అతని ప్రయాణ చరిత్రను కూపీ లాగడం ద్వారా వేలాదిమందితో ఢిల్లీలో ఈ సదస్సు జరిగిన్నటు గుంటూరు డిఐజి రామకృష్ణ ఢిల్లీలోని కేంద్ర నిఘా వర్గాలను అలెర్ట్ చేశారు.

ఆ సందర్భంగా ముస్తఫా వ్యవహారం వివాదంగా మారగా, తాజాగా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారందరిని ఇంటికి పంపించి వేయాలని అంటూ వైద్య అధికారులతో వివాదానికి దిగడం ద్వారా మరో రచ్చకు దారితీశారు. ఈ వ్యవహారంపై స్వయంగా జిల్లా మంత్రి మోపిదేవి వెంకట రమణ జోక్యం చేసుకొని తమ పార్టీ ఎమ్యెల్యే వ్యవహారంపై ఆక్షేపణ వ్యక్తం చేశారు.

14 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిని ఇంటికి పంపాలని ఎమ్మెల్యే ముస్తఫా చేసిన డిమాండ్ ను జీవో ప్రకారం కుదరదని అంటూ మంత్రి మోపిదేవి నిర్మోహాటంగా తోసిపుచ్చారు. 14 రోజుల తర్వాత కూడా చాలామందికి తిరిగి పాజిటివ్ వచ్చినదని అంటూ గుర్తు చేశారు. ఈ విషయంలో వైద్యుల నిర్ణయం పైననే ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పారు.

14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకొని, ఇంటికి పంపమని వత్తిడి తెస్తున్న వారిలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా ఉండటం గమనార్హం. తన కుటుంబ సభ్యులను ఇంటికి పంపించాలని అంటూ ఎమ్మెల్యే ముస్తఫా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

పైగా, నిబంధనలకు విరుద్దంగా గుంటూరు లోని రెడ్ జోన్ ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటించారు. ఇది సమంజసం కాదని అందరూ పరిస్దితిని అర్థం చేసుకోవాలని మంత్రి హితవు చెప్పారు. బాధ్యత కలిగిన వ్యక్తులు కూడా అర్దం లేకుండా మాట్లాడుతున్నారని అంటూ మంత్రి విరుచుకు పడ్డారు.

మొత్తం 28 రోజులకు క్వారంటైన్‌లో ఉండవలసిందే అని మంత్రి మోపిదేవి స్పష్టం చేయడంతో ఈ విషయమై ఇద్దరి మధ్య వాదోపవాదాలు తీవ్రమవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 100కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన మొదటి జిల్లా గుంటూరు కావడం గమనార్హం.

గుంటూరు జిల్లాలో మొత్తం 109 కేసులు నమోదు కాగా, అందులో 85 కేసులు గుంటూరు అర్బన్ పరిధిలోనే ఉన్నాయి. ఇక గ్రామీణ జిల్లాలో 24 మాత్రమే ఉన్నాయి. జిల్లాలో ఐదుగురు మృతి చెందారు.

దేశంలో మాస్ టెస్టింగ్ కీలకం!

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల పై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. “దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎంత ముఖ్యమో.. అదే స్థాయిలో మాస్ టెస్టింగ్ కూడా కీలకం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. లావోస్, నైజర్ మరియు హోండురాస్ వంటి తక్కువ అభివృద్ధి చెందిన దేశాల కంటే కరోనా పరీక్షా స్థాయిలు అత్యల్పంగా భారత్ లో ఉన్నాయని రాహుల్ పేర్కొన్నారు.

ఇదే విషయం పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ మాట్లాడుతూ..”భారత ప్రజలు ఏమి చేయాలని ఆయన (మోడీ) ఆశిస్తున్నారో ప్రధాని వివరించారు, కాని ప్రజల కోసం తన ప్రభుత్వం ఏమి చేస్తుందో ఆయన చెప్పలేదు” అని తివారీ అన్నారు.

“పేదలకు జీవనోపాధి – వారి మనుగడను గూర్చి మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, పేదలు 21 + 19 రోజులు తమను తాము రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని చిదంబరం అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, ఆహారం ఉంది, కాని ప్రభుత్వం డబ్బు లేదా ఆహారాన్ని విడుదల చేయదని చిదంబరం అన్నారు.

భారత్‌ను ప్రశంసిస్తున్న డబ్ల్యూహెచ్ఓ


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తుంది. చైనా నుంచి క్రమంగా అన్నిదేశాలకుపాకి మరణ మృందంగం చేస్తుంది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా 20వేల మంది మృతిచెందారు. అభివృద్ధిలో ముందుండే అమెరికా కరోనాతో మృతిచెందిన కేసుల్లో తొలిస్థానంలో నిలవడం శోచనీయంగా మారింది. ఇటలీ, స్పెయిన్, చైనా, బ్రిటన్, యూకే దేశాలు కరోనాను కట్టడిలో చేయడంలో విఫలమవుతున్నారు. కాగా భారత్ కరోనా విషయంలో త్వరగా మేల్కోవడంతో కొంతమేర కరోనా కట్టడిని చేయగలిగింది.

కరోనా కేసులు దేశంలో 10వేల కేసులకు చేరడం ఆందోళన కలిగిస్తుంది. రేపటి దేశంలో లాక్డౌన్ ముగిస్తుందనగా ప్రధాని మోదీ మంగళవారం జాతినుద్దేశించి మరోసారి మాట్లాడారు. ఈ సందర్భంగా లాక్డౌన్ మే 3వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని నిర్ణయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. కరోనాపై సమనుకూలంగా భారత్ కఠిన నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేసింది. అయితే కరోనా ఫలితాలపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని డబ్ల్యూహెచ్‌వో రీజనల్ డైరెక్ట్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. లాక్డౌన్ వల్ల సామాజిక దూరంగా, కేసుల నిర్ధారణ, ఐసోలేషన్, కరోనా పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్టులను గుర్తించడం తేలిక అవుతుందని ఆయన తెలిపారు.

లాక్డౌన్ నిర్ణయంతో ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ కరోనాపై పోరులో భారత్ కృతనిశ్చయంతో ఉందని పూనమ్ ప్రశంసించారు. కరోనాపై విజయం సాధించడానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాపై భారత్ చేస్తున్న పోరాటాన్ని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే ర్యాన్ గతంలోనే ప్రశంసించారు. భారత్ గతంలోనే స్మాల్ పాక్స్, పోలియా మహమ్మరులను నిర్మూలించిందన్నారు.

సమంత వంటను రుచి చూడలేదు: అమల


హీరోయిన్ సమంత సినిమాల్లోనే వంట చేస్తుంది.. నిజజీవితంలో ఆమెకు వంట రాదని తేలింది. ఈ విషయాన్ని ఆమె అత్తగారు స్వయంగా ఓ ఇంటర్య్యూలో వెల్లడించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సమంత యాక్టింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయంతో సామ్ దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. 2017లో నాగచైతన్యను వివాహాం చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అందరినీ అలరిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వూలో సమంత అత్తగారు అమలకు ఏ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె చెప్పిన సమాధానం ఆసక్తిని రేపుతోంది.

‘సమంత మీ కుటుంబ సభ్యుల కోసం ఎప్పుడైనా వంట చేశారా?’ అనే ప్రశ్న అమలను అడుగగా లేదని సమాధానం సమాధానం చెప్పింది. అనంతరం ఆమె నవ్వుతూ.. సమంతకే కాదు.. నాకు కూడా వంట రాదని తెలిపింది. మా ఇంట్లో మంచి కుక్ ఉన్నాడని నాగార్జునను ఉద్దేశించి చెప్పింది. నాగర్జున ఉండగా వేరొకరు వంట చేయాల్సిన అవసరం లేదని సమాధానం ఇచ్చింది. నాగార్జున లాగే చైతన్య కూడా మంచి వంటగాడని సమంత కూడా పలు సందర్భాల్లో చెప్పింది. నాగచైతన్య వంటింట్లో వంట చేస్తున్న ఫొటోలను ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసిన సంగతి తెల్సిందే. దీనిని బట్టి అత్త కోడళ్లు ఇంట్లో వంట చేయరని అర్థం అవుతుంది. కాగా తండ్రికొడుకులు తమ భార్యలకు వంట చేసి పెడితే వాళ్లిద్దరు హ్యాపీలా లాగించేస్తారన్నమాట.

ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’లో నటిస్తున్నాడు. ఇందులో చైతూకీ జోడిగా సాయిపల్లవి నటిస్తుంది. అలాగే ‘నాగేశ్వర్ రావు’ అనే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీలో చైతుకు జోడీగా రష్మిక నటిస్తుంది. కాగా సమంత ‘జాను’ మూవీ తర్వాత ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సీరిస్ లోనటిస్తుంది. అలాగే రెండు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.

వలస కార్మికులకు కేంద్రం గుడ్ న్యూస్!

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా వలస కార్మికుల జీనోపాధికి సంబంధించిన సమస్యలు మరియు వారికి సంబంధించిన ఇతర సమస్యలు పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా 20 కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ను మే 3 వరకు పొడిగించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే, ఏప్రిల్ 20 నుండి పరిస్థితుల అంచనా ప్రకారం కొన్ని చోట్ల లాక్‌ డౌన్‌ లో షరతులతో కూడిన సడలింపు ఇస్తామని ప్రధాని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు, వలస కూలీలు ఫోన్ నంబర్లు, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా ఈ కేంద్రాలను సంప్రదించవచ్చు. ఈ నియంత్రణ గదులను లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు, ప్రాంతీయ కార్మిక కమిషనర్లు మరియు ఆయా ప్రాంతాల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్లు నిర్వహిస్తారు. మొత్తం 20 కాల్‌ సెంటర్ల పనితీరును ప్రధాన కార్యాలయ చీఫ్ లేబర్ కమిషనర్ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

లాక్ డౌన్ కారణంగా కార్మికులు మరి ముఖ్యంగా వలస కూలీలు పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెద్ద సంఖ్యలో వలస కూలీలు జీవనోపాధి కోల్పోయారు. ఈ లాక్ డౌన్ కారణంగా భారతదేశంలో 40 మిలియన్ల అనధికారిక రంగ కార్మికులు తీవ్ర పేదరికంలోకి వెళ్లే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఉప రాష్ట్రపతి దృష్టికి పైలాన్ వివాదం!


నెల్లూరు జిల్లా కావలిలో అమృత్ పథకం పైలాన్ ధ్వంసం చేసిన సంఘటన వివాదాస్పదమయ్యింది. కావాలిలోని ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉన్న ఈ పైలాన్ కావాలనే అధికార పార్టీకి చెందిన వారు ధ్వంసం చేశారాని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హస్తం ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన ఈ పైలాన్ ను మాజీ మంత్రి లోకేష్ 2018లో ఆవిష్కరించారు. పైలాన్ నిర్మించిన ప్రదేశంలో ప్రెస్ క్లబ్ నిర్మిస్తారని సమాచారం. ఈ సంఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఈ సంఘటనపై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కి లేఖ రాశారు. బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వివాదాన్ని స్థానిక నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకు వెళ్లారు. చట్టం అధికారులు చర్యలు తీసుకుంటారని ఉపరాష్ట్రపతి బీజేపీ నేతలకు సూచించారు. వివాదాలకు పోవద్దని హితవు పాలికినట్లు తెలిసింది. మరోవైపు కూల్చివేత వివాదం ఉపరాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో ఇందుకు సహకరించిన అధికారుల్లో ఆందోళన మొదలైంది.

అటు జిల్లా అధికారులకు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. పైలాన్ మళ్లీ నిర్మాస్తామంటూ వైసీపీ నాయకులు రాయబారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కావలిలో అధికార పక్షం నాయకులు చేసిన పని వివాదాస్పదం అయ్యింది.

కరోనా సేవలో హీరోయిన్..


కరోనా విపత్తు మనుషుల ఆలోచన లో సరికొత్త మార్పు తీసుకొచ్చింది . తరచి చూడటం అలవాటౌతోంది. దరిమిలా నేను సైతం అంటూ ఈ ఆపత్సమయం లో ముందుకు రావడం జరుగుతోంది తాజాగా కేరళలో ఒక సినీ హీరోయిన్ ప్రజలకు సేవ చేస్తానంటూ ముందుకొచ్చింది. యంగ్ హీరోయిన్ నిఖిల విమల్ కేరళ ప్రభుత్వం చేపడుతున్న కరోనా సహాయక చర్యలకు తనవంతుగా సేవ లందిస్తోంది. కేరళ లో కరోనా రక్షణ పరికరాలు, నిత్యావసరాలు అందించే విషయం లో ప్రభుత్వ కాల్ సెంటర్ లో ప్రజలకు అనుసంధాన కర్తగా వ్యవహరిస్తోంది. అలా ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు తన గొంతు ద్వారా వినిపిస్తూ సేవలు అందిస్తోంది.

కేరళ లోని తలిపారంబ కి చెందిన నిఖిల విమల్ తమ సమీప కన్నూర్ పట్టణం లోని కాల్ సెంటర్ లో ఈ విధమైన ప్రజా సేవ చేస్తూ లాక్ డౌన్ టైంని సద్వినియోగం చేస్తోంది ఇంతకీ ఈ నిఖిల విమల్ ఎవరంటే 2017 లో తెలుగులో నరేష్ హీరోగా వచ్చిన ` మేడ మీద అబ్బాయి ` చిత్రంలో హీరోయిన్ గా నటించింది . ఆ తరవాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన ` గాయత్రీ ` చిత్రంలో కూడా నటించింది . .

స్వదేశం వద్దు, భారత్ ముద్దు: అమెరికన్లు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 210 దేశాల్లో తన ఉనికిని చాటుకుంటూ విలయం సృష్టిస్తోంది. ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా నిలిచిపోయింది. దాంతో అనేక దేశాల ప్రజలు ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. అయితే ఆయా దేశాలు విదేశీయులను తమ భూభాగంపై ఉండేందుకు అనుమతించడంలేదు.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఇటీవలే భారత్ నుంచి 444 మంది తమ పౌరులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లింది.అయితే మరికొన్ని దేశాలకు చెందిన ప్రజలు మాత్రం భారత్ ను వీడి తమ సొంత దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడడంలేదు. ముఖ్యంగా అమెరికన్ల గురించి చెప్పుకోవాలి. తాము భారత్ లోనే ఉంటామని, అమెరికా వెళ్లబోమని అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండడమే అందుకు కారణం. 22 వేలు దాటిన మృతుల సంఖ్య, ఐదున్నర లక్షల పాజిటివ్ కేసులతో అమెరికాలో కరోనా స్వైరవిహారం చేస్తోంది.

విదేశాల్లో ఉన్న 50 వేల మంది అమెరికా పౌరులను స్వదేశానికి వచ్చేయాల్సిందిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ట్రంప్ ఆదేశాలతో అమెరికా యంత్రాంగం అనేక విమానాలను నడుపుతోంది. విదేశాల్లో నిలిచిపోయిన అమెరికన్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

భారత్ లో తమకు అందుబాటులో వున్న 800 మందిని అమెరికా అధికార్లు ఒకరోజున సంప్రదించి విమానం రెడీగా వుంది వస్తారా? అని కోరితే, వారిలో 10 మంది మాత్రమే ముందుకొచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా భారత్ లో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా సాగుతుండడం కూడా అమెరికన్లలో ఇక్కడుండడమే మంచిదన్న అభిప్రాయం కలిగిస్తోంది.

కాగా, భారత్ లోని వివిధ ప్రాంతాల్లో 24 వేల మంది అమెరికా పౌరులు ఉన్నట్టు అధికార వర్గాల అంచనా.

కరోనాతో క్రికెటర్ మృతి


కరోనా వైరస్ సోకి మాజీ క్రికెటర్ మంగళవారం మృతిచెందాడు. పాక్ మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్(50)కు ఈనెల 7న కరోనా సోకింది. దీంతో అతడిని ఆసుప్రతిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. గడిచిన మూడురోజులుగా అతడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తుండగా మంగళారం పరిస్థితి విషమించడంతో సర్ఫరాజ్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

సర్ఫరాజ్ 1988-94 మధ్యకాలంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌‌ ఆడారు. ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌గా క్రికెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 15ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 616పరుగులు చేశాడు. 1994లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం కోచ్‌ అవతారమెత్తాడు. సర్ఫరాజ్ సోదరుడు అక్తర్ సర్ఫరాజ్ కూడా క్రికెటరే. పాక్ తరఫున అక్తర్ నాలుగు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడి 1998లో విడ్కోలు తీసుకున్నాడు.

కాగా పాకిస్తాన్ కు చెందిన స్వ్కాష్ ప్లేయర్ అజామ్ ఖాన్(95) కరోనాతో ఇటీవల మృతిచెందాడు. 1959-62కాలంలో వరుసగా నాలుగు బ్రిటీష్ ఓపెన్ టైటిల్స్ గెలుపొందాడు. మార్చిలో కరోనా బారిన అజామ్ లండన్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. పాకిస్తాన్లో ఇప్పటికే కరోనా కేసులు 5వేలకు చేరుకోగా 96మృతిచెందారు.

బోల్డ్ పాత్రలో కనిపించనున్న ‘శివగామి’


ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు కేరాఫ్ గా రమ్యకృష్ణ నిలిచింది. గ్లామర్ పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలళయాం, బాలీవుడ్ సీని ప్రేక్షకులను రమ్యకృష్ణ అలరించింది. కాగా వివాహం చేసుకున్న కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి కేవలం క్యారక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది.

అయితే రాజమౌళి తెరకెక్కించిన ‘బహుబలి’ సినిమాలో రమ్యకృష్ణ నటించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. శివగామి పాత్రలో ఆమెను తప్ప వేరేవరు చేయలేరు అన్న రీతిలో రమ్యకృష్ణ ఆ క్యారెక్టర్లో జీవించింది. దీంతో ఈ సినిమా తర్వాత ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమె సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలకే మొగ్గుచూపుతుంది. తాజాగా ఆమె ‘అంధాధున్’ రీమేక్లో నటించనుందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీని ఠాగూర్ నిర్మిస్తుండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.

నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ బోల్డ్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో టబు నటించిన పాత్రలో తెలుగులో రమ్యకృష్ణ నటించనుందట. ఇందుకోసం రమ్యకృష్ణ భారీగా డిమాండ్ చేయగా ఆమె అడినంత ఇచ్చేందుకు దర్శక, నిర్మాతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ‘అంధాధున్’లో నటించిన టబునే రీమేక్ మూవీలో నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆమె పారితోషకం భారీగా డిమాండ్ చేయగా ఈ పాత్రలో అనసూయను తీసుకున్నట్లు టాక్ విన్పించింది.

తాజాగా ఈ పాత్రలో అనసూయ బదులుగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓకే అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రమ్యకృష్ణ తన భర్త కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ మూవీలో నటిస్తోంది.

‘మే 3’ వెనుక మోడీ మార్క్..!?

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలా రాష్ట్రాల సీఎం లు లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి మే 3వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

అంతకంటే ముందే కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండానే ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌ డౌన్ ‌ను పొడిగిస్తున్నట్లు ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అరుణాచల్‌ ప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎం లు ప్రకటించుకున్నారు. దీంతో ప్రధాని మోడీ కూడా ఏప్రిల్ 30వ తేదీ వరకే లాక్‌ డౌన్ ‌ను పొడిగిస్తారని అందరూ భావించారు. కానీ.. అనూహ్యంగా మే 3వ తేదీ వరకు లాక్‌ డౌన్ ‌ను పొడిగించారు. లెక్క‌లో ఏదో తేడా కొట్టింది.దింతో ఆయా రాష్ట్రాలు పొడిగించిన లాక్ డౌన్ తేదీల నిర్ణయాలకు కేంద్రం చెక్ పెట్టినట్లయింది.

రాష్ట్రాలు, కేంద్రం ప్రకటించిన లాక్ ‌డౌన్ పొడిగింపు తేదీల్లో ఎందుకీ తేడా అన్నదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏప్రిల్ 30 కాకుండా మే 3వ తేదీ వరకు మోడీ ఎందుకు పొడిగించారు..? ఇందులో ఏమైనా ప్రత్యేకత ఉందా..? అన్న ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. ఇందులో ఏదో మోడీ మార్క్ తప్పకుండా ఉండి ఉంటుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

ఇక్కడే ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 24 నుంచి రంజాన్ నెల ప్రారంభం అవుతోంది. అక్కడనుండి 40 రోజులు పాటు రంజాన్ పండుగ కొనసాగనుంది. అంటే మే 25 నుండి జూన్ 3 వరకు 40 రోజులు కాబ‌ట్టి లాక్ డౌన్ ని ఏప్రిల్ 30కి కాకుండా మే 3 వరకు పొగిడించినట్లైయితే.. త‌రువాత మే 31 వ‌ర‌కు లాక్ ‌డౌన్ ను రాష్ట్రాలు ఖ‌చ్చితంగా పెంచుకుంటాయి. అలా అలా జూన్ 3వ తేదీ వ‌ర‌కు దేశంలో ఖ‌చ్చితంగా లాక్‌ డౌన్ అమలలో ఉంటుంది. దింతో ముస్లింలు ఇళ్లలోనే రంజాన్ జరుపుకొని, కరోనా వ్యాప్తికి చెక్ పెట్టొచ్చుని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లాక్ డౌన్ లో 7-7 ఫార్ములా మంచిది!


దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం పుట్టిస్తున్న వేళ మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ఏడు కీలక సూచనలిచ్చారు.కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రేపు మరిన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తున్నామని మోడీ అన్నారు.

మోడీ ఏడు సూచనలు ఇవే సూచనలు

1.వృధాప్యంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ మీ జాగ్రత్తగా చూసుకోవాలి
2.అత్యవసర విధుల్లో ఉన్న డాక్టర్లు, నర్సులు, పోలీసులను గౌరవిద్దాం
3.పేదలకు ఆకలితో,ఆపదలో ఉన్నవారికి మరింత సాయం చేద్దాం
4.ఏ ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసివేయొద్దు.
5.ఆరోగ్య సేతు ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోండి..సురక్షితంగా ఉండండి
6.భౌతిక దూరం పాటించాలి..కరోనాను తరిమేయాలి
7.రోగనిరోధక శక్తి పెంచుకోవాలి

ప్రపంచం మొత్తం ఇప్పుడు రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలా అని తెగ ఆరాటపడుతున్నారు.ఎవరి బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయో వారు కరోనాను ఈజీగా జయిస్తున్నారు. అమెరికాలో కరోనాను జయించిన వారి నుంచి యాంటీ బాడీస్ సేకరించి కరోనా పేషెంట్లకు ఎక్కిస్తున్నారు. అటువంటి యాంటీ బాడీస్ పెంచుకోవడానికి కూడా ఏడు సూత్రాలు ఉన్నాయి.

రోగనిరోధక శక్తిని పెంచే ఏడు సూత్రాలు

1.యాంటీబాడీస్ (మంచి బ్యాక్టీరియా, మంచి సూక్ష్మక్రిములు లేదా వ్యాధి నిరోధక శక్తి) తయారయ్యేది ప్రోటీన్స్ తోనే. మాంసం, చికెన్, గుడ్లు బాగా తినాలి. జీడిపప్పు, బాదం వంటి వాటిలో ప్రోటీన్స్ బాగా ఉంటాయి కాబట్టి వాటినీ తినాలి.
2.విటమిన్ A, C, E ఉండే పండ్లు బాగా తినండి. పుల్లగా ఉండే పండ్లు తింటే యాంటీబాడీస్ అద్భుతంగా పెరుగుతాయి.
3. ప్రతిరోజు ఓ అరగంటైనా నడిస్తే మంచిదే. కనీసం 10 నిమిషాలైనా నడవాలి. కొంతమందిలా గంటలతరబడి జిమ్‌ ఎక్సర్‌సైజ్‌ లు చెయ్యవద్దు. దాని వల్ల తెల్లరక్తకణాలకు సమస్య వస్తుంది.
4. ఉదయం, సాయంత్రం వేళ సూర్యుడి ఎండ తగిలేలా చేసుకోండి. లేదా డాక్టర్ల సలహాతో విటమిన్ డి టాబ్లెట్లు వేసుకోండి.
5. అదే పనిగా టెన్షన్ పడకండి. ఏ పనైనా అవుతుందిలే అని మనసులో గట్టిగా అనుకోండి.
6.కాస్త రేటు ఎక్కువైనా ఆలివ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్స్‌తో వంటలు వండుకోండి. వేపుళ్లు తగ్గించి ఉడకబెట్టినవి, పులుసు వంటలు ఎక్కువ తినండి. మసాలాలు తగ్గించండి. మొలకలు తింటే చాలా మంచిది.
7.మద్యం యాంటీ బాడీస్‌ని చంపేస్తుంది. మ

మే 3 వరకు రైలు సర్వీసులు రద్దు


దేశంలో మే3వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని రైలు సర్వీసులను మే 3వరకు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ట్వీటర్లో పేర్కొంది. ఈమేరకు ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం, ఎక్స్‌ప్రెస్, సబర్బన్, మెట్రో రైల్ సర్వీసులను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాలకు అవసరమైన సామగ్రి, వస్తువులు, పార్సెల్ రైలు సర్వీసులు మాత్రం కొనసాగుతాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం 21రోజుల లాక్డౌన్ ప్రకటించింది. రేపటితో ఈ గడుపు ముగుస్తుండటంతో రైల్వే శాఖ రైలు సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. తాజాగా లాక్డౌన్ మరో 19రోజులపాటు కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఏప్రిల్ 20తర్వాత పరిస్థితి అంచనా వేసి కొన్ని సడలింపు చేశారు. ప్రధాని ప్రసంగం అనంతరం కొద్దిసేపటికే రైల్వే శాఖ మే3వరకు రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారి డబ్బులను వందశాతం రిఫండ్ చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు ఐఆర్‌సీటీసీలో ఎలాంటి బుకింగ్స్, అడ్వాన్స్ రిజర్వేషన్స్ ఉండవని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

జగన్ గ్రహాపాటుపై చంద్రబాబు విసుర్లు!

Jagan-Chandrababu

ఒక్కసారి తప్పు చేస్తే పొరపాటు, రెండోసారి తప్పు చేస్తే అలవాటు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తే గ్రహాపాటు. ప్రధాని మోడీ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ లో ఏపీ సీఎం జగన్‌ కావాలనే తప్పులు చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. జగన్, చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. పీఎం మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా మరణాలను దాచిపెట్టడం వల్ల మరింత ప్రమాదమని చంద్రబాబు ఆరోపించారు. కోవిద్-19 మరణాల జాప్యం వల్లే దుష్ఫలితాలు సంభవిస్తాయని, విజయవాడ ఉదంతమే రుజువన్నారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతాలైన గుంటూరు-కృష్ణా జిల్లాలు రెడ్‌ జోన్‌ పరిధిలోకి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు ఆరోపించారు.

మీతో పాటు ఐదుగురికి భోజనం పెట్టాలంటూ ప్రధాని మోదీ ప్రజలందరికీ పిలుపునిస్తే.. ఏపీలో పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను మూసేసిన చరిత్ర సీఎం జగన్‌ దే అని దుయ్యబట్టారు.

తెదేపా నేతలతో చంద్రబాబు వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని జిల్లా ప్రాతిపదికగా విశ్లేషించాలే తప్ప.. మండలం ప్రాతిపదికగా తక్కువగా చూపించడం దురుద్దేశపూర్వకమేనని ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన పేద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం సరికాదని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడిన రమేష్ కుమార్‌ ను ఎస్‌ఈసీ పదవి నుంచి తొలగించడం దుర్మార్గచర్య అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. రాజకీయ లాభాలే తనకు ముఖ్యమనేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుత లాక్‌ డౌన్‌ సమయంలోనూ అనేక జిల్లాలలో అక్రమ మైనింగ్‌ కు వైకాపా నేతలు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో వందల ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునేవారు లేరని దుయ్యబట్టారు. గ్రావెల్‌ ను అక్రమ తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేయకుండా.. సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే ట్రాక్టర్లను సీజ్ చేయడం హేయమన్నారు.