Home Blog Page 8535

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్!

దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ కార‌ణంగా ఆఫీసుల‌న్నీ మూత‌ప‌డ‌టంతో ఉద్యోగులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. చాలావ‌ర‌కూ అన్ని కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోమ్‌ ను కొన‌సాగిస్తున్నాయి. దీంతో ఇంట‌ర్నెట్ వినియోగం విప‌రీతంగా పెరిగింది. అయితే.. దేశీయ టెలికం సంస్థ జియో.. వినియోగ‌దారుల‌ను దృష్టిలో ఉంచుకుని బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

వివ‌రాళ్లోకెళితే.. జియో ఫైబర్ తన క‌స్ట‌మ‌ర్లంద‌రికీ అన్ని ప్లాన్స్ లోనూ డబుల్ డేటాను ఆఫర్ చేస్తోంది. దీనికి సంబంధించి తమ వినియోగదారులు హై స్పీడ్ బ్రాడ్‌ బ్యాండ్‌కు క‌నెక్ట్ అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జియో ఫైబర్ పేర్కొంది. రాజ‌ధాని హైదరాబాద్‌ తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ సేవ‌ల‌ను అందించ‌నున్న‌ట్లు జియో ఫైబ‌ర్‌ పేర్కొంది.

ఇప్ప‌టికే హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలోని ప్ర‌ధాన పట్ట‌ణాల‌లో హై-స్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలను అందించేందుకు తన నెట్‌ వర్క్ సామర్థ్యాన్ని జియో పెంచింది. ఇక‌ స్టే కనెక్టెడ్, స్టే ప్రొడక్టివ్ నినాదంతో ముందుకు వెలుతున్న జియో.. కొత్త కస్టమర్లకు 10 ఎంబీపీఎస్ స్పీడ్, 100 జీబీ డేటాతో ఉచిత కనెక్ష‌న్‌ ఇస్తోంది. అలాగే.. తెలంగాణ‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో అంత‌కుముందున్న వినియోగ‌దార్ల‌కు జియో ఫైబర్ తన హై స్పీడ్ బ్రాడ్‌బాండ్ స్పీడ్ ను 1 గిగా ఫైబర్ వ‌ర‌కూ పెంచింది

భారీ స్థాయిలో ఐటీ ఉద్యోగుల తొలగింపు!


దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే సుదీర్ఘకాలం లాక్ ‌డౌన్‌ కొనసాగడం మూలంగా ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలను తీసేసే అవకాశాలు ఉన్నట్లు నాస్కామ్‌ మాజీ ప్రెసిడెంట్‌ ఆర్‌ చంద్రశేఖర్‌ సంకేతాలిచ్చారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతి దీర్ఘకాలంలో సానుకూలంగా ఉండవచ్చని, ఐటీ కంపెనీల పెట్టుబడులను ఆదా చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. వెంచర్‌ క్యాపిటలిస్టుల నిధులతో స్టార్టప్స్‌ మనుగడ సాగిస్తున్నాయని, ప్రస్తుత పరిణామాలు ఇంకా దిగజారితే ఈ సంస్థ లు మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.

ఉద్యోగులను తగ్గించుకోకుండా ఉండటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి. వారు తమ ఉద్యోగులను కోల్పోవాలనుకోరు. ఆయా కంపెనీల వద్ద తగినంత సొమ్ము ఉంది. పెద్ద కంపెనీల్లో కొన్ని ఉద్యోగులను తొలగించాలనుకుంటే.. తాత్కాలిక ఉద్యోగులను తగ్గించుకోవచ్చు. కానీ రెగ్యులర్‌, శాశ్వత ఉద్యోగులను కోల్పోవాలనుకోరు. అయితే రెండు మూడు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే వాటిపై కూడా ఒత్తిడి రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు సబ్సిడీలు కొనసాగిస్తూ ఉండలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఎంతకాలం అది కొనసాగుతుందన్నదే ప్రశ్న’’ అని చంద్రశేఖర్‌ అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తం గా చాలా కంపెనీలు ఇంటి నుంచి పనికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇది స్వల్పకాలంలో పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపినా దీర్ఘకాలంలో ఇది పని సంస్కృతిని మార్చే అవకాశం ఉందని చెప్పారు. మరికొన్ని నెలలపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే ఐటీ రంగంలోని పెద్ద కంపెనీల్లోనూ ఉద్యోగ కోతలు తప్పదని అన్నారు.

ప్రపంచమంతా ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఐటీ పరిశ్రమకు డిమాండ్‌ తగ్గుతుంద ని భావిస్తున్నట్టు నాస్కామ్‌ మాజీ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుండే అవకాశం లేదన్నారు. అన్ని ఎంతో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కాబట్టి డిమాండ్‌ తగ్గడానికి అవకాశం ఉందని చెప్పారు.

అధికార దాహ రాజకీయాలకు ఆంధ్రా ప్రజలు బలి

ప్రపంచం మరణ మృదంగం తో హృదయవిదారకంగా తయారయ్యింది. ఎక్కడచూసినా శవాల గుట్టల లెక్కలే తప్ప వేరే మాట లేదు. ఇది ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఎన్ని విషాదకర దృశ్యాలు, సంఘటనలు, వార్తలు వింటూ గడపాలో తెలియని విచిత్ర పరిస్థితి లో జనం బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. అయినా ఇవేమీ ఆంధ్రా రాజకీయనాయకులకు పట్టవు. అధికార దాహ రాజకీయాలకు ఇంతటి విపత్కర పరిస్థితి లో కూడా ఫులుస్టాప్ పడలేదు. అవి ఎప్పటిలాగే కొనసాగుతూనే వున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతో మొదలైన రావణాకాష్టం ఇంకా మండుతూనే వుంది. ఆంధ్రా జనం ఏం పాపం చేసారని ఈ శాపం.

జగన్ మొరటు రాజకీయాలు 

జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెద్ద మెజారిటీ తో గెలుపొందాడు. మొదట్లో తను తీసుకున్న ప్రజారంజక చర్యలు అందరి అభిమానాన్ని చూరగొన్నాయి. ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల నియామకం, మద్యపాన నియంత్రణ చర్యలు, అమ్మ ఒడి , విద్యారంగం లో మౌలిక సదుపాయాలు, రైతు భరోసా, సంక్షేమ పధకాలు లాంటి అనేక సంస్కరణలు, నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందాడు. ప్రజలకు ఊరట గొలిపే ఇటువంటి పధకాల తో పరిపాలన జనరంజకంగా జరుగుతున్న తరుణం లో వివాదాస్పద నిర్ణయాలతో పరిపాలన పక్కదారి పట్టింది. గోటితో పోయే దాన్ని గొడ్డలితో నరుక్కోవటం చందంగా సానుకూల వాతావరణాన్ని చేతులారా చెడగొట్టుకున్నాడు. రాజధాని వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి.

రాజధాని వికేంద్రీకరణ యోగ్యతా యోగ్యతల కన్నా అది నడిపిన తీరే మొరటుగా వుంది. ఆ మొరటు తనమే అవకాశం కోసం ఎదురుచూస్తున్న  ప్రతిపక్షాలకు వరమయ్యింది. ప్రతిపక్షాలమీద కోపం ప్రజలమీదకు  మళ్ళింది. రాజధానికి భూమినిచ్చిన రైతుల్ని పిలిచి మాట్లాడుకోవాల్సింది పోయి వాళ్ళ తో పంతానికి పోయి సమస్యను మరింత జటిలం చేసుకోవటం చూస్తే 21వ శతాబ్దపు ఆలోచనలకు భిన్నంగా పాత కాలపు కక్ష రాజకీయాల తోవనే యువకుడైన జగన్ మోహన రెడ్డి ఎంచుకోవటం చూస్తుంటే యవ్వనం వయసులోనే కానీ మనసులో కాదని అర్ధమవుతుంది. ఈ సమస్యను నిజానికి కొంచెం లౌక్యంతో వ్యవహరిస్తే ఇక్కడిదాకా వచ్చేదికాదనిపిస్తుంది. చంద్రబాబు అయిదు సంవత్సరాల్లో రాజధానికి ఖర్చు పెట్టింది కేవలం ఐదువేల కోట్లు మాత్రమే. మిగతాదంతా ప్రణాళికలలో మాత్రమే వుంది. మరి ఆర్దికపరిస్థితి బాగులేనప్పుడు నిన్ను మాత్రం లక్ష కోట్లు ఖర్చుపెట్టమని ఎవరూ చెప్పలేరు కదా. రాజధాని కి, నగర నిర్మాణానికి పొంతన పెట్టటం చంద్రబాబు ఎంత తప్పుచేసాడో జగనూ అంతే తప్పు చేసాడు. కొత్త నగరాన్ని నిర్మించటం ఆచరణ సాధ్యం కాదనుకున్నప్పుడు విశాఖ పట్టణాన్ని విస్తరించాలంటే ఇప్పుడున్న అధికారాలతో చేయొచ్చు కదా. దానికి రాజధాని మార్చటానికి లింక్ ఎందుకు? కావాలంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పెద్దది విశాఖలో కట్టుకొని విశాఖ ను వాణిజ్య నగరంగా అభివృద్ధి చేయటానికి ఇబ్బందేముంది? రాజధాని కి మరీ ఎక్కువ ఆర్భాటానికి పోకుండా ఇక్కడున్న ప్రాంతం లో కొనసాగిస్తూనే విశాఖ ను  అభివృద్ధి చేసివుంటే సమస్య సామరస్య పూరకంగా పరిష్కార మయ్యుండేది. ఇంత మొరటుగా , కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరమేముంది?

ఇకపోతే ఎన్నికల కమీషనర్ తో వ్యవహరించిన తీరు ఇంకా మొరటుగా, అనాగరికంగా వుంది. స్థానిక ఎన్నికల వాయిదా పై జగన్ మాట్లాడిన తీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సింది కాదు. ఇందులో కులాన్ని చొప్పించటం క్షంతవ్యం కాదు. ఎన్నికల కమీషనర్ కేంద్రానికి రాసిన లేఖ అభ్యంతరకరంగా వున్న మాట వాస్తవం. కానీ జగన్ మోహన రెడ్డి చేసిన వ్యాఖ్య వల్ల విషయం పక్కదారిపట్టింది. అందుకనే మొరటు రాజకీయాలనేది. అలా అనాగరికంగా మాట్లాడకపోయివుంటే ఎన్నికల కమీషనర్ లేఖ పైనే చర్చ జరిగుండేది. ఏది ఏమైనా ఓ విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు హుందాగా , సంయమనం తో వ్యవహరించి వుంటే జగన్ మోహన్ రెడ్డి నే అభినందించే వాళ్ళు. ఎన్నికల కమీషనర్ వ్యవహారం ఈ విపత్కర పరిస్థితులు అయిపోయేవరకు వాయిదా వేసుకొనివుంటే వచ్చే నష్టమేమిటో జగన్ మోహన రెడ్డి చెప్పాలి. ఇప్పటికిప్పుడు ఆర్డినెన్సు తీసుకొచ్చి తనను తీసేయాల్సిన అవసరం ఏముంది? రాజ్యాంగ బద్ధమా, చట్టబద్దమా అనే చర్చలోకి వెళ్ళదలుచుకోలేదు. అది న్యాయ స్థానాలు తేలుస్తాయి. కాకపోతే ఈ చర్య మొరటు రాజకీయాలకు ప్రతిబింబంగా వుందనేది వాస్తవం. ఇప్పటికైనా జగన్ మోహన రెడ్డి హుందాగా ప్రవర్తించటం అలవాటుచేసుకోవాలి. ఎందుకంటే ఆయన మాట్లేడేది, చేసేది ప్రతిదీ ఆరుకోట్ల ఆంధ్రుల తరఫున అని మరిచిపోవద్దు. ఆంధ్రుల గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా తన ప్రవర్తన వుండాలి. అంతేగానీ నేనింతే మారను అంటే దానివలన మొత్తం ఆంధ్రుల పరువు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయని గుర్తుంచుకోవాలి. ఇకనైనా మొరటు రాజకీయాలకు స్వస్తి పలకాలి.

చంద్రబాబు రెచ్చగొట్టే రాజకీయాలు      

ఒకవైపు అధికారపార్టీ నాయకుడు మొరటుగా ప్రవర్తిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నాడు. ఇదికూడా రాష్ట్ర ప్రజల క్షేమానికి మంచిదికాదు. చంద్రబాబు రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. ముఖ్యమంత్రిగా , ప్రతిపక్షనేతగా అపార అనుభవం వున్న వ్యక్తి. ఎప్పుడు రాజకీయాలు చేయాలో, ఎప్పుడు ప్రభుత్వానికి మద్దత్తివ్వాలో తెలియనంత అమాయకుడేమీ కాదు. ఇప్పుడు ఎదుర్కుంటున్నది ఓ మహత్తర విపత్కర పరిస్థితి. ఈ విపత్తు నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియని స్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు ఇది సమయం కాదు. ఏదో ఒక మిషమీద ప్రజల్ని రెచ్చగొట్టటం ఆపాలి. నిర్ద్వందంగా ప్రభుత్వానికి మద్దత్తు ప్రకటించాలి. ఈ విపత్కర పరిస్థితులనుంచి బయటపడిన తర్వాత రాజకీయాలు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం తప్పుచేసినా వాటిని ఎత్తి చూపే సమయం కాదు. నిర్మాణాత్మక సూచనలు మాత్రమే చేయాలి. లేకపోతే మౌనంగా ఉండటమే ఉత్తమం. తప్పులు ఎత్తిచూపటానికి, ప్రజల మధ్య పెట్టటానికి ఆ తర్వాత తగినంత సమయముంది. ఇప్పుడుకావాల్సింది అందరూ ఒక్కటిగా వుండి ఈ సమస్యనుంచి ప్రజల్ని బయట పడేయటం. అప్పటిదాకా రాజకీయాలు ఆపి ప్రభుత్వ నిర్ణయాలకు మద్దత్తివ్వాలి. ఈ మహమ్మారి పై యుద్ధం లో  విభేదాలకు తావులేదు. అలా చేస్తే చంద్రబాబుని అందరూ అభినందిస్తారు.

మీడియా భాద్యతాయుతంగా వ్యవహరించాలి 

జాతీయ చానళ్ళు చూస్తే కరోనా మహమ్మారి పై వార్తలు, ప్రజలకు సలహాలు మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. అదే తెలుగు చానళ్ళు (ఏవో కొన్ని తప్పించి) చూస్తే మతి పోతుంది. జగన్ మోహన్ రెడ్డి , చంద్రబాబు మాటల యుద్ధం, దానికి మద్దత్తుగా రెండువైపులా అనుయాయుల కాకిగోల చూపిస్తూ ఈ సమయం లో రాజకీయ నాయకుల వికృత రాజకీయ చేష్టలకు తాన తందానా అంటూ బాధ్యతారాహిత్యంగా ప్రసారం చేస్తున్నాయి. చివరకు జనానికి విసుగు, చిరాకు కలిగిస్తున్నాయి. ఇదేనా సామాజిక బాధ్యత. కొన్ని చానళ్లయితే ఇదే అదనుగా తమ వుద్యోగస్తుల్ని, రిపోర్టర్లని తొలగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదేనా సామాజిక బాధ్యత. మీడియా అంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం. అటువంటిది ఇటువంటి సమయం లో ఎంత బాధ్యతగా వ్యవహరించాలి.  దేశం లో ఎక్కడా లేనివిధంగా చెత్త రాజకీయాలతో  ప్రసారాలను నింపటం కన్నా దారుణం ఇంకేముంటుంది? మీడియా పాత్ర ఇటువంటి తరుణంలో ఎలా ఉండాలో జాతీయ ప్రసారాలను చూసైనా బుద్ధితెచ్చుకోండి. ఇకనైనా కొద్దిరోజులు అధికార , ప్రతిపక్ష రాజకీయ వికృత చేష్టల్ని ప్రసారం చేయకుండా ఆపితేనే మీ బాధ్యత నెరవేర్చిన వారవుతారు.

ఏపీలో ఎప్పుడైనా స్థానిక ఎన్నికలు జరగొచ్చు!


కరోనా మహమ్మారితో సంబంధం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పుడైనా మధ్యలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల పక్రియను చేపట్టే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా గత శనివారం నాటకీయంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కనకరాజ్ నేడు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం హడావుడిగా ఆర్డినెన్సు ద్వారా ఎన్నికలను కరోనా కారణంగా వారల పాటు వాయిదా వేసిన ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ పదవీకాలాన్ని కుదించి, ఆ స్థానంలో రహస్య జీవోతో కనగరాజ్ ను ఎన్నికల కమీషనర్ గా నియమించడం చెలిసిందే.

తొలిసారి కమీషన్ లోని అధికారులతో నేడు సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కరోనా ప్రభావం కారణంగా అసాధారణ పరిస్థితి నెలకొందని చెబుతో సమాయనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొంటూ ఈ ఉపద్రవంతో సంబంధం లేకుండా ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లు సంకేతం ఇచ్చారు.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందని చెబుతూ చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరువ కావాలని, అందుకోసం స్థానిక సంస్థల ఏర్పాటు ఇందులో చాలా కీలకమని కనగరాజ్ పేర్కొన్నారు. తద్వారా ఎన్నికలను మరింకా వాయిదా వేయడం తగదని సహితం కూడా పరోక్షంగా సందేశం ఇచ్చారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వం సమాయత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అతికీలకమని కూడా కనగరాజ్ పేర్కొన్నారు.

‘ఎస్.ఈ.సీ’ అంశంపై ప్రభుత్వానికి ఎదురు దెబ్బ!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ విషయంలో పదవీ కాలం కుదిస్తూ, నియామక నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్​ వివాదాస్పదమయ్యింది. సెలవు రోజుల్లో హడావిడిగా రమేశ్​ కుమార్​ను ఆ స్థానం నుంచి తొలగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్​గా మద్రాస్​ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ కనగరాజ్​ బాధ్యతలు చేపట్టారు. ఇదంతా కేవలం కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి. జగన్ ప్రభుత్వం చేసిన ఈ అంశంపై హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో రమేష్ కుమార్ స్వయంగా ఒక పిటీషన్, టీడీసీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నరసరావుపేట కు చెందిన మరో వ్యక్తి పిటీషన్ లు దాఖలు చేశారు. పిటిషన్లపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం విచారణ జరిపింది. ఈ నెల 16 నాటికి ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

అయితే ఈ సందర్భంలో, కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు పై వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ తరుపు అడ్వొకేట్ జనరల్, తమకు ఈ కేసు పై వాదనలు జరపటానికి, చాలా కాలం కావలి అని, కనీసం నెల రోజులు సమయం తమకు ఇవ్వాలని, ధర్మాసనాన్ని కోరారు. అయితే, కోర్ట్ మాత్రం, ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జనరల్ అభ్యర్ధనను సమర్ధించలేదు. నెల రోజుల సమయం ఇవ్వటం కుదరదు అని కోర్ట్ చెప్పింది. కేవలం మూడు రోజులే సమయం ఇస్తామని, ఏప్రిల్ 16 లోపు, కౌంటర్ దాఖలు చెయ్యాలని, అడ్వకేట్ జనరల్ ను కోరింది.

అలాగే, పిటీషన్ దాఖలు చేసిన అందరూ, 17లోపు అభ్యర్ధనలు ఉంటే తెలపాలి అంటూ కోర్ట్ తెలిపింది. కౌంటర్లు, అభ్యర్ధనలు చూసిన తరువాత, వచ్చే సోమవారం అంటే, ఏప్రిల్ 20న ఈ విషయం పై వాదనలు వింటామని హైకోర్ట్ తెలిపింది. అయితే ఇదే సందర్భంలో, ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, ఇది కేవలం సర్వీస్ మేటర్ మాత్రమే అని, ఈ విషయంలో మిగిలిన వారు పిటీషన్లు దాఖలు చేయటం కరెక్ట్ కాదని వీరి పిటీషన్లు కొట్టేయాలని కోరారు. పిటీషనర్ల తరుపున హాజరైన జంధ్యాల రవి శంకర్ వాదిస్తూ ఇది కేవలం సర్వీస్ మేటర్ మాత్రమే కాదని, ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఉందని తెలిపారు. అందుకే మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశామని చెప్పారు. అయితే తమకు వీరు వేసిన పిటీషన్లు తమ దగ్గర లేవని, అడ్వకేట్ జనరల్ చెప్పటంతో, ఆ పిటీషన్లు అన్నీ అడ్వకేట్ జనరల్ కు కూడా ఇవ్వాలని, కోర్ట్ తెలిపింది. మొత్తానికి, ఈ కేసును నెల రోజులు పాటు సాగదియ్యటానికి ట్రై చేసిన ప్రభుత్వానికి, కోర్ట్ దగ్గర ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి.

ఈ సంవత్సరం రంజాన్ ఇళ్లలోనే


ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ సంవత్సరం ప్రార్ధనలు ఇళ్ల వద్ద నుండే చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రార్ధన స్థలాలలో గుమికూడదన్ని నిషేధించడంతో పాటు సామూహికంగా కలవడాన్ని కూడా అనుమతులు లేకపోవడంతో రంజాన్ పండుగను కూడా ఇంటి నుండి జరుపుకోవలసిందే.

రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రజలు లాక్‌డౌన్ ఆదేశాలను, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి విజ్ఞప్తి చేశారు. ప్రార్థనలు, మత పరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియాలో స్టేట్ వక్ఫ్ బోర్డుల నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌ చైర్మన్‌గా కూడా నఖ్వి ఉన్నారు.

‘ఏడు లక్షలకు పైగా రిజిస్టర్ అయిన మసీదులు, ఈద్గాలు, ఇమాంబాద్, దర్గాలు, ఇతర మత సంస్థలు స్టేట్ వక్ఫ్ బోర్డుల కిందకు వస్తాయి’ అని నఖ్వి తెలిపారు. కోవిడ్-19 సంక్షోభ నేపథ్యంలో రంజాన్ మాసం వస్తున్నందున లాక్‌డౌన్ నిబంధనలు, సామాజిక దూరం పాటించేలా చూడాలని వివిధ మత నేతలు, అధికారులు, స్టేట్ వక్ఫ్ బోర్డుల ఆఫీసు బేరర్లను ఇప్పటికే కోరానని చెప్పారు.

ఇళ్లలోనే ఉండి రంజాన్ వేడుకలు జరుపుకునేలా చూస్తామని మత పెద్దలంతా తనకు హామీ ఇచ్చారని చెప్పారు. లాక్‌డౌన్‌కు కట్టుదిట్టంగా, సమర్థవంతంగా అమలు చేసే విషయంలో స్థానిక యంత్రాగానికి మత, సామాజిక సంస్థలు, వ్యక్తులు సహకరించాలని మంత్రి కోరారు.

కోవిడ్-19ని దృష్టిలో పెట్టుకుని అన్ని దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు, మతపరమైన సంస్థల్లో కార్యక్రమాలు రద్దయిన విషయాన్ని నఖ్వి మరోసారి గుర్తు చేశారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందువల్ల అందరికీ హాని జరుగుతుందని, కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు అధికార యంత్రాగం ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను విధిగా పాటించాలని కేంద్ర మంత్రి కోరారు

వైయస్సార్‌ టెలిమెడిసన్‌ ప్రారంభం


కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో భాంగా డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసిన్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. టెలిమెడిసన్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి డాక్టర్‌తో సీఎం జగన్‌ మాట్లాడారు. ఈ విధానాన్ని పటిష్టంగా, బలోపేతంగా నడపాలని అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యనూ పెంచాలని సూచించారు. డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌’ ఎలా పనిచేస్తుందంటే….

రాష్ట్రంలో డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌ అమలు కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబరు: 14410 కేటాయింపు.
– ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు, ఈనెల 11వ తేదీ నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్‌ పేర్లు నమోదు చేసుకున్నారు.

– డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు అందిస్తారు.

టెలి మెడిసిన్‌ ఉద్దేశం:
– కోవిడ్‌–19 కేసులను గుర్తించడం, ఐసొలేట్‌ చేయడం, పరీక్షించడం, క్వారంటైన్‌కు పంపించడం.
– ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు.
– డాక్టర్లకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది. టెక్నికల్‌ అసిస్టెన్స్‌ టెక్నాలజీ టీం నుంచి లభిస్తుంది.

మూడంచెలుగా ‘డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌:

స్టెప్‌–1:
– 14410 టోల్‌ ఫ్రీ నెంబరుకు రోగులు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు. అక్కడి సిస్టమ్‌ ఆ మొబైల్‌ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది.
– ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్‌∙రోగికి కాల్‌ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు.
– రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు.

స్టెప్‌–2:
– రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్‌ వ్యవస్థకు కనెక్ట్‌ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి.
– ఆ సమయంలో డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు ఆ కాల్‌ను స్వీకరించి, కాల్‌చేసి ఓపీ సేవలు అందిస్తారు.
– ఆ రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు.
– వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్‌–19 అనుమానిత రోగులను గుర్తిస్తారు.
– ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి.
– అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్‌కూడా ఉంటుంది.
– అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి, ఎక్కడకు పంపించాలన్నదానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆమేరకు వారిని తరలిస్తారు.

స్టెప్‌–3:
– కోవిడ్‌–19 అనుమానిత కేసుల జాబితాల రూపకల్పన.
– ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్, ఐసొలేషన్‌తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాలు.
– ఈ జాబితాలను జిల్లా అధాకారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు.

వైద్యాధికారి–పీహెచ్‌సీ:

– ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపిస్తారు.
– ప్రతి ఒక్క రోగికి అవసరమైన ఔషథాలను ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, గ్రామ వార్డు వలంటీర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు.
– నాన్‌ కోవిడ్‌ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది.

మహారాష్ట్రలో ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ రాజకీయం


మొత్తం దేశం అంతా కరోనా కట్టడికోసం తలమునకలై ఉండగా, మహారాష్ట్రాలో లాక్ డౌన్ నిబంధనలను గాలికి వదిలేసి వివాదాస్పదమైన ఒక పెద్ద పారిశ్రామిక వేత్తను విహారయాత్రకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఇచ్చిన పాస్ తో వెళ్లడం పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ విషయమై అదనపు డిజిపి హోదాలో ఉన్న అధికారి అమితాబ్ గుప్తా సస్పెన్షన్ కు గురికావడం తెలిసిందే.

నగర పోలీస్ కమీషనర్ ఇవ్వవలసిన అనుమతి పాస్ ను హోమ్ శాఖల ప్రిన్సిపాల్ కార్యదర్శిగా ఉన్న అధికారి ఏ విధంగా ఇచ్చారనే ప్రశంలు ముందు తలెత్తాయి. హోమ్ మంత్రి కూడా ఈ విషయం తనకు తెలియదని అనడంతో ప్రభుత్వంలో ప్రముఖులు ఎవ్వరో చెప్పనదే ఆ అధికారి ఆ విధంగా పాస్ ఇచ్చి ఉండరని ప్రతిపక్షం బిజెపి నేతలు విమర్శలు గుప్పించారు.

దేశమంతా లాక్‌డౌన్ ఉండగా డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధవాన్స్ లు 200 కిమీ కు పైగా స్వేచ్చగా ప్రయాణించేందుకు పాస్ జరీ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. కాగా, ఇప్పుడు వారికి సహకరించింది బిజెపి నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ని శివసేన ఇప్పుడు ఎదురు దాడి చేయడంతో రాజకీయ వివాదం ఒక దుమారంగా మారింది.

డీహెచ్‌ఎఫ్‌ఎల్ సంస్థలో అక్రమ లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొంటున్న వాధవాన్ సోదరులు దర్యాప్తు అధికారులు అరెస్టు చేస్తారేమోనన్న భయంతో ముంబై నుంచి ఖంబాలా పారిపోయారు. వారితోపాటు 21 మంది కుటుంబసభ్యులు, పనివాళ్లు కూడా కంభాలా వెళ్లేందుకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి అమితాబ్‌గుప్త అనుమతి పత్రం జారీచేశారు.

దీనిపై ప్రతిపక్షాల విమర్శలను శివసేన అధికార పత్రిక సామ్నా సోమవారం తిప్పికొట్టింది. అమితాబ్ గుప్తను ఆ పదివిలో నియమించినది గత ముఖ్యమంత్రేనని, దాంతోనే వాధవాన్ సోదరుల వెనుక ఎవరున్నారో తెలుస్తున్నని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై విమర్శలు గుప్పించింది. వాధవాన్స్‌కు ప్రయాణ అనుమతి ఇవ్వటం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించింది

దేశం మొత్తం మీద అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు 2,000 కు పైగా మహారాష్ట్రాలో ఉన్న సమయంలో రాజకీయ దుమారంలో రాజకీయ నేతలు చిక్కుకోవడం గమనార్హం.

ఢిల్లీలో రెండోసారి భూకంపం.. భయాందోళనలో ప్రజలు


దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.7గా నమోదైంది. దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుండగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. గత రెండ్రోరోజుల వ్యవధిలో రెండుసార్లు భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లలోని వెళ్లాలంటేనే జంకుతున్నారు. సోమవారం వచ్చిన భూకంపంతో పలువురి ఇళ్లలోని సామాన్లు కిందపడిపోయాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఆదివారం కూడా భూకంపం వచ్చింది. 3నుంచి 4సెకన్లపాటు భూప్రకంనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లో 3నుంచి 4సెకన్లపాటు భూకంపం వచ్చిన సంగతి తెల్సిందే. ఆదివారం వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైందని ఢిల్లీలోని భూకంప కేంద్రం ప్రకటించింది. కాగా ఢిల్లీలో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశముందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. ఓ వైపు కరోనా మహమ్మరి, మరోవైపు వరుస భూకంపాలు వస్తుండటంతో ప్రజలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిన్నటి కంటే ఈ రోజు భూకంపం తీవ్రత తక్కువగా నమోదైంది.

సల్మాన్ ఖాన్ ముద్దు సీన్.. వైరల్


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏం చేసినా అది చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. తాజాగా సల్మాన్ ఖాన్ తన పాత సినిమాలోని ఓ ముద్దుసీన్ ట్వీటర్లో పోస్టు చేశాడు. దీనిని చూసిన నెటిజన్లంతా సల్మాన్ ఖాన్ హ్యూమరస్ కు ఫిదా అవుతున్నారు. సల్మాన్ ఖాన్ మూములూగానే చాలా హ్యుమరస్ గా ఉంటాడు. కొన్ని విషయాల్లో అన్ని విషయాలను చాలా లైట్ తీసుకుంటాడు సల్మాన్. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న సల్మాన్ కరోనా టైంలో ముద్దుసీన్ తీస్తే ఎలా ఉంటుందో ఎలా అభిమానులకు షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

1989సంవత్సరంలో సల్మాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన ‘మైనే ప్యార్ కియా’ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ టాలీవుడ్లో ‘ప్రేమ పావురాలు’ పేరుతో రిలీజై మంచి విజయం దక్కించుకుంది. ఈ మూవీలోని ఓ సీన్ ను ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితులకు అనుగుణంగా మరో సినిమాలోని సీన్‌తో సల్మాన్ సరిపోల్చడం విశేషం. ‘ఈ సీన్లో అద్దంపై హీరోయిన్ కిస్ పెట్టిన‌ పెదాల ముద్ర ఉంటుంది.. అప్పటి చిత్రంలో హీరోగా నటించిన సల్మాన్ ఖాన్ ఆ ప్లేస్‌లో హీరోయిన్‌ను తలుచుకుంటూ ఆ ముద్ర‌పై ముద్దు పెడతాడు. ఇదే సీన్ ప్రస్తుతం చేయాల్సి వస్తే.. హీరో ఏం చేస్తాడు.. అన్నది ఈ వీడియో చూపించాడు సల్మాన్. హీరో ఆ అద్దంలోని హీరోయిన్ పెదాల ముద్రను చూసి సానిటైజ్ చేసి అందరూ అవాక్కయ్యేలా చేస్తాడు.

కరోనా టైంలో ‘మైనే ప్యార్ కియా’ మూవీ తీస్తే ఇలా ఉంటుందని సల్మాన్ క్వాప్షన్ కూడా పెట్టారు. అలాగే ‘హ్యాపీ ఈస్టర్’ అంటూ శుభాకాంక్ష‌లు తెలిపాడు. స్టే ఫోకస్సడ్ స్టే హోమ్ అని మెసేజ్ ఇచ్చాడు స‌ల్లూ భాయ్. కాగా ‘మైనే ప్యాయ్ కియా’ మూవీ సల్మాన్ కెరీర్లో ఓ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలోని పాటలన్నీ నేటికి ఆల్ టైం హిట్స్ లో చోటు దక్కించుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.

https://www.instagram.com/tv/B-4BIKDF-Lp/

 

కరోనా కట్టడికి ఇవి మాత్రమే సరిపోవు!


కరోనా వైరస్ ‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం సరైన మందు లేకపోవటంతో వైరస్ ‌ను నియంత్రించేందుకు లాక్‌ డౌన్లు విధించారని అయితే ఇవి మాత్రమే సరిపోవని, ఇతర ఆరోగ్యపరమైన చర్యలు కూడా చాలా కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్ర్తవేత్త సౌమ్యస్వామినాథన్‌ తెలిపారు. కరోనా వైరస్ ‌ను ఎదుర్కొనేందుకు చేస్తున్న పోరాటం దీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయ పడ్డారు. గత 30 ఏండ్లుగా హెచ్‌ఐవీ, ట్యూబర్‌ కు లోసిస్‌ వ్యాధులపై ఆమె పరిశోధన చేస్తున్నారు. ఈ వైరస్ ‌లను అదుపుచేయాలంటే వాటి జెనటిక్‌ సీక్వెన్స్ ‌ను అధ్యయనం చేయటం చాలా కీలకమని ఆమె అన్నారు. భారత ఆరోగ్యశాఖలో కీలకమైన ఐసీఎంఆర్‌ కు 2015 నుంచి 2017వరకు ఆమె కార్యదర్శిగా కూడా పనిచేశారు.

ఇప్పటివరకు కరోనా కట్టడికి వ్యాక్సిన్ లేదు. టీబీ, మలేరియా వ్యాధులకు ఇచ్చే మందులనే కరోనా రోగులకు కూడా వాడుతున్నారు. ఈ మందులు కరోనాను తగ్గించటంలో కొంతలోకొంత ఉపయోగపడుతున్నాయని వైద్యులు, పరిశోధకులు నమ్ముతున్నారు. అయితే టీబీకి వాడే బీసీజీ కరోనా వ్యాధిని నయంచేసినట్లు ఇప్పటివరకు శాస్త్రీయమైన ఆధారాలేవీ లభించలేదని భారత సంతతి పరిశోధకుడు మధుకర్ పై అన్నారు. కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీలో మెక్‌గిల్ గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు ఈయన డైరెక్టర్ ‌గా ఉన్నారు. అంటువ్యాధులపై పరిశోధన చేస్తున్నారు.

బీసీజీ మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచుతుందనటంలో సందేహం లేదని, కానీ కోవిడ్ నియంత్రణలో ఎంతమేర విజయవంతం అవుతుందనేదానిపై ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదని ఆయన వెల్లడించారు. అయితే తక్కువ ధరలో దొరికే బీసీజీని కోవిడ్-19 నియంత్రణకోసం దీనిని వాడటం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. దీనిపై అమెరికా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాల్లో ట్రయల్స్ కూడా మొదలయ్యాయని, ప్రస్తుత సంక్షోభాన్ని దీనితో ఏమేరకు అధిగమిస్తామన్నది చెప్పలేమని అభిప్రాయపడ్డారు.

క్లైమాక్స్ లో ఆకాష్ పూరి అలా రెచ్చిపోతాడట!


దర్శకుడు పూరి జగన్మాథ్ తనయుడు ఆకాష్ పూరి నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీని మే 29న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ఈ మూవీలో ఆకాశ్ పూరికి జోడిగా కొత్తభామ కేతికాశర్మ నటిస్తుంది. ఈ మూవీ పూరి దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్’ తరహాలో ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీకి కథను పూరినే సమకూర్చాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కొత్త దర్శకుడు అనిల్ పాదూరి ‘రొమాంటిక్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. పూరి జగన్నాథ్ బాన్యర్లో సమర్పిస్తున్న ఈ మూవీకి ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ మూవీకి సంబంధించి ఫస్టు లుక్కు, సాంగ్స్ ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఫస్టు లుక్కుతోనే ఈ సినిమాలో రోమాన్స్ ఏమేరకు ఉంటుందో దర్శకుడు చూపించాడు. ఫుట్ బోర్డుపై హీరోయిన్ ను గాఢంగా లిక్ లాక్ చేసే సన్నివేశాన్ని ఫస్టు లుక్కులోనే చూపించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు అనిల్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది.

ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే గాఢమైన ప్రేమతో కూడుకున్న సీరియస్ లవ్ స్టోరీ గా ‘రొమాంటిక్’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో రోమాన్స్ ఎక్కువ అవకాశం ఉండటంతో దర్శకుడు వీలైనంతగా రోమాన్స్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నాటం. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అదిరిపోయేలా దర్శకుడు ప్లాన్ చేసినట్లు సమాచారం. క్లైమాక్స్ లో హీరోహీరోయిన్ల మధ్య గాఢమైన లిప్ లాక్ ఉంటుందట. ‘రొమాంటిక్’ సినిమాకు ఎండ్ కార్డ్ లాప్ లాక్ తోనే పడనుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గుముఖం పడితే తప్ప ఈ మూవీని అనుకున్న టైంకి రావడం కష్టమనే చెప్పాలి. చూడాలి మరీ ఏం జరుగుతోందో..!

నా న‌డిచే దైవం చిరంజీవి: రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి


గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి అనే ఆమెకు స్టార్ హాస్పిట‌ల్ లో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఎంత‌గానో స‌హ‌కారం అందించారు. కాగా సోమ‌వారం రాజనాల నాగలక్ష్మి గారిని స్టార్ హాస్ప‌టిట‌ల్స్ వారు ఆమెను ఐసీయూ నుంచి ప్ర‌త్యేక గ‌దికి త‌ర‌లించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్లు ఆమె ఆరోగ్యం బాగుంద‌ని తెలిపారు. అలాగే రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పృహలోకి రాగానే చిరంజీవి శ్రీమతి సురేఖ స్వయంగా నాగలక్ష్మి వీడియో కాల్ ద్వారా ఆమె ఆరోగ్య యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి దంప‌తులు ఆరోగ్యంగా ఉన్నార‌ని..ఏం కాద‌ని మీకు మేము ఉన్నామంటూ ధైర్యం చెప్పారు. అనంత‌రం నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ, ` ఇది క‌లా..నిజ‌మా? నా న‌డిచే దైవం శ్రీ చిరంజీవి గారు స్వ‌యంగా నాతో మాట్లాడ‌ట‌మా? దీన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమ‌తి సురేఖ గారు కూడా కుంటుంబ స‌భ్యురాలిగా నాతో ఎంతో ప్ర‌మ‌తో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ జ‌న్మ‌కి ఇది చాలు. ముక్కోటి దేవ‌త‌లు చిరంజీవి గారిని..వారి కుటుంబాన్ని చ‌ల్ల‌గా చూడాల‌ని, మ‌న‌స్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాని ఉద్వేగంతో, ఆనంద బాష్పాల‌తో మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌కి బ‌ధులిచ్చారు.

నో అమెరికా అంటున్న అవసరాల


కరోనా ఎఫెక్ట్ సినిమా షూటింగ్ ల మీద బాగా పడింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర లేదు. తాజాగా యంగ్ హీరో నాగశౌర్య కొత్త చిత్రం ఒకటి సగం షూటింగ్ పూర్తి చేసుకొని సడెన్ గా ఆగిపోయింది. పీపుల్ మీడియా బ్యానర్లో నాగశౌర్య కథానాయకుడిగా అవసరాల శ్రీనివాస్ కొంతకాలం క్రితం ఒక సినిమాను మొదలుపెట్టాడు. ఈ చిత్ర కథ డిమాండ్ మేరకు కొంత భాగం ఇండియాలోను కొంత భాగం అమెరికాలోను షూటింగ్ చేయాల్సి ఉంటుందట ..ఆ క్రమంలో ఇండియాకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. మిగతా సన్నివేశాల్ని అమెరికాలో చిత్రీకరిద్దామని అనుకుంటూ ఉండగానే కరోనా అడ్డువచ్చింది. దాంతో అమెరికా షూటింగు సందిగ్ధం లో పడింది .

ఇక చేసేది లేక నిర్మాతలు కథలో అమెరికా ప్రస్తావన లేకుండా చేసి, మిగతా భాగాన్ని కూడా ఇండియా లోనే పూర్తి చేసేలా చూడమని అవసరాల శ్రీనివాస్ తో చెప్పారట. సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయమనీ, లేదంటే తాము పెద్ద మొత్తంలో నష్టపోవలసి వస్తుందని అన్నట్టుగా తెలుస్తోంది … అవసరాల శ్రీనివాస్ దర్శకుడే గాక మంచి రచయిత కూడా అవడం తో ఆయనకు కథపై మంచి పట్టుంది. అందువలన ఆయన కథను మార్చుకుని, అమెరికా వెళ్లకుండా ఇక్కడే షూటింగ్ ఫినిష్ చేసేలా ఏర్పాట్లు చేసు కొంటున్నాడు . .

ఆ విషయంలో నెంబర్ వన్ గా భారత్!


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి ప్రజలను బెంబేలెత్తిస్తుంది. దీంతో ఆయా దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. భారత్ లోనూ కరోనా ఎంట్రీతో 21రోజుల లాక్డౌన్ అమలు చేస్తున్నారు. రేపటితో ఈ లాక్డౌన్ గడువు ముగియనుండగా కేంద్రం మరో రెండువారాలు పొడగించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. లాక్డౌన్ ఇంటికి పరిమితమైన ప్రజలు సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది కాలక్షేపం కోసం పోర్న్ వీడియోలను చూస్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.

ప్రముఖ పోర్న్ వెబ్ సైట్ ‘పోర్న్ హబ్’ తాజాగా విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ వీక్షించే వారిసంఖ్య పెరిగినట్లు ప్రకటించింది. లాక్డౌన్ వేళ ప్రజలు ఇళ్లకే పరిమితం అవడం, సోషల్ డిస్టెన్స్ వంటివి పాటించడం వల్ల ఎక్కువ మంది పోర్న్ సైట్ చూసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పోర్న్ ఎక్కువగా చూస్తున్న దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉన్నట్లు ‘పోర్న్ హబ్’ ప్రకటించడం గమనార్హం.

భారత్ లో లాక్డౌన్ తర్వాత ఏకంగా 60శాతం వ్యూయర్స్ పెరిగినట్లు ప్రకటించింది. ప్రజలు అందరూ ఖాళీగా ఇంట్లోనే ఉండటం వల్లనే ఈ వీడియోలు చూస్తూ ఆనందిస్తున్నారని ఈ నివేదికలో ప్రకటించడం విశేషం. అదేవిధంగా కండోమ్స్ కు కూడా దేశంలో బాగా గిరికి పెరిగిందని వెల్లడించింది. ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఓవైపు శాయశక్తులా కృషి చేస్తుంటే మరోవైపు అధికశాతం ప్రజలు తమ శక్తినంతా ‘పోర్న్’ సైట్లకు ధారబోయడం విచిత్రంగా మారింది.

క్లోరోక్విన్ టాబ్లెట్లు వల్ల ఇంత ప్రమాదమా!

కరోనా వైరస్ ‌కు ఇప్పటివరకు వాక్సిన్‌ లేదు. కొన్ని పరిశోధనల తర్వాత కరోనా సోకిన వ్యక్తికి చికిత్సలో భాగంగా ఇస్తున్న మలేరియా మందు (హైడ్రాక్సీ క్లోరోక్విన్)‌ టాబ్లెట్‌ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దింతో అత్యవసర పరిస్థితుల్లో అవసరం లేకున్నా పలువురు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను వాడటాన్ని డాక్టర్లు తప్పుపడుతున్నారు. వైద్యుడు సిఫార్సు చేయకుండా నేరుగా మలేరియా మందు (హైడ్రాక్సీ క్లోరోక్విన్‌) టాబ్లెట్లను వాడితే గుండె రిథమ్, పంపింగ్‌ లో తేడా వచ్చి, ఆకస్మిక గుండెపోటుకు దారితీసే ప్రమాదం లేకపోలేదు’ అని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) కార్డియో థొరాసిక్‌ సర్జన్, ప్రొఫెసర్‌ ఆర్వీకుమార్‌ స్పష్టం చేశారు. ఈ అత్యవసర పరిస్థితుల్లో అవసరం లేకున్నా పలువురు క్లోరోక్విన్‌ కొనుగోలు చేస్తూ పరోక్షంగా కృత్రిమ కొరతకు కారణమవుతున్నారని ఆయన తెలిపారు.

వైద్యుల సిఫార్సు లేకుండా క్లోరోక్విన్‌ వాడితే గుండె రిథమ్‌ సహా పంపింగ్‌ లోనూ తేడా వస్తుంది. కంటి రెటీనా దెబ్బతింటుంది. కరోనా పాజిటివ్‌ బాధితులకు కూడా ఈసీజీతీసి, వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతుంటారు. హైరిస్క్‌ జోన్‌ లో ఉన్న వారు కాకుండా ఇతరులు కూడా ఈ మందులు ఇష్టానుసారం వాడుతున్నారు. ఇలా వాడటం వల్ల గుండె లయ తప్పుతుంది. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణలో తేడాలు ఏర్పడతాయి. ఫలితంగా హార్ట్‌ఎటాక్‌ వచ్చే ప్రమాదం లేకపోలేదు.

నిజానికి పాజిటివ్‌ బాధితులకు అజిత్రోమైసిన్‌ కాంబినేషన్ ‌లో ఈ మందులు వాడుతున్నారు. వారి నుంచి వారికి సన్నిహితంగా మెలిగిన వారికి కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉంది కాబట్టి, ఇదే మందును వారి కుటుంబసభ్యులు, ఇతర సన్నిహితులకు కూడా సిఫార్సు చేస్తున్నారు. అంతేకాదు వైద్య సేవలందించే వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పారమెడికల్‌ స్టాఫ్‌ సహా కేసులను ట్రేస్‌ చేసేందుకు వెళ్లే సర్వేలెన్స్‌ ఆఫీసర్లకు, శానిటైజ్‌ చేసే పారిశుద్ధ్య కార్మికులకు వైరస్‌ సోకవచ్చు. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఈ హైరిస్క్‌ కేటగిరిలో పనిచేసే వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సిఫార్సు చేస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలోనే దీనిని వాడాలి. కానీ కొంతమంది ఎలాంటి కాంటాక్ట్‌ హిస్టరీ లేకపోయినా ముందస్తుగా ఈ టాబ్లెట్లను కొని వాడుతున్నారు. రోగుల బలహీన%