
ఆర్ ఆర్ ఆర్ అలియాస్ రౌద్రం రణం రుధిరం చిత్రం ఎపుడు పూర్తి అవుతుందో ఇంకా తేలక పోయినా తారక రాముడు మాత్రం తన తదుపరి చిత్రానికి సంబందించిన తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి బిజీ గా ఉన్నాడు. అల వైకుంఠపురంలో, అరవింద సమేత వంటి చిత్ర మకుటాల మాదిరిగానే మాటల మాంత్రికుడి కొత్త చిత్రానికి `అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ పేరు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయడం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రస్తావించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాస్తున్నాడట.
అది పక్కా రాజకీయ చిత్రంగా ఉండబోతోంది. దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటుందట. రాజకీయాలకి ఓ కొత్త ఒరవడిని ఆపాదించేలా ఎన్టీఆర్ పాత్రను రాస్తున్నాడట త్రివిక్రమ్.శ్రీనివాస్. ఇద్దరు హీరోయిన్స్ తో నిర్మించ బోతున్న ఈ చిత్రం లో అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ అనుకొంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన బుట్టబొమ్మ పూజా హెగ్డేను తీసుకోవాలనే అనుకొంటున్నారని తెలుస్తోంది.