Home Blog Page 31

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు శని దేవుడి ఆశీస్సులు.. అన్నీ విజయాలే..

Today 4 July 2026 Horoscope
Today 4 July 2026 Horoscope

Today 4 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విషయాల్లో కలిసి రానున్నాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అయితే కొన్ని ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. దూరపు బంధువులనుంచి సమాచారం అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈరోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని పనులు పూర్తి చేయడంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వస్తువులు కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందర పడొద్దు. అధికారుల నుంచి ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కొత్తగా ఉద్యోగం లోకి చేరిన వారికి అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వ్యాపారులకు లాభాలు ఉంటాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఇలాంటి సమయంలో అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉండే అవకాశం ఉంది. వీరికి కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కానీ కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయాల్లో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు తొందర పడొద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సలహాలను తీసుకోవాలి. ముఖ్యమైన రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు. భవిష్యత్తులో వచ్చే లాభం విషయంలో కొత్తగా పెట్టుబడులు పెడతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల సహకారం ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వసూలు అవుతుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారాలు ఈరోజు అధిక లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పాత స్నేహితుల నుంచి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈరోజు శని దేవుడి అండదండలు ఉంటాయి. దీంతో ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడి లేకుండా ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడును పెడతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో ఉత్సాహం చూపుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

బిర్యానీ అంటే ఇష్టమా.. ఇలా తింటే మీరు అసలు లావు కారు

Chicken-Biryani-Featured

Chicken Biryani : లెగ్ పీస్ ఊరిస్తూ ఉంటుంది. పక్కనే బ్రెస్ట్ పీస్ కవ్విస్తూ ఉంటుంది. పొగలు కక్కే బిర్యాని సిద్ధమా అంటూ సవాల్ చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎవరు మాత్రం ఊరుకుంటారు.. ఒక పట్టు పడతారు. అవసరమైతే రెండవ పట్టు కూడా పడతారు. ప్లేట్లకు ప్లేట్లు బిర్యానీ లాగించేస్తారు. ఆ తర్వాత లావు అయిపోతామని భయపడుతుంటారు.. కొందరైతే లావు అవుతామని భయపడి బిర్యానీ తినడాన్ని పక్కన పెడతారు.. బిర్యానీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ బలవంతంగా కడుపు మాడ్చు కొంటారు.

బిర్యానీ తినడం వల్ల లావు అవుతారని వైద్యులు కూడా చెబుతుంటారు. శరీరాన్ని ఒక ఆకృతిలో ఉంచుకోవాలి అనుకునేవారు బిర్యానీ తినడాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తుంటారు. డైట్ చేసేవాళ్లు బిర్యానీ తినకుండా ఉండాలని డైటీషియన్లు కూడా చెబుతుంటారు. ప్రస్తుతానికి బిర్యానీ హై క్యాలరీ ఫుడ్. పైగా అందులో చికెన్ లేదా మటన్ లేదా ఎగ్ లేదా రకరకాల కూరగాయలు ఉంటాయి. వీటిని నెయ్యి.. ఇతర దినుసులు ఉపయోగించి తయారు చేస్తారు. నెయ్యి ఉపయోగించి బిర్యానీ చేయడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి..

చికెన్ బిర్యాని ఒక సరైన విధానంలో తింటే పెద్దగా ఇబ్బంది ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల డాక్టర్ విక్రాంత్ సింగ్ అనే వ్యక్తి ఒక పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో భాగంగా ఆయన బిర్యాని గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. బిర్యానీలో ముందుగా చికెన్ ముక్కలను తినాలి. ఆ తర్వాత బిర్యానీ తినాలి. ఇలా ప్రోటీన్ ఫస్ట్ పద్ధతిని పాటిస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరిగే అవకాశం ఉండదట. దీనివల్ల శరీరం బరువు పెరగకుండా ఉంటుందట. రెస్టారెంట్లలో కంటే ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుని తినడం మంచిదట.. ఇటీవల విక్రాంత్ కొంతమంది మీద పరిశోధన చేశారు. వారు చికెన్ కంటే ముందు బిర్యానీ రైస్ తిన్నారు.. వారిలో షుగర్ లెవెల్స్ పెరగడాన్ని విక్రాంత్ పరిశీలించారు. బిర్యానీ రైస్ కంటే చికెన్ ముక్కలు ముందుగా తిన్న వాళ్ల షుగర్ లెవెల్స్ ను విక్రాంత్ పరిశీలించారు. వారిలో షుగర్ లెవెల్స్ తక్కువ ఉండడాన్ని ఆయన గమనించారు.

బిర్యానీ ఎక్కువగా తిన్న లావు కావొద్దు అంటే ఈ విధానాన్ని పాటించాలని విక్రాంత్ చెబుతున్నారు. ఒకవేళ మధుమేహం.. ఇతర వ్యాధులతో ఇబ్బంది పడేవారు వైద్యుల సూచనలకు అనుగుణంగా బిర్యానీ తినాల్సి ఉంటుందని ఆయన సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఇంట్లోనే బిర్యాని తినాలని.. బయట రెస్టారెంట్లలో తినకపోవడమే మంచిదని.. బయట తయారు చేసే బిర్యాని లలో కల్తీ ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని ఆయన చెబుతున్నారు.

పౌర్ణమికి పెరుగుతుంది.. అమావాస్యకు తగ్గుతుంది.. అమర్నాథ్ మంచు శివలింగం వెనక అంతు చిక్కని మిస్టరీ

Amarnath Shivling

Amarnath Shivling : మనదేశంలో స్వయంభు శైవ క్షేత్రాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ శివుడిని రకరకాల పేర్లతో భక్తులు పిలుస్తారు. ఇక్కడ ఏర్పడిన శివలింగాల వెనుక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. వీటి స్థల పురాణాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రతి స్థల పురాణానికి బలమైన నేపథ్యం ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి.. ఆయా క్షేత్రాలలో కైలాస వాసుడికి ఘనమైన పూజలు జరుగుతుంటాయి.

శైవ క్షేత్రాలలో శివుడు స్థిరమైన రూపంతో కలిగి ఉంటాడు. కానీ మనదేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని అమర్నాథ్ ప్రాంతంలో మాత్రం శివుడి రూపం కేవలం కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది. వర్షాకాలం సీజన్ పరమైన తర్వాత అమర్నాథ్ ప్రాంతంలో శివుడి లింగం ఏర్పడుతూ ఉంటుంది. అది కూడా అత్యంత సహజంగా ఉంటుంది.. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కైలాస క్షేత్రం ఉందని.. అక్కడ శివుడు ధ్యానముద్రలో ఉంటాడని.. ఆ క్షేత్రానికి వెళ్లడం సాధ్యం కాదని.. ఇప్పటికే అనేక పర్యాయాలు చాలామంది ప్రయత్నించినప్పటికీ కఠినమైన వాతావరణం వల్ల వెనక్కి తిరిగి వచ్చారని వార్తలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఇప్పటికీ మంచు రూపంలో శివలింగం ఏర్పడే విధానం ఒక మిస్టరీగానే ఉంటుంది. జమ్ము కాశ్మీర్లోని అమర్నాథ్ గుహ ప్రాంతంలో ఈ శివలింగం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడి అమర్నాథ్ గుహ సముద్రమట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏ గుహ పైకప్పు భాగం దృఢంగా ఉంటుంది. ఈ భాగంలో సున్నపురాయి.. జిప్సం వంటి శిలలు ఉంటాయి. హిమాలయ ప్రాంతాల్లో ప్రవహించే నదులు.. కొండల ప్రాంతంలో ఉన్న మంచు కరిగిపోతున్నప్పుడు.. ఆ నీరు మొత్తం బండరాళ్ల పగుళ్ల మీదుగా గుహలోకి వెళ్తూ ఉంటుంది. అధి కాస్త చుక్కలు చుక్కలుగా కారి.. శివుడి లింగం మాదిరిగా ఏర్పడుతూ ఉంటుంది.

అమర్నాథ్ గుహలో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా ఉంటాయి.. ఇవి మైనస్ డిగ్రీలలో ఉంటాయి. అక్కడ నీటి బిందువులు పడగానే.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల వెంటనే గడ్డ మాదిరిగా మారిపోతాయి.

ఇలా చుక్కలు చుక్కలుగా పడిన మంచు బిందువులు ఒకదానిపై ఒకటి వేరుకొని పోతూ ఉంటాయి. అలా పైకి లింగం మాదిరిగా ఎదుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజులపాటు జరుగుతూ ఉంటుంది. ఫలితంగా అది ఒక మంచు స్థంభం మాదిరిగా మారిపోతుంది. అది చూసేందుకు శివలింగంలాగా కనిపిస్తూ ఉంటుంది.

శివలింగం కాలాలకు అనుగుణంగా పెరుగుతుంది. అదే సమయంలో తగ్గిపోతూ ఉంటుంది. సరిగ్గా మే నెల నుంచి ఆగస్టు కాలం వరకు శివలింగం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. పౌర్ణమి రోజుకు మరింత పెద్దదిగా మారుతుంది. అమావాస్య సమయంలో ఆ పరిమాణం తగ్గుతూ ఉంటుంది. అయితే ఆ మంచు శివలింగం పక్కనే చిన్న చిన్న రూపాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటిని పార్వతి, వినాయకుడు, భైరవుడు అని భక్తులు భావిస్తూ ఉంటారు. ఆగస్టు నెల తర్వాత అమర్నాథ్ యాత్ర ముగిసిపోతుంది. అప్పటికి శివలింగం క్రమంగా మాయమవుతుంది. అయితే వేలాదిమంది భక్తులు ఒకేసారి గుహలోకి వచ్చినప్పుడు వారి శరీరాల నుంచి వేడి వస్తుంది. ఫలితంగా మంచు కరిగిపోతుంది.

మీ మొబైల్‌లో ఈ 5 యాప్స్ తప్పనిసరిగా ఉండాలి.. ఎందుకంటే..

Important Apps
Important Apps

Government Apps : ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారింది. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ సేవల వరకు, ప్రయాణాల నుంచి వ్యక్తిగత పత్రాల నిర్వహణ వరకు దాదాపు అన్నింటినీ మొబైల్ ద్వారానే పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కొన్ని అధికారిక యాప్స్ ప్రతి భారతీయుడి ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ యాప్స్ ద్వారా ప్రభుత్వ సేవలు సులభంగా పొందడమే కాకుండా సమయం, డబ్బు కూడా ఆదా అవుతుంది. వాటిలో ముఖ్యమైన ఐదు యాప్స్ గురించి తెలుసుకుందాం.

1. డిజీ లాకర్ (DigiLocker):
డిజీ లాకర్ అనేది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ ప్లాట్‌ఫాం. ఈ యాప్‌లో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ , విద్యా సర్టిఫికెట్లు వంటి కీలక పత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరచుకోవచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ డాక్యుమెంట్లను చూపించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ శాఖలు కూడా డిజీ లాకర్‌లోని డాక్యుమెంట్లను అధికారికంగా గుర్తిస్తాయి. దీంతో ఒరిజినల్ పత్రాలను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది.

2. ఉమంగ్ (UMANG):
UMANG (Unified Mobile Application for New-age Governance) అనేది ఒకే యాప్‌లో వందలాది ప్రభుత్వ సేవలను అందించే సూపర్ యాప్. ఇందులో EPFO, PAN సేవలు, పాస్‌పోర్ట్, గ్యాస్ బుకింగ్, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, పెన్షన్, ఆరోగ్య సేవలు, వ్యవసాయ సేవలు, స్కాలర్‌షిప్‌లు వంటి అనేక ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయి. కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వ సేవలను కూడా ఈ యాప్ ద్వారానే పొందవచ్చు.

3. ఎం పరివాహన్ (mParivahan):
వాహనదారులకు అత్యంత ఉపయోగకరమైన యాప్ mParivahan. ఈ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ (DL), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC)లను డిజిటల్ రూపంలో చూపించవచ్చు. ట్రాఫిక్ తనిఖీల సమయంలో ఫిజికల్ కాపీలు లేకపోయినా ఈ యాప్‌లోని డిజిటల్ డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయి. అంతేకాకుండా వాహన వివరాలు, యజమాని సమాచారం, చలాన్లు, డ్రైవింగ్ లైసెన్స్ సేవలు వంటి అనేక సదుపాయాలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.

4. ఆధార్ (mAadhaar):
UIDAI రూపొందించిన mAadhaar యాప్ ద్వారా ఆధార్ కార్డును డిజిటల్ రూపంలో నిర్వహించవచ్చు. ఇందులో ఆధార్ వివరాలు చూడడం, QR కోడ్ ద్వారా గుర్తింపు ధృవీకరణ చేయడం, చిరునామా నవీకరణకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం, బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ చేయడం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. అవసరమైనప్పుడు ఆధార్ కార్డు వెంట లేకపోయినా ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది.

5. ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect):
రైల్వే ప్రయాణికులకు IRCTC Rail Connect యాప్ అత్యంత అవసరమైనది. ఈ యాప్ ద్వారా రైలు టికెట్ల బుకింగ్, టికెట్ రద్దు, PNR స్టేటస్ చెక్, రైలు షెడ్యూల్, సీట్ల లభ్యత, ప్రయాణ చరిత్ర వంటి సేవలను సులభంగా పొందవచ్చు. పండుగలు, అత్యవసర ప్రయాణాల సమయంలో త్వరగా టికెట్ బుక్ చేసుకోవడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ యాప్స్ వల్ల కలిగే ప్రయోజనాలు:
ఈ ఐదు యాప్స్ ఫోన్‌లో ఉంటే ప్రభుత్వ సేవలు పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎప్పుడూ చేతిలో ఉన్నట్లే ఉంటాయి. బిల్లుల చెల్లింపులు, రైల్వే టికెట్లు, వాహన పత్రాలు, ఆధార్ సేవలు వంటి అనేక పనులను ఇంటి నుంచే పూర్తి చేయవచ్చు. దీంతో సమయం ఆదా కావడంతో పాటు డిజిటల్ సేవలను మరింత సురక్షితంగా వినియోగించే అవకాశం ఉంటుంది.

పిఠాపురం ZP హై స్కూల్ లో 'నో అడ్మిషన్' బోర్డు.. పవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్స్..

Pithapuram ZP High School

Pithapuram ZP High School : ప్రభుత్వ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ తో పోటీ పడే రోజు వస్తుందని మనం ఎప్పటికీ ఊహించలేదు. కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే అంశాలు ఇవి , నిజజీవితం లో చాలా కష్టం అని అంతా అనుకునేవారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేట్ , కార్పొరేట్ స్కూల్స్ తో పోటీ పడుతూ ర్యాంకులు సాధించడం సంచలనం గా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యని అందించడం గమనించిన తల్లిదండ్రులు లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్ లో చదివించడం కన్నా , ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడమే బెస్ట్ అని నిర్ణయించుకున్నారు కాబోలు , అందుకే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ బాగా పెరిగింది.

అందుకు ది బెస్ట్ ఉదాహరణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం. పిఠాపురం లోని మూలపేట లో ఉన్నటువంటి ZP హై స్కూల్ లో కాకినాడ జిల్లాలోనే ది బెస్ట్ ఫలితాలు సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో ఈ పాఠశాలకు డిమాండ్ పెరిగింది, 7 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సీట్లు ఫుల్ అయిపోయాయి. దీంతో హై స్కూల్ సిబ్బంది గేట్ బయట ‘నో అడ్మిషన్స్ ‘ బోర్డు పెట్టారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ZP హై స్కూల్ సిబ్బందికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఉపాధ్యాయుల కష్టం, సిబ్బంది సహకారమే ఈ మార్పునకు కారణమని కొనియాడిన పవన్ కళ్యాణ్ , త్వరలోనే పిఠాపురం పర్యటనలో భాగంగా ఈ పాఠశాలను సందర్శించబోతున్నట్టు తెలిపారు. మరోపక్క పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం లోని జడ్పీ పాఠశాలకు ఈ ఘనత దక్కడం పై నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ పాఠశాలలు ఈ తరహా లో అభివృద్ధి చెందితే పేద ప్రజలకు ఎంతో మేలు చేసేవారు అవుతారని , దయచేసి స్టాండర్డ్స్ ని ఇంకా పెంచాల్సిందిగా కోరుతూ సోషల్ మీడియా లో నెటిజెస్ పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘తల్లికి వందనం’ స్కీం డబ్బులు ఈ నెల 16, 17, 18 తేదీలలో పడబోతున్నాయి. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం.

'ఫౌజీ' మూవీ సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం.. ప్రభాస్ పరిస్థితేంటంటే.. వీడియో వైరల్

Fauji Fire Accident

Fauji Fire Accident : ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘ఫౌజీ’. ‘సీత రామం’ వంటి భారీ హిట్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి చేస్తున్న చిత్రమిది. శరవేగంగా ఘాన్గ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. నెట్ ఫ్లిక్స్ కూడా ఒకవేళ ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తే , భారీ మొత్తం మీద డీల్ కుదిరించుకోవడానికి సిద్ధమని మేకర్స్ కి చెప్పడం తో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వేగం పెంచారు. ప్రస్తుతానికి ఈ సినిమా మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే నేడు ఈ సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

సోషల్ మీడియా లో సెట్స్ కాలిపోతున్న విజువల్స్ ని అప్లోడ్ చేయగా, ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇది నిజంగానే అగ్ని ప్రమాదం జరిగిందా?, లేదా ఏదైనా షాట్ కి సంబంధించిన సన్నివేశం చిత్రీకరణ లో భాగంగా ఇలా చేశారా అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఈ విజువల్స్ ని చూసి సోషల్ మీడియా లో భయపడుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. కేవలం షూటింగ్ కి సంబంధించిన ప్రాపర్టీ మాత్రమే డ్యామేజ్ అయ్యిందని అంటున్నారు. దీనిపై మూవీ టీం స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప, మరో ప్రమోషనల్ కంటెంట్ విడుదల అవ్వలేదు. ప్రభాస్ అభిమానులు టీజర్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మూవీ టీం నుండి రెస్పాన్స్ లేదు.

దీంతో ఫ్యాన్స్ మూవీ టీం ని ట్యాగ్ చేసి , అసలు ఈ సినిమా ఉందా?, లేదంటే ఆపేసారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఫౌజీ చిత్రానికి సంబంధించిన ప్రధానమైన యాక్షన్ భాగం పూర్తి అయ్యాక , ఆయన పూర్తి ఫోకస్ స్పిరిట్ మీదనే పెట్టారు. ఇక టాకీ పార్ట్ అయితే పూర్తి అయ్యి చాలా రోజులైంది. ప్రస్తుతం ప్రభాస్ కి సంబంధించి కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. త్వరలోనే ఆ ప్యాచ్ వర్క్ ని కూడా పూర్తి చేయబోతున్నారు. డిసెంబర్ 3 న గ్రాండ్ గా విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

అమెరికాలో దోచుకుంటున్నారు..ఇండియాలో కళ్లకద్దుకుంటున్నారు.. యూఎస్ మహిళ వీడియో చర్చనీయాంశం

US Medical Costs : అమెరికా గురించి మనం చాలా గొప్పగా వింటాం. మీడియాలో అమెరికా గురించి రకరకాలుగా వార్తలు వస్తుంటాయి. కానీ అమెరికా అసలు రూపం లోతుగా చూస్తే గాని తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి అమెరికా అసలు రంగు కనిపిస్తోంది. అమెరికా గురించి.. అమెరికాలో అమల్లో ఉండే విధానాల గురించి ఒక యువతి.. అది కూడా ఆ దేశానికి సంబంధించిన ఓ యువతి బయటపెట్టింది. దీంతో అమెరికా అసలు ముఖచిత్రం వెలుగులోకి వచ్చింది.

అమెరికాలో ప్రతిదీ కూడా ఖరీదైన వ్యవహారం లాగా ఉంటుంది. అందువల్లే అమెరికాలో జీవన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అమెరికాకు వలస వెళ్లిన వారు మాత్రమే కాదు.. అమెరికా దేశస్థులు కూడా అక్కడి ఖర్చులు భరించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. కాకపోతే మాతృ దేశం కాబట్టి బయటికి చెప్పుకోలేరు. కానీ ఒక యువతి ధైర్యం చేసి ముందుకు వచ్చింది. సోషల్ మీడియా వేదికగా తమ దేశంలో జరుగుతున్న వ్యవహారాలను బయటపెట్టింది. అవికాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అమెరికన్ మహిళ ఆంటీ కి క్యాన్సర్ సోకింది. అమెరికాలో ఆమె చికిత్స పొందుతోంది. క్యాన్సర్ నివారణకు ఆమె రెవిల్ మిడ్ అదే మెడిసిన్ వాడుతోంది. ఆ మెడిసిన్ ధర అమెరికాలో ఏకంగా 85000. అదే ఇండియాలో అయితే కేవలం 35 రూపాయలు మాత్రమే. ఈ వ్యత్యాసం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయింది. అమెరికా కంటే ఇండియాలో హెల్త్ కేర్ సిస్టం నడిపిస్తున్న విధానం గొప్పగా ఉందని ఆమె వ్యాఖ్యానించింది. అమెరికాలో ప్రజలను దోచుకుంటున్నారని.. ఇండియాలో మాత్రం కళ్ళకు అడ్డుకుంటున్నారని పేర్కొంది. మందుల ధరలు విపరీతంగా ఉంటాయని.. హాస్పిటల్ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయని ఆ మహిళ తన స్వీయ వీడియోలో స్పష్టం చేసింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరైతే అమెరికాలో మందులు కొనడం కంటే.. ఇండియాకు ఫ్లైట్ ద్వారా వచ్చి మందులు కొనుక్కోవడం ఉత్తమం అని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరేమో అమెరికా నుంచి ఇండియాకు వచ్చేయండి అంటూ సూచనలు చేస్తున్నారు.

కేవలం ఈ మహిళ మాత్రమే కాదు.. ఇటీవల కాలంలో ఇండియన్ హెల్త్ కేర్ సిస్టం.. అమెరికన్ హెల్త్ కేర్ సిస్టం ను కంపేర్ చేస్తూ చాలామంది వీడియోలు రూపొందిస్తున్నారు. ఆ వీడియోలు బహుళ ప్రజాదరణ సొంతం చేసుకుంటున్నాయి. అసలు ఈ తరహాలో ప్రజలను దోచుకోవడం పట్ల సోషల్ మీడియా వేదికగా అమెరికా మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ అమెరికా తన ధోరణి మార్చుకోవడం లేదు. తన విధానాలను సవరించుకోవడం లేదు.

100 కోట్ల బడ్జెట్ బూడిదపాలు..? 'నాగ బంధం' ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే..

Nagabandham Movie
Nagabandham Movie

Naga Bandham First Day Collection : 100 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘నాగబంధం’ చిత్రం విడుదలకు ముందు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, ఎంచుకున్న కాన్సెప్ట్ , ఇలా ప్రతీ ఒక్కటి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. కొత్తవాళ్లపై ఇంత బడ్జెట్ పెట్టి తెరకెక్కించారంటే , కచ్చితంగా ఈ సినిమాలో కంటెంట్ చాలా బలంగా ఉందేమో అని అంతా ఆశించారు. థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ ప్రీ ప్రమోషనల్ కంటెంట్ కారణంగా ఈ చిత్రానికి మొదటి రోజు పర్వాలేదు అనే రేంజ్ లో ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3 నుండి 4 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ నిర్మాతకు పెట్టిన బడ్జెట్ రీకవర్ అవ్వడానికి ఇది ఏ మాత్రం సరిపోదు. విడుదలకు ముందు కూడా థియేట్రికల్ బిజినెస్ బడ్జెట్ కి తగ్గట్టుగా జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ బిజినెస్ కూడా అత్యధిక ప్రాంతాల్లో అడ్వాన్స్ బేసిస్ మీద జరిగాయి. అంటే థియేటర్స్ నుండి వచ్చే కలెక్షన్స్ మీదనే నిర్మాత సేవ్ అవుతాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఈ టాక్ కి బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవడం అసాధ్యమే అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఫుల్ రన్ లో కూడా రావడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.

దీనిని బట్టి నిర్మాతకు ఏ రేంజ్ దెబ్బ తగలబోతుందో అర్థం చేసుకోవచ్చు. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది కాబట్టి సాటిలైట్ రైట్స్ ఓటీటీ రైట్స్ కూడా భారీ రేంజ్ లో అమ్ముడుపోవు. దీంతో మేకర్స్ 100 కోట్ల భారీ బడ్జెట్ ని బూడిదపాలు చేసారని అంటున్నారు. సరైన స్క్రిప్ట్ లేకుండా , ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఏమి ఉపయోగం?, ఇప్పటికైనా మేకర్స్ నిద్ర లేస్తారో లేదో చూడాలి అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గ్రాఫిక్స్ చిత్రాలు ఎలా ఉన్నా , ఎలాంటి టాక్ వచ్చినా మొదటి వీకెండ్ వరకు ఇలాంటి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళ కారణంగా వీకెండ్ లో అంచనా వేసిన దానికంటే ఎక్కువ వసూళ్లు రావొచ్చేమో చూడాలి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 5 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.

పూరి జగన్నాధ్ కి డేట్స్ ఇచ్చిన మరో స్టార్ హీరో... పోకిరి రేంజ్ కథతో వస్తున్నాడా..?

Puri Jagannadh career controversy
Puri Jagannadh career controversy

Puri Jagannadh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జజగన్నాధ్ ఒకప్పుడు ఆయన దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు ఉండేవి. ఆ సినిమా ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే ఒక కాన్ఫిడెంట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో తన ఫామ్ ని అందుకోలేకపోతున్నాడు. ఆయన చేసిన సినిమాలు చేసినట్టుగా ఫ్లాప్ అవుతుండడంతో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా వరకు ప్రేక్షకులు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన నాసిరకం కథలతో సినిమాలను చేస్తున్నాడు. గొప్ప కథలు రాయగలిగే కెపాసిటీ పూరి దగ్గర ఉన్నప్పటికి ఆయన ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సేఫ్ జోన్ లో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో మాఫియా బ్యాక్ డ్రాప్ ని ఎంచుకొని అదే మూస పద్ధతిలో సినిమాలను చేస్తుండటం ప్రతి ఒక్కరి నిరాశకి గురి చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పూరి జగన్నాధ్ తన పంథాను మార్చుకొని మంచి సినిమాను చేయగలిగితే తనకు ఎదురు ఎవరు ఉండరు అనేది వాస్తవం… అలాంటి పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి ‘స్లమ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా వీలైనంత తొందరగా రిలీజ్ అవ్వనున్న నేపద్యంలో ఈ మూవీ తర్వాత అతను ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో కూడా చాలా వరకు కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఒక స్టార్ హీరోతో పూరి జగన్నాధ్ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే శివ కార్తికేయన్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పూరి కథ చర్చలను కూడా జరుపుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. స్లామ్ డాగ్ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా శివ కార్తికేయన్ సినిమా చేయాలని చూస్తున్నాడట. వీలైనంత తొందరగా ఓపెనింగ్ కార్యక్రమాలు చేపట్టాలనే ప్రయత్నంలో పూరి జగన్నాధ్ ఉన్నారట.

ఈ సినిమా బడ్జెట్ ఎంత సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుంది అనే విషయాల్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా శివ కార్తికేయన్ స్టోరీస్ సెలక్షన్ బాగుంటుంది. పూరి తనకు ఏ స్టోరీ చెప్పి ఒప్పించాడు. కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే శివ కార్తికేయన్ పూరి జగన్నాథ్ చెప్పిన రొటీన్ రొట్టా కథలకు ఎలా ఫ్లాట్ అయ్యాడు. లేదంటే పూరి అతని కోసం పోకిరి రేంజ్ లో ఏదైనా ఒక కొత్త కథను రెడీ చేశాడా అనే వార్తలు కూడా వస్తున్నాయి…

ఆ యువతికి అలాంటి భర్తనే కావాలట.. ఏసేసుకుంటున్నారు

age gap in marriage
age gap in marriage

Viral Marriage Conditions : పెళ్లి.. నేటి కాలంలో ఈ తంతు జరుగుతున్న తీరు రకరకాలుగా ఉంటున్నది. కొందరేమో పెళ్లిని అత్యంత ఆడంబరంగా జరుపుకుంటే.. మరికొందరేమ ఎందుకొచ్చిన దరిద్రం అంటూ పక్కన పెడుతున్నారు. అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండడంతో చాలామందికి వివాహాలు కూడా కావడం లేదు. కన్యాదానం కాస్త కన్యాశుల్కంగా మారినప్పటికీ చాలామందికి పెళ్లి యోగం కలగడం లేదు. కొందరైతే పెళ్లి చేసుకోవడం మాత్రమే జీవిత లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిల ముందు ఎన్ని మెట్లైనా సరే కిందికి దిగుతున్నారు. ఇదే అదునుగా అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. సరికొత్త కోరికలు కోరుతూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు. ఓ అమ్మాయి కూడా వింత కోరికలు కోరి అలానే నిలిచింది.

ఆ అమ్మాయి ఉన్నత విద్యావంతురాలు. ఒక సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి వయసు వచ్చింది.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తనకు కావలసిన క్వాలిటీస్ ఏంటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త విపరీతంగా వైరల్ గా మారింది. ఆమె కోరిన కోరికలు.. కావలసిన క్వాలిటీస్ సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు కారణం అవుతున్నాయి.

ఆ అమ్మాయికి నెలకు రెండు లక్షల రూపాయలకు పైగా వేతనం వచ్చే అబ్బాయి కావాలట. అతడు ఎత్తు 6 ఫీట్ల వరకు ఉండాలట. అందంగా ఉండాలట. కచ్చితంగా వంట వచ్చి ఉండాలట. అందరికీ స్నేహితురాళ్ళు ఉండకూడదట. 24 గంటల పాటు అతడు తన లైవ్ లొకేషన్ పంచుకోవాలట. అంతేకాదు ఆమెను ఫారిన్ ట్రిప్స్ తీసుకెళ్తూ ఉండాలట.

ఆమె విధించిన షరతులు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో భర్త కావాలా.. లేదా జీవితాంతం భరించే సర్వెంట్ కావాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు..”ఇన్ని కండిషన్లకు ఓకే చెప్పి పెళ్లి చేసుకోవాలంటే మామూలు విషయం కాదు. అతడు ఆగర్భ శ్రీమంతుడు అయి ఉండాలి. ఓపిక సహనంలో భూదేవిని మించిపోవాలి. ఏం చేసినా మూసుకొని కూర్చోవాలి. ఇదంతా జరగాలంటే అతడు ఉప్పు కారం మానేయాలని” నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల కాలంలో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు తమకు సంబంధించిన జీవిత భాగస్వాముల విషయంలో క్లారిటీగా ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కండిషన్లు పెడుతున్నారు. తాము పెళ్లి చేసుకునే వారి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. పైగా ఇండిపెండెంట్ లైఫ్ ను ఎక్కువగా కోరుకుంటున్నారు. అందువల్లే చాలామంది అబ్బాయిలు వివాహాలు చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. జీవితాంతం ఒంటరిగా ఉన్న పర్వాలేదు గానీ.. ఇలా ఇబ్బంది పడుతూ జీవించడం సాధ్యం కాదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై ప్రకాష్ రాజ్ మండిపాటు.. రావణ్ కోసం పోరాటం..

Prakash Raj , Pawan Kalyan
Prakash Raj , Pawan Kalyan

Prakash Raj పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో సహనం పూర్తిగా నశించిందా..?, నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వాళ్లకు మాటలతో కాదు , చేతలతో బుద్ది చెప్పాలని చూస్తున్నారా ?, వీళ్ళని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కంట్రోల్ చేసే పరిస్థితి లో లేరా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈమధ్య కాలం లో కొంతమంది యూట్యూబర్స్ ఓవర్ నైట్ లో ఫేమ్ అయిపోదామే ఉద్దేశ్యం తో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం చాలా సాధారణం అయిపోయింది. అది పవన్ కళ్యాణ్ వరకే ఆగితే పర్వాలేదు, మతాల మధ్య చిచ్చు పెట్టడం , కులాల మధ్య చిచ్చు పెట్టడం , శ్రీరాముడిని సైతం దుర్భాషలాడే పరిస్థితికి రావడం అనేది సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇలాంటివన్నీ చేస్తున్న ప్రశ్న రావణ్ ని అందుకే పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఇతనికి మచిలీపట్టణం పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఇతను బయటకి వస్తే దాడి చేయడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు స్టేషన్ బయటే కాచుకొని రెడీ గా ఉన్నారు. పిఠాపురం , సర్పవరం పోలీస్ స్టేషన్స్ వద్దనే రావణ్ పై దాడి చేసేందుకు పవన్ ఫ్యాన్స్ దూసుకొచ్చారు. కానీ మచిలీపట్టణం లో పవన్ ఫ్యాన్స్ ఆవేశాన్ని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. దీనిని ప్రకాష్ రాజ్ వంటి వారు ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఏంటో..జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు. వీళ్ళు జన సైనికులా ?, లేదంటే గూండాలా?, ప్రశ్నించాడని పోలీసులను పంపించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బెయిల్ మీద బెయిల్ ఇస్తున్నారు కోర్టు వారు , అరెస్టుల మీద అరెస్టులు వీళ్ళు చేస్తున్నారు , ఈ కొత్త నాటకం ఏంటి ?, ఈ బెదిరింపులు ఏంటి?, ఈ జనసైనికులు ప్రశ్నించే వాళ్ళను చంపేస్తారా ఏంటి?, దేశం చూస్తుంది జాగ్రత్త’ అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చారు.

దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. చాలా తెలివిగా , ప్రశ్నిస్తే చంపేస్తారా అని ప్రకాష్ రాజ్ లాంటోళ్ళు తెగ రుద్దేస్తున్నారు, కానీ రావణ్ మాట్లాడిన దుర్మార్గమైన మాటలను మాత్రం అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు , కావాలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధారాలతో సహా , రావణ్ దుర్మార్గమైన మాటలను సోషల్ మీడియా లో తిప్పుతున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కాస్త శాంతిస్తే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు. రావణ్ అంటే ఎవరో జనాలకు అసలు తెలియదని , అతనికి కావాలని పాపులారిటీ ని తీసుకొస్తున్నది పవన్ ఫ్యాన్స్ అని , ఏదైనా చట్టపరమైన చర్యలే న్యాయబద్ధమని , దాడి చేయడం సరికాదు అంటూ సోషల్ మీడియా సాక్షిగా చెప్పుకొస్తున్నారు.

అలియా భట్ 'ఆల్ఫా' చిత్రానికి డిజాస్టర్ టాక్.. మొదటి వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

Alpha Box Office Collection

Alpha Box Office Collection : బాలీవుడ్ లో ఒకప్పుడు స్పై జానర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ సల్మాన్ ఖాన్ తో ‘ఏక్ తా టైగర్’, ‘టైగర్ జిందా హై ‘, షారుఖ్ ఖాన్ తో ‘పఠాన్’, హృతిక్ రోషన్ తో ‘వార్’ వంటి సంచలనాత్మక చిత్రాలను నిర్మించింది. కానీ ‘పఠాన్’ తర్వాత ఈ సంస్థ నుండి వచ్చిన ప్రతీ స్పై థ్రిల్లర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ యూనివర్స్ నుండి వచ్చిన గత చిత్రం ‘వార్ 2’ అందుకు బెస్ట్ ఉదాహరణ. బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్, హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇందులో నటించారు , సినిమా కూడా డీసెంట్ గానే ఉంది , కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.

ఈ యూనివర్స్ లో అతి తక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రం గా ‘వార్ 2’ నిలిచిపోయింది. ఇక్కడితో ఈ స్పై యూనివర్స్ కి తెర పడిందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇదే యూనివర్స్ నుండి నేడు ‘ఆల్ఫా ‘ అనే చిత్రం విడుదలైంది. అలియా భట్, శర్వరీ ప్రధాన పాత్రల్లో, బాబీ డియోల్ , అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ యూనివర్స్ పై జనాల్లో ఆసక్తి పూర్తిగా పోయింది , పర్వాలేదు అనిపించే రేంజ్ కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్ కి కదలడం లేదు , అలాంటిది డిజాస్టర్ టాక్ వస్తే ఎలా కదులుతారు చెప్పండి. అందుకే ఈ చిత్రానికి మొదటి రోజు దారుణమైన ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 8 నుండి 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.

దీనిని బట్టీ చూస్తే ఈ చిత్రానికి 10 నుండి 12 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు నెటిజెన్స్. ఈ మాత్రం కూడా హృతిక్ రోషన్ గెస్ట్ రోల్ లో కనిపించడం వల్లే , లేదంటే ఇంకా దారుణమైన ఓపెనింగ్స్ నమోదు అయ్యి ఉండేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకనైనా ఈ యూనివర్స్ కి యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ముగింపు పలుకుంటుందో , లేదంటే మరోసారి ‘పఠాన్ 2’ అంటారో చూడాలి. ‘ఆల్ఫా ‘ ఫలితం చూసి కూడా ఈ యూనివర్స్ ని కొనసాగిస్తే మాత్రం , అంతకంటే తెలివి తక్కువ పని మరొకటి లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'రావు బహదూర్' కి బంపర్ ఓపెనింగ్స్..మొదటిరోజు గ్రాస్ ఏ రేంజ్ లో ఉందంటే..

Rao Bahadur
Rao Bahadur

Rao Bahadur Box Office : విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించిన ‘రావు బహదూర్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై , మొదటి ఆట నుండి పర్వాలేదు, బాగుంది అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియా లో ఫస్ట్ హాఫ్ పై అనేక కంప్లైంట్స్ వచ్చాయి కానీ , మ్యాట్నీ షోస్ కి టాక్ సెటిల్ అయ్యింది. ఈ జానర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ ని ఈ చిత్రం సంతృప్తి పరిచిందని ఓపెనింగ్స్ ని చూస్తుంటే అర్థం అవుతోంది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 3 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. సత్యదేవ్ రేంజ్ కి ఇది చాలా మంచి ట్రెండ్ అనే చెప్పాలి . గతం లో ఆయన చేసిన సినిమాల్లో దేనికి కూడా ఇంత ట్రెండ్ కనపడలేదు.

మరోపక్క నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి 1 లక్షా 20 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా ఓవర్సీస్ నుండే ఈ చిత్రానికి మొదటి రోజు + ప్రీమియర్స్ కి కలిపి 3 లక్షల డాలర్లు వచ్చేలా అనిపిస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా డీసెంట్ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి కాబట్టి , 4 నుండి 5 కోట్ల మధ్యలో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 7 నుండి 8 కోట్ల రూపాయిల మధ్యలో గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వబోతున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే ఈ చిత్రానికి మొదటి రోజే 50 శాతం బ్రేక్ ఈవెన్ జరిగినట్టు అనుకోవచ్చు.

ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయలకు జరిగింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజున 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే ట్రెండ్ రేపు , ఎల్లుండి కూడా కొనసాగితే , ఈ చిత్రం అవలీలగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెడుతుంది. మరి ఈ వీకెండ్ ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. ఒకవేళ హోల్డ్ చేస్తే మాత్రం మన టాలీవుడ్ కి ఈ ఏడాది మరో క్లీన్ హిట్ సినిమా వచ్చినట్టే. పబ్లిక్ టాక్ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది కాబట్టి , కచ్చితంగా ఈ చిత్రం మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అవ్వబోతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

250 సంవత్సరాల అమెరికా స్వాతంత్ర దినోత్సవం ఎందుకు చరిత్రాత్మకం?

US Independence Day

US Independence Day : జులై 4, 1776. ప్రపంచ చరిత్రలో ఒక సాధారణ తేదీ కాదు. మానవ చరిత్రలో రాజకీయ ఆలోచనలను, పాలనా విధానాలను, స్వేచ్ఛ అనే భావనను కొత్త దిశగా మలిచిన రోజు. బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన 13 కాలనీలు తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటిస్తూ “డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్”ను ఆమోదించాయి. ఆ రోజు జన్మించిన దేశమే అమెరికా సంయుక్త రాష్ట్రాలు.

2026లో అమెరికా తన 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది కేవలం ఒక దేశం పుట్టినరోజు కాదు. ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ ప్రయోగానికి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

రాజుల యుగానికి సవాల్

18వ శతాబ్దంలో ప్రపంచంలోని చాలా దేశాలు రాజుల పాలనలో ఉండేవి. యూరప్‌లోని శక్తివంతమైన సామ్రాజ్యాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాలను ఆక్రమించి కాలనీలుగా మార్చుకున్నాయి. ప్రజల హక్కుల కంటే రాజుల అధికారం ప్రధానమైంది. పన్నులు విధించేది రాజు, చట్టాలు చేసేది రాజు, ప్రజల జీవితాలను నిర్ణయించేది కూడా రాజే.

ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా కాలనీలు ఒక విప్లవాత్మకమైన ప్రశ్న లేవనెత్తాయి.

“ప్రజల సమ్మతి లేకుండా పాలించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు.”

ఈ ఒక్క ఆలోచనే ప్రపంచ రాజకీయాలను మార్చేసింది.

డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ చెప్పిన సందేశం

1776 జులై 4న ఆమోదించిన స్వాతంత్ర్య ప్రకటనలో కొన్ని మౌలిక సూత్రాలు ఉన్నాయి.

మనుషులందరూ సమానులే.
ప్రతి మనిషికి జీవించే హక్కు, స్వేచ్ఛ, సంతోషాన్ని అన్వేషించే హక్కు సహజసిద్ధమైనవి.
ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాపాడేందుకే ఏర్పడతాయి.
ప్రజల హక్కులను హరించే ప్రభుత్వం ఉంటే దానిని మార్చే హక్కు ప్రజలకు ఉంటుంది.

ఈ భావనలు అప్పట్లో అత్యంత విప్లవాత్మకమైనవి. తర్వాత ప్రపంచంలోని అనేక ప్రజాస్వామ్య రాజ్యాంగాలకు ఇవే స్ఫూర్తిగా నిలిచాయి.

ప్రపంచ ప్రజాస్వామ్యానికి మార్గదర్శి

అమెరికా స్వాతంత్ర్యం తర్వాత ప్రపంచంలో భారీ మార్పులు ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్‌లో జరిగిన విప్లవం నుంచి లాటిన్ అమెరికా స్వాతంత్ర్య ఉద్యమాల వరకు అనేక పోరాటాలకు అమెరికా విప్లవం ఒక ప్రేరణగా నిలిచింది.

“ప్రజలే యజమానులు” అనే భావన బలపడింది. రాజుల పాలన క్రమంగా బలహీనపడగా, ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే విధానం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

అమెరికా విజయానికి కారణాలేమిటి?

250 సంవత్సరాల కాలంలో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, వైద్య రంగంలో, అంతరిక్ష పరిశోధనల్లో, ఉన్నత విద్యలో, వ్యాపారంలో అగ్రస్థానాన్ని సాధించింది.

దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.

వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం.
ఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణం.
స్వతంత్ర న్యాయ వ్యవస్థ.
బలమైన రాజ్యాంగ వ్యవస్థ.
పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు.
ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిభను ఆకర్షించడం.

ఈ అంశాలన్నీ కలిసి అమెరికాను ప్రపంచ నాయకత్వ స్థాయికి తీసుకెళ్లాయి.

విమర్శలూ ఉన్నాయి

అమెరికా చరిత్ర పూర్తిగా లోపరహితమని చెప్పడం కూడా సరైంది కాదు. బానిస వ్యవస్థ, స్థానిక ఆదివాసీలపై జరిగిన అన్యాయాలు, జాతి వివక్ష, విదేశాంగ విధానాలపై వచ్చిన విమర్శలు, యుద్ధాల్లో జోక్యం వంటి అంశాలు అమెరికా చరిత్రలో వివాదాస్పద అధ్యాయాలుగా ఉన్నాయి.

అయితే, ఒక ప్రజాస్వామ్య దేశంగా తన తప్పులను చర్చించుకునే, న్యాయస్థానాల ద్వారా సవాలు చేసే, ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను మార్చే వ్యవస్థను కూడా అమెరికా అభివృద్ధి చేసుకుంది. ఇదే ప్రజాస్వామ్య బలానికి ఒక సూచికగా చాలామంది విశ్లేషకులు భావిస్తారు.

భారత దృష్టిలో అమెరికా

భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత చాలా దశాబ్దాల పాటు దేశీయ రాజకీయాల్లో అమెరికాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శీతల యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్, అమెరికా మధ్య జరిగిన భౌగోళిక-రాజకీయ పోటీ ప్రభావం భారత రాజకీయ చర్చలపై కూడా పడింది. వివిధ రాజకీయ పక్షాలు, భావజాలాలు అమెరికా విదేశాంగ విధానాలపై విమర్శలు చేశాయి; మరోవైపు అమెరికా సాంకేతిక, విద్యా, ఆర్థిక రంగాల్లో సాధించిన విజయాలను ప్రశంసించిన వర్గాలు కూడా ఉన్నాయి.

నేటి పరిస్థితుల్లో భారత్–అమెరికా సంబంధాలు వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో గణనీయంగా విస్తరించాయి. రక్షణ, వాణిజ్యం, విద్య, సెమీకండక్టర్లు, అంతరిక్షం వంటి అనేక రంగాల్లో రెండు దేశాలు భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నాయి.

250 సంవత్సరాల సందేశం

ఒక దేశం శక్తివంతం కావాలంటే కేవలం సహజ వనరులు సరిపోవు. బలమైన రాజ్యాంగం, ప్రజల స్వేచ్ఛ, చట్ట పరిపాలన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా అవసరమని అమెరికా ప్రయాణం సూచిస్తుంది.

ప్రపంచంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నా, సాంకేతిక విప్లవాలు జరుగుతున్నా, ప్రజాస్వామ్య విలువలపై కొత్త చర్చలు జరుగుతున్నా — 1776 జులై 4న వెలువడిన స్వాతంత్ర్య ప్రకటన ఇప్పటికీ రాజకీయ చరిత్రలో ఒక కీలక మైలురాయిగానే నిలిచింది.

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం ఒక దేశం వార్షికోత్సవం మాత్రమే కాదు. ప్రజల సమ్మతితో నడిచే పాలన, వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం వంటి విలువలు ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించాయో గుర్తు చేసే చారిత్రక సందర్భం.

అమెరికాను విమర్శించడానికి అంశాలు ఉన్నట్లే, దాని ప్రజాస్వామ్య ప్రయోగం నుంచి నేర్చుకోవడానికి కూడా అనేక పాఠాలు ఉన్నాయి. ఏ దేశాన్నైనా భావోద్వేగాల కంటే చరిత్ర, వాస్తవాలు, సంస్థాగత బలాలు, సాధించిన విజయాలు, చేసిన తప్పులు.. అన్నింటినీ సమగ్రంగా పరిశీలించినప్పుడే సరైన అవగాహన ఏర్పడుతుంది. 250 ఏళ్ల అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం ఆ సమతుల్య దృష్టితో చరిత్రను తిరిగి చూసుకునే అవకాశాన్ని ప్రపంచానికి అందిస్తోంది.

250 సంవత్సరాల అమెరికా స్వాతంత్ర దినోత్సవం ఎందుకు చరిత్రాత్మకం? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

భారత సైన్యానికి భీకర దండు.. పాక్ తోక జాడిస్తే వేసేయడమే.. ఖతమే ఇక..

Indian Army Kamikaze Drones 2026
Indian Army Kamikaze Drones 2026

India Army : ఒకప్పుడు సరిహద్దుల్లో పరిస్థితి దారుణంగా మారినప్పుడు.. క్షేత్రస్థాయిలో పనిచేసేవారు పై అధికారులకు సమాచారం అందించేవారు. పై అధికారులు తమ దళాలకు నాయకత్వం వహించే వ్యక్తికి చెప్పేవారు. ఆయన హోంశాఖ సెక్రటరీ దాకా తీసుకెళ్లేవారు. హోంశాఖ సెక్రటరీ హోం మంత్రి కి వర్తమానం పంపేవారు. హోమ్ మంత్రి క్యాబినెట్లో చర్చించి.. ప్రధానమంత్రి కి చెప్పి.. ప్రధానమంత్రి మళ్ళి మేడం సలహా తీసుకొని.. రంగంలోకి దిగేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయ్యేది. పాకిస్తాన్ వాడు మన మీద దాడి చేసే వాడు. మన సైనికులను చంపేసేవాడు. ముఖ్యంగా సరిహద్దుల్లో రక్త ప్రవాహం కొనసాగించేవాడు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాడి చేస్తే ఏకంగా పాకిస్తాన్ మీదికి వెళ్లి ప్రతి దాడులు చేసే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎరిగింది.. ఒకరిని చంపితే పది తలకాయలు తీసుకొచ్చే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎదిగింది. సరిహద్దుల్లో రక్తపాతం సృష్టిస్తే.. పాకిస్తాన్ దేశానికి వెళ్లి ఉగ్రవాదులను చంపే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎదిగింది.. మధ్య మధ్యలో రకరకాల ఆపరేషన్లు.. రకరకాల వ్యవహారాలు.. కరుడుగట్టిన తీవ్రవాదులను మట్టు పెట్టడాలు వంటివి జరిగిపోతున్నాయి. ఫలితంగా పాకిస్తాన్ భారత్ అంటేనే పోసుకుంటున్నది. అయితే భారత్ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు. ఇంతటితోనే తన ఆర్మీని నిలుపుదల చేయడం లేదు.

ప్రస్తుతం భారత్ దగ్గర అత్యంత శక్తివంతమైన డ్రోన్లు 50వేల వరకు ఉన్నాయి. ఇవి నిత్యం పహారా కాస్తూ ఉంటాయి. యుద్ధ రంగంలో భీకరంగా పోరాడుతూ ఉంటాయి. చివరికి పాకిస్తాన్ చేతికి చిక్కకుండా ఏం చేయాలో అవి చేసి వస్తాయి. ఒకప్పటితో పోల్చి చూస్తే.. ఇప్పుడు భారత్ దగ్గర అత్యంత ఖరీదైన ఆయుధాలు.. బాంబులు.. యుద్ధ సామగ్రి.. శక్తివంతమైన పరికరాలు ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలల్లో వీటి సంఖ్య డబుల్, త్రిపుల్ కాబోతోంది. ఈ లెక్కన చూస్తే పాకిస్తాన్ తోక జాడిస్తే చాలు ఖతం చేసే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎదిగింది.

లక్ష కోట్ల ఖర్చుతో డిఫెన్స్ డిపార్ట్మెంట్ మరిన్ని అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోబోతోంది. ఇవన్నీ కూడా ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తయారవుతున్నాయి. ఒకప్పుడు ఆయుధాలను భారత్ దిగుమతి చేసుకునేది. వీటికోసం భారీగా ఖర్చు పెట్టేది. కానీ ఇప్పుడు సొంతంగా తయారు చేసుకుంటున్నది. ఇతర దేశాలకు అమ్ముతున్నది. ఈ 12 సంవత్సరాలలో భారత్ ఏ స్థాయిలో ఎదిగింది.. ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది.. అనే విషయాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని జాతీయవాదులు అంటున్నారు.
image.png

ఎన్టీఆర్ మీద విషం కక్కుతున్నది ఎవరు..?

NTR
NTR

NTR: నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్…స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మొన్న వచ్చిన వార్ 2 సినిమా వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా అతన్ని ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా నందమూరి అభిమానులైతే అతన్ని అభిమానిస్తూ తమ ఫ్యామిలీ మూడోవతరం హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ పండగ చేసుకుంటున్నారు. ఈ విషయం మీద కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీ అభిమానులు విశేషమైన ఆదరణను చూపిస్తున్నారు. అయినప్పటికి బ్యాక్ ఎండ్ నుంచి కొంత మంది కావాలనే ఎన్టీఆర్ మీద విమర్శలు చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక బాలయ్య బాబుకి, జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య చాలా విభేదాలైతే ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసిపోతారు అనుకున్న ప్రతిసారి ఎవరికి వారు విడిపోయి ఉంటున్నారు.

మరి ఈ కారణం చేతనే వీళ్లిద్దరి మధ్య ఏకాభిప్రాయం అయితే రావడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి అభిమానుల్లోనే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకని అతని మీద అలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు.

ఇక ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం వారసుడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. పాన్ ఇండియాలో నందమూరి ఫ్యామిలీ పేరు వినిపిస్తుంది అంటే అది జూనియర్ ఎన్టీఆర్ పుణ్యమే అని మరి కొంతమంది చెబుతున్నారు…

ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస లైనప్ తో బిజీగా ఉన్నాడు. భారీ పాన్ ఇండియా సినిమాలను చేసుకుంటూ స్టార్ హీరోలకు పోటీని ఇస్తూ టైర్ వన్ హీరోగా ముందుకు దూసుకెళ్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… తన నుంచి రాబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఆ న్యూస్ ఛానల్ పెద్ద అమెరికా లో హల్ చల్.. పక్కన కేఏ పాల్.. ఏదో కొడుతుంది శీనా

tv9-telugu-md-rajinikanth

Channel Chairman US Visit: ఆ చానల్ పెద్ద ఉన్నట్టుండి అమెరికా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్లిపోయారో తెలియదు. ఛానల్ కు సంబంధించిన అధికారిక కార్యక్రమం కూడా కాదు. ఇటీవల ఆయన తన కూతుర్ని చూసేందుకు ఢిల్లీ వెళ్లిపోయారు. అది కూడా ప్రత్యేకమైన ప్రైవేట్ విమానంలో. ఒక సాధారణ జర్నలిస్టు ఈ స్థాయిలో ఆడంబరమైన జీవితాన్ని గడపడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొంతమంది నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న ఒక పార్టీ తో ఆయన గట్టిగా నడుచుకున్నారని.. దీనివల్ల ఆయనకు భారీగానే ముట్టాయని వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఆయన అనేక విధాలుగా పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు సంపాదించారని.. కోట్లు వెనకేసుకున్నారని ప్రచారం మొదలైంది. దీనిని ఆ ఛానల్ పెద్ద ఖండించినప్పటికీ.. నెగిటివ్ వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఆ ఛానల్ పెద్ద అమెరికా వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లారో తెలియదు. తాను పనిచేస్తున్న ఛానల్ కు సంబంధించిన అధికారిక కార్యక్రమం కూడా కాదు. ఆయన వెంట ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఉన్నారు. ఇంకా కొంతమంది అమెరికన్ చట్టసభలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఉన్నారు. దీంతో ఆ ఛానల్ పెద్దపై విమర్శలు మళ్లీ మొదలయ్యాయి. ఇన్ని రోజులపాటు నెగిటివ్ ప్రచారాన్ని ఎదుర్కొన్న ఆయన అమెరికా ఎందుకు వెళ్లిపోయారు.. శ్వేత దేశానికి వెళ్ళిపోవాల్సిన అవసరమేంటి.. అక్కడ ఎన్ని రోజులపాటు ఉండాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.. ఇలా అనేక రకాలుగా చర్చలు సాగుతున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్టు వారు వార్తలు రాస్తున్నారు. గుసగుసలను తమకు నచ్చినట్టుగా పబ్లిష్ చేస్తున్నారు.

ఆ చానల్ పెద్ద గతంలో ఇంటర్వ్యూ నిర్వహించేవారు. ప్రైమ్ టైం లో వార్తలు కూడా చదివేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా ఆయన ఇటీవల కాలంలో వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఈ నెగిటివ్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇది ఇలా సాగుతుండగానే ఆయన అమెరికా వెళ్లిపోయారు. గతంలో ఆయన అనేక సందర్భాల్లో అమెరికా వెళ్ళినప్పటికీ.. ఎన్నడూ కూడా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. వాటికి ఆయన ఏ విధమైన సమాధానాలు ఇస్తారో చూడాల్సి ఉంది. గతంలో ఆయన కేఏ పాల్ తో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇప్పుడు కేఏ పాల్ తో ఆయన కనిపించారు. కేఏ పాల్ కు అమెరికాలో బలమైన సంబంధాలు ఉన్నాయి. అమెరికా లో కీలకమైన నేతలతో ఆయన నేరుగా మాట్లాడగలరు. అందువల్లే ఆ ఛానల్ పెద్ద అమెరికా వెళ్లారేమో.. పక్కన కె ఏ పాల్ కూడా ఉన్నారు కాబట్టి.. ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారని వినికిడి.