Home Blog Page 30

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కార్పొరేట్ కంపెనీ 180 కోట్లు.. కుట్ర ఇలా బయటికి

Vijay Government
Vijay Government

Vijay Government: తమిళనాడులో టీ వీ కే అధినేత విజయ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరిగిందా.. దీనికోసం భారీగానే వ్యవహారం సాగించారా.. వందల కోట్లు సమకూర్చుకున్నారా.. ఇందులో కార్పొరేట్ కంపెనీ రంగ ప్రవేశం చేసిందా.. దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు.. ఎందుకు ఈ స్థాయిలో కుట్రకు పాల్పడ్డారు.. ఈ ప్రశ్నల ఆధారంగానే తమిళనాడు మీడియాలో కొద్ది రోజులుగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ కుట్రకోణం వెలుగులోకి రావడంతో అసలు నిజాలు బయటపడుతున్నాయి.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి విజయ్ పై డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూలిపోతుందని.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ తరచూ పిలుపునిస్తూనే ఉన్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిది ఏకంగా విజయ్ కుటుంబ వ్యవహారాన్ని రాజకీయాల్లోకి లాగారు. ఎవరో తన భర్త కోసం కోర్టు దగ్గర ఉన్నారంటూ పరోక్షంగా ఆరోపణలు చేశారు.. వాస్తవానికి తమిళనాడు రాజకీయాలు ఇలా ఉండకుంటే ఆశ్చర్యం.. ఇలా సాగుతుంటే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆశ్చర్య పడాల్సిన అవసరం అంతకంటే లేదు.

విజయ్ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చడానికి చేసిన ప్రయత్నాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న పదిమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక కార్పొరేట్ సంస్థ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఏకంగా 180 కోట్లను నిధులను సమకూర్చుకున్నట్టు సమాచారం.. డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ.. అతడు తమ్ముడు ఆధ్వర్యంలో 35 కోట్ల ఒప్పందం చేసుకున్నాం.. అయితే ఎమ్మెల్యేలు ఎవరు డబ్బుకు, బెదిరింపులకు లొంగలేదని పోలీసుల విచారణలో నిందితులు బయటపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆ కంపెనీ ఎవరిది.. ఈ స్థాయిలో డబ్బులు ఎలా సమకూర్చుకుంది.. దాని వెనుక ఎవరు ఉన్నారు అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.

విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూడా ఇలాంటి చర్చలే తమిళనాడులో జరిగాయి. డీఎంకే, అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని వార్తలు వచ్చాయి. అయితే విజయ్ నేరుగా రంగంలోకి దిగడం.. కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఐయూఎంఎల్ పార్టీలతో సమన్వయం చేసుకొని.. మద్దతు దక్కే విధంగా అడుగులు వేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అయితే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి స్వల్ప కాలంలోనే ఇలా కుట్రలు జరగడం విశేషం. అయితే ఈ వ్యవహారం విజయ్ రేంజ్ ను తమిళనాడులో మరింత పెంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రేవంత్ కు 20 ఏళ్ళు.. మిడ్జిల్ తో ఉన్న సంబంధం ఏంటి..

Revanth Reddy Political Journey
Revanth Reddy Political Journey

Revanth Reddy Political Journey: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రస్థానం చాలా భిన్నమైనది. పొలిటికల్ గా ఆయనకు ఎటువంటి నేపథ్యం లేకపోయినప్పటికీ ఈ స్థాయి దాకా వచ్చారు. ఆర్ఎస్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సమితి.. తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ పార్టీ.. ఇలా రకరకాల నేపథ్యాలను ఆయన తన రాజకీయ ప్రయాణానికి అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతి ప్రయాణంలోనూ ఎంతో కొంత నేర్చుకున్నారు. తద్వారా తనను తాను గొప్పగా తీర్చిదిద్దుకున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్తానానికి నేటితో 20 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి.

రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణంలో తొలి అడుగులు ఉమ్మడి పాలమూరు జిల్లా మిడ్జిల్ జెడ్పిటిసి సభ్యుడిగా మొదలుపెట్టారు. 20 సంవత్సరాల క్రితం ఆయన వేసిన అడుగు బలమై.. బలోపేతమై.. చివరికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది.

విద్యార్థి దశలో ఏబీవీపీ లో పని చేశారు రేవంత్ రెడ్డి. 2000 ఆరు సంవత్సరంలో జరిగిన జెడ్పీ ఎన్నికల్లో మిడ్జిల్ స్థానానికి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. జూలై 4న ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత మరసటి ఏడాది 2007 లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డారు. తద్వారా శాసనమండలిలో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తనకు ఉన్న వాక్పాటిమతో పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు.

2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రం విభజనకు గురి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కార్యనిర్వాక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.. తెలంగాణ శాసనసభలో టిడిపి ఎల్పి బి ఆర్ ఎస్ ఎల్ పి. లో విలీనం అయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మనుగడ తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారింది.

టిడిపికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో కూడా పట్టు సాధించారు. కాంగ్రెస్ పార్టీని జనాలకు మరింత చేరువ చేయగలిగారు. కెసిఆర్ కు ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదిగారు. అది ఆయనను బలంగా నిలిపింది. 2018 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం లో ఓడిపోయినప్పటికీ.. ఆ మరుసటి ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద స్థానమైన మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2021లో పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఆయనది డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. ముఖ్యమంత్రిగా ఎదిగినప్పటికీ.. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో మిడ్జిల్ జడ్పిటిసి గా ఎన్నిక అవడం ఎప్పటికీ ప్రత్యేకతనే. దానిని గుర్తు చేసుకుంటూ రేవంత్ రెడ్డి నేడు మిడ్జిల్లో పర్యటిస్తున్నారు. ఆయన అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తిరుమల శ్రీవారి లడ్డు.. కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత ఇది..

Tirumala Laddu
Tirumala Laddu

Tirumala Laddu: సెలవు దినాలు కాదు. ఎండాకాలం సెలవులు కూడా ముగిసిపోయాయి. విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయినప్పటికీ తిరుమల భక్తులతో కిటకిటలాడుతూనే ఉంది.. తిరుమలలో ఎన్నడు లేని విధంగా ప్రస్తుత కాలంలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఆ సంఖ్య లక్షలకు చేరుకుంటున్నది. విఐపి దర్శనాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త నిబంధనలు తెరపైకి తీసుకురావడంతో సామాన్య భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కలిగింది..

ఇప్పుడు సెలవులు లేకపోయినప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వాస్తవానికి సెలవులు ముగిసిన తర్వాత తిరుమల కొండమీద భక్తుల సంఖ్య తగ్గుతుంది. కానీ భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పించే ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చేయడంతో రద్దీ విపరీతంగా ఉంటున్నది. కొన్ని సందర్భాలలో శిలా తోరణం వరకు భక్తులు వేచి ఉంటున్నారు. దీనిని బట్టి అక్కడ రద్దీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. శ్రీవారి లడ్డు ప్రసాదానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. తిరుమల శ్రీవారి లడ్డుప్రసాదం గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డులను సృష్టిస్తున్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు పెట్టే అన్న ప్రసాదం విషయంలో నాణ్యతను పాటిస్తోంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ తిరుమలలో పర్యటించినప్పుడు.. అన్న ప్రసాదం విషయంలో నాణ్యత తగ్గితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో దేవస్థానం బాధ్యులు అప్పటినుంచి అన్నప్రసాదంలో నాణ్యతను మరింత పెంచారు. ఇది కూడా భక్తుల సంఖ్య పెరగడానికి ఒక కారణం.

భక్తుల సంఖ్య లడ్డు ప్రసాదానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. తిరుమల శ్రీవారి లడ్డు గతంలో ఎన్నడు లేనివిధంగా రికార్డులను సృష్టిస్తున్నది. జూన్ నెలలో అత్యధికంగా లడ్డు ప్రసాదం విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఏప్రిల్ లో 1,11,96,170, మే నెలలో 1,21,35,528, జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలను విక్రయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. 2024 జూన్ లో 1,02,54,364, గత ఏడాది జూన్ లో 1,19,21,353 లడ్డూలను దేవస్థానం విక్రయించింది. అయితే ఈ ఏడాది జూన్లో విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. గత ఏడాది జూన్ నెలతో పోల్చి చూస్తే ఈ జూన్ లో ఏకంగా 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయించింది తిరుమల తిరుపతి దేవస్థానం.

పాకిస్తాన్ ను సమయం చూసి దెబ్బ కొట్టారు.. 30 మంది ఖతం

Baloch Liberation Army
Baloch Liberation Army

Baloch Liberation Army: ఉగ్రదాడులతో గతంలో భారత్ మీద పైశాచికత్వాన్ని ప్రదర్శించింది పాకిస్తాన్. దీనికి మనదేశంలో ఉన్న కొంతమంది నాయకులు కూడా పాకిస్తాన్ దేశానికి సహకరించారు. సరిహద్దుల్లో దారుణాలు సృష్టించడం.. రక్తపాతాన్ని కొనసాగించడం.. నకిలీ కరెన్సీని స్ప్రెడ్ చేయడం.. దేశంలో అలలు సృష్టించడానికి కుట్రలు చేయడం.. ఇలా ఎన్నో దారుణాలకు పాకిస్తాన్ పాల్పడింది. చివరికి అంతర్జాతీయ వేదికల మీద కూడా తనను తాను బాధిత దేశంగా పేర్కొంది. భారత్ మీద లేనిపోని విమర్శలు చేసింది. చివరికి చైనా సహకారంతో.. రచ్చ రచ్చ చేసింది.

పాకిస్తాన్ కుట్రలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. సరిహద్దుల్లో గట్టిగా కాదు.. చెవులు పలిగి పోయే విధంగా పాకిస్తాన్ దేశానికి సమాధానం చెప్పింది. పాకిస్తాన్ దేశానికి ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్య పేరు బలూజ్. కొంతకాలంగా ఇక్కడి ప్రాంత ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి తమకు స్వాతంత్రం కావాలని నిరసనలు చేపడుతున్నారు.. అక్కడ ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆ ప్రాంతం మీద దారుణంగా దాడులు చేస్తుంది. ప్రజలను అత్యంత క్రూరంగా హతమార్చుతోంది.

పాకిస్తాన్ ఆర్మీ తమను ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అదును చూసి దెబ్బ కొట్టింది. పాకిస్థాన్లోని గ్వాదర్ కోస్ట్ గార్డ్ ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసింది. ఈ దాడిలో ఏకంగా 30 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. మరి కొంతమంది గాయపడ్డారు. దానికి సంబంధించిన వీడియోలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీడియోలను పోస్ట్ చేసింది. ఇందులో ఒక వ్యాన్ లో పేలుడు పదార్థాలను నింపి.. ఆర్మీ క్యాంప్ సమీపంలోకి పంపించింది. ఆ తర్వాత బలుచ్ ఆర్మీ నిర్వాహకులు ఆ వ్యాన్ ను పేల్చేశారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం పేలిపోయింది. క్యాంపు లో పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది.

చూస్తుండగానే మంటలు వచ్చాయి. ఆ మంటల తాకిడికి చాలామంది చనిపోయారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ పేలుడు శబ్దం కిలోమీటర్ల వరకు వినిపించింది. ఏం జరిగిందో తెలిసే లోపే పాకిస్తాన్ ఆర్మీకి భీకరమైన నష్టం వాటిల్లింది. 30 మంది పాకిస్తాన్ ఆర్మీ చనిపోవడంతో బలూజ్ ఆర్మీ స్థాయి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ మీద విరుచుకుపడే అవకాశం ఉంది. మరి దీనికి బలూచ్ లిబ్రేషన్ ఆర్మీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

వైభవ్ హింట్ ఇచ్చేశాడు.. రెండో మ్యాచ్లో ఆడతాడా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ కి జాతీయ జట్టులో చోటు లభించినప్పటికీ.. తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం లభించడం లేదు. అతడి ఎంట్రీ కోసం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ మేనేజ్మెంట్ అతని విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. వాస్తవానికి ఐర్లాండ్ సిరీస్ లోనే అతడు జాతీయ జట్టులో ఆడాల్సి ఉండగా.. సీనియర్లు ఉన్నారు అనే సాకుతో మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టింది.

సూర్య వంశీ ప్రస్తుతం తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ట్రై సిరీస్లో శ్రీలంక జట్టు మీద ఫైనల్ మ్యాచ్లో వీర విహారం చేశాడు. టీమిండియాను విజేతగా నిలిపాడు. అయితే అతడు ఆ స్థాయిలో ఆడుతున్నప్పటికీ మేనేజ్మెంట్ బ్రేకులు వేస్తోంది. సీనియర్లు ఉన్నారని అతడికి అవకాశాలు ఇవ్వడం లేదు.

ఐర్లాండ్ సిరీస్ లో టీమిండియా దారుణంగా ఓడిపోవడం.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో సంజు.. కిషన్ విఫలం కావడంతో మరోసారి సూర్య వంశీ గురించి చర్చ మొదలైంది. సూర్య వంశీ రెండవ మ్యాచ్లో ఆడాలని.. అతడికి అవకాశం కల్పించాలని సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిరా సాగుతుండగానే సూర్య వంశీ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశాడు.. న్యూ చాప్టర్ అంటూ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై ఆడిన ఇన్నింగ్స్ ఫోటోలను స్టోరీలో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో వైభవ్ రెండవ టి20 లో ఆడతాడని సంకేతాలు ఇస్తున్నాడా.. లేదా జస్ట్ ఆ ఇన్నింగ్స్ ను గుర్తుకు తెచ్చుకుంటున్నాడా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. నాడు ఆ ఇన్నింగ్స్ లో సూర్య వంశీ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు కొట్టాడు.

నేడు జరిగే మ్యాచ్లో సంజు కు గనుక విశ్రాంతి ఇస్తే సూర్య వంశీకి చోటు లభించే అవకాశం ఉంది. ఒకవేళ కిషన్ ను కనుక పక్కన పెడితే అప్పుడు సూర్య వంశీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఐర్లాండ్ సిరీస్లో సంజు ఆకట్టుకోలేదు. కిషన్ అదరగొట్టలేదు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా కిషన్.. సంజు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్లో ఎలాగైనా సరే టీమిండియా గెలవాలి కాబట్టి.. సూర్య వంశీకి అవకాశాలు ఇచ్చే విషయాన్ని మేనేజ్మెంట్ తీవ్రంగా పరిశీలిస్తుందని.. అందువల్లే సూపర్ కిడ్ ఇన్ స్టా గ్రామ్ లో ఆ తరహా పోస్టులు పెట్టాడని స్పోర్ట్స్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

ప్రకాష్ రాజ్ పై రగిలిపోతున్న హిందూ సమాజం!

Prakash Raj
Prakash Raj

Prakash Raj: భావ స్వేచ్ఛ పేరిట రెచ్చిపోతున్న వారికి సరైన బుద్ధి చెప్పాలని చూస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వపరంగా బలమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సమాజంలో ఎలాంటి యోగ్యత లేని వారు భావ స్వేచ్ఛ పేరిట సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అటువంటి వారికి బ్రేక్ వేసే విధంగా బలమైన ప్రభుత్వ వ్యవస్థను పవన్ కళ్యాణ్ తేవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటువంటి వ్యవస్థతో ఇష్టారాజ్యంగా మాట్లాడే వారి నోటికి తాళం పడనుంది. అయితే తాజాగా ప్రశ్న రావణ్ అరెస్టుతో.. నటుడు ప్రకాష్ రాజుకు అసలు సిసలు సినిమా కనిపిస్తోంది.

* రావణ్ కు మద్దతు..
దళిత క్రైస్తవ మహాసభలో మాట్లాడారు రావణ్. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆయనపై కేసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు మాత్రమే కాదు. హిందూ సమాజంతో పాటు హిందూ దేవతలను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజం పై తీవ్ర ప్రభావం చూపాయి. అటువంటి రావణ్ అరెస్టును తప్పుపట్టారు ప్రకాష్ రాజ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నేరుగా విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు. అయితే ఇప్పుడు అదే ప్రకాష్ రాజ్ పై కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతుండడం విశేషం.

* కర్ణాటకలో తీవ్ర నిరసనలు.
కర్ణాటకలో ధర్మస్థల వివాదం కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి తనను గైడ్ చేశారని చెప్పుకొచ్చారు. దీంతో ధర్మస్థల చుట్టూ జరిగిన అంతర్జాతీయ కుట్రలో ప్రకాష్ రాజ్ భాగస్తుడు అని తీవ్ర అనుమానాలు రేగాయి. బెంగళూరు ప్రెస్ క్లబ్లో ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ సీనియర్ జర్నలిస్టులు ప్రకాష్ రాజ్ బట్టలు విప్పినంత పని చేశారు. ఇదంతా పెయిడ్ జర్నలిజం అన్నట్టు మాట్లాడారు ప్రకాష్ రాజ్. కానీ కర్ణాటకలో హిందూ సమాజం ఊరుకోవడం లేదు. ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. దిష్టిబొమ్మలను సైతం దహనం చేస్తోంది. అదే సమయంలో ఏపీలో రావణ్ ఘటనపై స్పందించి పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబును తప్పుపట్టారు. దీంతో హిందూ సంఘాలు మరింత గా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి ప్రకాష్ రాజ్ పై. ఊహించని ఈ పరిణామంతో తనకు తాను అపరమేధావిగా భావించే ప్రకాష్ రాజ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ప్రశ్న రావణ్.. దారులన్నీ మూసుకుపోయాయి.. ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాడిలా..

Joseph Ravan
Joseph Ravan

Prashna Ravan: కొన్ని రకాల సాయాలు కొంతవరకు చేయగలరు. ఎవరో అండగా ఉన్నారని రెచ్చిపోతే కృష్ణ రావణ్ లా ఉంటుంది పరిస్థితి. పవన్ కళ్యాణ్ తో పాటు హిందూ దేవతలను దూషించిన కేసులో వరుసగా అరెస్టు అవుతున్నారు రావణ్. అందుకే న్యాయ సాయం కోసం ఆయన కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. బెంగళూరు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని విమానాశ్రయంలో కలిసి కన్నీరు మున్నీరయ్యారు. కానీ జగన్ ఆ బాధ్యతను పార్టీ నేత దేవినేని అవినాష్ కి అప్పగించారు. ఆయన కూడా ఏం చేయలేకపోయారు. దీంతో అసలు సినిమా రావణ్ కుటుంబ సభ్యులకు అర్థం అయింది.

* ముందుకు వచ్చిన జడ శ్రవణ్ కుమార్
వాస్తవానికి రావణ్ కు న్యాయ సహాయం అందించేందుకు జడ శ్రావణ్ కుమార్ ముందుకు వచ్చారు. కానీ వైసీపీ లీడర్ సెల్ నేతలు శ్రావణ్ కుమార్ ను ఉద్దేశించి తక్కువ చేసి మాట్లాడారు. రావణ్ కోసం పార్టీ తరపున స్టార్ లాయర్లు వస్తున్నారంటూ వ్యాఖ్యానించేసేసరికి నొచ్చుకున్నారు. రావణ్ తరుపున వాదనలు వినిపించకుండానే కోర్టు నుంచి బయటకు వచ్చేసారు. అటు పార్టీ తరపున లాయర్లు రాక.. ఇటు ఉన్న లాయర్ శ్రావణ్ కుమార్ చేజారి పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చివరకు బతిమిలాడుకోవడంతో శ్రావణ్ కుమార్ ముందుకు వచ్చి వాదనలు వినిపించారు. బెయిల్ ఇప్పించారు.

* వరుసగా కేసులు..
రావణ్ కు బెయిల్ వచ్చింది. కానీ ఆ ఆనందం ఎంతసేపు నిలవలేదు. బెయిల్ రాగానే పాయకరావుపేట పోలీసులు ఆయనపై నమోదైన మరో కేసులో అదుపులోకి తీసుకుని తరలించారు. దీంతో ఇప్పుడు రావణ్ కు అసలు పరీక్ష ఎదురవుతోంది. అందుకే తదుపరి కేసులో జడ శ్రావణ్ కుమార్ వాదిస్తారా? లేక పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగుతారా? అన్నది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం జడ శ్రావణ్ కుమార్ ను మాత్రమే నమ్ముకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందదని ఒక నిర్ణయానికి వచ్చారు.

* ఆ భయంతోనే..
రావణ్ విషయంలో సాయం చేస్తే ప్రజల్లోకి భిన్న వైఖరి వెళుతుందన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన. హిందూ సమాజం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రావణ్. హిందూ దేవతలను దారుణాతి దారుణంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు రావణ్ కు వైసీపీ తరఫున న్యాయ సహాయం చేస్తే ప్రజల్లోకి ప్రతికూలత వెళుతుందనేది వైసీపీ ఆందోళన. మరోవైపు కేంద్రంలోని బిజెపి పెద్దలకు కోపం వస్తుందని.. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యూహంతోనే న్యాయ సహాయానికి ముఖం చాటేసారని భావిస్తున్నారు. అయితే రావణ్ కు న్యాయ సహాయం అందకపోవడంపై పార్టీ సోషల్ మీడియాలోనే సెటైర్లు పడుతుండటం విశేషం.

దొంగ ఓట్లు అన్ని వైసిపివి అంటే ఎలా?!

AP Voter List Revision
AP Voter List Revision

AP Voter List Revision: ఏపీవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ సమగ్ర ఓటర్ల సవరణ ను ఆది నుంచి వ్యతిరేకిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఒక రకమైన ఆరోపణ చేస్తూ.. ఈ ప్రక్రియను మరో నెల రోజులపాటు పెంచాలంటూ కోరింది వైసిపి. ప్రతి పోలింగ్ బూత్ లో 50 చొప్పున తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందని చెబుతోంది. అందుకే సర్ ప్రక్రియను మరో నెల రోజులు పెంచాలంటూ వైసీపీ నేతలు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ కు వినతి పత్రాలు అందజేశారు. అయితే ఆది నుంచి వైసీపీ ఈ ప్రక్రియ పై వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

* పక్కా పారదర్శకంగా..
కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి.. నివాసం ఉంటున్న వారిని ఓటర్లుగా పరిగణిస్తూ.. పక్కా పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అర్హులైన ఏ ఒక్క సామాన్య పౌరుడి ఓటు పోయే అవకాశం లేదు. కానీ ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు, చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు మాత్రమే తొలగిస్తారు. అయితే ఇలా తొలగిస్తున్న ఓట్లన్నీ తమవే అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్ల వైసిపి హయాంలో ప్రతి నియోజకవర్గంలో… ప్రతి బూత్ పరిధిలో 50 నుంచి 100 వరకు పైగా అక్రమంగా ఓట్లు చేర్పించారని ఆరోపణలు ఉన్నాయి. అవి ఇప్పుడు బలపడుతున్నాయి.

* వైసిపి ఆందోళన..
ఒక బూత్ పరిధిలో 50 నుంచి 100 ఓట్లు తగ్గుతుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సమావేశమై పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఏపీలో కూడా విపక్షాల ఓట్లను భారీగా తొలగిస్తున్నారని.. క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక వైసీపీ నేతలు అయితే ఎలక్షన్ కమిషన్ చేసిన ప్రయత్నాన్ని తప్పుపడుతున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయం, ఆ పార్టీ అనుమానాలు బయటపడ్డాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తుండడంతో అవన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేర్పించినవి అని అర్థం అవుతోంది.

* అప్పట్లో దొంగ ఓట్లు..
గతంలో వైసిపి హయాంలో బై పోల్స్ ఎలా జరిగాయి ఇట్టే గుర్తు చేసుకోవచ్చు. సరిహద్దు జిల్లాల నుంచి వేలాది మందిని బస్సులు, లారీల ద్వారా తరలించి ఎలా ఓట్లు వేయించుకున్నారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల నకిలీ ఓట్లను ఏరిపారేసే క్రమంలో భాగంగా.. ఏపీలోనూ గట్టి చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రత్యేక డ్రైవ్ వల్ల తప్పకుండా బినామీ, దొంగ ఓట్లకు పడుతుంది. అయితే ఇప్పుడు తమ ఓట్లు పోతాయని ఈ రాజకీయ పార్టీ అయినా ఆరాటపడితే కచ్చితంగా అనుమానం వ్యక్తం చేయవచ్చు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై అదే అనుమానం బలపడుతోంది.

కశ్మీర్‌ వేర్పాటువాదులపై ఉక్కుపాదం..

Jammu Kashmir Separatists
Jammu Kashmir Separatists

Jammu Kashmir Separatists: జమ్మూ కశ్మీర్‌లో కొందరు శక్తులు మళ్లీ 2006–08 కాలపు వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కూడా వేర్పాటువాద రాజకీయాలను పునరుజ్జీవింపజేయాలని, పాకిస్తాన్‌తో సత్సంబంధాలు కొనసాగాలని కొందరు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ ఇంటెలిజెన్స్‌ వేర్పాటువాదుల ఆర్థిక వనరులపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ముగ్గురు వ్యక్తుల ఆస్తులను జప్తు చేసింది. ఇది వేర్పాటువాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే వ్యూహం.

ఆర్థిక వనరులపై దాడి…
జమ్మూ కశ్మీర్‌ ఇంటెలిజెన్స్‌ ఒక మాజీ వ్యాపారి డాక్టర్‌ ముబీన్‌ అహ్మద్‌ షా, ఒక ఆర్కిటెక్ట్‌ అజీజ్‌ ఉల్‌ హసన్‌ అషాయ్‌ అలియాస్‌ టోనీ అషాయ్‌. ఒక జర్నలిస్టు–మానవహక్కుల కార్యకర్త రిపర్ట్‌ వాణి ఆస్తులను సీజ్‌ చేసింది. వీరు ఉన్నత స్థాయిలో ఉండి వేర్పాటువాద ఆలోచనలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో ఒకరు కశ్మీర్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షుడు. ఆయన కాలంలో క్రాస్‌ బార్డర్‌ వ్యాపారం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించి, ఆ నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు చెందిన భూములు జప్తు అయ్యాయి. రెండో వ్యక్తి అంతర్జాతీయంగా పనిచేస్తున్న ఆర్కిటెక్ట్‌. ఆయన కశ్మీర్‌ విషయంలో విదేశాల్లో విషప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడో వ్యక్తి జర్నలిస్టు–మానవహక్కుల కార్యకర్త. వీరి ఆస్తులపై కూడా చర్యలు జరిగాయి. ఈ ముగ్గురూ 2019లో ఆర్టికల్‌ 370 రద్దు అయిన వెంటనే దేశం వదిలి విదేశాలకు వెళ్లిపోయారు. వారికి 2025 డిసెంబర్‌లో నోటీసులు జారీ చేసి, 2026 జనవరి 26లోపు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

అంతర్జాతీయ ఆశ్రయాలు…
వేర్పాటువాద నాయకుల్లో చాలా మందికి మలేషియా, పాకిస్తాన్, ఇంగ్లండ్‌ వంటి దేశాలు ఆశ్రయం ఇస్తున్నాయి. వారి ఆస్తులు మాత్రం భారతదేశంలోనే ఉండటం వల్ల ఇప్పుడు ఆ ఆస్తులు జప్తు అవుతున్నాయి. ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని బయటపెడుతోంది. వేర్పాటువాద నాయకులు భారతదేశంలో అల్లర్లు, హింసను ప్రోత్సహించి, సాధారణ ప్రజల జీవితాలను దెబ్బతీస్తారు. కానీ వారి సొంత పిల్లలు విదేశాల్లో సుఖంగా చదువుకుంటారు. 2019కి ముందు జమ్మూ కశ్మీర్‌లో స్కూళ్లు నెలల తరబడి మూతపడేవి. పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యేవారు. అదే నాయకులు తమ పిల్లలను మలేషియా, ఆస్ట్రేలియా, లండన్‌లో చదివించేవారు. ఈ డబుల్‌ స్టాండర్డ్‌ ఇప్పుడు బయటపడుతోంది.విశ్లేషణ: ఆర్థిక దెబ్బతో వేర్పాటువాదం బలహీనంఈ ఆస్తి జప్తులు కేవలం శిక్షాత్మక చర్యలు కావు. అవి వేర్పాటువాదం యొక్క ఆర్థిక మద్దతును తగ్గించడానికి ఉద్దేశించినవి. అక్రమ వ్యాపారం, ఉగ్రవాద నిధులు, అంతర్జాతీయ విషప్రచారం వంటి వనరులను నిలిపివేయడం ద్వారా వేర్పాటువాద ఉద్యమం యొక్క బలాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

2019కి ముందు ఉన్న పరిస్థితులు…
2019లో కేంద్రం ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. అంతకుముంద నిరంతర అల్లర్లు, స్కూలు మూతలు, ఆర్థిక అస్థిరత సాధారణ ప్రజలకు ఎంత నష్టం కలిగించాయో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఆ కాలంలో నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపి, సాధారణ ప్రజలను బలి తీసుకునేవారు. ఇప్పుడు ఆ ఆస్తులు జప్తు అవుతున్నాయి.ఖలిస్తానీ నాయకుల విషయంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే వారు దేశంలోకి రాకుండా ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది చట్టబద్ధమైన ప్రక్రియలో భాగమని, ఆరోపణలు నిరూపితం కావాలని న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది.

కేంద్రం చేపట్టిన ఈ చర్యలు జమ్మూ కశ్మీర్‌లో భద్రతా వాతావరణం మారిందని, వేర్పాటువాదం ఇకపై సులభంగా వ్యాపించలేదని సూచిస్తున్నాయి. ఆర్థికంగా బలహీనపడిన వేర్పాటువాదం రాజకీయంగా కూడా బలహీనపడే అవకాశం ఉంది.

బండ్ల గణేష్ ఆర్థికంగా చితికిపోయాడా.. ఆస్తులు వేలం వేసిన బ్యాంకు.. కోర్టుకు పంచాయితీ

Bandla Ganesh
Bandla Ganesh

Bandla Ganesh: మొన్ననే కదా బండ్ల గణేష్ తన కుమార్తె వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపింది. పైగా ఆయన ఆర్థికంగా అత్యంత స్థితి మంతుడు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా. ఆంధ్ర ప్రదేశ్.. కర్ణాటక.. తమిళనాడు ప్రాంతాలలో భారీగా కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నాడు. గుడ్ల పరిశ్రమలో కూడా అగ్రభాగంలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. సొంతంగా నిర్మాణ సంస్థ కూడా ఉంది. టెంపర్, బాద్ షా, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కూడా తీశాడు.

ఇంతటి స్థాయి కలిగిన బండ్ల గణేష్ ఆర్థికంగా చితికిపోయాడా.. ఆయనకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయా.. వాటిని వేలం కూడా వేశాయా.. ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం చెబుతున్నారు విశ్లేషకులు. బండ గణేష్, ఆయన కుటుంబానికి సంబంధించిన ఒక ఆస్తిని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ వేలం వేసింది.. అంతేకాదు వేలం వేసిన విషయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. వేలం వేసిన సొమ్మును బండ్ల గణేష్ కుటుంబానికి చెల్లించాలని డి.ఆర్.టి ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి పడేసింది.

యూనియన్ బ్యాంకు తమ ఆస్తిని వేలం వేసిందని.. వచ్చిన ఆ సొమ్మును తమకు చెల్లించాలని బండ్ల గణేష్.. అతడి తండ్రి.. సోదరుడు డిఆర్టి దృష్టికి తీసుకెళ్లారు. డిఆర్టిలో వీళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టులో పిటిషన్ వేసింది దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బ్యాంకు తరఫున సీనియర్ న్యాయవాది బిఎస్ ప్రసాద్ కోర్టులో వాదించారు.

బండ్ల గణేష్ కుటుంబం శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ లిమిటెడ్ పేరు మీద లోన్ తీసుకున్నారు. అయితే ఆ రుణం చెల్లించకపోవడంతో బండ్ల గణేష్ కుటుంబానికి సంబంధించిన ఆస్తిని 2019లో యూనియన్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. 2022లో వేలం వేసింది. తద్వారా 8.5 వన్ కోట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పిటిషనర్లు వన్ టైం సెటిల్మెంట్ కింద అపోలు మొత్తం చెల్లిస్తామని ముందుకు వచ్చారు. దానికి యూనిట్ బ్యాంక్ ఒప్పుకుంది. ఆ సమయంలో వన్ టైం సెటిల్మెంట్ కింద 82 కోట్ల చెల్లింపుకు యూనియన్ బ్యాంకు ఒప్పుకుంది. అందులో వేలం సొమ్ము 8.51 కోట్లను మినహాయించుకుంటామని చెప్పింది. అయితే వేలం వేసిన విధానాన్ని సవాల్ చేయడం.. యూనియన్ బ్యాంక్ మీద వేసిన పిటిషన్లను వెనక్కి తీసుకోవడానికి బండ్ల గణేష్ ఒప్పుకున్నారు.

పిటిషన్ లను వెనక్కి తీసుకోకుండానే డిఆర్టి ని గణేష్ ఆశ్రయించారు. యూనియన్ బ్యాంక్ రికార్డులను పరిశీలించకుండా డిఆర్టి ఏకపక్షంగా వేలాన్ని రద్దు చేసింది.. ” ఎన్సిఎల్టిలో దివాలా పరిష్కార ప్రక్రియను అనుమతించింది. ఆస్తుల క్రయవిక్రాలపై నిషేధం ఉంది. అలాంటప్పుడు వేలం నిర్వహించకూడదని చెప్పడం సరికాదు. ఇది కంపెనీ ఆస్తి కాదు. హామీ ఇచ్చిన వారి ఆస్తి. దానిమీద ఎటువంటి నిషేధం ఉండదు. అందువల్లే డిఆర్టి తీర్పును రద్దు చేస్తున్నామని” హైకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించడం విశేషం.

అమిత్‌ షా మాస్టర్‌ స్ట్రోక్‌..

Amit Shah
Amit Shah

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో కేంద్రం ఇటీవల చేపట్టిన చర్యలు స్వచ్ఛంద సంస్థల(ఎన్జీఓలు) విదేశీ నిధుల విషయంలో పెద్ద మార్పులను తీసుకొచ్చాయి. ఇప్పటికే ఉన్న నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడం ద్వారా, విదేశీ సహాయాలు ఎలా వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు అవుతున్నాయి అనే విషయంలో పూర్తి పారదర్శకతను తీసుకురావడం లక్ష్యం. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన సున్నితమైన అంశం.

నిబంధనల కఠినతరం..
విదేశీ నిధులు సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు ఉపయోగపడాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఒక పని కోసం నిధులు తీసుకుని, మరొక పనిలో ఖర్చు చేయడం లేదా ఒక రాష్ట్రంలో తీసుకుని మరొక రాష్ట్రంలో ఉపయోగించడం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి దుర్వినియోగాన్ని నివారించడానికి కేంద్రం ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలను మరింత బలోపేతం చేసింది. ఈ చర్యలు భారత వ్యతిరేక లేదా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు విదేశీ నిధులు వెళ్లకుండా చూడడం లక్ష్యంగా ఉన్నాయి.

కొత్త మానిటరింగ్‌ వ్యవస్థ..
కేంద్రం ఏర్పాటు చేసిన ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ పోర్టల్‌ ద్వారా ప్రతి స్వచ్ఛంద సంస్థ తన కార్యకలాపాలు, నిధులు, ఖర్చుల వివరాలను నమోదు చేయాలి. ఈ వ్యవస్థ ట్రాన్స్‌ఫరెన్సీ, ట్రేసబిలిటీని నిర్ధారిస్తుంది. నేషనల్‌ డేటా బేస్‌తో అనుసంధానం చేయడం ద్వారా పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు తప్పనిసరి. ఎన్జీఓ దర్బన్‌లో నమోదు ఉందా లేదా
ఆడిట్‌లు జరుగుతున్నాయా, చార్టర్డ్‌ అకౌంటెంట్లకు యూడీఐఎన్‌ వ్యవస్థ ఉందా

అన్నీ కేంద్రం నేరుగా పర్యవేక్షించగలుగుతుంది. డేటా క్లౌడ్‌లో అందుబాటులో ఉండటం వల్ల ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. ఇది ముందుగా హెచ్చరికలు ఇవ్వకుండా, నిశ్శబ్దంగా పని చేసే వ్యవస్థగా రూపొందింది.

14,500 సంస్థలపై దృష్టి…
దేశంలో సుమారు 14,500 స్వచ్ఛంద సంస్థలు విదేశీ నిధులు స్వీకరిస్తున్నాయి. ఇప్పుడు వాటి కార్యకలాపాలు, నిధుల వినియోగం, లక్ష్యాలు అన్నీ కేంద్ర పర్యవేక్షణలోకి వస్తాయి. సంక్షేమం, హక్కుల పరిరక్షణ వంటి నిజమైన పనులు చేసే సంస్థలకు ఇది ఎలాంటి ఇబ్బంది కలిగించకపోవచ్చు. కానీ రేజీమ్‌ చేంజ్‌ లేదా వివిధ ఉద్యమాలకు నిధులు సేకరించే సంస్థలు ఇప్పుడు తమ లెక్కలు సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవర్‌సీస్‌ సిటిజన్లు కూడా డిజిటల్‌ వెరిఫికేషన్‌ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మోసపూరిత లావాదేవీలను తగ్గించడానికి సహాయపడుతుంది.

సానుకూలతలు, సవాళ్లు..
ఈ చర్యలు దేశంలో విదేశీ నిధుల ప్రవాహాన్ని మరింత జవాబుదారీగా మార్చడానికి దోహదపడతాయి. నిజమైన సామాజిక సేవ చేసే సంస్థలు పారదర్శకంగా పని చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. అయితే, చిన్న స్థాయి ఎన్జీఓలకు అదనపు పేపర్‌ వర్క్, ఆడిట్‌ భారం పడవచ్చు. ముఖ్యంగా, ఈ వ్యవస్థ ద్వారా కేంద్రం నిధులు ఎలా వినియోగమవుతున్నాయో నిరంతరం గమనించగలుగుతుంది. ఇది భారతదేశ సార్వభౌమత్వం, జాతీయ భద్రతకు సంబంధించిన విషయంలో ఒక ముందస్తు చర్యగా చూడవచ్చు.

అమిత్‌ షా చేపట్టిన ఈ చర్యలు స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను మరింత జవాబుదారీగా, పారదర్శకంగా మార్చడానికి దోహదపడతాయి. నిజమైన సేవా సంస్థలు ఇంకా మెరుగ్గా పని చేయగలవు, అయితే దుర్వినియోగం చేసేవారికి ఇకపై సులభంగా తప్పించుకోవడం కష్టం అవుతుంది.

పవన్ పై పడి బతికేస్తామంటే ఇక కుదరదు!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ ఓ వ్యాఖ్య చేశారు. తనపై కామెంట్స్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి.. చేసుకోనివ్వండి అంటూ చాలా సిల్లీగా మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే అంశాన్ని సీరియస్గా తీసుకొని ఒక బలమైన ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను ఉక్కు పాదంతో అణచివేయనున్నారు. అయితే చాలా రోజులపాటు సహనంతో వ్యవహరించారు పవన్. కానీ రోజురోజుకు శృతిమించుతోంది సోషల్ మీడియా ధోరణి. జీవితంలో కనీస స్థాయి విజయం లేదా పది పైసల యోగ్యత లేని వారు కూడా రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించాలంటే ఎంచుకునే మార్గం పవన్ కళ్యాణ్. గత పదేళ్ల ప్రస్థానం చూస్తే సోషల్ మీడియా చాలా హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మీడియాతో పాటు సోషల్ మీడియా నడిపిన వ్యాపార కోణంలో పవన్ కళ్యాణ్ ఒక ఆదాయ వనరుగా మారారు. ఆయనను టార్గెట్ చేసుకుంటే వ్యూస్ తో పాటు టిఆర్పి రేటింగ్స్ వస్తాయి అన్నది వారి ఆలోచన.

* కనీస యోగ్యత లేని వారు…
కత్తి మహేష్ అనే వ్యక్తి విమర్శల దగ్గర నుంచి ప్రారంభమైంది పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి. మొన్నటి ఎన్నికల ముందు వరకు శ్రీ రెడ్డి పురుష పదజాలం గురించి అందరికీ తెలిసిన విషయమే. పోసాని కృష్ణ మురళి ఆవేశపూరిత వ్యాఖ్యలు, రామ్ గోపాల్ వర్మ తీసిన పేరడీ సినిమాలు.. ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుంటూ పబ్బం గడుపుకున్నారు. తాజాగా ఏలూరు దళిత క్రైస్తవుల సభలో సీఎం, డిప్యూటీ సీఎం లపై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు బచ్చలకూరి జోసఫ్ అలియాస్ కృష్ణ రావణ్. వీరందరిదీ ఒకటే సూత్రం.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే.. ఆదాయం పెంచుకోవచ్చు అనేది వీరి ఆలోచన. ఉద్దేశపూర్వకంగానే నిలకడ లేని వ్యక్తులకు వేదికలు కల్పించారు. కనీస నైతిక విలువలు లేకుండా పవన్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ.. లైవ్ డిబేట్ లు పెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.

* బలమైన చట్టవ్యవస్థ..
అయితే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి రకరకాలుగా లబ్ది పొందారు. అనైతిక కార్యక్రమాలు రోజురోజుకు పెరుగుతుండడంతో పవన్ కళ్యాణ్ లో సహనం నశించింది. అందుకే చట్టబద్ధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మునుపటిలా వ్యూస్ వస్తాయని.. టిఆర్పి రేటింగ్ వస్తుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు కూడా. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా, అత్యంత శక్తివంతమైన ప్రజానాయకుడిగా పవన్ అవతరించారన్న విషయాన్ని గ్రహించుకోవాలి. సోషల్ మీడియా దుర్వినియోగానికి, విద్వేష పూరిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రత్యేక విచారణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కచ్చితంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది.

* విచారణకు వణకాల్సిందే..
ఒక బలమైన సైబర్ క్రైమ్ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక కేసులో బెయిల్ రాగానే మరో పాత కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం, న్యాయస్థానాలు సైతం సమాజంలో విద్వేషాలు రగిలించే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం చూస్తుంటే.. వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తున్నాయని అర్థం అవుతోంది. పవన్ కళ్యాణ్ ను దూషించి పెద్దవారు అవుతాం అనుకున్న వారు.. చట్టం కొట్టే దెబ్బకు చితికి పోవాల్సిందే. ఇకనుంచి ఇటువంటి విచారణలకు హాజరయ్యేందుకు కూడా భయపడాల్సిందే.

జగన్ తో ఉండలేం.. సీక్రెట్ భేటీలు!

YSRCP Crisis
YSRCP Crisis

YSRCP Crisis: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇంకా పాత వాసనలు మరువలేదు. 2014 నుంచి 2019 మధ్య జగన్ చేసిన రాజకీయాలనే మరోసారి చేస్తున్నారు. దీంతో అవి వికటిస్తున్నాయి. అప్పట్లో జగన్ ఏం చెబితే అది జనాల్లోకి వెళ్ళేది. పార్టీ శ్రేణులు అనుసరించేవారు. వ్యూహాలు పనిచేసేవి. సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉండేది. అన్నింటికీ మించి ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వన్ చాన్స్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ పాలనను ప్రజలు చూశారు. పదేపదే అవే మాటలు చెప్పడం ద్వారా నమ్మే స్థితిలో లేరు కూడా. పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఇటువంటి సమయంలో వ్యూహాత్మకంగా ప్రజా సమస్యలపై పోరాడి గట్టి పడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పాత రాజకీయాలనే నమ్ముకుంటున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఆలోచనలో పడ్డారు.

* చెప్పినా వినరు..
జగన్మోహన్ రెడ్డి చెబితే వినే రకం కాదు. ఫలానా చోటా ఫలానా విధంగా రాజకీయాలు చేయాలి అని చెప్పిన వినరు. ఆ విషయం సీనియర్లకు సైతం తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అలవాటు పడినవారు వేరే పార్టీలో చేరలేరు. అయితే కాంగ్రెస్ నుంచి వేరుపడిన జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. చావైనా రేవైనా పార్టీలోనే ఉండాల్సిన పరిస్థితి కొందరిది. కానీ జగన్మోహన్ రెడ్డి రోజురోజుకు తన పరిస్థితిని దిగజార్చుకుంటున్నారు. ఎటువంటి స్టాండ్ తీసుకుంటున్న దానికి యూటర్న్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాజధానుల అంశం విషయంలో తరచూ స్టాండ్స్ మార్చుతున్నారు. పార్టీకి అది డ్యామేజ్ చేస్తోంది. కంట్రోల్ చేసుకునే పరిస్థితి లేకుండా చేయి దాటుతోంది. దీంతో సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న వారు కూడా ఉన్నారు.

* కాంగ్రెస్ వైపు..
ఒక్క రాజధాని విషయంలోనే కాదు రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సీనియర్లకు అంతు పట్టడం లేదు. అస్సలు మింగుడు పడడం లేదు. బిజెపితో స్నేహం వద్దు అన్న సీనియర్లు చాలామంది ఉన్నారు. దీంతో మైనారిటీలతో పాటు కొన్ని వర్గాల వారు దూరం అవుతారన్న ఆందోళన ఉంది. కానీ జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల దృష్ట్యా బిజెపితో పరోక్ష స్నేహం కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవైపు అదే ఎన్ డి ఏ లో తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉంది. ఏపీ ప్రభుత్వంలో కూడా బిజెపి భాగస్వామ్యమై ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి వైఖరిని వ్యతిరేకించాల్సింది పోయి.. పరోక్ష స్నేహ హస్తం అందించడం పై సీనియర్లు ఆవేదనతో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు కొందరు సీనియర్లు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. జగన్ మోహన్ రెడ్డిని ఒప్పించి కాంగ్రెస్ వైపు తీసుకెళ్లడం ఒక ఎత్తు అయితే.. ఇదే మాదిరిగా జగన్ ముందుకు వెళితే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు మరి కొందరు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

దురంధర్ ను మించి.. అటు పాక్ ను.. ఇటు దేశాన్ని షేక్ చేసే చిత్రం...

Chauhan Teaser
Chauhan Teaser

Chauhan Teaser: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద పెను సంచలనాన్ని నమోదు చేసిన సినిమా దురంధర్… అదొక సినిమా గానే కాకుండా భారతదేశంలోని కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్ పాకిస్తాన్ లో ఎలా జీవించారు. ఇక బ్యాక్ ఎండ్ నుంచి మన రాజకీయ నాయకులు పాకిస్తాన్ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ని అందించారు అనే విషయాలను చాలా క్లియర్ గా చూపించారు. ఇప్పుడు వస్తున్న ‘చౌహన్’ మూవీ మాత్రం దురంధర్ సినిమాని మించి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజై ఈ మూవీ టీజర్ ను చూసినట్లయితే ఇందులో భారతదేశంలో జరిగే రాజకీయ వ్యవస్థకు సంబంధించిన విషయాలను చాలా కులంకషంగా చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది… మన మీద డైరెక్ట్ గా యుద్ధం చేసి గెలవలేక పాకిస్తాన్ వాళ్ళు దేశవ్యాప్త గా క్రియేట్ చేసిన స్లిప్పర్స్ సెల్స్ ఆర్మీ కాన్వాయ్ మీద దాడి చేసి డబ్బులు పంపిణీ చేసే చీకటి పాకిస్తాన్ వ్యవస్థ మీద ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను అద్దం పట్టేలా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది… 2018 వ సంవత్సరంలో ఇండియా ఆర్మీ సోల్జర్స్ మీద రాళ్ళ దాడి చేశారు.వాహనాలు తగలబడిపోయాయి. తాజా ఆర్మీ సోల్జర్స్ ను కాపాడుకోవడానికి మేజర్ ఆదిత్య కుమార్ ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చాడు. సైనికులను రక్షించడం కోసం ఆదిత్య కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం మీద జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు కేసు ను నమోదు చేశారు. ఆయన మీద విచారణ చేపట్టారు. ఫేక్ లిబరల్స్ డ్రామా అంత ఇంతకాదు. వీళ్ళు పాకిస్తాన్ ఫండెడ్ అల్లరి మూకలకు మద్దతుగా నిలిచి ఇండియన్ ఆర్మీ ని డి మొరలైజ్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు…చివరికి ఈ కేసు సుప్రీం కోర్టు కి వెళ్లింది. అక్కడ ఈ కేసు మీద సుప్రీం కోర్ట్ స్టే విధించింది….

అలాగే ఇండియన్ ఆర్మీ వాళ్ళు మన రాజకీయ నాయకులు తెచ్చే ఒత్తిడి వల్ల ఎలా చేతులు కట్టుకుని డ్యూటీ సరిగ్గా చేయలేక ఉండిపోతున్నారనే విషయాలను కూడా ఇందులో కులంకషంగా చర్చించబోతున్నారు. దానికి తగ్గట్టుగానే ఇంతకుముందు బాలీవుడ్ హీరోలు చేసిన ఏక్తా టైగర్, బజరంగీ బాయ్ జాన్, పఠాన్ లాంటి సినిమాలు పాకిస్తాన్ తో అనుసంధానంగా ఉండే కథలతో నడిచాయి.

కానీ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ చీల్చి చెండాడే సినిమాలు మనవాళ్లు చేస్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక దీంతో బాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా ఒక పెద్ద చర్చ జరగబోతుంది… ఈ సినిమాని చూస్తే పాకిస్తాన్ సగం చచ్చిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ‘దురంధర్’ సినిమాతో భారీ దెబ్బ కొట్టిన ఆదిత్యధర్ పాకిస్తాన్ వాళ్లని కోలుకోలేకుండా చేశాడు.

వాళ్లు చేసే చీకటి కోణాలను బయట పెట్టాడు మొత్తానికైతే ఇప్పుడు ‘చౌహాన్’ మూవీ మరోరకంగా పాకిస్తాన్ ను దెబ్బ కొట్టబోతుందనేది వాస్తవం… ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఈ సినిమాలో ఎలాంటి అంశాలు చూపిస్తారు అనేది మనకు స్పష్టంగా తెలియదు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం దీని గురించి ఇంకా ఎక్కువ డిస్కషన్ చేసే అవకాశాలైతే ఉన్నాయి…

 

ఏపీకి భారీ హెచ్చరిక!

AP Rain Alert
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
* మరోవైపు ఉత్తరాంధ్రలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, పోలవరం జిల్లాల్లో శుక్రవారం నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి.
* అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
* అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. జూన్ 1 నాటికి ప్రవేశించాల్సిన రుతుపవనాలు.. దేశానికి ఆలస్యంగా తాకాయి.. విస్తరణలో కూడా తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. రుతుపవనాల కదలిక కూడా మందగించింది. అయితే తాజాగా అల్పపీడన ప్రభావంతో రుతుపవనాల విస్తరణకు చాన్స్ వచ్చింది.
* ఈ వర్షాలపై రైతులు నమ్మకం పెట్టుకున్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని చెబుతుండడంతో ఉపశమనం పొందుతున్నారు. అల్పపీడనం బలపడితే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
* సాధారణంగా జూన్ నుంచి డిసెంబరు వరకు భారీ వర్షాలు కురుస్తుంటాయి అల్పపీడనాలు, తుఫానుల ప్రభావంతో. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి అని అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు పడుతుండడం కొంత ఉపశమనం కలిగించే విషయం.

డ్రైవర్ లేకుండా కారులో ప్రయాణం.. ఆ ఎమ్మెల్యే సాహసం!

JC Asmith Reddy
JC Asmith Reddy

JC Asmith Reddy: మార్కెట్లోకి డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ఇవి చలామణి అవుతున్నాయి. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించి ఎంతో అనుభూతి పొందుతున్నారు. డ్రైవర్ లేకుండా ముందుకు సాగే ఈ కారులో ప్రయాణం ఒక కొత్త అనుభూతి. అటువంటి అనుభూతి తన కుటుంబ సభ్యులతో పొందారు టిడిపి ఎమ్మెల్యే. డ్రైవర్ లెస్ కారులు కుటుంబంతో ప్రయాణించి తన అనుభవాన్ని పంచుకున్నారు. మొదటిసారి డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించడం ఎంతో ఆనందంగా ఉందంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

* విదేశాల్లో కుటుంబంతో..
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు జేసీ అస్మిత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. అక్కడ డ్రైవర్ లెస్ కార్లు తన పిల్లలతో కలిసి ప్రయాణం చేసినట్లు ఒక వీడియోను షేర్ చేశారు. డ్రైవర్ లెస్ కారులో తొలిసారి ప్రయాణం చేస్తున్నానని.. తాను ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ఆ అనుభూతిని అందరితో పంచుకున్నారు. డ్రైవర్ లేకుండానే ఆ కారు అలా ముందుకు సాగుతోంది. వెనుక సీట్లో ఎమ్మెల్యే తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ వీడియో పై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అటువంటి కారును తాడిపత్రికి తీసుకురావాలని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

* మనదేశంలో తక్కువ..
అయితే మన దేశంలో డ్రైవర్ లెస్ కార్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కానీ చాలా దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో నడిచే ఈ కార్లు అందుబాటులోకి వచ్చాయి. చివరకు టాక్సీలు సైతం నడుపుతున్నారు ఈ విధానంలో. మన దేశానికి చెందిన ప్రముఖులు విదేశాలకు వెళ్లిన సమయంలో ఈ డ్రైవర్ లెస్ కారులో ప్రయాణిస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అమెరికాలో వేమో పేరుతో రోబో టాక్సీ సైతం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేకమైన యాప్ ద్వారా డ్రైవర్లు లేని కారులను సైతం బుక్ చేసుకోవచ్చు. ఈ కార్లలో స్పెషల్ కెమెరాలు, రాడార్, లీడర్ సెన్సార్లు కూడా ఉంటాయి.

 

అర్ధరాత్రి పూట భర్త ఆ పని.. తట్టుకోలేక విడాకులు కోరిన భార్య..

Husband Snoring Divorce Case
Husband Snoring Divorce Case

Husband Snoring Divorce Case: ఆమె విసిగిపోయింది. తట్టుకోలేకపోయింది. ఏళ్లుగా అదే బాధ. అతడికి చెప్పి చూసింది. అతడి వ్యవహార శైలి మారలేదు. పైగా మరింత దారుణంగా అతడు ప్రవర్తించ సాగాడు.. శారీరకంగా ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ.. ఆమెకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. ఎలా ఉండాలో అర్థం కాలేదు. చివరికి ఒక నిర్ణయం తీసుకుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. పైగా వారిద్దరు అన్యోన్యంగానే ఉంటారు. పడక పైకి వెళ్తే చాలు అతనిలో ఉన్న అపరిచితుడు బయటికి వస్తాడు. గట్టిగా శబ్దం చేస్తాడు. ఆ శబ్దం ఆమె తట్టుకోదు. ఆమెకు కనీసం నిద్ర కూడా ఉండడం లేదు. ఆ శబ్దం తీవ్రతకు కొన్ని సందర్భాల్లో ఆమె రాత్రంతా మెలకువతోనే ఉండాల్సి వస్తోంది. భర్తకు చెప్పి చూసినప్పటికీ అతని ప్రవర్తన మారలేదు. దీంతో ఆమె విడాకులు కోరుకుంది.

భర్త నుంచి వస్తున్న ఆ శబ్దం పేరు గురక.. అతడు అదే పనిగా గురక పెడుతున్న నేపథ్యంలో ఆమెకు నిద్ర ఉండడం లేదు. దీంతో ఆ గురకను భరించలేక ఆమె విడాకులకు దరఖాస్తు చేసింది. ఫ్యామిలీ కౌన్సిలర్లను ఆశ్రయించింది. తనకు నిద్ర పట్టడం లేదని చెప్పినప్పటికీ భర్త తన తీరు మార్చుకోవడం లేదని.. అతడి తో కేవలం గురక మాత్రమే సమస్యగా ఉందని.. మిగతా ఇబ్బందులు ఏమీ లేవని ఆమె చెప్పింది. దీంతో ఫ్యామిలీ కౌన్సిలర్లు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. మూడు నెలలపాటు విడిగా ఉండాలని సూచించారు. ఆ మూడు నెలల్లో ఆమెకు భర్త విలువ తెలిసి వచ్చింది. దీంతో ఆమె విడాకుల నిర్ణయాన్ని మార్చుకుంది.

గురక వల్ల ఆ మహిళ చాలా రోజులపాటు నిద్రను కోల్పోయింది. పైగా భర్త నుంచి విపరీతంగా గురక రావడంతో ఆమె తట్టుకోలేకపోయింది. అందువల్లే విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కాకపోతే కౌన్సిలింగ్లో తన నిర్ణయాన్ని మార్చుకుంది.. అయితే ఇప్పుడు అభర్త తన గురక సమస్య నివారణకు చికిత్స తీసుకున్నాడా? లేదా? అనే వివరాలు తెలియ రాలేదు. కాకపోతే కేవలం గురుకను సమస్యగా చూపించి విడాకుల కోసం ఒక భార్య దరఖాస్తు చేయడం దేశంలోనే ఇది తొలిసారి అని అక్కడి ఫ్యామిలీ కౌన్సిలర్లు చర్చించుకోవడం ఇక్కడ విశేషం.