Homeఎంటర్టైన్మెంట్Fauji Fire Accident : 'ఫౌజీ' మూవీ సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం.. ప్రభాస్ పరిస్థితేంటంటే.....

Fauji Fire Accident : ‘ఫౌజీ’ మూవీ సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం.. ప్రభాస్ పరిస్థితేంటంటే.. వీడియో వైరల్..

Fauji Fire Accident : ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘ఫౌజీ’. ‘సీత రామం’ వంటి భారీ హిట్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి చేస్తున్న చిత్రమిది. శరవేగంగా ఘాన్గ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. నెట్ ఫ్లిక్స్ కూడా ఒకవేళ ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తే , భారీ మొత్తం మీద డీల్ […]

Fauji Fire Accident : ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘ఫౌజీ’. ‘సీత రామం’ వంటి భారీ హిట్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి చేస్తున్న చిత్రమిది. శరవేగంగా ఘాన్గ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. నెట్ ఫ్లిక్స్ కూడా ఒకవేళ ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తే , భారీ మొత్తం మీద డీల్ కుదిరించుకోవడానికి సిద్ధమని మేకర్స్ కి చెప్పడం తో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వేగం పెంచారు. ప్రస్తుతానికి ఈ సినిమా మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే నేడు ఈ సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

సోషల్ మీడియా లో సెట్స్ కాలిపోతున్న విజువల్స్ ని అప్లోడ్ చేయగా, ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇది నిజంగానే అగ్ని ప్రమాదం జరిగిందా?, లేదా ఏదైనా షాట్ కి సంబంధించిన సన్నివేశం చిత్రీకరణ లో భాగంగా ఇలా చేశారా అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఈ విజువల్స్ ని చూసి సోషల్ మీడియా లో భయపడుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. కేవలం షూటింగ్ కి సంబంధించిన ప్రాపర్టీ మాత్రమే డ్యామేజ్ అయ్యిందని అంటున్నారు. దీనిపై మూవీ టీం స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప, మరో ప్రమోషనల్ కంటెంట్ విడుదల అవ్వలేదు. ప్రభాస్ అభిమానులు టీజర్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మూవీ టీం నుండి రెస్పాన్స్ లేదు.

దీంతో ఫ్యాన్స్ మూవీ టీం ని ట్యాగ్ చేసి , అసలు ఈ సినిమా ఉందా?, లేదంటే ఆపేసారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఫౌజీ చిత్రానికి సంబంధించిన ప్రధానమైన యాక్షన్ భాగం పూర్తి అయ్యాక , ఆయన పూర్తి ఫోకస్ స్పిరిట్ మీదనే పెట్టారు. ఇక టాకీ పార్ట్ అయితే పూర్తి అయ్యి చాలా రోజులైంది. ప్రస్తుతం ప్రభాస్ కి సంబంధించి కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. త్వరలోనే ఆ ప్యాచ్ వర్క్ ని కూడా పూర్తి చేయబోతున్నారు. డిసెంబర్ 3 న గ్రాండ్ గా విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper