Home Blog Page 32

భారత సైన్యానికి భీకర దండు.. పాక్ తోక జాడిస్తే వేసేయడమే.. ఖతమే ఇక..

Indian Army Kamikaze Drones 2026
Indian Army Kamikaze Drones 2026

India Army : ఒకప్పుడు సరిహద్దుల్లో పరిస్థితి దారుణంగా మారినప్పుడు.. క్షేత్రస్థాయిలో పనిచేసేవారు పై అధికారులకు సమాచారం అందించేవారు. పై అధికారులు తమ దళాలకు నాయకత్వం వహించే వ్యక్తికి చెప్పేవారు. ఆయన హోంశాఖ సెక్రటరీ దాకా తీసుకెళ్లేవారు. హోంశాఖ సెక్రటరీ హోం మంత్రి కి వర్తమానం పంపేవారు. హోమ్ మంత్రి క్యాబినెట్లో చర్చించి.. ప్రధానమంత్రి కి చెప్పి.. ప్రధానమంత్రి మళ్ళి మేడం సలహా తీసుకొని.. రంగంలోకి దిగేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయ్యేది. పాకిస్తాన్ వాడు మన మీద దాడి చేసే వాడు. మన సైనికులను చంపేసేవాడు. ముఖ్యంగా సరిహద్దుల్లో రక్త ప్రవాహం కొనసాగించేవాడు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాడి చేస్తే ఏకంగా పాకిస్తాన్ మీదికి వెళ్లి ప్రతి దాడులు చేసే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎరిగింది.. ఒకరిని చంపితే పది తలకాయలు తీసుకొచ్చే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎదిగింది. సరిహద్దుల్లో రక్తపాతం సృష్టిస్తే.. పాకిస్తాన్ దేశానికి వెళ్లి ఉగ్రవాదులను చంపే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎదిగింది.. మధ్య మధ్యలో రకరకాల ఆపరేషన్లు.. రకరకాల వ్యవహారాలు.. కరుడుగట్టిన తీవ్రవాదులను మట్టు పెట్టడాలు వంటివి జరిగిపోతున్నాయి. ఫలితంగా పాకిస్తాన్ భారత్ అంటేనే పోసుకుంటున్నది. అయితే భారత్ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు. ఇంతటితోనే తన ఆర్మీని నిలుపుదల చేయడం లేదు.

ప్రస్తుతం భారత్ దగ్గర అత్యంత శక్తివంతమైన డ్రోన్లు 50వేల వరకు ఉన్నాయి. ఇవి నిత్యం పహారా కాస్తూ ఉంటాయి. యుద్ధ రంగంలో భీకరంగా పోరాడుతూ ఉంటాయి. చివరికి పాకిస్తాన్ చేతికి చిక్కకుండా ఏం చేయాలో అవి చేసి వస్తాయి. ఒకప్పటితో పోల్చి చూస్తే.. ఇప్పుడు భారత్ దగ్గర అత్యంత ఖరీదైన ఆయుధాలు.. బాంబులు.. యుద్ధ సామగ్రి.. శక్తివంతమైన పరికరాలు ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలల్లో వీటి సంఖ్య డబుల్, త్రిపుల్ కాబోతోంది. ఈ లెక్కన చూస్తే పాకిస్తాన్ తోక జాడిస్తే చాలు ఖతం చేసే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎదిగింది.

లక్ష కోట్ల ఖర్చుతో డిఫెన్స్ డిపార్ట్మెంట్ మరిన్ని అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోబోతోంది. ఇవన్నీ కూడా ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తయారవుతున్నాయి. ఒకప్పుడు ఆయుధాలను భారత్ దిగుమతి చేసుకునేది. వీటికోసం భారీగా ఖర్చు పెట్టేది. కానీ ఇప్పుడు సొంతంగా తయారు చేసుకుంటున్నది. ఇతర దేశాలకు అమ్ముతున్నది. ఈ 12 సంవత్సరాలలో భారత్ ఏ స్థాయిలో ఎదిగింది.. ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది.. అనే విషయాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని జాతీయవాదులు అంటున్నారు.
image.png

ఎన్టీఆర్ మీద విషం కక్కుతున్నది ఎవరు..?

NTR
NTR

NTR: నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్…స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మొన్న వచ్చిన వార్ 2 సినిమా వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా అతన్ని ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా నందమూరి అభిమానులైతే అతన్ని అభిమానిస్తూ తమ ఫ్యామిలీ మూడోవతరం హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ పండగ చేసుకుంటున్నారు. ఈ విషయం మీద కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీ అభిమానులు విశేషమైన ఆదరణను చూపిస్తున్నారు. అయినప్పటికి బ్యాక్ ఎండ్ నుంచి కొంత మంది కావాలనే ఎన్టీఆర్ మీద విమర్శలు చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక బాలయ్య బాబుకి, జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య చాలా విభేదాలైతే ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసిపోతారు అనుకున్న ప్రతిసారి ఎవరికి వారు విడిపోయి ఉంటున్నారు.

మరి ఈ కారణం చేతనే వీళ్లిద్దరి మధ్య ఏకాభిప్రాయం అయితే రావడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి అభిమానుల్లోనే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకని అతని మీద అలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు.

ఇక ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం వారసుడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. పాన్ ఇండియాలో నందమూరి ఫ్యామిలీ పేరు వినిపిస్తుంది అంటే అది జూనియర్ ఎన్టీఆర్ పుణ్యమే అని మరి కొంతమంది చెబుతున్నారు…

ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస లైనప్ తో బిజీగా ఉన్నాడు. భారీ పాన్ ఇండియా సినిమాలను చేసుకుంటూ స్టార్ హీరోలకు పోటీని ఇస్తూ టైర్ వన్ హీరోగా ముందుకు దూసుకెళ్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… తన నుంచి రాబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఆ న్యూస్ ఛానల్ పెద్ద అమెరికా లో హల్ చల్.. పక్కన కేఏ పాల్.. ఏదో కొడుతుంది శీనా

tv9-telugu-md-rajinikanth

Channel Chairman US Visit: ఆ చానల్ పెద్ద ఉన్నట్టుండి అమెరికా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్లిపోయారో తెలియదు. ఛానల్ కు సంబంధించిన అధికారిక కార్యక్రమం కూడా కాదు. ఇటీవల ఆయన తన కూతుర్ని చూసేందుకు ఢిల్లీ వెళ్లిపోయారు. అది కూడా ప్రత్యేకమైన ప్రైవేట్ విమానంలో. ఒక సాధారణ జర్నలిస్టు ఈ స్థాయిలో ఆడంబరమైన జీవితాన్ని గడపడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొంతమంది నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న ఒక పార్టీ తో ఆయన గట్టిగా నడుచుకున్నారని.. దీనివల్ల ఆయనకు భారీగానే ముట్టాయని వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఆయన అనేక విధాలుగా పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు సంపాదించారని.. కోట్లు వెనకేసుకున్నారని ప్రచారం మొదలైంది. దీనిని ఆ ఛానల్ పెద్ద ఖండించినప్పటికీ.. నెగిటివ్ వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఆ ఛానల్ పెద్ద అమెరికా వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లారో తెలియదు. తాను పనిచేస్తున్న ఛానల్ కు సంబంధించిన అధికారిక కార్యక్రమం కూడా కాదు. ఆయన వెంట ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఉన్నారు. ఇంకా కొంతమంది అమెరికన్ చట్టసభలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఉన్నారు. దీంతో ఆ ఛానల్ పెద్దపై విమర్శలు మళ్లీ మొదలయ్యాయి. ఇన్ని రోజులపాటు నెగిటివ్ ప్రచారాన్ని ఎదుర్కొన్న ఆయన అమెరికా ఎందుకు వెళ్లిపోయారు.. శ్వేత దేశానికి వెళ్ళిపోవాల్సిన అవసరమేంటి.. అక్కడ ఎన్ని రోజులపాటు ఉండాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.. ఇలా అనేక రకాలుగా చర్చలు సాగుతున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్టు వారు వార్తలు రాస్తున్నారు. గుసగుసలను తమకు నచ్చినట్టుగా పబ్లిష్ చేస్తున్నారు.

ఆ చానల్ పెద్ద గతంలో ఇంటర్వ్యూ నిర్వహించేవారు. ప్రైమ్ టైం లో వార్తలు కూడా చదివేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా ఆయన ఇటీవల కాలంలో వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఈ నెగిటివ్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇది ఇలా సాగుతుండగానే ఆయన అమెరికా వెళ్లిపోయారు. గతంలో ఆయన అనేక సందర్భాల్లో అమెరికా వెళ్ళినప్పటికీ.. ఎన్నడూ కూడా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. వాటికి ఆయన ఏ విధమైన సమాధానాలు ఇస్తారో చూడాల్సి ఉంది. గతంలో ఆయన కేఏ పాల్ తో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇప్పుడు కేఏ పాల్ తో ఆయన కనిపించారు. కేఏ పాల్ కు అమెరికాలో బలమైన సంబంధాలు ఉన్నాయి. అమెరికా లో కీలకమైన నేతలతో ఆయన నేరుగా మాట్లాడగలరు. అందువల్లే ఆ ఛానల్ పెద్ద అమెరికా వెళ్లారేమో.. పక్కన కె ఏ పాల్ కూడా ఉన్నారు కాబట్టి.. ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారని వినికిడి.

కఠినమైన డైట్ లేదు.. ఎక్సర్ సైజూ లేదు.. 24 వారాల్లో 25 కిలోల బరువు తగ్గాడు..

Healthy Weight Loss
Healthy Weight Loss

Healthy Weight Loss: నేటి కాలంలో శారీరక శ్రమ తగ్గిపోతుంది. దీనికి తోడు తినే తిండిలో కూడా చాలా మార్పు వచ్చింది. అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తోంది. నాన్ వెజ్ డైలీ మెనూలో ఉంటోంది. దీంతో చాలామంది తెలియకుండానే బరువు పెరిగిపోతున్నారు. కొందరైతే ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారు. మద్యం తాగి అలవాటు లేకపోయినప్పటికీ చాలామంది ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. ఇదంతా కూడా నేటి ఆధునిక కాలంలో సర్వ సాధారణంగా మారిపోయింది.

అసాధారణంగా బరువు పెరిగినవారు.. దానిని తగ్గించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే కఠినమైన వ్యాయామాలు చేస్తున్నారు. ఇంకొందరైతే కడుపు మార్చుకుంటున్నారు. వీటివల్ల కొన్ని సందర్భాలలో అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. అటువంటి వారికోసం ఇతడు గొప్ప ప్రయోగాన్ని చేశాడు. అంతేకాదు బరువు తగ్గిందని ఆశ్చర్యపరిచాడు

అతడి పేరు అలీ. శారీరక సామర్ధ్య నిపుణుడు. ఇతడు కొన్ని సులభమైన విధానాలతో కేవలం 24 వారాల్లోనే 25 కిలోల బరువు తగ్గి చాలామందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రతిరోజు అతడు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాడు. 8 గంటల పాటు నిద్రపోయాడు. క్రమం తప్పకుండా జిమ్ చేశాడు. అదే సమయంలో వాకింగ్ కూడా చేశాడు. ఇవన్నీ కూడా రోజు ఒకే విధంగా ఉండేలా ప్రణాళిక రూపొందించాడు. తక్కువ ఆహారం తీసుకున్నాడు. ఖాళీ కడుపుతో ఎన్నడూ ఉండలేదు. ప్రతిరోజు 180 నుంచి 200 గ్రాముల ప్రోటీన్ తీసుకున్నాడు. తీపి పదార్థాల జోలికి వెళ్లలేదు. జంక్ ఫుడ్ ముట్టుకోలేదు. తాజా కూరగాయలను.. ఆకుకూరలను తీసుకున్నాడు. పండ్లకు ప్రాధాన్యమిచ్చాడు. ఫలితంగా బరువు తగ్గి.. నాజుకుగా మారిపోయాడు.

పాఠకులకు ముఖ్య గమనిక

ఈ కథనం కేవలం పాఠకులకు అవగాహన కల్పించడానికి మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానాలను ఓకే తెలుగు ఆమోదించదు. ఈ సమాచారాన్ని వివిధ వేదికల వద్ద సేకరించి పాఠకుల కోసం అందించాం. దీనిని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా చూడకూడదని సవినయంగా మనవి చేస్తున్నాం.

వైభవ్ సూర్య వంశీ పరిస్థితి ఏంటి.. రెండో మ్యాచ్ లోనూ "ఆఅ"కే పరిమితమా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: సంజు సరిగా ఆడటం లేదు. టెక్నిక్స్ మార్చుకోవడం లేదు. అదేవిధంగా పదేపదే ఆడుతూ వికెట్ పడేసుకుంటున్నాడు. ఓపెనర్ గా రంగంలోకి వస్తున్న అతడు.. పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. నిర్లక్ష్యమైన బ్యాటింగ్ తో అయితే సున్నా.. లేకుంటే ఒక పరుగు మాత్రమే చేసి వెళ్ళిపోతున్నాడు.

తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సరిగ్గా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నప్పటికీ.. జట్టు అవసరాల దృష్ట్యా అతడు భీకరంగా ఆడలేక పోతున్నాడు. కేవలం తన వ్యక్తిగత రికార్డుల కోసం మాత్రమే ఆడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఐర్లాండ్ సిరీస్లో రెండవ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. తిలక్ వర్మ మీద విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అతడు బ్యాటింగ్ చేసిన విధానం అత్యంత నిదానంగా ఉంది. అతడు నిదానంగా బ్యాటింగ్ చేయడం వల్లే చేయాల్సిన పరుగులు పెరిగిపోయాయి. తదుపరి బ్యాటర్ల మీద ఒత్తిడి పెరిగింది.

ఇషాన్ కిషన్ కూడా అంత గొప్పగా ఆడటం లేదు. ఐపీఎల్ లో పోటాపోటీగా పరుగులు చేసిన అతడు. ఐర్లాండ్ సిరీస్లో ఫ్లాప్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అన్ని వేళ్ళు అతడిని చూపిస్తున్నాయి. ఇంకా ఎందుకు అతడికి జట్టులో చోటు కల్పిస్తున్నారని సీనియర్ ప్లేయర్లు విమర్శలు చేస్తున్నారు. సంజు.. కిషన్ కు పదేపదే అవకాశాలు ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టి20 వరల్డ్ కప్ గెలవడానికి కారణమైనంతమాత్రాన సంజు ను ఇంకా ఎన్నిసార్లు మోస్తారని మేనేజ్మెంట్ ను ఉద్దేశించి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సంజు కోసం సూర్య వంశీని ఆటలో అరటిపండుగా మార్చేస్తున్నారని మండిపడుతున్నారు.

సంజును పక్కనపెట్టి.. వైభవ్ సూర్య వంశీకి జట్టులో చోటు కల్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఐర్లాండ్ సిరీస్లో అతడిని పక్కన పెట్టారు. కేవలం మంచినీళ్లు అందించేందుకు మాత్రమే ఉపయోగించుకున్నారు. తాజా ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా అతనికి అవకాశం ఇవ్వడం లేదు. రెండో మ్యాచ్లో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. ఇంకా నాలుగు మ్యాచ్లు మిగులు ఉన్నాయి. బ్రూక్, బట్లర్, సాల్ట్ వంటి అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్లు ఉన్నారు. వారిని అడ్డుకోవాలంటే బౌలింగ్ బలపడాలి. బ్యాటింగ్ అంతకంటే బలపడాలి. ఆతిథ్య జట్టు మందు భారీగా లక్ష్యాలను విధించకపోతే టీమిండియా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. లోపాలు కనిపిస్తున్నప్పటికీ మేనేజ్మెంట్ పెద్దగా దిద్దుబాటు చర్యలకు దిగడం లేదు. సీనియర్ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వకుండా మానడం లేదు. ఇదే కనుక సాగితే ఇంగ్లాండ్ సిరీస్ లోనూ టీమిండియాకు ఊహించని ఫలితం వస్తుంది. అప్పుడు చింతించి లాభం ఉండదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

మేఘాలయ హనీమూన్ కేసు.. భర్తను చం** భార్యకు బెయిల్..

Meghalaya Honeymoon Case
Meghalaya Honeymoon Case

Meghalaya Honeymoon Case: సరిగ్గా గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మేఘాలయ హనీమూన్ కేసు. ఈ వ్యవహారంలో తన భర్తను ప్రేమికుడితో కలిసి చంపేసింది సోనం అనే యువతి. ఆ తర్వాత అనేక రకాలుగా డ్రామాలు ఆడింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. అయితే ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఒక వార్త మరోసారి జాతీయ మీడియాలో ప్రధానంగా కనిపించింది.

శుక్రవారం సోనం కు సంబంధించిన బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు లో వాదనలు జరిగాయి. విచారణ నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కాస్త గందరగోళం ఏర్పడింది. ముందుగా బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ కేసులో సోనం బెయిల్ మీద బయటకు వచ్చింది. దీంతో సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. ఆమె బెయిల్ మీద ఇప్పటికీ బయటనే ఉన్నందున.. ఆ విషయంలో తాము జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి చెందిన రాజా రఘువంశీని గత ఏడాది మే 11న సోనం వివాహం చేసుకుంది. నూతన దంపతులు మే 20న మేఘాలయ ప్రాంతానికి హనీమూన్ వెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరూ కనిపించలేదు. ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఫలితంగా వారు పోలీసులను ఆశ్రయించారు.

రఘు వంశీ అదృశ్యమైన 11 రోజుల అనంతరం అతడి మృతదేహాన్ని ఓ జలపాతం సమీపంలో పోలీసులు గుర్తించారు. అతడి దేహం మీద కత్తి పోట్లు ఉన్నాయి. అనంతరం పోలీసులు సోనం కోసం గాలించడం మొదలుపెట్టారు. సరిగ్గా జూన్ ఏడున్న ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ ప్రాంతంలో కనిపించింది.. పోలీసులు విచారించగా ప్రియుడితో కలిసి ఆమె రఘు వంశీని చంపినట్టు తేలింది. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహ… ఇంకా కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే సోనం.. మరికొందరికి బెయిల్ వచ్చింది.

సరిగ్గా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో షిల్లాంగ్ కోర్టు సోనం కు బెయిల్ ఇచ్చింది. సెక్షన్లు నమోదు చేయడంలో పోలీసులు తప్పు చేయడం వల్లే ఆమెకు బెయిల్ వచ్చిందని తెలుస్తోంది.. అయితే ఈ బెయిల్ ఇవ్వడాన్ని మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ మెహత సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఆమె ఇప్పటికే బెయిల్ మీద విడుదలైన నేపథ్యంలో.. ఇంకా క్రూరంగా ఉండాలని అనుకోవడం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం విశేషం.

సందీప్ వంగ vs ప్రశాంత్ నీల్... వీళ్లలో ఎవరు టాప్ డైరెక్టర్... ఎవరి బలాలు, బలహీనతలు ఏంటి..?

Sandeep Reddy Vanga Vs Prashanth Neel
Sandeep Reddy Vanga Vs Prashanth Neel

Sandeep Reddy Vanga Vs Prashanth Neel: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఇప్పటికే టైర్ వన్ హీరోలతో సినిమాలను చేస్తున్న దర్శకులు రికార్డులను కొల్లగొట్టడంలో విపరీతమైన పోటీని చూపిస్తున్నారు. ఒకరిని మించి ఒకరు భారీ బడ్జెట్ ను పెట్టిస్తూ సినిమా మీద అంచనాలను పెంచుతూ ఎలాగైనా సరే ఆ సినిమాను సక్సెస్ ఫుల్ గా డీల్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగా సైతం ప్రస్తుతం చేస్తున్న ‘స్పిరిట్’ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…ఇక ఈ సినిమాను ప్రభాస్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా మార్చాలని చూస్తున్నాడు. 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతుందనే అంచనాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఇలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రశాంత్ నీల్ సైతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఇంతకు ముందు ఆయన చేసిన కెజిఎఫ్, సలార్ లాంటి సినిమాలతో తనదైన మార్క్ మేకింగ్ ను చూపించిన ఆయన మాస్ కమర్షియల్ సినిమాలను విభిన్న తరహాలో తెరకెక్కించి సక్సెస్ లను అందించడంలో సిద్ధహస్తుడనే చెప్పాలి.

సందీప్ రెడ్డివంగా – ప్రశాంత్ నీల్ మధ్య విపరీతమైన పోటి అయితే నడుస్తుంది. అయినప్పటికి రాబోయే సినిమాలతో ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు. తద్వారా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబడతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి సందీప్ రెడ్డివంగా చాలా డీసెంట్ సబ్జెక్టుని తీసుకొని దాన్ని బోల్డ్ గా వైలెంట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం పేరు ఉన్న కథను తీసుకొని దానిని మాస్ కమర్షియల్ హంగులతో నింపేస్తూ ఎలివేషన్స్ తో ప్రేక్షకుడి మెప్పు పొందుతుంటాడు. ఇక వీరిద్దరి బలాలు ఇవే…

ఇక బలహీనతల విషయానికి వస్తే సందీప్ రెడ్డివంగా సినిమాలో కొంతవరకు బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే విమర్శలైతే వస్తూ ఉంటాయి. ఇక ప్రశాంత్ నీల్ సినిమా విషయానికి వస్తే ఆయన చేసే అన్ని సినిమాలు కూడా ఒకే టెంప్లేట్ లో ఉండడం అనేది కొంతమంది ప్రేక్షకులకు నచ్చడం లేదు…ఇక ఏది ఏమైన కూడా రాబోయే సినిమాలతో ఎవరు సూపర్ సక్సెస్ ని సాధిస్తే వాళ్ళు టాప్ పొజిషన్ కి వెళ్తారనేది వాస్తవం…

పాకిస్తాన్ కుట్రలో భాగమయిన భారతీయ కుహనా మేధావులు

India Pakistan Relations

India Pakistan Relations : భారత్-పాకిస్తాన్ సంబంధాలు ఎప్పుడైనా చర్చకు వస్తే ఒక విషయం మాత్రం ఎప్పటికీ మరవకూడదు. అది సరిహద్దు దాటి వచ్చే ఉగ్రవాదం. దశాబ్దాలుగా వేలాది మంది భారతీయ పౌరులు, సైనికులు, భద్రతా సిబ్బంది ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య శాంతి, చర్చలు, ప్రజల మధ్య సంబంధాల పునరుద్ధరణ గురించి ఎవరైనా మాట్లాడితే, ఆ పిలుపు ఎంత సమతుల్యంగా ఉందో ప్రజలు సహజంగానే పరిశీలిస్తారు.

ఇటీవల భారత్, పాకిస్తాన్‌కు చెందిన 117 మంది ప్రముఖులు ఇరు దేశాల ప్రధానమంత్రులకు సంయుక్త లేఖ రాశారు. అందులో దౌత్య సంబంధాల పునరుద్ధరణ, అట్టారీ సరిహద్దు తెరవడం, వీసా సేవలు పునఃప్రారంభించడం, శ్రీనగర్-ముజఫరాబాద్ బస్సు సేవలు తిరిగి ప్రారంభించడం, కర్తార్‌పూర్ కారిడార్, శారదా పీఠానికి యాత్రలను పునరుద్ధరించడం వంటి అంశాలను ప్రస్తావించారు.

అయితే విమర్శకులు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే.. భారత్ ఎన్నిసార్లు చెప్పినట్లు, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ప్రధాన అడ్డంకి ఉగ్రవాదమే. అలాంటప్పుడు ఆ లేఖలో సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదాన్ని ఖండించడం లేదా పాకిస్తాన్ తన భూభాగాన్ని ఉగ్రవాదానికి వేదికగా మారనీయకూడదని స్పష్టంగా పేర్కొనడం ఎందుకు కనిపించలేదనే ప్రశ్న.

ఈ విమర్శను పూర్తిగా విస్మరించడం కూడా సరికాదు. ఎందుకంటే భారత ప్రభుత్వం చాలా కాలంగా “ఉగ్రవాదం మరియు చర్చలు ఒకేసారి సాగవు” అనే వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తోంది. అలాంటి నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ప్రస్తావించకుండా కేవలం సంబంధాల పునరుద్ధరణకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆ లేఖ ఏకపక్షంగా కనిపిస్తోందని కొందరు భావించడం సహజం.

అయితే అదే సమయంలో, కేవలం ఒక లేఖ ఆధారంగా ఆ లేఖపై సంతకం చేసిన వారందరూ “పాకిస్తాన్ కుట్రలో భాగమయ్యారు” లేదా “దేశద్రోహులు” అని తేల్చేయడం కూడా బలమైన ఆధారాలు లేకుండా చేసే తీవ్రమైన ఆరోపణ అవుతుంది. ఒక ప్రజాస్వామ్యంలో పౌరులు లేదా మేధావులు శాంతి చర్చలను కోరే హక్కు కలిగి ఉంటారు. వారి అభిప్రాయాలతో విభేదించడం ఒక విషయం; వారు విదేశీ కుట్రలో భాగమని నిర్ధారించడం మరో విషయం.

భారత్‌కు నిజమైన శాంతి కావాలంటే, ముందుగా పాకిస్తాన్ తన భూభాగం నుంచి భారతదేశంపై ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా నమ్మదగిన చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాతే దౌత్య సంబంధాల విస్తరణ, ప్రజల రాకపోకలు, వాణిజ్యం వంటి అంశాలపై చర్చలకు బలమైన పునాది ఏర్పడుతుంది. ఈ వాస్తవాన్ని పక్కనబెట్టి శాంతి గురించి మాత్రమే మాట్లాడితే, అలాంటి ప్రయత్నాలు ప్రజల్లో అనుమానాలకు తావివ్వడం సహజం.

దేశ భద్రత విషయంలో రాజీ ఉండకూడదు. అదే సమయంలో విభిన్న అభిప్రాయాలను కూడా వాస్తవాలు, ఆధారాల ఆధారంగానే విమర్శించాలి. శాంతి కోసం చేసే పిలుపు కూడా ఉగ్రవాదాన్ని నిర్ద్వంద్వంగా ఖండించినప్పుడే విశ్వసనీయతను సంతరించుకుంటుంది. భారత్‌కు శాంతి అవసరమే, కానీ ఆ శాంతి ఉగ్రవాదాన్ని విస్మరించే మూల్యం మీద కాకూడదు.

పాకిస్తాన్ కుట్రలో భాగమయిన భారతీయ కుహనా మేధావులు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణగా రాయండి..

బాలయ్య - కొరటాల శివ మూవీలో నటించనున్న ఇద్దరు స్టార్ హీరోలు...

Balakrishna
Balakrishna

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ముఖ్యంగా బీ,సీ సెంటర్లోని మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాడు. కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన బాలయ్య బాబు ప్రస్తుతం చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇక ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న ‘శివ కార్తికేయన్’ ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడట. ఇక ఆయన పాత్ర ఏంటి అనే విషయాన్ని దర్శకుడు ఎక్కడ కూడా రివిల్ చేయడం లేదు.

ఇక తనతో పాటుగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విజయ్ ఆంటోని ని సైతం ఈ సినిమాలో భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరి క్యారెక్టర్లు ఈ సినిమాలో చాలా కీలకంగా మారబోతున్నాయట. ఇక ఈ మూవీని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇతర భాషల హీరోలను కూడా ఇందులో భాగం చేస్తే సినిమాకి భారీ బజ్ ఏర్పడుతుంది.

అలాగే ఆయా భాషల్లో కూడా ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశ్యంతోనే కొరటాల శివ వాళ్ళిద్దరిని ఈ సినిమాలో భాగం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ ఇంతకు ముందు చేసిన ‘దేవర’ సినిమా సక్సెస్ ని సాధించినా కూడా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టలేకపోయింది. కాబట్టి తను ఈ సినిమాతో మరోసారి తన స్టామినాయేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదం కూడా ఉంది. టైర్ వన్ హీరోల నుంచి ఇప్పటికే అతనికి అవకాశాలైతే రావడం లేదు. కాబట్టి తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకుంటే తప్ప అతను స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోలేడనే చెప్పాలి…

అఖిల్ లెనిన్ మూవీతో సమంత రికార్డు ను బ్రేక్ చేస్తాడా...

Lenin First Day Collections
Lenin First Day Collections

Lenin Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వరరావు, నాగార్జున ఇద్దరు వాళ్ల స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన వారే కావడం విశేషం. ఇక వీళ్లిద్దరి తర్వాత నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీకి వచ్చారు కానీ వాళ్లు అనుకున్న రేంజ్ లో సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. దాంతో అక్కినేని ఫ్యామిలీ ఇమేజ్ కొంత వరకు తగ్గింది. ఇక ఇప్పుడు అఖిల్ మాత్రం ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ప్రస్తుతం లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ఈ సినిమా అతని కెరియర్లో ది బెస్ట్ మూవీ గా నిలిచిపోతుందా?

మొదటిసారి అతను బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకోబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే విధంగా ఉండాలి.

లేకపోతే మాత్రం ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ కంటే సమంతనే పై చేయిని సాధించింది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వ్యక్తం అయ్యే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఈ సినిమా విషయంలో ఇప్పటికే చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్న వీళ్ళు భారీ ఎత్తున ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఇక వచ్చే వారం ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా అఖిల్ స్టార్ హీరోగా మారబోతున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికైనా అక్కినేని ఫ్యామిలీలో ఉన్న మూడోతరం హీరోలు మంచి విజయాలను సాధిస్తే పర్లేదు లేకపోతే మాత్రం వాళ్ళు భారీ మూల్యాన్ని చెల్లించుకొక తప్పదు అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం హెచ్చరిస్తున్నారు…

స్టార్ హీరోలు చిన్న సినిమాలను నిర్మించేటప్పుడే అదొక్కటి చూసుకుంటే బాగుంటుందా..?

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలు ప్రొడ్యూసర్లుగా మారి చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. వాళ్ళు ఒకవైపు హీరోలుగా చేసుకుంటూనే మరొక హీరోను పెట్టి కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను నిర్మిస్తుండటం విశేషం… ఒకరకంగా ఇది చాలా మంచి పద్ధతి దీనివల్ల చాలామంది దర్శకులకు అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయా హీరోలు కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది. ఇక దానికి తోడుగా దర్శకుడు వాళ్లకు చెప్పిన కథను చెప్పినట్టుగా తీస్తున్నాడా? లేదా అనేది ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ సినిమా ఎక్కడైనా గాడి తప్పినా కూడా మొదటి నుంచే దర్శకుడికి ఇన్స్ట్రాక్షన్స్ ఇచ్చుకుంటూ వస్తే బాగుంటుంది. దాని వల్ల చిన్న సినిమాలు బతికే అవకాశం ఉంటుంది.

అలాగే దర్శకుడు సైతం సినిమాని ఎఫెక్ట్ గా తీర్చిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలు ప్రొడ్యూసర్లుగా మారి తమ సత్తా ఏంటో చూపించుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సైతం చిన్న సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరును సంపాదించుకుంటుండటం విశేషం…

ఇక తనతో పాటు మరి కొంతమంది స్టార్ హీరోలు సైతం చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి ఒక ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక నాని లాంటి హీరో సైతం ఇప్పటికే తను ప్రొడ్యూసర్ గా మారి ఆ,హిట్ సిరీస్, కోర్ట్ లాంటి సినిమాలను నిర్మించాడు. ఆ సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలను కూడా తెరమీదకి తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

ఇక వీళ్లతో పాటుగా మరికొంతమంది హీరోలు సైతం ప్రొడ్యూసర్లుగా మారడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాళ్ళకి సరైన కథ దొరికితే ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు ముందు వరుసలో ఉన్నామని చెబుతున్నారు. ఇంకొంతమంది హీరోలు సైతం వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వడానికి లేట్ అవుతుంది కాబట్టి ప్రొడ్యూసర్లుగా మారి సినిమాలను నిర్మిస్తే ఇండస్ట్రీ కి రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికులకు సైతం ఎక్కువగా పని దొరకడానికి ఆస్కారం ఉంటుందనే ధోరణిలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది…

అంత ఘోరం జరుగుతున్నా మీ ఖలిస్తాన్ ఉద్యమం పాకిస్తాన్ లో ఉండదా?

Khalistan Movement
Khalistan Movement

Khalistan Movement: పాకిస్తాన్‌ ఒకవైపు ఖలిస్తాన్‌ ఉద్యమం పేరిట సిక్కు సమాజాన్ని భారతదేశం నుంచి వేరు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఖలిస్తానీలకు ఆశ్రయం ఇస్తోంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందిస్తోంది. ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ఇక మరోవైపు తమ భూభాగంలోని సిక్కుల చారిత్రక ఆనవాళ్లను క్రమబద్ధంగా ధ్వంసం చేస్తోంది. ఇలా ద్వంద్వ వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది. ఈ విరుద్ధ చర్యలు సిక్కు సమాజం వారసత్వం, రాజకీయ ఉద్యమాల మధ్య వైరుధ్యాలు చర్చనీయాంశమయ్యాయి.

చారిత్రక గురుద్వారాలు ధ్వంసం..
పాకిస్తాన్‌లోని చారిత్రక గురుద్వారాలను ధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 125 సంవత్సరాల పురాతనమైన శ్రీ గురు సింగ్‌ సభా సాహెబ్‌ గురుద్వారాను కూల్చివేసింది. ఇది చారిత్రక, సాంస్కృతిక విలువ కలిగిన స్థలం. 1960లలో భారతదేశం నుండి వచ్చిన ముస్లింలకు ఈ స్థలాన్ని నివాసం కోసం అప్పగించినప్పుడు, దాని గురుద్వారా స్వరూపాన్ని మార్చకుండా ఉండాలని స్పష్టమైన షరతు విధించారు. అయినప్పటికీ, ఆ షరతును ఉల్లంఘించి పూర్తి ధ్వంసం చేయడం చారిత్రక వారసత్వం పట్ల అనాదరణను చూపిస్తోంది.

పాకిస్తాన్‌ ద్వంద్వ విధానం..
ఖలిస్తాన్‌ ఉద్యమం పేరిట సిక్కులను భారతదేశం నుంచి వేరు చేసి, పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సిక్కు సమాజంలో అస్థిరత కలిగించేందుకు ఉపయోగపడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్‌ తన దేశంలో సిక్కుల చారిత్రక గుర్తులను అంతం చేస్తుండటం ఈ ఉద్యమం వెనుక దాగిన ఉద్దేశాలపై సందేహాలు కలిగిస్తోంది. ఒకవైపు సిక్కులను ‘‘స్వతంత్ర రాష్ట్రం’’ పేరిట ఆకర్షించి, మరోవైపు తమ దేశంలోని సిక్కు సంస్కృతిని నాశనం చేయడం వ్యూహాత్మక వ్యతిరేకతను సూచిస్తోంది.

ఖలిస్తానీల మౌనం..
భారతదేశంలోని ఖలిస్తాన్‌ మద్దతుదారులు ఈ ధ్వంసం గురించి పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. ఒక్కరు కూడా ఈ విషయంలో మాట్లాడడం లేదు. నిజమైన సిక్కు వారసత్వం, హక్కుల కోసం ఉద్యమిస్తున్నట్లయితే, పాకిస్తాన్‌ చేస్తున్న ఈ చర్యలపై వారు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది ప్రశ్నార్థకం. పాకిస్తాన్‌పై పోరాటం చేయడం మానేసి, భారతదేశంపైనే దృష్టి సారించడం వారి ఉద్యమం యొక్క నిజమైన ప్రాధాన్యతను సందేహాస్పదం చేస్తోంది. ఇది ఉద్యమం సిక్కు సమాజం యొక్క వాస్తవ ప్రయోజనాల కోసం కాకుండా, ఇతర రాజకీయ లక్ష్యాల కోసం నడుస్తుందని సూచిస్తోంది.

ఢిల్లీలోని సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఈ సమస్య నేరుగా పాకిస్తాన్‌తో ముడిపడి ఉంది కాబట్టి, పాకిస్తాన్‌ను నేరుగా సంప్రదించి, అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి తీసుకురావడం మరింత సమర్థవంతంగా ఉండవచ్చు. భారత ప్రభుత్వం దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ సమస్యను లేవనెత్తడం అవసరం. సిక్కు సమాజం ఏకమై, తమ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవడానికి, ఈ విరుద్ధ చర్యలను ఖండించడానికి చర్యలు తీసుకోవాలి.

బంగారంతో లో దుస్తులు .. ఈ మహిళా ఎంపీ చేసిన పని తెలిస్తే అవాక్కే

Iraq Corruption
Iraq Corruption

Iraq Corruption: మనదేశంలో బంగారంతో మహా అయితే ఆడవాళ్లు ఆభరణాలు చేయించుకుంటారు. బాగా డబ్బున్న వాళ్ళైతే కాళ్ల పట్టీలు.. మెట్టెలు.. వడ్డాణం వంటివి చేయించుకుంటారు. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళైతే కంచాలు.. మంచాలు.. సోఫా సెట్లు బంగారంతో చేయించుకుంటారు. కానీ బంగారంతో.. ఈమె చేయకూడని పని చేసింది. చివరికి ఇలా దొరికిపోయింది..

మనదేశంలోనే కాదు అవినీతి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. గతంలో ఇతర దేశాలలో అవినీతి వ్యవహారాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ప్రతి విషయం తెలిసిపోతున్న నేపథ్యంలో.. ఇతర దేశాలలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు కూడా బయటపడుతున్నాయి. అటువంటిదే ఇది కూడా. కాకపోతే ఇక్కడ అవినీతికి పాల్పడింది ఇద్దరు మహిళలు. వారిద్దరు కూడా ప్రజాప్రతినిధులు. వారు అవినీతికి పాల్పడిన తీరు వేరే లెవెల్. అసలు ఇలా కూడా చేస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇరాక్ దేశంలో కొంతకాలంగా అవినీతి భారీగా పెరిగిపోయింది. దీంతో అక్కడ ప్రభుత్వం తనిఖీలు మొదలుపెట్టింది. దాడులను విస్తృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళ ఎంపీల ఇళ్లల్లో లెక్కకు మిక్కిలిగా అక్రమంగా పోగు చేసిన ఆస్తులు బయటపడ్డాయి. ఇలా అక్రమంగా ఆస్తులు సంపాదించిన వారిలో హింద్ ఆల్ అబ్బాసి, అలియా నసీఫ్ అనే ఎంపీలు ఉన్నారు. వీరి దగ్గర నుంచి అధికారులు వందల కోట్లు నగదు.. కిలోల పరిమాణంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అబ్బాసీ ఇంట్లో..

అవినీతి వ్యతిరేక అధికారులు ఇరాక్ దేశంలోని భాగ్యాధి ప్రాంతంలో గ్రీన్ జోన్ ఏరియాలో దాడులు జరిపారు. ఇందులో అబ్బాసి అనే ఎంపీ ఇంట్లో ఏకంగా 490 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 27 కిలోల అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని జట్టు చేశారు.. అబ్బాసి బంగారంతో లో దుస్తులు తయారు చేయించుకుంది. వాటిని ఆమె రాత్రిపూట ధరించేది. కొన్ని సందర్భాలలో తన ప్రైవేటు వ్యవహారాలలో పాల్గొన్నప్పుడు కూడా ధరించేది. బంగారంతో లో దుస్తులు రూపొందించుకున్న నేపథ్యంలో అబ్బాసి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

నసీఫ్ ఇంట్లో

నసీఫ్ అనే ఎంపీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. చివరికి ఆమె అవినీతి పరురాలిగా మారిపోయారు. పార్లమెంట్ ఇంటిగ్రేటెడ్ కమిటీకి ఆమె వైస్ చైర్మన్ గా పని చేశారు. తనకున్న గుర్తింపును అవినీతికి అనుకూలంగా మార్చుకున్నారు. ఆమె ఇంట్లో ఏకంగా 130 కోట్ల నగదు లభించింది.. భారీగా బంగారం దొరికింది.. ఎక్కువగా చమురు మంత్రిత్వ శాఖలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో.. అధికారులు విచారణ జరిపారు. ఇందులో 67 మందికి పైగా అధికారులు.. ఎంపీలను ఇరాక్ అధికారులు అరెస్ట్ చేయడం విశేషం.

ఎనిమిది రోజులుగా నీరు, ఆహారం లేదు. ఐనా బతికాడు..

Venezuela Earthquake
Venezuela Earthquake

Venezuela Earthquake: భూమ్మీద నూకలు ఉంటే.. యముడి పాశం నుంచి కూడా తప్పించుకోవచ్చు అంటారు. ఇతడు కూడా అలాంటి వాడే. చావు చివరి అంచుదాకా వెళ్లి వచ్చాడు. చివరికి అందరూ ఆశ్చర్యపోయే విధంగా కనిపించాడు. ఈ అద్భుతం వెనిజులా ప్రాంతంలో చోటుచేసుకుంది.

సరిగ్గా ఎనిమిది రోజుల క్రితం వెనిజులా ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. ఆ భవనాల శిధిలాల కింద చాలామంది పడి చనిపోయారు. ఈ శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ శిధిలాల కింద చాలావరకు మృతదేహాలను వెలికితీస్తున్నారు.

శిధిలాల కింద నుంచి మృత దేహాలను బయటకు తీస్తుండగా ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడు. వాస్తవానికి ఎనిమిది రోజులు ఆహారం.. తాగునీరు లేకపోయినప్పటికీ అతడు బ్రహ్మాండంగా వున్నాడు. పైగా అతడి శరీరం మీద టన్నులకొద్ది శిధిలాలు ఉన్నప్పటికీ అతడు జీవించ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ స్థాయిలో శిధిలాల కింద పడిపోయినప్పటికీ అతడు జీవించి ఉండడం అక్కడి అధికారులకు మిరాకిల్ మాదిరిగా ఉంది. ఆ వ్యక్తి ఒక షాపింగ్ మాల్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేసేవాడు. భూకంపం వల్ల శిధిలాలలో కూరుకుపోయాడు. దాదాపు 100 గంటల పాటు 140 టన్నుల శిథిలాలను తొలగించిన తర్వాత అతడిని బయటికి తీశారు.

శిధిలాల కింద ఇంకా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు వెనిజులా ప్రాంతంలో చోటు చేసుకున్న భూకంపం లో చనిపోయిన వారి సంఖ్య ఏకంగా 2595 కి చేరుకుంది. ఇంకా శిధిలాల తొలగింపు జరుగుతూనే ఉంది. మృతదేహాల వెలికితీత సాగుతూనే ఉంది.. భూకంపం వల్ల వెనుజులా ప్రాంతంలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రపంచ దేశాలు ఆహారం.. ఔషధాలు.. దుస్తులు.. ఇతర సామాగ్రిని పంపిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నాయి. ఇప్పటికీ భారత్ కూడా విడతలవారీగా వెనిజులా దేశానికి ఔషధాలు పంపించి తన సేవా తత్పరతను చాటుకుంది.

మహేష్ బాబు చెప్పినట్టుగా రావు బహదూర్ లో మార్పులు చేసి ఉంటే ఇంకా బాగుండేదా.?

Rao Bahadur
Rao Bahadur

Rao Bahadur Movie: సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావు బహదూర్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి నుంచే ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్న మేకర్స్ ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడంతో ఈ సినిమా యావరేజ్ టాక్ ను అయితే సంపాదించుకుంది. మొత్తానికైతే వెంకటేష్ మహా ఇంతకుముందు చేసిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఈ సినిమాని పోలిస్తున్నారు. నిజానికి ఆ మూవీకి ఈసినిమాకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే అది కంప్లీట్ ఎమోషన్స్ తో తెరకెక్కిన మూవీ, ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా కాబట్టి రెండింటికి పోల్చడం సరైనది కాదు.

అయినప్పటికీ ఈ జానర్ లో పర్ఫెక్ట్ గా సినిమాను ప్రజెంట్ చేశాడా అంటే లేదనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. కథ చెప్పినప్పుడే మహేష్ బాబు ఇందులో చాలా వరకు మార్పులు చేర్పులు చేయని చెప్పారట. కానీ దర్శకుడు వాటిని మార్చకుండా వాళ్ళని కన్విన్స్ చేశాడు.

దర్శకుడి కాన్ఫిడెంట్ చూసిన మహేష్ బాబు సైతం అందులో వేలు పెట్టలేదు. కానీ ఫైనల్ గా సినిమా చూసిన తర్వాత కొన్ని మార్పులు చేస్తే బాగుండేదేమో అంటూ సినిమా యూనిట్ నుంచి కూడా కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. నిజానికి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయిన కూడా ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ కలిగించే సన్నివేశాలైతే ఉండాలి. అవి ఉన్నప్పుడే సినిమా కూడా ముందుకు సాగుతుంది.

ఆ థ్రిల్లింగ్ సన్నివేశాలను కొంచెం యాడ్ చేయమని మహేష్ బాబు సలహా ఇచ్చాడట. కానీ వెంకటేష్ మహా మాత్రం దానిని పట్టించుకోలేదు. ఎట్టకేలకు సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు విజయాన్ని సాధించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మొదటి షో తోనే యావరేజ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ను రాబడుతుంది అనేది తెలియాల్సి ఉంది.

'పెద్ది' చిత్రానికి రామ్ చరణ్ అందుకున్న రెమ్యూనరేషన్ ఇంతేనా..? చాలా తక్కువ కదా..

Ram Charan Remuneration
Ram Charan Remuneration

Ram Charan Remuneration: ‘గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ రేట్స్ కి కొనడం వల్ల, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ నెంబర్ ని అందుకోలేకపోయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. రాయలసీమ , నెల్లూరు జిల్లాల్లో స్వల్ప నష్టాలు వచ్చిన విషయం వాస్తవమే కానీ , రిటర్న్ జీఎస్టీ నిర్మాతలు బయ్యర్స్ కి కడితే ఆ రెండు ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాకు రామ్ చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన రేంజ్ కి ఇది చాలా తక్కువ అని అభిమానులు ఫీల్ అవుతున్నారు.

‘గేమ్ చేంజర్ ‘ చిత్రం భారీ ఫ్లాప్ అవ్వడం తో , ‘పెద్ది’ చిత్రానికి రామ్ చరణ్ విడుదలకు ముందు ఎలాంటి అడ్వాన్స్ కూడా తీసుకోలేదట. విడుదల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చాక నిర్మాతలు ఆయనకు 60 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ని బట్టి రామ్ చరణ్ రేంజ్ కి తగ్గట్టు తీసుకోవాల్సి వస్తే 100 కోట్ల రూపాయిలు తీసుకోవచ్చు. కానీ గత చిత్రం ఫ్లాప్ అవ్వడం వల్ల, ఆయన కేవలం 60 కోట్లకు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారట. ఈ విషయాన్నీ తెలుసుకున్న ఫ్యాన్స్ , నిర్మాతల బాగోగులు గురించి ఆలోచించే హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు, ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో కళ్ళకు కనిపించింది , అయినప్పటికీ కూడా ఆయన రేంజ్ కి తగ్గ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు.

ఇకపోతే రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ దసరా నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రం తర్వాత ఆయన మరోసారి బుచ్చి బాబు తోనే ఒక సినిమా చేయబోతున్నారు అట. రీసెంట్ గానే ఒక ప్రముఖ నిర్మాత చేత బుచ్చి బాబు కి అడ్వాన్స్ కూడా ఇప్పించినట్టు సమాచారం. హైదరాబాద్ లో తన రైటింగ్ టీం తో ఆఫీస్ ని ఏర్పాటు చేసి కథ కూడా సిద్ధం చేసే పనిలో పడ్డారట.

అలా పిలిస్తే నేను ఇంటర్వ్యూ నుండి దొబ్బేస్తా అంటూ గెటప్ శ్రీను కి అఖిల్ వార్నింగ్.. వీడియో వైరల్..

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: సుమారుగా మూడేళ్ళ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ ఈ నెల 10 న ‘లెనిన్’ చిత్రం తో మన ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఇప్పుడు యూట్యూబ్ , ఇన్ స్టాగ్రామ్ వంటి యాప్స్ లో బాగా వైరల్ అయ్యాయి. ప్రతీ ఇంటర్వ్యూ లోనూ అఖిల్ మాట్లాడే మాటలను చూస్తుంటే , ఈ సినిమా పై ఆయన ఎంత నమ్మకం తో ఉన్నాడో తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రం లో గెటప్ శ్రీను ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన ఒక ఇంటర్వ్యూ కి హోస్ట్ గా మారి, అఖిల్ , భాగ్యశ్రీ లతో పాటుగా , ఈ చిత్రం లో కీలక పాత్రలు పోషించిన శివాజీ, బ్రహ్మాజీ లను ఇంటర్వ్యూ చేశారు.

అయితే ఈ ఇంటర్వ్యూ లో గెటప్ శ్రీను అఖిల్ ని మాటకు ముందు , మాట తర్వాత ‘సార్’, ‘సార్’ అంటూ సంబోధించడం అఖిల్ కి అసలు నచ్చలేదు. అందుకు ఆయన గెటప్ శ్రీను కి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ‘ఇంకోసారి నువ్వు సార్ అంటూ పిలిచావంటే నేను ఈ ఇంటర్వ్యూ నుండి దొబ్బేస్తా. నా కంటే ఇండస్ట్రీ లో సీనియర్ వి నువ్వు, కావాలంటే అరేయ్ , ఒరేయ్ అని పిలువు , ఊరికే సార్ ఏంటి?’ అంటూ మందలించారు. దీన్ని చూసిన అభిమానులు , వీళ్లిద్దరి మధ్య ఇంత మంచి సాన్నిహిత్యం ఉందా?, అని ఆశ్చర్యపోతూ పోస్టులు వేస్తున్నారు. ఒక కమెడియన్ కి అఖిల్ ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం పైన కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతం లో అఖిల్ హీరో గా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో గెటప్ శ్రీను పంతులు పాత్ర పోషించారు.

అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం ఇప్పటికీ అలాగే కొనసాగుతుండడం విశేషం. ఇక ‘లెనిన్’ విషయానికి వస్తే, ఈ చిత్రం తో అఖిల్ కచ్చితంగా కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నారని ఆయన అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. థియేట్రికల్ ట్రైలర్ కి కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా నాగార్జున కూడా ఔట్పుట్ పై పూర్తి స్థాయిలో సంతృప్తి గా ఉండడం అభిమానుల్లో ఈ చిత్రం పై మరింత నమ్మకాన్ని కలిగించింది. ఎందుకంటే నాగార్జున అంత సామాన్యంగా ఒక సినిమాని నచ్చడు, ఆయన స్టాంప్ పడిందంటే మాత్రం కచ్చితంగా హిట్ కొడుతాము అనే నమ్మకం అక్కినేని ఫ్యాన్స్ లోనే కాదు , ట్రేడ్ లో కూడా ఉంది. మరి ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి.