Homeఅంతర్జాతీయంUS Medical Costs : అమెరికాలో దోచుకుంటున్నారు..ఇండియాలో కళ్లకద్దుకుంటున్నారు.. యూఎస్ మహిళ వీడియో చర్చనీయాంశం

US Medical Costs : అమెరికాలో దోచుకుంటున్నారు..ఇండియాలో కళ్లకద్దుకుంటున్నారు.. యూఎస్ మహిళ వీడియో చర్చనీయాంశం

US Medical Costs : అమెరికా గురించి మనం చాలా గొప్పగా వింటాం. మీడియాలో అమెరికా గురించి రకరకాలుగా వార్తలు వస్తుంటాయి. కానీ అమెరికా అసలు రూపం లోతుగా చూస్తే గాని తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి అమెరికా అసలు రంగు కనిపిస్తోంది. అమెరికా గురించి.. అమెరికాలో అమల్లో ఉండే విధానాల గురించి ఒక యువతి.. అది కూడా ఆ దేశానికి సంబంధించిన ఓ యువతి బయటపెట్టింది. దీంతో అమెరికా అసలు ముఖచిత్రం […]

US Medical Costs : అమెరికా గురించి మనం చాలా గొప్పగా వింటాం. మీడియాలో అమెరికా గురించి రకరకాలుగా వార్తలు వస్తుంటాయి. కానీ అమెరికా అసలు రూపం లోతుగా చూస్తే గాని తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి అమెరికా అసలు రంగు కనిపిస్తోంది. అమెరికా గురించి.. అమెరికాలో అమల్లో ఉండే విధానాల గురించి ఒక యువతి.. అది కూడా ఆ దేశానికి సంబంధించిన ఓ యువతి బయటపెట్టింది. దీంతో అమెరికా అసలు ముఖచిత్రం వెలుగులోకి వచ్చింది.

అమెరికాలో ప్రతిదీ కూడా ఖరీదైన వ్యవహారం లాగా ఉంటుంది. అందువల్లే అమెరికాలో జీవన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అమెరికాకు వలస వెళ్లిన వారు మాత్రమే కాదు.. అమెరికా దేశస్థులు కూడా అక్కడి ఖర్చులు భరించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. కాకపోతే మాతృ దేశం కాబట్టి బయటికి చెప్పుకోలేరు. కానీ ఒక యువతి ధైర్యం చేసి ముందుకు వచ్చింది. సోషల్ మీడియా వేదికగా తమ దేశంలో జరుగుతున్న వ్యవహారాలను బయటపెట్టింది. అవికాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అమెరికన్ మహిళ ఆంటీ కి క్యాన్సర్ సోకింది. అమెరికాలో ఆమె చికిత్స పొందుతోంది. క్యాన్సర్ నివారణకు ఆమె రెవిల్ మిడ్ అదే మెడిసిన్ వాడుతోంది. ఆ మెడిసిన్ ధర అమెరికాలో ఏకంగా 85000. అదే ఇండియాలో అయితే కేవలం 35 రూపాయలు మాత్రమే. ఈ వ్యత్యాసం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయింది. అమెరికా కంటే ఇండియాలో హెల్త్ కేర్ సిస్టం నడిపిస్తున్న విధానం గొప్పగా ఉందని ఆమె వ్యాఖ్యానించింది. అమెరికాలో ప్రజలను దోచుకుంటున్నారని.. ఇండియాలో మాత్రం కళ్ళకు అడ్డుకుంటున్నారని పేర్కొంది. మందుల ధరలు విపరీతంగా ఉంటాయని.. హాస్పిటల్ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయని ఆ మహిళ తన స్వీయ వీడియోలో స్పష్టం చేసింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరైతే అమెరికాలో మందులు కొనడం కంటే.. ఇండియాకు ఫ్లైట్ ద్వారా వచ్చి మందులు కొనుక్కోవడం ఉత్తమం అని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరేమో అమెరికా నుంచి ఇండియాకు వచ్చేయండి అంటూ సూచనలు చేస్తున్నారు.

కేవలం ఈ మహిళ మాత్రమే కాదు.. ఇటీవల కాలంలో ఇండియన్ హెల్త్ కేర్ సిస్టం.. అమెరికన్ హెల్త్ కేర్ సిస్టం ను కంపేర్ చేస్తూ చాలామంది వీడియోలు రూపొందిస్తున్నారు. ఆ వీడియోలు బహుళ ప్రజాదరణ సొంతం చేసుకుంటున్నాయి. అసలు ఈ తరహాలో ప్రజలను దోచుకోవడం పట్ల సోషల్ మీడియా వేదికగా అమెరికా మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ అమెరికా తన ధోరణి మార్చుకోవడం లేదు. తన విధానాలను సవరించుకోవడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper