Homeలైఫ్ స్టైల్Chicken Biryani : బిర్యానీ అంటే ఇష్టమా.. ఇలా తింటే మీరు అసలు లావు కారు

Chicken Biryani : బిర్యానీ అంటే ఇష్టమా.. ఇలా తింటే మీరు అసలు లావు కారు

Chicken Biryani : లెగ్ పీస్ ఊరిస్తూ ఉంటుంది. పక్కనే బ్రెస్ట్ పీస్ కవ్విస్తూ ఉంటుంది. పొగలు కక్కే బిర్యాని సిద్ధమా అంటూ సవాల్ చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎవరు మాత్రం ఊరుకుంటారు.. ఒక పట్టు పడతారు. అవసరమైతే రెండవ పట్టు కూడా పడతారు. ప్లేట్లకు ప్లేట్లు బిర్యానీ లాగించేస్తారు. ఆ తర్వాత లావు అయిపోతామని భయపడుతుంటారు.. కొందరైతే లావు అవుతామని భయపడి బిర్యానీ తినడాన్ని పక్కన పెడతారు.. బిర్యానీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ బలవంతంగా కడుపు […]

Chicken Biryani : లెగ్ పీస్ ఊరిస్తూ ఉంటుంది. పక్కనే బ్రెస్ట్ పీస్ కవ్విస్తూ ఉంటుంది. పొగలు కక్కే బిర్యాని సిద్ధమా అంటూ సవాల్ చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎవరు మాత్రం ఊరుకుంటారు.. ఒక పట్టు పడతారు. అవసరమైతే రెండవ పట్టు కూడా పడతారు. ప్లేట్లకు ప్లేట్లు బిర్యానీ లాగించేస్తారు. ఆ తర్వాత లావు అయిపోతామని భయపడుతుంటారు.. కొందరైతే లావు అవుతామని భయపడి బిర్యానీ తినడాన్ని పక్కన పెడతారు.. బిర్యానీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ బలవంతంగా కడుపు మాడ్చు కొంటారు.

బిర్యానీ తినడం వల్ల లావు అవుతారని వైద్యులు కూడా చెబుతుంటారు. శరీరాన్ని ఒక ఆకృతిలో ఉంచుకోవాలి అనుకునేవారు బిర్యానీ తినడాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తుంటారు. డైట్ చేసేవాళ్లు బిర్యానీ తినకుండా ఉండాలని డైటీషియన్లు కూడా చెబుతుంటారు. ప్రస్తుతానికి బిర్యానీ హై క్యాలరీ ఫుడ్. పైగా అందులో చికెన్ లేదా మటన్ లేదా ఎగ్ లేదా రకరకాల కూరగాయలు ఉంటాయి. వీటిని నెయ్యి.. ఇతర దినుసులు ఉపయోగించి తయారు చేస్తారు. నెయ్యి ఉపయోగించి బిర్యానీ చేయడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి..

చికెన్ బిర్యాని ఒక సరైన విధానంలో తింటే పెద్దగా ఇబ్బంది ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల డాక్టర్ విక్రాంత్ సింగ్ అనే వ్యక్తి ఒక పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో భాగంగా ఆయన బిర్యాని గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. బిర్యానీలో ముందుగా చికెన్ ముక్కలను తినాలి. ఆ తర్వాత బిర్యానీ తినాలి. ఇలా ప్రోటీన్ ఫస్ట్ పద్ధతిని పాటిస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరిగే అవకాశం ఉండదట. దీనివల్ల శరీరం బరువు పెరగకుండా ఉంటుందట. రెస్టారెంట్లలో కంటే ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుని తినడం మంచిదట.. ఇటీవల విక్రాంత్ కొంతమంది మీద పరిశోధన చేశారు. వారు చికెన్ కంటే ముందు బిర్యానీ రైస్ తిన్నారు.. వారిలో షుగర్ లెవెల్స్ పెరగడాన్ని విక్రాంత్ పరిశీలించారు. బిర్యానీ రైస్ కంటే చికెన్ ముక్కలు ముందుగా తిన్న వాళ్ల షుగర్ లెవెల్స్ ను విక్రాంత్ పరిశీలించారు. వారిలో షుగర్ లెవెల్స్ తక్కువ ఉండడాన్ని ఆయన గమనించారు.

బిర్యానీ ఎక్కువగా తిన్న లావు కావొద్దు అంటే ఈ విధానాన్ని పాటించాలని విక్రాంత్ చెబుతున్నారు. ఒకవేళ మధుమేహం.. ఇతర వ్యాధులతో ఇబ్బంది పడేవారు వైద్యుల సూచనలకు అనుగుణంగా బిర్యానీ తినాల్సి ఉంటుందని ఆయన సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఇంట్లోనే బిర్యాని తినాలని.. బయట రెస్టారెంట్లలో తినకపోవడమే మంచిదని.. బయట తయారు చేసే బిర్యాని లలో కల్తీ ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని ఆయన చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper