Home Blog Page 290

నా కెరీర్ మొత్తం కష్టాల్లోకి వెళ్ళిపోయింది అంటూ హీరోయిన్ కియారా అద్వానీ హాట్ కామెంట్స్

Kiara Advani career struggles
Kiara Advani career struggles

Kiara Advani career struggles: సౌత్ నుండి నార్త్ వరకు యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ. ‘ఏం ఎస్ ధోని’ బయోపిక్ తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మన టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ చిత్రం చేయగా, అది కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ లో ఈమె చేసిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. టాలీవుడ్ ఈమెకు అంతగా కలిసి రాలేదు కానీ , బాలీవుడ్ లో మాత్రం వరుస సూపర్ హిట్స్ ని అందుకుంటూ పెద్ద రేంజ్ కి వెళ్ళిపోయింది.

ఇకపోతే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , తన మొదటి సినిమా అనుభవాన్ని చెప్పుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా ఫుగ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ కారణం చేత నేను కోరుకున్న గుర్తింపు రాలేదు. ఆ చిత్రం తర్వాత నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. ఎన్నో సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను, కానీ నన్ను రిజెక్ట్ చేసేవారు. అలాంటి సమయం లో MS ధోని బయోపిక్ లో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. కబీర్ సింగ్ చిత్రం నా కెరీర్ ని మలుపు తిప్పింది. ఇప్పుడు టాప్ స్థాయిలో కొనసాగుతున్నాను. జీవితం లో ప్రతీ ఒక్కరికి ఇలాగే కష్టాలు వస్తుంటాయి, వాటిని సమర్థవతంగా ఎదురుకొని నిలబడినప్పుడే విజయం దక్కుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది కియారా అద్వానీ.

ఇకపోతే ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’. కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ పై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు , ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల , ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది . ఈ చిత్రం లో కియారా అద్వానీ నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ లో నటించిందని టాక్. ఆమె నటన చాలా బోల్డ్ గా ఉంటుందని , ముఖ్యంగా యాష్ తో చేసిన బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు వేరే లెవెల్ లో వచ్చాయని అంటున్నారు.

'పెద్ది' హైప్ పడిపోయిందా.. ? వరుస వాయిదాల కారణంగా ఆడియన్స్ పట్టించుకోవడం లేదా?

Peddi Movie
Peddi Movie

Peddi movie hype down: ఎంతటి క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ ఉన్నా సరే, మేకర్స్ సరైన ప్లానింగ్ తో జనాల్లోకి వెళ్లకపోతే, అందుకోవాల్సిన టార్గెట్ ని చేరుకోలేము అనేది ట్రేడ్ విశ్లేషకులు చెప్పే మాట. గతం లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి , ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ కూడా మరో ఉదాహరణగా మారనుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ చిత్రానికి ఒకసారి కాదు , రెండు సార్లు కాదు , ఏకంగా మూడు సార్లు వాయిదా వేశారు. ఆ కారణం చేత ఈ సినిమా పై ఉన్న బజ్ బాగా తగ్గిపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి రెండు పాటలు వచ్చాయి, అందులో ‘చికిరి చికిరి’ పాటకు సెన్సేషనల్ రీచ్ వచ్చింది. కేవలం ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఈ పాటకు యూట్యూబ్ లో 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఆ తర్వాత విడుదలైన ‘రయ్ రయ్ రారా’ పాటకు కూడా అద్భుతమైన రీచ్ వచ్చింది. ఇక మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పహిల్వాన్ గ్లింప్స్ వీడియో కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని అద్భుతమైన కంటెంట్లు ఈ చిత్రం నుండి వచ్చాయి కాబట్టి, ఓవర్సీస్ లో సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతాయని అంతా అనుకున్నారు. కానీ అది జరగడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టి మూడు రోజులైంది , ఇప్పటి వరకు ఈ చిత్రానికి అక్కడ రెండు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఇది కచ్చితంగా మంచి ట్రెండ్ కాదు అనే చెప్పాలి. ఇదే రేంజ్ హైప్ ఉన్న ఓజీ, దేవర, కల్కి లాంటి చిత్రాలకు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. పెద్ది కి ఆ స్థాయి ఉంటుందని అనుకుంటే చాలా నార్మల్ గానే ఉన్నాయి.

ఇది అభిమానులను కాస్త కలవరపెడుతున్న విషయం. సినిమా కి హైప్ ఉంటే ఇలా ఉండదని , మూవీ టీం వరుసగా మూడు సార్లు వాయిదా వెయ్యడం వల్లే, ఈ చిత్రం పై ఉన్న హైప్ మొత్తం దెబ్బ తినిందని , ట్రెండ్ ఇలాగే కొనసాగితే 1 మిలియన్ కూడా ప్రీమియర్స్ నుండి రాబట్టడం కష్టమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. కానీ ‘రాజా సాబ్’ ని కూడా ఇలాగే తక్కువ అంచనా వేశారని, చివరి పది రోజుల్లో ఆ చిత్రానికి దిమ్మ తిరిగే గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయని , కాబట్టి చివరి పది రోజుల్లో ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ విద్వంసం మామూలు రేంజ్ లో ఉండదని , కచ్చితంగా 2 మిలియన్ డాలర్లకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

నార్త్ అమెరికా లో టాప్ 5 ప్రీమియర్ గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాలు ఇవే.. 'పెద్ది' టార్గెట్ చాలా పెద్దది..

North America top Telugu premieres
North America top Telugu premieres

North America top Telugu premieres: మన టాలీవడ్ కి ఎప్పటి నుండో బలమైన మార్కెట్ గా నిలుస్తూ వచ్చింది ఏదైనా ఉందా అంటే , అది ఓవర్సీస్ మార్కెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో మెగా స్టార్ చిరంజీవి , అక్కినేని నాగార్జున కారణంగా ఈ మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ఈ ఓవర్సీస్ మార్కెట్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. 30 లేదా 40 ప్రింట్లతో ఓవర్సీస్ లో మన సినిమాలు విడుదలయ్యే రోజుల్లోనే వీళ్లిద్దరు 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మన టాలీవుడ్ మార్కెట్ ఓవర్సీస్ లో బాగా పెరిగింది. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయి. ఆ స్థాయికి చేరిపోయింది. అయితే ప్రస్తుతం అక్కడ ప్రీమియర్స్ నుండి అత్యధికంగా వసూళ్లను రాబట్టిన సినిమాలను ఒకసారి చూద్దాం.

కల్కి 2898 AD :
ప్రభాస్ హీరో గా నటించిన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమాకు ప్రీమియర్ షోస్ నుండి ఏకంగా 3.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఒక సంచలన రికార్డు గా భావించవచ్చు. ఇప్పటి వరకు ఎవ్వరూ దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు.

#RRR :
రామ్ చరణ్ , ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 3.4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా ప్రీమియర్స్ ని అందుకోవాలంటే చాలా కష్టం , వేరే లెవెల్ హైప్ ఉండాలి.

ఓజీ :
పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం గత ఏడాది టాలీవుడ్ లో కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి నార్త్ అమెరికా నుండి 3.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్, టికెట్ సేల్స్ ట్రెండ్ చూసి , కచ్చితంగా కల్కి రికార్డు ని బద్దలు కొట్టి టాప్ 1 స్థానానికి చేరుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషం లో మేకర్స్ ప్రింట్ ని సరైన సమయానికి ఓవర్సీస్ కి పంపకపోవడంతో AMC థియేటర్స్ చైన్ బుకింగ్స్ ని మొదలు పెట్టడానికి నిరాకరించడంతో, ఆల్ టైం రికార్డు మిస్ అయ్యింది . లేదంటే ఈ చిత్రానికి 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చేదని అంటున్నారు విశ్లేషకులు.

పుష్ప 2:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం తో బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

దేవర:
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం 2024 లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి దాదాపుగా 2.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన గ్రాస్ ని అందరూ షాక్ కి గురయ్యారు. టాలీవుడ్ మార్కెట్ నార్త్ అమెరికా లో ఎవ్వరూ ఊహించని స్థాయిలో పెరిగింది అని చెప్పడానికి ఈ సినిమా మొదటి సాక్ష్యంగా నిల్చింది.

పెద్ది ఈ రికార్డ్స్ ని అందుకోగలదా ?:
ప్రస్తుతం అందరి చూపు పెద్ది చిత్రం మీదనే ఉంది , రామ్ చరణ్ కెరీర్ లోనే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది అనే బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అయితే రీసెంట్ గానే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. వెయ్యికి పైగా షోస్ ని షెడ్యూల్ చేయగా , ఇప్పటి వరకు కనీసం 2 లక్షల డాలర్లు కూడా రాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 1.5 మిలియన్స్ నుండి 2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అతడు కొడుతుంటే విరాట్ కోహ్లీ కూడా చూస్తూ ఉండిపోయాడు.. అవకాశాలిస్తే టీమిండియాను ఏలేలా ఉన్నాడు

Urvil Patel batting performance
Urvil Patel batting performance

Urvil Patel batting performance: మామూలుగా అయితే విరాట్ కోహ్లీ తను ఆడుతుంటే.. మిగతా వాళ్ళు చూస్తుంటారు. అతను అదేపనిగా బంతిని బాదేస్తూ ఉంటే.. తోటి ప్లేయర్లు, అభిమానులు, ప్రేక్షకులు ఆనంద పడుతుంటారు. విరాట్ కోహ్లీ ఆడుతుంటే అతనిలో తమను చూసుకుంటారు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తుంటే ఎగిరి గంతులు వేస్తుంటారు. కానీ ఈసారి ఆస్థానాన్ని విరాట్ కోహ్లీ ఆక్రమించాడు. తాను ఒక గొప్ప ఆటగాడిని అనే విషయాన్ని మర్చిపోయి.. అభిమానిగా మారిపోయాడు. అతడు కొడుతుంటే ఎగిరి గంతులు వేశాడు. బిగ్గరగా కేకలు వేశాడు. విరాట్ కోహ్లీని కదిలించిన ఆ ఆటగాడు ఎవరు? అతడి నేపథ్యం ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఐపీఎల్ లో భాగంగా చెన్నై జట్టు మరో విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై 204 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.2 ఓవర్లలో ఫినిష్ చేసింది. తద్వారా ప్లే ఆఫ్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది. చెన్నై జట్టు ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఉర్విల్ పటేల్.. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో అతడు చెన్నై జట్టు తరఫున మెరుపు బ్యాటింగ్ చేశాడు. 13 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 7 సిక్సర్లు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటే ఫోర్ ఉంది. దీంతో ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50 నమోదు చేసిన ఆటగాడిగా జైస్వాల్ (13 బంతులు) సరసన చేరాడు. కేఎల్ రాహుల్, కమిన్స్, షెఫర్డ్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేసి.. రికార్డులు సృష్టించారు.

లక్నో జట్టుపై ఉర్విల్ పటేల్ 23 బంతుల్లో 65 పరుగులు చేసి అదరగొట్టాడు. అతడి ఆటను కోహ్లీ వీక్షించాడు. ఆ వీడియో కాస్త ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ కోసం బెంగళూరు రాయ్ పూర్ వెళ్ళింది. అక్కడ ప్రాక్టీస్ సమయంలో కోహ్లీ టీవీలో పటేల్ బ్యాటింగ్ చూసాడు.. అతడు కొడుతుంటే ఆనందం గంతులు వేశాడు. ఇది కదా బ్యాటింగ్ అంటూ తోటి ప్లేయర్లతో వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ పటేల్ బ్యాటింగ్ చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. విరాట్ కోహ్లీని కదిలించగలిగే స్థాయి ఇతడికి వచ్చిందంటే.. ఒకవేళ అవకాశాలు గనుక ఇస్తే టీమిండియాను ఏలేస్తాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

చదివింది అంతంత మాత్రమే.. సంపాదన 18 లక్షలు.. ఐటీ ఉద్యోగులు కూడా ఇతని ముందు దిగదుడుపే

Inspirational Income Success Story
Inspirational Income Success Story

Inspirational Income Success Story: సొంత ఇల్లు ఉంది. వ్యవసాయ క్షేత్రం కూడా ఉంది. తిరగడానికి ఖరీదైన కారు ఉంది. అలాగని ఇతడేమి ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఐటీ ఉద్యోగి అంతకంటే కాదు. ఒక సాధారణ ప్లంబర్.. ఇతడి నేపథ్యం గురించి.. ఎదిగిన తీరు గురించి తెలుసుకున్న తర్వాత చాలామందిలో ఉద్యోగాలు పోయిన బాధ ఉండదు. ఒత్తిడిని తలకెత్తుకోవలసిన కర్మ ఉండదు.

సోషల్ మీడియాలో ఇతడి గురించి విపరీతంగా సర్కులేట్ అవుతోంది. అతడు ఒక మామూలు పేద కుటుంబంలో జన్మించాడు. ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో కొంతవరకు మాత్రమే చదువుకున్నాడు. ఆ తర్వాత కూలి పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు. తమకు తెలిసిన వాళ్ళు ముంబైలో ప్లంబర్ గా పనిచేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆ పని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా పనిచేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న కాంట్రాక్టులు పొందాడు. ఆ తర్వాత రూపాయి రూపాయి పోగేశాడు. కొంత డబ్బు సమ కూరిన తర్వాత చిన్నపాటి స్థలం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొంత డబ్బు పోగు చేసి అందులో ఇల్లు నిర్మించుకున్నాడు.

గృహ యోగం సాధ్యమైన తర్వాత.. డబ్బు సమకూరడంతో వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒక హుందాయి కారు కొన్నాడు. ఇలా అంచలంచెలుగా తన జీవితాన్ని ఆర్థికంగా స్థిరత్వం చేసుకున్నాడు. ఇప్పుడు అతడు ప్రతి ఏడాది 18 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు.. తను ఒక చిన్నపాటి వ్యవస్థగా మారాడు. ముగ్గురు లేదా నలుగురికి పని కల్పిస్తున్నాడు.. జీవితాన్ని ఒత్తిడితో కాకుండా.. పని నేర్చుకొని సాగిస్తున్నాడు.

నేటి కాలంలో ఉద్యోగాలు కోల్పోయి.. ఆర్థిక స్థిరత్వం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇందులో పెద్దపెద్ద ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ ఇతడు కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. పేదరికంలో పుట్టానని బాధపడకుండా.. తనను తాను తిట్టుకోకుండా.. ఆర్థికంగా బలమైన పునాదులు వేసుకున్నాడు. నేటి కాలంలో చాలామంది ఉద్యోగాలు రాలేదని బాధపడుతున్నారు. ఉద్యోగాలు పోయాయని బాధపడుతున్నారు. కానీ ఇతడికి ఎటువంటి బాధ లేదు. ఇబ్బంది అంతకంటే లేదు. సున్నా నుంచి జీవితాన్ని మొదలుపెట్టాడు. తనే కొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. దీనినే కష్టేఫలి అంటారేమో.

ప్లంబింగ్ వృత్తి ద్వారా నెలకు లక్షలు సంపాదిస్తున్న ఆ వ్యక్తి పేరు కథనంలో రాసేందుకు ఒప్పుకోలేదు. అతడు మీరా రోడ్డు, బోరివలి, కాండీవలి వంటి ప్రాంతాలలో పనిచేస్తున్నాడు. ఒక ఇంట్లో పైపులు రిపేర్ చేస్తున్న సమయంలో.. ఈ విషయం బయటికి వచ్చింది. సదరి వ్యక్తి పైపులు రిపేరు చేస్తుండగా.. అతని గురించి ఆ ఇంటి యజమాని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఈ సంభాషణ మొత్తాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు.. అయితే ఈ వ్యవహారం దేశంలో బ్లూ కాలర్ ఉద్యోగాల డిమాండ్ ను బయటపడుతోంది. వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తున్నప్పటికీ… బ్లూ కాలర్ ఉద్యోగాలను టెక్నాలజీ భర్తీ చేయలేదని తెలుస్తోంది.

పెనంపై నుంచి పొయ్యికి.. జనసేనకు కష్టమే!

Janasena
Janasena

Janasena internal conflicts: జనసేన పార్టీకి కొత్త తలనొప్పి ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా 11 మందిని ఇన్చార్జులుగా నియమించారు పవన్ కళ్యాణ్. రాయలసీమతో పాటు ప్రకాశం,నెల్లూరు బాధ్యతలను బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు నేతలకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వంటి వాటిపై పార్టీ క్యాడర్ అభిప్రాయాలు సేకరించాల్సిన పని ఈ కమిటీకి ఉంది. అందులో భాగంగా రాయలసీమ రీజియన్కు సంబంధించి సమావేశం నిర్వహించగా రచ్చకు దారితీసింది. పార్టీలో కీలక నాయకులుగా ఉన్న వారిని వ్యతిరేకిస్తూ.. కొందరు నాయకులు బహిరంగ విమర్శలు చేశారు. సమావేశం నిర్వహణను కూడా బహిష్కరించారు. దీంతో ఇప్పటివరకు జనసేన లో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.

ఆ నేతల్లో అసంతృప్తి..
పార్టీలో ప్రారంభం నుంచి ఉన్న నేతలకంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం లభిస్తుందన్న టాక్ జనసేనలో ఉండి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారితోనే ఇటువంటివి జరుగుతున్నాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వాస్తవంగా చెప్పాలంటే మాజీ మంత్రి బాలినేని వ్యతిరేకిస్తూ గళం విప్పారు ఎక్కువ మంది నేతలు. బాలినేని రాకను జనసేన లోని ప్రధాన వర్గం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బాలినేని నియామకం, అదే నేత సమావేశం నిర్వహించడాన్ని ఆయన వ్యతిరేకులు తట్టుకోలేకపోయారు.

ఇంకోవైపు ఇదే కమిటీ లో ఉన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఇదే సమావేశంలో ఒకరికొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఈ పరిణామాలతో బాలినేని సహా అందరూ విస్తు పోయారు. అయితే ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన లో చేరిన నేతలతోనే ఈ పరిస్థితి అని అర్థమవుతోంది. ఎందుకంటే బాలినేని సైతం వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరారు. ఎన్నికల ముందు ఆరని శ్రీనివాసులు సైతం వైసీపీ నుంచి జనసేన లోకి వచ్చారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన నేతలకు ఎటువంటి ప్రాధాన్యం లేదు. దీంతో పార్టీలో విభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఇలా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన నెగ్గుకు రావడం మాత్రం కష్టం.

హాలీవుడ్ మూవీ లో మంచు లక్ష్మి.. సంచలనం రేపుతున్న వీడియో..

Manchu Lakshmi Hollywood movie
Manchu Lakshmi Hollywood movie

Manchu Lakshmi Hollywood movie: సోషల్ మీడియా లో సినీ సెలబ్రిటీలలో అత్యధిక మీమ్స్ ని మంచు లక్ష్మి పై , మంచు కుటుంబం పై వస్తాయనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మంచు లక్ష్మి పై వచ్చే ఫన్నీ మీమ్స్ ఎలాంటివో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆమె మాట్లాడే ప్రతీ మాటని మనం వాస్తవ దూరం అనే అనుకుంటూ ఉంటాము, కానీ వాటిల్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. అవి చాలా కాలం తర్వాత మనం చూసినప్పుడు , అరెరే మంచు లక్ష్మి నిజమే చెప్పింది , మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం అని అనుకుంటాము , ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి మాట్లాడుతూ , నేను ఒక హాలీవుడ్ చిత్రం లో నటించాను అంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో దీనిపై వేరే లెవెల్ లో ట్రోల్స్ పడ్డాయి.

కానీ వాస్తవం ఏమిటంటే ఆమె నిజంగానే ఒక హాలీవుడ్ చిత్రం లో నటించింది. ఆ సినిమా పేరు బాస్మతి బ్లూస్. ఈ చిత్రం లోని ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. అందులో మంచు లక్ష్మి అచ్చు గుద్దినట్టు హాలీవుడ్ హీరోయిన్ లాగానే అనిపించింది. ఆమె యాస కూడా ఫక్తు అమెరికన్ ఇంగ్లీష్ యాసలోనే ఉంది. దీనిని చూసిన నెటిజెన్స్ మంచు లక్ష్మి అక్క రేంజ్ ఇదా?, అనవసరంగా ఆమెని అపార్థం చేసుకున్నాము అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మంచు లక్ష్మి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఎన్నో సూపర్ హిట్ అమెరికన్ షోస్ లో నటించింది. హాలీవుడ్ ఇండస్ట్రీ లో కొన్నాళ్ళు గడిపిన తర్వాతనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రతీ ఒక్కరు ప్రియాంక చోప్రా ని ఇండియా నుండి హాలీవుడ్ లోకి వెళ్లిన మొట్టమొదటి మహిళగా పిలుస్తుంటారు. కానీ మంచు లక్ష్మి హాలీవుడ్ లో స్థిరపడి ఇండియన్ ఫిలిమ్స్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళగా మనం భావించవచ్చు. ప్రస్తుతం మంచు లక్ష్మి కెరీర్ అంత గొప్పగా లేదనే విషయం అందరికీ తెలిసిందే. మోహన్ బాబు కూతురు కదా అని ఈమె మొదటి సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు , విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ వచ్చింది. అందులో అత్యధిక శాతం విలన్ క్యారెక్టర్స్ ఉన్నాయి , నిర్మాతగా కూడా అనేక సినిమాల్లో నటించింది కానీ, పెద్దగా సక్సెస్ లను అందుకోలేదు. ఇప్పుడు కూడా ఆమె అడపాదడపా క్యారెక్టర్ రోల్స్ లో కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే మంచి యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న మంచు లక్ష్మి మన టాలీవుడ్ మేకర్స్ సరిగా ఉపయోగించుకోలేదు అని చెప్పొచ్చు.

రాముడు, కృష్ణుడు, ఆదిశంకరుడు, వివేకానందుడు.. వీరంతా కలిస్తే నరేంద్ర మోడీ

Tanikella Bharani on Modi
Tanikella Bharani on Modi

Tanikella Bharani on Modi: శీర్షిక చదివారు కదా.. ఈ మాట అంటున్నది మేం కాదు. నరేంద్ర మోడీ లో రాముడు కనిపించాడట. కృష్ణుడు దర్శనమిచ్చాడట. ఆది శంకరుడు సాష్టాంగంగా కొలువై ఉన్నాడట. వివేకానందుడు ఆయన రూపంలో సాక్షాత్కరించాడట. ఈ మాట ఆయన మనసులో అనుకున్నాడు.. ఆ తర్వాత బయట పెట్టుకున్నాడు.. చివరికి సోషల్ మీడియాలో నరేంద్ర మోడీపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.

నరేంద్ర మోడీపై ఈ స్థాయిలో ప్రేమను కనబరిచిన ఆ వ్యక్తి పేరు తనికెళ్ల భరణి. తెలంగాణ పర్యటనకు ఆదివారం వచ్చిన నరేంద్ర మోడీని తనికెళ్ల భరణి హైదరాబాదులో కలిశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ చేతులను ముద్దాడారు. ఆ అనుభూతిని తనికెళ్ల భరణి గొప్పగా చెప్పుకున్నారు. ,”రాముడిని చూసే అవకాశం లేదు. కృష్ణుడిని చూసే అవకాశం రాలేదు. ఆది శంకరులను కూడా చూడలేదు. వివేకానందుడిని కనులారా చూసే భాగ్యం లభించలేదు. పైగా వారిని చూసే అవకాశం కూడా లేదు. కానీ వాళ్ళందరి అంశలతో ఉన్న నరేంద్ర మోడీ గారిని చూశాను. ముట్టుకున్నాను. చేతిని ముద్దు పెట్టుకున్నాను. నా జన్మ ధన్యమైపోయిందని” తనికెళ్ల భరణి రాసుకువచ్చారు. తనికెళ్ల భరణికి జాతీయవాదం అంటే చాలా ఇష్టం. అయితే ఆయన దానిని ఆయన ఎప్పుడూ బయట పెట్టుకోలేదు. పైగా ఆయన మాటలు రాసిన సినిమాలు.. కథ అందించిన సినిమాలు.. ఒక కోవలో ఉంటాయి. తనికెళ్ల భరణి వేషధారణకు.. భావధారణకు..ఆ సినిమాలకు సంబంధం ఉండదు . ఉన్నట్టుండి తనికెళ్ల భరణి ఇలా మాట్లాడటం.. ఇలా తన భావాలను వ్యక్తం చేయడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది.

తనికెళ్ల భరణి మొదట్లో రాంగోపాల్ వర్మ సినిమాలలో కనిపించేవారు. ఆయన కోసమే రాంగోపాల్ వర్మ ప్రత్యేకంగా పాత్రలను సృష్టించేవారు. వాస్తవానికి రాంగోపాల్ వర్మ ది డిఫరెంట్ స్టైల్. ఆయనతో పని చేసిన వారిది అదే స్టైల్. కానీ తనికెళ్ల భరణి అలాంటి స్టైల్ కు దూరంగా ఉన్నారని.. ఆయన పూర్తి డిఫరెంట్ అని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.. తనికెళ్ల భరణి ఇలా మాట్లాడతారని.. నరేంద్ర మోడీపై ఈ స్థాయిలో ప్రేమను కనబరుస్తారని తాను కలలో కూడా ఊహించలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

గంభీరమైన పులి.. కంటికి కనిపించడం లేదు.. ఏం జరిగి ఉంటుంది

Missing Tiger Mystery
Missing Tiger Mystery

Missing Tiger Mystery: క్రూరమైన చూపు. బలమైన అడుగులు.. విశాలమైన దేహం. పటిష్టమైన పంజా దెబ్బ.. ఒక్క ఉదుటున మాటు వేస్తే ఎంతటి జంతువైనా సరే చావాల్సిందే. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పులి గురించి వర్ణన ఒక పట్టాన ముగిసిపోదు.

అటువంటి భయంకరమైన పులి ఇప్పుడు కనిపించడం లేదు. మహారాష్ట్రలోని తాడోబ అడవి నుంచి వందల కిలోమీటర్ల దూరం అది ప్రయాణించింది. తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టింది. ఇక్కడ అనేక ప్రాంతాలు తిరుగుతూ చివరికి యాదగిరిగుట్ట వరకు వచ్చింది. అటువంటి భయంకరమైన పులి ఇప్పుడు కనిపించడం లేదు. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో అది కొద్ది రోజులు కనిపించింది. ఆ తర్వాత కనిపించడం మానివేసింది. దీంతో అటవీశాఖ అధికారులలో ఆందోళన నెలకొంది.

యాదగిరిగుట్ట నుంచి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిన పులి.. ఆ తర్వాత జగిత్యాల మీదుగా నిజామాబాద్ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఇక అక్కడి నుంచి ఆ పులి కనిపించడం లేదు. ఎక్కడెక్కడ వెతికినా సరే దాని జాడ తెలియడం లేదు. ట్రాకింగ్ చేయడంలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారా.. పులి వేటగాళ్ల ఉచ్చులకు చిక్కి చనిపోయిందా.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. సాధారణంగా వేసవి కాలంలో పులులు ఆహార అన్వేషణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణకు రావడం సర్వ సాధారణం. వర్షాలు కురిసిన తర్వాత మళ్లీ ఆ పులులు మహారాష్ట్ర వెళ్ళిపోతుంటాయి. ఇది నిత్యం జరిగే ప్రక్రియనే. కానీ ఆ పులి అక్కడి నుంచి వచ్చి.. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందనేది అర్థం కావడం లేదు.

మహారాష్ట్రలో ఇటీవల ఒక పులి ఆడ తోడు కోసం తెలంగాణ దాకా వచ్చింది. ఇక్కడ సరైన జోడు లభించకపోవడంతో.. వెర్రి లేచినట్టు తిరిగింది. ఇష్టానుసారంగా ఇతర జంతువులను చంపి తినేసింది. ఒక రకంగా మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ జిల్లాల్లో భయాన్ని కలగజేసింది. చివరికి ఆ పులి ఆడ తోడు దొరకడంతో శాంతించింది. అయితే తడోబా ఫారెస్ట్ నుంచి వచ్చిన ఈ పులి మాత్రం అలాంటి దారుణాల కైతే పాల్పడలేదు. అలాగని ఇతర జంతువులను చంపి తినకుండా ఉండలేదు. అయితే ఉన్నట్టుండి ఈ పులి ఎక్కడికి వెళ్లిందనేది ఇప్పుడు అంతు పట్టడం లేదు.

చేపలంటే మీకు ఇష్టమా.. ఈ వీడియో చూస్తే జన్మలో కొనరు

fish market viral video
fish market viral video

Fish Market Viral Video: మనలో చాలామందికి చేపలు ఉంటే విపరీతమైన ఇష్టం. చేపల్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. అవి తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు వైద్యులు. పైగా వాటిల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. చేపలు కంటి చూపును పెంపొందిస్తాయి. అందువల్లే వాటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు.

చేపలు సముద్ర ప్రాంతంలో విస్తారంగా లభిస్తాయి. నదుల ప్రాంతంలో కూడా లభిస్తాయి.. చెరువులు, ఇతర నీటి వనరుల ప్రాంతంలో కూడా చేపలు సమృద్ధిగా ఉంటాయి. నీటి ఆధారంగా చేపల రుచి మారుతూ ఉంటుంది. చేపలను కొంతమంది వేపుడు చేసుకొని తింటారు. మరి కొంతమంది పులుసుగా తింటారు. ఇంకొంతమంది నిలువ పచ్చడి పెట్టుకొని తింటారు. ఎలా తిన్నా సరే చేపలు రుచికరంగానే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చేపలను అధికంగా తింటూ ఉంటారు.

ఒకప్పుడు చేపలకు ఇంతగా డిమాండ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు డిమాండ్ పెరిగిపోవడంతో ప్రత్యేకంగా చెరువులు తవ్వించి.. చేపలను పెంచుతున్నారు. అందులో కొర్రమీను నుంచి మొదలుపెడితే బొచ్చే వరకు అన్ని రకాల చేపలు ఉంటాయి.

ఇక వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందు గోదావరి నదీ ప్రవాహానికి ఎదురు ఈదే పులస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోదావరి నీరు ఎరుపు రంగు అలముకున్న తర్వాత పులస జాలర్ల వలలకు చిక్కుతుంది. ఆ సమయంలో ఆ చేపల రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు చేపల గురించి మీరు చదివారు కదా. ఇప్పుడు చేపలు అమ్మే వాళ్ల గురించి.. వాళ్ళు వచ్చేసే మోసం గురించి చదవండి.

సాధారణంగా చేపలు నీళ్లలో పెరుగుతాయి. వలలకు చిక్కిన తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఆ సమయంలో అవి చాలావరకు బరువు తగ్గిపోతాయి. అయితే కొంతమంది వ్యాపారులు చనిపోయిన చేపల నోట్లో నీళ్లు పోస్తున్నారు. ఇలా నీళ్లు పోయడం ద్వారా చేపలు బరువు అధికంగా ఉంటాయి. తద్వారా కొనుగోలు చేసిన వారు మోసపోక తప్పదు. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. అయితే ఈ సంఘటన మన దగ్గర కాదు.. బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. అక్కడ వ్యాపారులు చేపలను అమ్ముతుండగా.. కొందరు వాటి నీటిలో నీళ్లు పోస్తూ కనిపించారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by telugubyts (@telugubyts)

ఏకంగా ట్రాన్స్ ఫార్మర్ తోనే ఆ పని ..మీ గుండెలు బతకాలి రా

People charging phones from transformer
People charging phones from transformer

People charging phones from transformer: విద్యుత్ ను తయారు చేసింది విలియం గిల్బర్ట్.. అతడు ఒకవేళ బతికి ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కిందపడి గిలగిలా కొట్టుకునేవాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని అటువంటిది కాబట్టి. కరెంటుతో ఎవరైనా సరే విద్యుత్ దీపాలు వెలిగించుకుంటారు. అనేక రకాల పనులు చేసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం ప్రపంచం మొత్తం నోరు వెళ్ళబెట్టే విధంగా.. ఆశ్చర్యంతో చూసే విధంగా.. ఓరయ్య మీకో దండం.. ఆపండ్రా బాబు అన్నట్టుగా పనిచేశారు.

అది బీహార్ రాష్ట్రం. ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలోకి కరెంటు సరఫరా సరిగా అవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ కరెంటు వచ్చినప్పటికీ .. కొద్దిసేపు మాత్రమే ఉంటోంది. అక్కడ సరఫరాలో నిరంతరం సమస్యలు ఉండడంతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం అనేది పెరిగిపోయింది. కరెంటు ఉన్నతసేపు ఫోన్ లను చార్జింగ్ పెడుతున్నారు అక్కడి యువకులు. కరెంటు పోతే వారి కష్టాలు మామూలుగా ఉండడం లేదు. అందువల్లే ఒక పని చేశారు.

వారి గ్రామానికి కొంత దూరంలో ఉన్న మరో ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లారు. అక్కడ చిన్నపాటి రెండు తీగలను ఏర్పాటు చేశారు. వాటిని సాకెట్ మాదిరిగా అమర్చారు. అలా అనేక కనెక్షన్లు రూపొందించారు. అక్కడ తమ ఫోన్ లను చార్జింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. దాదాపు 50 నుంచి 100 వరకు ఫోన్లు అక్కడ నిత్యం చార్జ్ అవుతూనే ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లడమే ప్రమాదకరం అనుకుంటే.. బీహార్ యువకులు ఏకంగా చార్జింగ్ కోసం సాకెట్ ఏర్పాటు చేసి.. దానిని రకరకాలుగా మార్చేశారు.

బీహార్ యువకులు ఫోన్లను చార్జింగ్ పెడుతున్న తీరును కొంతమంది వీడియో తీశారు. దానిని కాస్త సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంకేముంది దెబ్బకు చర్చకు దారి తీయడం మొదలుపెట్టింది. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని కొంతమంది అంటుంటే.. విద్యుత్ సృష్టించిన వ్యక్తి కూడా ఈ స్థాయిలో ఆలోచించడని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఇలాంటి విధానాలు సరికావని.. వీటివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉందని నెటిజన్లు వాపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Spotlight orbit (@spotlight.orbitt)

మోడీ చెప్పింది కరెక్టే.. బంగారం పిచ్చితో ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో తెలుసా..

Gold Price Drop In India
Gold Price Drop In India

Indians spending too much on gold: ‘బంగారం ఏడాది పాటు కొనడం మానేయండి. బంగారం కొనుగోలు చేయడం వల్ల దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అందువల్ల బంగారం కొనుగోలు చేయకుండా భారతీయులు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుంది..’ హైదరాబాదులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన సూచన ఇది.

వాస్తవానికి బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో ధర తగ్గినప్పటికీ.. కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. బంగారం ధర పెరగడం వల్ల దిగుమతులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. దీనివల్ల బంగారం కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోంది. అందువల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో పరోక్షంగా ప్రస్తావించారు.

బంగారం మాత్రమే కాదు, వెండి కూడా విపరీతంగా పెరుగుతుంది.. బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల దిగుమతులు కూడా అభ్యస్థాయిలో ఉంటున్నాయి. ఈ సంవత్సరంలో దేశీయంగా బంగారం దిగుమతులు స్థాయిని దాటిపోయాయి. దిగుమతుల విలువ ఏకంగా 24 శాతం పెరిగింది. మొత్తంగా 71.98 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మన దేశీయ నగదు విలువ తొలగిస్తే అది అక్షరాల 6,04,632 కోట్లకు చేరుకుంది. 2025లో ఈ విలువ 58 బిలియన్ డాలర్లుగా ఉండేది. దీనిని బట్టి బంగారం దిగుమతులు మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ఒత్తిడి కలిగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

పరిమాణపరంగా కూడా బంగారం దిగుమతులు 4.76 తగ్గినప్పటికీ.. మనదేశ నిలువలలో బంగారం 721.03 టన్నులకు చేరుకుంది. వెండి దిగుమతులు మాత్రం ఘోరంగా పెరిగిపోతున్నాయి. ఏకంగా 150 శాతం పెరిగిపోయి.. వెండి నిల్వలు 12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వీటివల్ల దేశీయంగా వాణిజ్య లోటు 333.2 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. మన దేశానికి బంగారం స్విజర్లాండ్ నుంచి అత్యధికంగా 40 శాతం, యూఏఈ నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం బంగారం దిగుమతి అవుతోంది.

ఆ టైమ్ లో మహేష్ బాబు ను రాంగ్ రూట్ లోకి తీసుకెళ్ళిందేవరు..

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu career mistakes: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మహేష్ బాబు లాంటి నటుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడ. ఇకు ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. కెరియర్ స్టార్టింగ్ లో మహేష్ బాబు చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. దాంతో తన పంథా ను మార్చుకొని డిఫరెంట్ స్టైల్లో సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఎక్స్పరిమెంటల్ సినిమాలను కూడా చేశాడు అవి కూడా ఆయనకు సక్సెస్ లను కట్టబెట్టలేదు. దాంతో ఎలాగైనా సరే భారీ విజయాలను దక్కించుకోవాలని మాస్ అవతారమైతే ఎత్తాడు. ఇక మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ స్టోరీలను ఎంచుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు తన సన్నిహితులు కొంతమంది అలాంటి కథలు తనకి సెట్ అవ్వవని చెప్పారట.

కృష్ణ గారు సైతం మహేష్ బాబుకి ఎలాంటి కథలైతే బాగుంటాయి అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాలను చేయించాడు. అయితే అవి అనుకున్న రేంజ్ లో సక్సెస్ లను సాధించలేదు. అతడు సినిమా నుంచి మహేష్ బాబు స్టోరీల సెలక్షన్లో తను కూడా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశాడు.

అప్పటినుంచి ఆయనకు వరుసగా మంచి విజయాలు వస్తున్నాయి. కృష్ణ సలహాలు, సూచనలు తీసుకున్న కూడా మహేష్ బాబు డెసిజన్ ను ఫైనల్ గా పెట్టుకొని ముందుకు సాగుతూ వచ్చాడు. తద్వారా ఆయన ఇండస్ట్రీలో ఉన్న భారీ రికార్డులను కొల్లగొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…మహేష్ బాబుకి అలాంటి సినిమాలు సెట్ అవ్వవని తన సన్నిహితులు చెప్పడం వల్లే మహేష్ బాబు చాలా మంచి సినిమాలైతే వదులుకున్నాడు.

ఫలితంగా సక్సెస్ఫుల్ సినిమాలను వదులుకొని ఫెయిల్యూర్ సినిమాలను చేయాల్సి వచ్చిందని ఆయన ఒక సందర్భంలో తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా తను ఓన్ డిసీజనే ఫైనల్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ హీరోగా నిలబడ్డాడు…

బాలయ్య టార్గెట్ అదేనా..సీనియర్ హీరోలను వెనక్కి నెట్టబోతున్నాడా..

Balakrishna
Balakrishna

Balakrishna latest movie target: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు ఉన్న క్రేజీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… కొరటాల శివ ఈ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. బాలయ్య బాబు కెరియర్లో సైతం ఆ రేంజ్ కలెక్షన్స్ ను ఇప్పటివరకు రాలేదు. కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి బాలయ్య బాబు కెరియర్లో సూపర్ సక్సెస్ గా నిలిస్తే మాత్రం అతను సీనియర్ హీరోలకు సైతం పోటీని ఇచ్చిన వాడవుతాడు.

ఇప్పటికే సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ ముందు వరుసలో ఉన్నారు. గత సంవత్సరం వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ఇక ఈ సంవత్సరం చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాడు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు తన రేంజ్ ను పెంచుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది.

ఎందుకంటే తన తోటి హీరోలను బీట్ చేసి వెళుతున్నప్పుడు తను కూడా తన పంథాను మార్చుకొని భారీ కలెక్షన్స్ ని రాబట్టే సినిమాలను చేయాలి. అందుకే కొరటాల శివతో జతకడుతున్నట్టుగా తెలుస్తుంది… ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. బాలయ్య గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయి.

కాబట్టి ఈ సినిమాలతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి టాప్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు… ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా నందమూరి అభిమానులను అలరించింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు…

బాలయ్య - కొరటాల మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్న స్టార్ హీరో..

Balakrishna Koratala Siva movie
Balakrishna Koratala Siva movie

Balakrishna Koratala Siva movie: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన ప్రతి సినిమాలో తనను తాను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉండబోతుందట. బాలయ్య బాబు ఈ సినిమాతో ఒక సోషల్ మెసేజ్ ను కూడా ఇవ్వబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా అయితే రాలేదు. కాబట్టి ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుంది అంటూ అటు బాలయ్య బాబు అభిమానులు ఇటు కొరటాల శివ ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…

ఇప్పటివరకు కొరటాల శివ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి. ఒక ఆచార్య సినిమాను మినహాయిస్తే ఆయనకు 100% సక్సెస్ రేటు ఉందనే చెప్పాలి… ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరోని కూడా బాగా చేయబోతున్నారట. మొత్తానికైతే వాళ్ళు ఈ సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు.

కాబట్టి ఈ సినిమాకి మరొక యంగ్ హీరోని కూడా యాడ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడట. 15 నిమిషాల పాటు తన క్యారెక్టర్ ఉంటుందంట. ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దర్శకుడు ఆ పాత్రను ఎలా తీర్చిదిద్దాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక బాలయ్య బాబుకు సిద్దు జొన్నలగడ్డ మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధమైతే ఉంది…

కాబట్టి ఆయన కొరటాల సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొరటాల శివ ఇంతకుముందు చేసిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనుకున్నప్పటికి అది ఒక మోస్తారు సక్సెస్ గానే మారింది. కాబట్టి ఈ సినిమాతో ఆయన ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఆ ఇద్దరు దర్శకులను వాడుకొని హ్యాండ్ ఇచ్చిన మహేష్ బాబు..

Mahesh Babu Missed Movies
Mahesh Babu Missed Movies

Mahesh Babu directors controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన వీలైనంత తొందరగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెడితే ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమా అతన్ని ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మార్చే ప్రయత్నం చేస్తుంది… మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ లో చాలామంది దర్శకులు అతనికి సూపర్ సక్సెస్ లను అందించారు. అందులో కొంతమందికి ఆయన రిపీటెడ్ గా చాన్స్లైతే ఇచ్చాడు. వాళ్ళలో కొంతమంది ప్రూవ్ చేసుకుంటే మరి కొంత మంది మాత్రం అతనికి భారీ ప్లాప్ లను కట్టబెట్టారు. ఇక ఈ క్రమంలోనే పోకిరి సినిమాతో మహేష్ బాబు కి ఇండస్ట్రీ హిట్ ని అందించిన పూరి జగన్నాథ్ తో బిజినెస్ మాన్ అనే సినిమా చేసి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

వీళ్ళిద్దరి కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది. మహేష్ బాబు అభిమానులు సైతం పూరి జగన్నాథ్ తో సినిమా అంటే సంబరపడిపోతారు. అలాంటిది మహేష్ బాబు పూరి జగన్నాథ్ మీద కోపంతో అతనికి సినిమా చేసే ఛాన్స్ ఇవ్వడం లేదు.

ఇక కొరటాల శివ తో సైతం మహేష్ బాబుకి చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు శ్రీమంతుడు, భరత్ అనే నేను రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను సాధించాయి. అయితే కొరటాల శివ సినిమాల్లో ఆచార్య, దేవర లాంటి సినిమాలతో కొంతవరకు తడబడటంతో మహేష్ బాబు అతనికి ఛాన్స్ ఇస్తాడని అనుకున్నాడు.

కానీ మహేష్ బాబు మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల కొరటాల శివతో సినిమా చేసే అవకాశం లేదని చెప్పారట. దాంతో ఆయన ప్రస్తుతం బాలయ్య బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇలా మహేష్ బాబు తనకు భారీ సక్సెస్ లను అందించిన దర్శకులకు హ్యాండ్ ఇచ్చాడు అంటు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…