Munir lobbying with America: గతేడాది పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ప్రతిదాడులను తిప్పికొట్టింది. అయితే మన దాడికి వణికిపోయిన పాకిస్తాన్ అమెరికాతో చేసిన లాబీయింగ్ ఇప్పుడు బయటపడింది. ఇది పాకిస్తాన్ బలహీనతకు ప్రత్యక్ష సాక్ష్యం.
పకడ్బందీ లాబీయింగ్..
అమెరికా చొరవతోనే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందని, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తాజాగా ప్రకటించారు. ప్రాంతీయ శాంతి కోసమే పాకిస్తాన్ ఇందుకు అంగీకరించిందని వెల్లడించాడు. కానీ యూఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఫెరా(FARA) పత్రాలు ఈ ప్రకటనను డొల్లుగా మార్చాయి. నిజం ఏమిటంటే.. పాకిస్తాన్ అమెరికా సాయం కోసం 60 సార్లకుపైగా లాబీయింగ్ చేసింది. ఇది దౌత్య విజయం కాదు, దౌత్య బలహీనతకు నిదర్శనం.
30 సార్లు సంప్రదింపులు..
మే 6 అర్ధరాత్రి భారత్ సైనిక దాడులతో షాక్ అయిన పాకిస్తాన్ అమెరికాతో సుమారు 30 సార్లు వేర్వేరుగా సంప్రదింపులు చేపట్టింది. పాక్ అంబాసిడర్ అమెరికా నేతలతో సమావేశాల కోసం ప్రయత్నాలు చేసింది. మే 7–8న ఉద్రిక్తతలపై చర్చించేందుకు లాబీయింగ్ చేసింది. మే 9న లాబీయింగ్‌ను మరింత పెంచి, రక్షణ, జాతీయ భద్రత వ్యక్తులతో 20–25సార్లు సంప్రదించింది. అమెరికా మీడియా జర్నలిస్టులతో భేటీలు జరిపింది.
సైనిక దెబ్బకు బలహీనపడిన పాక్
భారత్ సైనిక చర్యలకు పాక్ ఎంతగా భయపడిందో లాబీయింగ్ పరిమితి నుంచి స్పష్టమవుతోంది. మొత్తం 50సార్లకుపైగా అమెరికాను సంప్రదించడం, 60 మంది అధికారులను సంచరించడం నిదర్శం.
దౌత్య వ్యూహాల్లో తేడా..
వాషింగ్‌టన్‌లో భారత్, పాక్ కార్యకలాపాలకు పూర్తి వ్యత్యాసం కనిపించింది. ఉగ్రవాదాన్ని ఖండించడం, పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం. మూడో పక్షం జోక్యాన్ని వ్యతిరేకిస్తూ భారత్ తొలి నుంచే వస్తోంది. పాకిస్తాన్ మాత్రం అమెరికా మద్దతు కోరడం, మధ్యవర్తిత్వం కోరడం, కశ్మీర్‌ను అంతర్జాతీయత చేయడం. ఇదే రెండు దేశాల మధ్య తేడా.
బలహీనతకు లొంగిపోవడం
పాక్ ప్రకటనలు ‘ప్రాంతీయ శాంతి కోసం‘ అని చెప్తున్నాయి. కానీ నిజం మరొకటి: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కంగుతిన్న పాక్ చివరకు కాళ్లబేరానికి వచ్చింది. ఈ పరిస్థితిలోనే భారత్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇది భారత్ బలహీనత కాదు. ఇది భారత్ దౌత్య విజయం.
కచ్చితమైన దాడులు..
ఆపరేషన్ సిందూర్ భారత్ సైనిక సమర్థతను చాటింది: ఇచ్చిన పనిని పర్ఫెక్ట్‌గా పూర్తి చేశాం. పీవోకేసహా పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రకేంద్రాలను కకావికలం చేసి పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పింది.
ఆసిమ్ మునీర్ ప్రకటనలు డొల్లు అని తేలిపోయాయి. పాక్ ఎంతగా దిగజారిపోయిందనే విషయం వెలుగు చూసింది. 60సార్లకుపైగా లాబీయింగ్ చేయడం బలహీనతకు లక్షణం. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక విజయం కాదు, దౌత్య విజయం కూడా.. భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్ మెడలు వంచింది.
















త్రిష అసలు మనిషి కాదంటూ ప్రముఖ సింగర్ హాట్ కామెంట్స్..
Singer comments on Trisha: తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం సౌత్ నుండి నార్త్ వరకు మారుమోగిపోతున్న పేరు ఇది. అందుకు కారణం ఏంటో కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. గత కొంతకాలం నుండి ఈమె తమిళ హీరో విజయ్ తో సహజీవనం చేస్తోంది. ఇప్పుడు ఆయన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం లో త్రిష పాల్గొనగా , అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ‘సూచీ లీక్స్’ అంటూ అప్పట్లో ప్రముఖ సింగర్ సుచిత్ర సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అందరికీ తెలిసిందే.
సినీ సెలబ్రిటీలకు సంబంధించిన అక్రమ సంబంధాలు , ఫోటోలు , వీడియోలు వంటివి అప్పట్లో ఈమె విడుదల చేసింది. దానిని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే సుచిత్ర ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా త్రిష గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘త్రిష అంటే నాకు మొదటి నుండి అసలు ఇష్టం ఉండదు. కానీ తలపతి విజయ్ అంటే చాలా ఇష్టం. ఆయన తన భార్య కి దూరమయ్యాడు , తల్లిదండ్రులకు , పిల్లలకు కూడా దూరం అయ్యాడు. ఇలా అందరికీ దూరమైన సమయాన్ని చూసుకొని కొన్ని పరాన్నజీవులు లాంటి వ్యక్తులు ఆయన జీవితం లోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఒంటరి తనాన్ని , మంచితనాన్ని వాడుకొని కొందరు ఆయనకు భారం గా మారుతున్నారు’ అంటూ త్రిష ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం గా మారాయి.
ఇకపోతే విజయ్ ముఖ్యమంత్రి అవ్వగానే, త్రిష టీవీకే పార్టీ లో కీలక బాధ్యతలు చేపడుతుందని, ఆమెకు ఉపముఖ్యమంత్రి పదవి ని ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోషల్ మీడియా లో అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. ఎందుకంటే టీవీకే పార్టీ ప్రస్తుతం నాలుగు పార్టీలతో పొత్తులో ఉంది, అందులో వీసీకే పార్టీ కి సంబంధించిన ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రి పదవి ని డిమాండ్ చేస్తున్నారు , అందుకే విజయ్ త్రిష కి ఈసారి అవకాశం ఇవ్వలేదని, కానీ పార్టీ కి సంబంధించిన అంతర్గత కార్యక్రమాలు మొత్తం ఆమె దగ్గరుండి చూసుకుంటుందని అంటున్నారు. ఇకపోతే మరోపక్క ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూర్య హీరో గా నటించిన ఈ చిత్రం , తెలుగు లో ‘వీరభద్రుడు’ అనే పేరుతో విడుదల కాబోతుంది.