North America top Telugu premieres: మన టాలీవడ్ కి ఎప్పటి నుండో బలమైన మార్కెట్ గా నిలుస్తూ వచ్చింది ఏదైనా ఉందా అంటే , అది ఓవర్సీస్ మార్కెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో మెగా స్టార్ చిరంజీవి , అక్కినేని నాగార్జున కారణంగా ఈ మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ఈ ఓవర్సీస్ మార్కెట్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. 30 లేదా 40 ప్రింట్లతో ఓవర్సీస్ లో మన సినిమాలు విడుదలయ్యే రోజుల్లోనే వీళ్లిద్దరు 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మన టాలీవుడ్ మార్కెట్ ఓవర్సీస్ లో బాగా పెరిగింది. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయి. ఆ స్థాయికి చేరిపోయింది. అయితే ప్రస్తుతం అక్కడ ప్రీమియర్స్ నుండి అత్యధికంగా వసూళ్లను రాబట్టిన సినిమాలను ఒకసారి చూద్దాం.
కల్కి 2898 AD :
ప్రభాస్ హీరో గా నటించిన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమాకు ప్రీమియర్ షోస్ నుండి ఏకంగా 3.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఒక సంచలన రికార్డు గా భావించవచ్చు. ఇప్పటి వరకు ఎవ్వరూ దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు.
#RRR :
రామ్ చరణ్ , ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 3.4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా ప్రీమియర్స్ ని అందుకోవాలంటే చాలా కష్టం , వేరే లెవెల్ హైప్ ఉండాలి.
ఓజీ :
పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం గత ఏడాది టాలీవుడ్ లో కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి నార్త్ అమెరికా నుండి 3.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్, టికెట్ సేల్స్ ట్రెండ్ చూసి , కచ్చితంగా కల్కి రికార్డు ని బద్దలు కొట్టి టాప్ 1 స్థానానికి చేరుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషం లో మేకర్స్ ప్రింట్ ని సరైన సమయానికి ఓవర్సీస్ కి పంపకపోవడంతో AMC థియేటర్స్ చైన్ బుకింగ్స్ ని మొదలు పెట్టడానికి నిరాకరించడంతో, ఆల్ టైం రికార్డు మిస్ అయ్యింది . లేదంటే ఈ చిత్రానికి 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చేదని అంటున్నారు విశ్లేషకులు.
పుష్ప 2:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం తో బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
దేవర:
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం 2024 లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి దాదాపుగా 2.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన గ్రాస్ ని అందరూ షాక్ కి గురయ్యారు. టాలీవుడ్ మార్కెట్ నార్త్ అమెరికా లో ఎవ్వరూ ఊహించని స్థాయిలో పెరిగింది అని చెప్పడానికి ఈ సినిమా మొదటి సాక్ష్యంగా నిల్చింది.
పెద్ది ఈ రికార్డ్స్ ని అందుకోగలదా ?:
ప్రస్తుతం అందరి చూపు పెద్ది చిత్రం మీదనే ఉంది , రామ్ చరణ్ కెరీర్ లోనే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది అనే బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అయితే రీసెంట్ గానే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. వెయ్యికి పైగా షోస్ ని షెడ్యూల్ చేయగా , ఇప్పటి వరకు కనీసం 2 లక్షల డాలర్లు కూడా రాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 1.5 మిలియన్స్ నుండి 2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.