Homeజాతీయ వార్తలుWest Bengal political change: బెంగాల్‌లో మొదలైన మార్పు.. తెరుచుకుంటున్న గుళ్లు.. బళ్లు..

West Bengal political change: బెంగాల్‌లో మొదలైన మార్పు.. తెరుచుకుంటున్న గుళ్లు.. బళ్లు..

West Bengal political change: పశ్చిమ బెంగాల్‌ 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సువేందు అధికారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది . ఆయన బాధ్యతలు చేపట్టిన కేవలం 12 గంటల్లోనే రాష్ట్రంలో గణనీయమైన మార్పులు కనిపించాయి. కొత్త ప్రభుత్వం 361 బీజేపీ కార్యకర్తల హత్యలకు కారణమైన దోషులపై కేసులను మళ్లీ తెరవాలని, దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని ఆదేశించింది . మత కల్లోలాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని […]

West Bengal political change: పశ్చిమ బెంగాల్‌ 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సువేందు అధికారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది . ఆయన బాధ్యతలు చేపట్టిన కేవలం 12 గంటల్లోనే రాష్ట్రంలో గణనీయమైన మార్పులు కనిపించాయి. కొత్త ప్రభుత్వం 361 బీజేపీ కార్యకర్తల హత్యలకు కారణమైన దోషులపై కేసులను మళ్లీ తెరవాలని, దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని ఆదేశించింది . మత కల్లోలాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ప్రజలు ఈ చర్యను ‘ఆపరేషన్‌ మహాకాళి‘గా పేర్కొన్నారు .

తృణమూల్‌ 15 ఏళ్ల పాలనలో దుర్వినియోగం..
గత 15 ఏళ్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో అనేక హిందూ దేవాలయాలు పార్టీ కార్యకర్తల దుర్వినియోగానికి గురయ్యాయి. ఆలయాలు పేకాట అడ్డాలుగా మారాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలుగా పార్టీ కార్యాలయాలుగా మార్చారు. కలకత్తాలోని శ్యామాప్రసాద్‌ ముఖర్జీ తండ్రి అసితోష్‌ ముఖర్జీ పేరుపై ఉన్న పాఠశాలను మూసివేసి పార్టీ ఆఫీసుగా వాడుకున్నారు.

విముక్తి, పూజలు పునఃప్రారంభం..
బీజేపీ గెలిచిన వెంటనే తృణమూల్‌ కార్యకర్తలు పారిపోవడం ప్రారంభించారు. బస్తీం బజార్‌లో ఉన్న దుర్గ అమ్మవారి ఆలయం ప్రత్యేక ఉదాహరణ. తృణమూల్‌ 15 ఏళ్లుగా ఆలయానికి తాళం వేసి ఉంచింది . దుర్గా పూజ సమయంలో మాత్రమే తెరిచేవారు. బీజేపీ గెలిచిన తర్వాత ప్రజలే ఆలయాన్ని తెరిచారు. గంటలు మోగాయి. పూజలు పునఃప్రారంభమయ్యాయి అనేక దేవాలయాలను విముక్తం చేసే పనులు మొదలయ్యాయి, ఆలయాలను శుద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతోంది .

ఇతర పార్టీ కార్యాలయాల విముక్తి
తృణమూల్‌ నేతలు బీజేపీ ఆఫీసులనే కాకుండా కాంగ్రెస్, సీపీఎం పార్టీ కార్యాలయాలను కూడా ఆక్రమించుకున్నారు. తమ పార్టీ ఆఫీసులుగా మార్చుకున్నారు. తాజాగా బీజేపీ అధికారంలోకి రావడంతో బీజేపీ కార్యాలయాల నుంచిపారిపోయారు. కాంగ్రెస్‌ నేతలు జెండాలు పెట్టుకుంటున్నారు. కమ్యూనిస్టులు మాక్సిస్ట్, లెనిన్‌ ఫోటోలు పెట్టుకుంటున్నారు

ప్రైవేటు స్కూల్‌ విముక్తి..
24 పరగణాలు జిల్లాలోని ఝార్కాలీ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు ట్రస్టు స్కూల్‌ను తృణమూల్‌ కబ్జా చేసి పార్టీ కార్యాలయంగా మార్చింది . అయితే ఈ ప్రాంతంలో తృణమూల్‌ గెలిచినా, నీలిమ అభ్యర్థి గెలిచారు . ప్రజలు ఆ పాఠశాలను స్వాధీనం చేసుకుని ట్రస్టుకు అప్పగించారు .

సంబుఆలు చేసుకోలేని పరిస్థితి..
ఇక విచిత్రం ఏమిటంటే తృణమూల్‌ అభ్యర్థులు గెలిచిన 79 స్థానాల్లో వారు సంబురాలు చేసుకోలేకపోతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్‌కు వెళ్లడానికి వెనుకాడారు. పిల్లలు ఆడుకునే మైదానాన్ని తృణమూల్‌ నేత ఆక్రమించాడు. బీజేపీ గెలవగానే పిల్లలు కంచె పీకిపడేశారు. తృణమూల్‌ నాయకుడు పారిపోయాడు

నేరస్థులపై కఠిన చర్యలు..
కొత్త ప్రభుత్వం నేరస్థులపై కేసులను మళ్లీ తెరవాలని ఆదేశించింది . అనుమానాస్పద తృణమూల్‌ కార్యకర్తల ఇళ్లపై రైడ్లు మొదలయ్యాయి . ఒక కార్యకర్త ఇంట్లో బుల్లెట్లు, తుపాకీ దొరికాయి . సందేశ్‌ఖాలీలో పేదల భూములను ఆక్రమించి బంగ్లాదేశీయులకు అప్పగించిన షేక్‌ సాజహాన్‌ భూములను ప్రజలు తిరిగి లాక్కున్నారు .

ఒక రకంగా సువేందు అధికారి రావడంతో హిందూ చంద్రోదయం మొదలైందని బెంగాల్‌ ప్రజలు భావిస్తున్నారు . రాష్ట్రంలో రాజకీయ ధోరణి పూర్తిగా మారుతోంది, న్యాయవ్యవస్థ మరియు ప్రభుత్వ వ్యవస్థలో న్యాయం నెలకొంటోంది. ఈ మార్పులు పశ్చిమ బెంగాల్‌లో కొత్త యుగం ప్రారంభమైనందుకు సంకేతంగా ప్రజలు చూస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper