Homeఎంటర్టైన్మెంట్Peddi movie hype down: 'పెద్ది' హైప్ పడిపోయిందా.. ? వరుస వాయిదాల కారణంగా ఆడియన్స్...

Peddi movie hype down: ‘పెద్ది’ హైప్ పడిపోయిందా.. ? వరుస వాయిదాల కారణంగా ఆడియన్స్ పట్టించుకోవడం లేదా?

Peddi movie hype down: ఎంతటి క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ ఉన్నా సరే, మేకర్స్ సరైన ప్లానింగ్ తో జనాల్లోకి వెళ్లకపోతే, అందుకోవాల్సిన టార్గెట్ ని చేరుకోలేము అనేది ట్రేడ్ విశ్లేషకులు చెప్పే మాట. గతం లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి , ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ కూడా మరో ఉదాహరణగా మారనుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ చిత్రానికి ఒకసారి కాదు , రెండు […]

Peddi movie hype down: ఎంతటి క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ ఉన్నా సరే, మేకర్స్ సరైన ప్లానింగ్ తో జనాల్లోకి వెళ్లకపోతే, అందుకోవాల్సిన టార్గెట్ ని చేరుకోలేము అనేది ట్రేడ్ విశ్లేషకులు చెప్పే మాట. గతం లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి , ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ కూడా మరో ఉదాహరణగా మారనుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ చిత్రానికి ఒకసారి కాదు , రెండు సార్లు కాదు , ఏకంగా మూడు సార్లు వాయిదా వేశారు. ఆ కారణం చేత ఈ సినిమా పై ఉన్న బజ్ బాగా తగ్గిపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి రెండు పాటలు వచ్చాయి, అందులో ‘చికిరి చికిరి’ పాటకు సెన్సేషనల్ రీచ్ వచ్చింది. కేవలం ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఈ పాటకు యూట్యూబ్ లో 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఆ తర్వాత విడుదలైన ‘రయ్ రయ్ రారా’ పాటకు కూడా అద్భుతమైన రీచ్ వచ్చింది. ఇక మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పహిల్వాన్ గ్లింప్స్ వీడియో కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని అద్భుతమైన కంటెంట్లు ఈ చిత్రం నుండి వచ్చాయి కాబట్టి, ఓవర్సీస్ లో సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతాయని అంతా అనుకున్నారు. కానీ అది జరగడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టి మూడు రోజులైంది , ఇప్పటి వరకు ఈ చిత్రానికి అక్కడ రెండు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఇది కచ్చితంగా మంచి ట్రెండ్ కాదు అనే చెప్పాలి. ఇదే రేంజ్ హైప్ ఉన్న ఓజీ, దేవర, కల్కి లాంటి చిత్రాలకు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. పెద్ది కి ఆ స్థాయి ఉంటుందని అనుకుంటే చాలా నార్మల్ గానే ఉన్నాయి.

ఇది అభిమానులను కాస్త కలవరపెడుతున్న విషయం. సినిమా కి హైప్ ఉంటే ఇలా ఉండదని , మూవీ టీం వరుసగా మూడు సార్లు వాయిదా వెయ్యడం వల్లే, ఈ చిత్రం పై ఉన్న హైప్ మొత్తం దెబ్బ తినిందని , ట్రెండ్ ఇలాగే కొనసాగితే 1 మిలియన్ కూడా ప్రీమియర్స్ నుండి రాబట్టడం కష్టమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. కానీ ‘రాజా సాబ్’ ని కూడా ఇలాగే తక్కువ అంచనా వేశారని, చివరి పది రోజుల్లో ఆ చిత్రానికి దిమ్మ తిరిగే గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయని , కాబట్టి చివరి పది రోజుల్లో ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ విద్వంసం మామూలు రేంజ్ లో ఉండదని , కచ్చితంగా 2 మిలియన్ డాలర్లకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper