Homeజాతీయ వార్తలుIndians spending too much on gold: మోడీ చెప్పింది కరెక్టే.. బంగారం పిచ్చితో ఎంత...

Indians spending too much on gold: మోడీ చెప్పింది కరెక్టే.. బంగారం పిచ్చితో ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో తెలుసా..

Indians spending too much on gold: ‘బంగారం ఏడాది పాటు కొనడం మానేయండి. బంగారం కొనుగోలు చేయడం వల్ల దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అందువల్ల బంగారం కొనుగోలు చేయకుండా భారతీయులు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుంది..’ హైదరాబాదులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన సూచన ఇది.

వాస్తవానికి బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో ధర తగ్గినప్పటికీ.. కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. బంగారం ధర పెరగడం వల్ల దిగుమతులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. దీనివల్ల బంగారం కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోంది. అందువల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో పరోక్షంగా ప్రస్తావించారు.

బంగారం మాత్రమే కాదు, వెండి కూడా విపరీతంగా పెరుగుతుంది.. బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల దిగుమతులు కూడా అభ్యస్థాయిలో ఉంటున్నాయి. ఈ సంవత్సరంలో దేశీయంగా బంగారం దిగుమతులు స్థాయిని దాటిపోయాయి. దిగుమతుల విలువ ఏకంగా 24 శాతం పెరిగింది. మొత్తంగా 71.98 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మన దేశీయ నగదు విలువ తొలగిస్తే అది అక్షరాల 6,04,632 కోట్లకు చేరుకుంది. 2025లో ఈ విలువ 58 బిలియన్ డాలర్లుగా ఉండేది. దీనిని బట్టి బంగారం దిగుమతులు మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ఒత్తిడి కలిగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

పరిమాణపరంగా కూడా బంగారం దిగుమతులు 4.76 తగ్గినప్పటికీ.. మనదేశ నిలువలలో బంగారం 721.03 టన్నులకు చేరుకుంది. వెండి దిగుమతులు మాత్రం ఘోరంగా పెరిగిపోతున్నాయి. ఏకంగా 150 శాతం పెరిగిపోయి.. వెండి నిల్వలు 12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వీటివల్ల దేశీయంగా వాణిజ్య లోటు 333.2 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. మన దేశానికి బంగారం స్విజర్లాండ్ నుంచి అత్యధికంగా 40 శాతం, యూఏఈ నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం బంగారం దిగుమతి అవుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular