Home Blog Page 280

కర్ర దొరికితే ఆ ఎస్ఐ చేసే విన్యాసం అది.. వీడియో వైరల్!

SI Krishna Prasad
SI Krishna Prasad

SI Krishna Prasad: పోలీస్ శాఖ లో ఎక్కువ మంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే. పోలీస్ ఎంపికలో కూడా గ్రామీణ నేపథ్యం ఎంతగానో అక్కరకు వస్తుంది. ముఖ్యంగా పోలీస్ నియామకాల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఎంపిక అవుతుంటారు. చాలామంది ఉన్నత స్థానాలకు వెళ్లిన తమ మూలాలను మాత్రం మరిచిపోరు. తాము చిన్ననాడు చేసే విన్యాసాలను కూడా వారు మారవ రు. ఓ పోలీస్ ఎస్ఐ అయితే ఎదురుగా సాము గరిడీలు కనిపించడంతో ఉండలేకపోయారు. అక్కడే ఉన్న కర్ర సాము కళాకారుల నుంచి కర్రను తీసుకొని.. అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ఎస్ఐ చేసిన కర్ర సాము సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

* అమ్మవారి పండుగలో..
శ్రీకాకుళం జిల్లా బెల్లు పట్టియాలో అమ్మవారి పండుగలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద గ్రామం కావడంతో.. పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సై కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో సిబ్బంది బందోబస్తు చేపడుతున్నారు. మూడు రోజులపాటు అమ్మవారి పండుగ వేడుకలు జరిగాయి. మరో ఆరు రోజులపాటు కొనసాగనున్నాయి. పండుగలో భాగంగా కర్ర సాము విన్యాసాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడే ఉన్న ఎస్సై కృష్ణ ప్రసాద్ ఉండలేకపోయారు. తాను చిన్నప్పుడు చేసిన కర్ర సాము విన్యాసం ఆయనకు గుర్తు వచ్చింది. వెంటనే కర్రను తీసుకుని విన్యాసం చేయడం ప్రారంభించారు. అక్కడ ఉన్న వారిని అది ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఎస్సై కృష్ణ ప్రసాద్ ను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* పోలీసులకు కత్తి మీద సాము..
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గ్రామ దేవత పండుగలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో మూడు నుంచి తొమ్మిది రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ ఐక్యతకు చిహ్నంగా.. సంప్రదాయాల మేళవింపుగా గ్రామ దేవతల పండుగలు జరుపుకుంటారు. అయితే ఈ గ్రామ దేవత పండుగలకు పోలీస్ బందోబస్తు నిర్వహించడం కష్టతరంగా మారుతోంది. అయితే సనాతన సంప్రదాయాలను గుర్తుకు తెస్తూ ఈ అమ్మవారి పండుగలు కొనసాగుతున్నాయి. నిత్యం బందోబస్తులో బిజీగా ఉండే ఇటువంటి పోలీస్ అధికారులు.. ఆటవిడుపుగా విన్యాసాలు చేయడం ఆకట్టుకుంటోంది.

అస్సాం సీఎంగా హిమంత ఔట్.. బీజేపీ బిగ్ ప్లాన్!

Himanta Biswa Sarma
Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: అస్సాంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. హిమంత బిశ్వశర్మ వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మే 12న పదవీ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడంతో ఆయన రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల మధ్య ప్రవేశం, విద్యా సంస్కరణలతో ప్రజా నేతగా ఎదిగిన హిమంత, సర్బానంద సోనోవాల్‌ ప్రభుత్వంలో మంత్రిగా విద్యా వ్యవస్థను బలోపేతం చేశారు. అధికారులు రాత్రి పాఠశాలల్లో ఉండేలా చేసిన వినూత్న చర్యలు విశేష ప్రశంసలు అందుకున్నాయి.

ఎన్నికల వ్యూహాలు..
ఎన్నికల ప్రచారంలో ’మోదీ ప్రభుత్వం’ పాటలు, పాదయాత్రలు, సైకిల్‌ యాత్రలు, రన్నింగ్‌లతో వినూత్న వ్యూహాలు రూపొందించారు. 2019, 2021 అసెంబ్లీ, 2024 లోక్‌సభ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నినాదం కీలకం. ఈ విధానాలు బీజేపీ గెలుపును నిర్ధారించాయి.

జాతీయ గుర్తింపు..
హిమంతను బీజేపీ జాతీయ నాయకుడిగా రూపొందిస్తోంది. మహారాష్ట్ర, హర్యాణ, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్‌ సీఎంలు 50 ఏళ్ల లోపు యువకులు. వీరు దీర్ఘకాలిక రాజకీయ భవిష్యత్తును సూచిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ తర్వాత హిమంతకు అలాంటి ఇమేజ్‌ ఏర్పాటు జరుగుతోంది.

నార్త్‌ ఈస్ట్‌లో పార్టీ బలోపేతం
నార్త్‌ ఈస్ట్‌లో బీజేపీ బలాన్ని పెంచిన హిమంత, యూపీ, జార్ఖండ్, ఒడిశా, బెంగాల్‌ ఎన్నికల్లో ప్రచారం చేశారు. హైదరాబాద్‌ వినాయక నిమజ్జనంలో పాల్గొన్నారు. అస్సాం–బెంగాల్‌ మధ్య శత్రుత్వాలను అధిగమించి, ‘మామ్‌’ అనే స్నేహపూర్వక సంబోధన పొందారు. 1980ల వరకు బెంగాలీ–అస్సామీ గొడవలను ఏకం చేసిన ఆయన ప్రచార వ్యూహాలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించాయి. ఇటీవలి ఎన్నికల ప్రచారం సువేందు అధికారి యోగికి పాదాభివందనం చేశారు. ఇప్పుడు హిమంతకు కూడా అలాంటి ఇమేజ్‌ తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. యూపీ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. లోక్‌సభ ఎన్నికల సమయంలో పలు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో పాల్గొన్నారు.

హిమంత ప్రచారాలు యువతకు గుర్తింపు, జాతీయ అవకాశాలు కల్పిస్తున్నాయి. 2029 లేదా 2032 నాటికి జాతీయ నాయకుడిగా ఎదగడం ఖాయం. బీజేపీ యువ లీడర్‌షిప్‌ వ్యూహం ద్వారా పార్టీ భవిష్యత్తును బలోపేతం చేస్తోంది.

సినిమా వాళ్లు పవన్ వ్యతిరేకులా..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కి వస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకున్నారు. కొన్ని రకాల వివాహ వేడుకలకు మాత్రమే ఆయన హాజరవుతూ వచ్చారు. ఈరోజు తాడేపల్లి కి వస్తున్నారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి.. అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి. నేరుగా ఆయనకు ఫోన్ చేసి తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని సూచించారు. అయితే అంతకుముందే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి విజయ్ కు ఫోన్ చేయడం గమనార్హం. ఎందుకంటే తమిళనాడులో విజయ్ గెలుపును ఏపీలో జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అక్కడ విజయ్ గెలవడంతో ఏపీలో సంబరాలు చేసుకున్నారు. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడారు.

* పవన్ హెచ్చరికలతో..
అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఒక ముద్ర పడుతోంది. దేశంలో ఏ రాజకీయ పరిణామం జరిగిన దానిని తనకు అనుకూలంగా మలుచుకోవడం.. ముఖ్యంగా సినిమా పరంగా ఏ క్రెడిట్ కూడా ఆ పార్టీ విడిచిపెట్టడం లేదు. దానికి కారణం పవన్ కళ్యాణ్. పాతాళానికి తొక్కేస్తానంటూ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలకు ముందు హెచ్చరించారు. అనుకున్న మాదిరిగానే 151 అసెంబ్లీ స్థానాల నుంచి.. 11 స్థానాలకు పరిమితం చేశారు. అయితే అప్పటినుంచి సినిమా స్టార్స్ అంటేనే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏ భాష నటుడైన.. ఏదైనా సాధిస్తే దానిని పవన్ కళ్యాణ్ తో జోడించి చూపించే ప్రయత్నం చేస్తోంది. చివరకు మెగా ఫ్యామిలీని కూడా విడిచిపెట్టలేదు.

* ఎన్నో రకాల ప్రయోగాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండనివ్వనని పవన్ కళ్యాణ్ శపధం చేశారు. ఆ సమయంలో అయితే మెగాస్టార్ చిరంజీవిని మచ్చిక చేసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. విందు ఆహ్వానం పేరుతో చిరంజీవి దంపతులను ప్రత్యేకంగా అమరావతికి పిలిపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ను వేరుచేసి పవన్ కళ్యాణ్ పై ప్రయోగించాలని కూడా చూశారు. టాలీవుడ్ అగ్ర హీరోలతో పవన్ కు వైరం ఉందని కూడా ప్రచారం చేశారు. కానీ ఇవేవీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు సరిహద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. అసలు ఏపీతో సంబంధంలేని తమిళనాడులో విజయ్ గెలుపును తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శుభాకాంక్షలు చెప్పడం అనేది సంప్రదాయంగా వస్తోంది. జగన్మోహన్ రెడ్డి విజయ్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడాన్ని కూడా గొప్ప విషయం గా చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సినిమా స్టార్స్ కనిపిస్తే చాలు వారు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడుతోంది. అయితే ఇదే విజయ్ తాను పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అని గతంలో చెప్పుకొచ్చారు. దానిని కూడా పరిగణలోకి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ కు విజయ్ వ్యతిరేకం అన్నట్టు వ్యవహరిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..

మావిగన్ ను మరిచిన వైసిపి!

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party: అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా జగన్ మావిగన్ అనే ఊహాజనిత ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే దానిని ఒక గొప్ప ఆలోచనగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజల ఆదరణ మాట దేవుడెరుగు.. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు, మీమ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని ముందుకు తీసుకెళ్లే బదులు.. మావిగన్ అనే ప్రతిపాదనను ఎలా మరిపిద్దాం అనేలా వ్యవహరిస్తోంది. మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో మావిగన్ పై చర్చ పెట్టట్లేదు. డిబేట్ లు నిర్వహించడం లేదు. దీనిని ప్రజలు ఎలా మర్చిపోతారా? అనే ఆరాటం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే ఆ పార్టీ నేతలు మావిగన్ అనే ప్రతిపాదనను అసలు జగన్మోహన్ రెడ్డి తేలేదు అన్నట్టు మరిచిపోయారు.

* మూడు రాజధానుల ప్రతిపాదన..
మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాయలసీమలో హైకోర్టు పెట్టడం ద్వారా న్యాయ రాజధాని చేస్తామని చెప్పింది. అమరావతిలో శాసన రాజధాని కొనసాగిస్తామని చెప్పుకొచ్చింది. విశాఖను పాలనా రాజధానిగా పేర్కొంది. కానీ చెప్పింది చేయలేక పోయింది. ఇప్పుడు మావిగన్ పేరుతో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలుపుతూ క్యారిడార్ పేరుతో మావిగన్ అనే పేరును ప్రతిపాదించారు జగన్మోహన్ రెడ్డి. అయితే దీనిని ఒక అద్భుత ఆలోచనగా ప్రమోట్ చేయాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం అమరావతి ప్రతిపాదన తీసుకొచ్చిన సమయంలోనే.. మావిగన్ ప్రతిపాదన తీసుకు వచ్చుంటే అర్థవంతంగా ఉండేది. ఇంత జరిగాక తేవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. తటస్థులతోపాటు విద్యావంతులు పై ప్రభావం చూపింది.

* దాటవేత ధోరణి
మాజీ మంత్రి రోజా అయితే అమరావతి విషయంలో అభిప్రాయం అడిగితే మావిగన్ రెండు ఒకటే కదా అని సర్దుబాటుతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం మీడియాలో కూడా దీనిపై చర్చ లేదు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా లేదు. అయితే ఎప్పుడైతే మావిగన్ ఫెయిల్ అయిందో అప్పుడే అమరావతి విషయంలో పాత కోణాలను బయటకు తీస్తారు. దేశంలో నిర్మాణరంగం నిలిపివేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని.. అమరావతి ఆగిపోతుందని కొత్త ప్రచారం ప్రారంభించింది. అమరావతిలో భారీ అవినీతి జరుగుతోందని చెబుతోంది. అసలు మావిగన్ ఊసే లేకుండా పోయింది.

ఇన్ స్టాగ్రామ్ వ్యసనంగా మారిందా.. ఇలా చేసి చూడండి

Instagram Addiction
Instagram Addiction

Instagram Addiction: సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్న వారిలో ఎక్కువ శాతం ఇంస్టాగ్రామ్ ను చూస్తారు. గతంలో ఫేస్బుక్ ఉండేది.. ఇప్పుడు దాని స్థానాన్ని క్రమక్రమంగా ఇన్ స్టాగ్రామ్ అక్రమిస్తుంది.. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ అనేవి విపరీతమైన ప్రాచుర్యం పొందాయి. అందువల్లే యూత్ నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ల వరకు ఇన్ స్టాగ్రామ్ విపరీతంగా చూస్తున్నారు.

ఇన్ స్టా గ్రామ్ కు మొదట్లో ఈ స్థాయిలో పాపులారిటీ ఉండేది కాదు. ఫోటోలు షేర్ చేసే అవకాశం మాత్రమే ఉండేది. క్రమక్రమంగా వీడియోలు.. రీల్స్ అందుబాటులోకి రావడంతో దీనికి ఇది విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది. పైగా కేంద్రం టిక్ టాక్ యాప్ ను నిషేధించడంతో ఇన్స్టాగ్రామ్ తన రేంజ్ పెంచుకుంది. దేనినైనా సరే వాడకం ఒక స్థాయి వరకు ఉంటే బాగుంటుంది. అది స్థాయి దాటితే వ్యసనం లాగా మారుతుంది.

చాలామంది నేటి కాలంలో ఇన్ స్టాగ్రామ్ ను అదే పనిగా చూస్తున్నారు. దానివల్ల బానిసలుగా మారిపోతున్నారు. అదేపనిగా ఇన్స్టాగ్రామ్ లో తల దూర్చడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక పరిమితి ప్రకారం ఇన్ స్టా గ్రామ్ వాడాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఇన్ స్టా గ్రామ్ కు దూరంగా ఉండడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత.. కుడివైపున కల్పించే మూడు లైన్ల పై క్లిక్ చేయాలి. అందులో టైం మేనేజ్మెంట్ ఎంపిక చేసుకోవాలి. డైలీ లిమిట్ కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. నోటిఫికేషన్లను ఆఫ్ చేసుకోవాలి. హోమ్ స్క్రీన్ పై యాప్ అనేది కనిపించకుండా పేరు లేని ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయాలి. అందులో దానిని సేవ్ చేసుకోవాలి. అవసరం లేదు అనుకుంటే యాప్ మొత్తాన్ని డిలీట్ చేయాలి. ప్రత్యామ్నాయంగా పుస్తకాలు చదవాలి. కొత్త స్కిల్స్ పెంపొందించుకోవడం పట్ల దృష్టి పెట్టాలి. దీనివల్ల ఇన్ స్టాగ్రామ్ వ్యసనానికి దూరంగా ఉండవచ్చు.

కాంగ్రెస్ ని మిత్ర పక్షాలు ఎందుకు నమ్మడంలేదు

Congress party crisis

Congress party crisis : కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై దేశంలో చర్చ జరుగుతున్నాయి. మిత్రపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే పొత్తు పెట్టుకున్న డీఎంకేను వదిలేసి టీవీకేకు మద్దతు ఇవ్వడంపై మిత్రపక్షాలు జీర్ణించుకోవడం లేదు. ముఖ్యంగా డీఎంకే అంతకు నెలరోజుల ముందే రాజ్యసభ సీటును కాంగ్రెస్ కు ఇచ్చింది.

అలాగే తమిళనాడులో బలం లేకున్నా ఏకంగా 28 సీట్లను కాంగ్రెస్ కు ఇచ్చింది డీఎంకే. అసలు రాహుల్ గాంధీ ప్రచారం చేయకున్నా.. స్టాలిన్ 28 చోట్ల ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థికసాయం కూడా చేశారని తెలిసింది. కానీ.. జరిగింది ఏంటి.. డీఎంకేకు మాట కూడా చెప్పుకుండా కాంగ్రెస్ ఫ్లేటు ఫిరాయించి టీవీకేకు సపోర్టు చేసింది.

ప్రజలు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలుపలేదు. 28 సీట్లకు 5 సీట్లే గెలిపించారు ప్రజలు. ప్రజలు కూడా మీ వైపు లేరు. అది ఆలోచించుకుండా పవర్ చోరీ కోసం టీవీకేకు మద్దతుగా కాంగ్రెస్ ఫ్లేటు ఫిరాయించింది.

బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఓడిపోయింది.. తమిళనాడులో ఓడిపోయింది. కేరళలోనే గెలిచింది. ఇది కాంగ్రెస్ కు చాలా డ్యామేజ్ జరిగింది..

కాంగ్రెస్ ని మిత్ర పక్షాలు ఎందుకు నమ్మడంలేదు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోను చూడండి

యంగ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఫ్లైట్ లో ఆఫీసుకు.. ఇంతకీ ఇతడు అలా ఎందుకు వెళ్తున్నాడంటే..

Engineer Travel Story
Engineer Travel Story

Engineer Travel Story: పెట్రోల్ ధరలు తారస్థాయిలో ఉన్నాయి. జీవనశైలి కూడా భారంగా మారింది. ఇలాంటి సమయంలో వ్యక్తిగత వాహనాల కంటే.. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణం చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే నాలుగు డబ్బులను మిగుల్చుకోవాలని భావిస్తున్నారు. కానీ ఇతడు అందరికంటే భిన్నంగా ఉన్నాడు. తన పని చేస్తున్న కార్యాలయానికి వెళ్లడానికి కారు లేదా బస్సు లేదా రైలు వంటి ప్రయాణ సాధనాలు వాడకుండా.. ఏకంగా విమానాన్ని ఉపయోగిస్తున్నాడు.

కార్యాలయానికి వెళ్లడానికి విమానం ఉపయోగిస్తున్న ఇతడి పేరు హాంగ్ వై.. యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతడి దక్షిణ కొరియా. 15 సంవత్సరాల క్రితమే అమెరికా వచ్చాడు. ఇతడికి పెళ్లి కూడా అయింది. గూగుల్ సంస్థలో ఇతర పని చేస్తున్నాడు. ఇతడి పనితీరు మెచ్చిన గూగుల్ వైబే ఏరియాలో ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చింది. ఇతడు భార్యకు మాత్రం అమెజాన్ కార్యాలయంలో కీలకమైన ఉద్యోగం లభించింది. ఆమె ప్రస్తుతం సీ టెల్ ప్రాంతంలో ఉంటున్నారు. వైబే ఏరియాలో పనిచేస్తున్న హాంగ్.. తన భార్యను చూసేందుకు తాను ఉంటున్న శాన్ జోస్ నుంచి భార్య పని చేస్తున్న సీ టెల్ ప్రాంతానికి ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రాంతానికి వెళ్లడానికి అతడు విమానంలో ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. ప్రతి సోమవారం లేదా మంగళవారం సీటెల్ ప్రాంతం నుంచి శాన్ జోస్(కాలిఫోర్నియా) కు విమాన ప్రయాణం సాగిస్తుంటాడు. మళ్లీ గురువారం లేదా శుక్రవారం సీ టెల్ వెళ్తుంటాడు. అటు సీ టెల్, ఇటు శాన్ జోస్ ప్రాంతాలలో ఇంటి అద్దెలు.. విమానానికి సంబంధించిన టికెట్ ధరలు.. ఇతర ఖర్చులు కలిపి దాదాపు 2.8 లక్షల వరకు ఉంటుంది.. అయినప్పటికీ తన భార్యను చూసేందుకు రావడం తనకు ఎంతగానో ఆనందం కలిగిస్తోందని.. ఇద్దరం కూడా కెరియర్లో కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఈ ఖర్చు పెద్దది కాదని అతడు చెబుతున్నాడు.

హాంగ్ ప్రస్తుతం గూగుల్ ఏఐ ప్రాజెక్టులలో పనిచేస్తున్నాడు. ఖాళీ సమయం దొరికితే తన పర్సనల్ న్యూస్ లెటర్లో పనిచేస్తూ ఉంటాడు. దానికి 500 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.. ఈ ప్రయాణ అనుభవాన్ని అతడు గొప్పగా ఆస్వాదిస్తున్నాడు. భార్యతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. కెరియర్.. రిలేషన్.. ఎదుగుదల ఇలా మూడింటిని ఒకేకాలంలో చేస్తూ.. నేటితరం పిల్లలు దేన్నైనా సాధించడానికి ఎంతకైనా తెగిస్తారని నిరూపిస్తున్నాడు.

కట్టుదిట్టమైన భద్రత ఉన్నా.. నీట్ పరీక్ష పత్రం ఎలా లీక్ అయింది..

NEET Exam Paper Leak
NEET Exam Paper Leak

NEET Exam Paper Leak: నీట్ పరీక్ష పత్రాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తయారుచేస్తారు.. పరీక్ష కూడా అదే స్థాయిలో నిర్వహిస్తూ ఉంటారు. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ నీట్ ప్రశ్నపత్రం ఎలా బయటికి వచ్చింది.. కొంతమంది ముఠా సభ్యులు ఇలా దీనిని బయటికి తీసుకు రాగలిగారు.. ఇప్పుడు ఈ ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి.

నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో సిబిఐ దూకుడు పెంచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐదుగురిని అరెస్ట్ చేసింది. దాదాపు 24 మందిని అదుపులోకి తీసుకుంది. దేశ వ్యాప్తంగా మంగళవారం అనేక ప్రాంతాలలో విస్తృతంగా సోదాలు జరిపింది. ఫోన్లు .. లాప్టాప్ లు స్వాధీనం చేసుకుంది. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించింది. సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతానికి చెందిన మంకీలాల్ , వికాస్, దినేష్ ఉన్నారు. హర్యానా రాష్ట్రంలోని గురు గ్రామ్ ప్రాంతానికి చెందిన యశ్ యాదవ్, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన శుభం ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు..

ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు బృందాలు ఏకంగా 15 మందికి పైగా విద్యార్థులను విచారించాయి. ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో కోచింగ్ సెంటర్ల పాత్రలేదని.. తమకు ఆ దిశగా ఆధారాలు లభించలేదని పోలీసులు ప్రకటించారు. ఒక కన్సల్టెన్సీ వ్యవస్థ.. విద్యార్థుల పేరుతో అనేక మాధ్యమాలలో గెస్ పేపర్ అనే పిడిఎఫ్ ఫైల్ సర్కులేట్ చేసింది. ఆ పేపర్ మొత్తాన్ని ప్రింట్ తీసి విద్యార్థులకు ఓ జిరాక్స్ సెంటర్ యజమాని అందించాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గెస్ పేపర్ పేరుతో ఇది చాలామందికి చేరింది. దీనిని ముందుగా కేరళ రాష్ట్రంలో ఎంబిబిఎస్ అవుతున్న రాజస్థాన్ ప్రాంతానికి సంబంధించిన ఒక విద్యార్థి.. రాజస్థాన్లోని ఒక హాస్టల్ ఓనర్.. కొంతమంది విద్యార్థులకు పంపించాడు. అక్కడ నుంచి ఇంకా అనేకమంది విద్యార్థులకు అది చేరింది. కేరళ రాష్ట్రంలో ఎంబిబిఎస్ అవుతున్న రాజస్థాన్ విద్యార్థికి గెస్ పేపర్ ను అదర్ స్నేహితుడు పంపించాడు. అది అక్కడ నుంచి గురు గ్రామ్ ప్రాంతంలోని ఒక వ్యక్తి ద్వారా రాజస్థాన్ కు చేరినట్టు తెలుస్తోంది. అయితే ఆ హాస్టల్ ఓనర్ ఈ వ్యవహారాన్ని పోలీసులు దృష్టికి తీసుకువచ్చాడు. అతడే ఈ వ్యవహారంలో కీలక సమాచారాన్ని పోలీసులకు అందించాడు.

నీట్ ప్రశ్నపత్రం మహారాష్ట్రలోని నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రణ అయింది. అక్కడ నుంచి పేపర్ బయటకు వచ్చినట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. పూణేలో ఒక మహిళను పోలీసులు ఇప్పటికే అధువులకు తీసుకున్నారు. మరోవైపు ఢిల్లీలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సిబిఐ అధికారులు సందర్శించారు. అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.. రాజస్థాన్లో పోలీసులు అరెస్ట్ చేసిన దినేష్ బిజెపిలో పనిచేస్తున్నాడని కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. అతడు జైపూర్ గ్రామీణ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని విమర్శించారు.

అశోక్ చేసిన విమర్శలను బిజెపి నాయకులు ముఖేష్ తీవ్రంగా ఖండించారు. కాగా, దినేష్ అరెస్టు తర్వాత అతడి తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.. తన కొడుకు దినేష్ స్థానిక ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎమ్మెల్యేతో తాను మాట్లాడానని ఆమె చెప్పారు. ఈ కేసు వ్యవహారంతో తన భర్తకు సంబంధం లేదని.. తమ కుమారుడి నీట్ పరీక్ష కోసం షికారు ప్రాంతంలో ఉంటున్నాడని దినేష్ భార్య రజని విలేకరులతో వెల్లడించారు.

0, 0.. ఇప్పుడేమో 105*.. విరాట్ అంటేనే రన్ మిషన్..

Virat Kohli Century
Virat Kohli Century

Virat Kohli Century: వరుసగా రెండు మ్యాచ్ లు …0 పరుగులు.. కోహ్లీ పని అయిపోయిందని అందరూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.. దీనికి తోడు విరాట్ కోహ్లీ కూడా అంత సౌకర్యవంతంగా మైదానంలో కనిపించలేదు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇకపై టి20లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని కొంతమంది విశ్లేషకులు జోష్యం చెప్పారు. ఇలాంటివి విరాట్ కోహ్లీ చాలా చూశాడు. ఆడితే గొప్పవాడివని.. ఆడకపోతే చెడ్డవాడివని ఇటువంటి ముద్రలు అతడు అనేకం భరించాడు. సింహం జూలు విధిల్చినట్టుగా.. ఒక్కసారిగా తన బ్యాట్ పరాక్రమాన్ని బయటపడ్డాడు..

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేశాడు.. 60 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 105* పరుగులు చేశాడు. ఫలితంగా షారుక్ ఖాన్ జట్టు విధించిన లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 19.1 ఓవర్లలో, నాలుగు వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది.

లక్నో జట్టు విధించిన 193 పరుగుల టార్గెట్ ఫినిష్ చేసేందుకు రంగంలోకి దిగిన బెంగళూరు ప్రారంభంలోనే బెతల్ (15) వికెట్ నష్టపోయింది. విరాట్ కోహ్లీ జోరు చూపించడంతో బెంగళూరు ఈజీగా విక్టరీ అందుకుంది. చెత్త బంతులను మాత్రమే శిక్షించిన విరాట్.. పదునైన బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా వైభవ్ వేసిన ఓవర్ లో నాలుగు ఫోర్లు కొట్టాడు. కార్తీక్ బౌలింగ్లో భారీ సిక్సర్ సాధించాడు. ఫలితంగా 10 ఓవర్లలోనే బెంగళూరు స్కోర్ సెంచరీ మార్క్ అందుకుంది. ఈ దశలోనే విరాట్ కోహ్లీ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తదుప రి ఓవర్లలో కూడా విరాట్ కోహ్లీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. పడికల్ తో రెండో వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని విరాట్ నమోదు చేశాడు.

పడికల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన పాటిదర్ గొప్పగా ఆడలేకపోయాడు. చివరి నాలుగు ఓవర్లలో బెంగళూరు విజయానికి 36 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో విరాట్ బ్యాటింగ్ చేయడంతో విజయం సాధ్యమైంది.. తద్వారా 58 బంతుల్లో ఐపీఎల్లో తన 9వ సెంచరీని పోస్ట్ చేసుకున్నాడు విరాట్.. ఇప్పటివరకు ఐపీఎల్లో ఎక్కువ సెంచరీలు(9) చేసిన ఆటగాడిగా విరాట్ కొనసాగుతున్నాడు. అతని తర్వాతి స్థానంలో బట్లర్ (7) ఉన్నాడు. అదే కాదు ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్ (279) లు ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ధోని, రోహిత్ (278) మ్యాచులతో తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు. ఈ విజయం ద్వారా బెంగళూరు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి వచ్చింది. ప్లే ఆఫ్ ఆశలను మరింత సుస్థిరం చేసుకుంది.

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీ ఇకపై ఎలా ఉండబోతుందంటే..

WhatsApp New Privacy Feature
WhatsApp New Privacy Feature

WhatsApp New Privacy Feature: వాట్సప్ వాడకం అంతకంతకు పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ యాప్ కు విపరీతమైన ఆదరణ ఉంది. ఓ నివేదిక ప్రకారం దాదాపు 5 బిలియన్ల యూజర్లు ఈ యాప్ వాడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వాలు కూడా వాట్సాప్ ద్వారానే ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ముఖ్యంగా సర్టిఫికెట్లు.. ఇతర ఆన్లైన్ సేవలను దీని ద్వారానే కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏకంగా వాట్సప్ గవర్నెన్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా పౌరులకు కొన్ని రకాల సేవలు అందిస్తోంది.

వాట్సప్ నిర్వహణ దాని పేరెంటింగ్ కంపెనీ మెటా చూసుకుంటూ ఉంటుంది. మెటా ఎప్పటికప్పుడు వాట్సప్ ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. కొత్త కొత్త ఫీచర్లను జత చేస్తూ ఉంటుంది. దీనివల్ల యూజర్లకు ప్రైవసీ.. ఇతర సెక్యూరిటీ వ్యవస్థలు రక్షణగా ఉంటాయి. ఇతర సంస్థల నుంచి పోటీ.. యూజర్ల అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో మెటా కంపెనీ ఎప్పటికప్పుడు వాట్సప్ ను ఆధునికరిస్తుంది. యూజర్ల ప్రైవసీకి ప్రాధాన్యం కల్పిస్తూ ఉంటుంది.

తాజాగా వాట్స్అప్లో ఒక కొత్త ప్రైవసీ ఫీచర్ ను మెటా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల రక్షణ తమకు ప్రథమ ప్రాధాన్యమని మెటా కంపెనీ స్పష్టం చేసింది. మెటా ఏఐ చాట్ లో వాట్సాప్ ఇన్ కాగ్నిటో మోడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్సనల్ చాట్ కు ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ను ఎక్స్ టెండ్ చేసింది. దీనివల్ల యూసర్లు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో పర్సనల్, ప్రైవేట్ కన్వెర్షన్ జరిపేందుకు అవకాశం ఉంటుంది.. ఇక్కడ ఏం చాట్ చేశారనేది.. యూజర్లకు మినహా.. మిగతా వారికి తెలిసే ఆస్కారం లేదు. చివరికి మెటా ఏఐ కూడా దీనిని యాక్సిస్ చేయలేదు. ఆ సందేశాలు సేవ్ కూడా కావు. వెంట వెంటనే డిసపియర్ అయిపోతూ ఉంటాయి.

ఈ ఫీచర్ వల్ల యూజర్లు సరికొత్త అనుభూతిని పొందవచ్చని మెటా చెబుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. పైగా రెండవ కంటికి తెలియకుండా సమాచారాన్ని సేకరించవచ్చు. అందువల్లే మెటా కంపెనీ ఈ ఫీచర్ తీసుకొచ్చింది. కొన్ని దేశాలలో టెస్టింగ్ దశ విజయవంతంగా పూర్తయిన తర్వాత.. దీనిని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో తీసుకొచ్చింది.

టీసీఎస్‌ ఉదంతంలో మౌనం.. బండి విషయంలో రాజకీయం!

TCS Incident
TCS Incident

TCS Incident: టీసీఎస్‌లో ఉద్యోగాలు ఆశ చూపి పేద, మధ్య తరగతి యువతులను లవ్‌జిహాల్‌ పేరుతో వేధించడం, లైంగికంగా వాడుకోవడం, మతం మారాలని ఒత్తిడి చేయడం వంటి విషయాలు గత నెలలో ఆధారాలతో సహా వెలుగు చూశాయి. పోలీసులు ఈ గుట్టు రట్టు చేశారు. 8 బాధిత యువతుల ఇందులో ఉన్నట్లు నిర్దారించారు. ఇక ఇందులో ప్రధాన నింధితురాలు హెచ్‌ఆర్‌ మహిలే. కొందరు ఉద్యోగులు ఉన్నారు. అయితే ఈ ఉదంతంపై పెద్దగా స్పందించిన రాజకీయ పార్టీలు కానీ, సంఘాలు కానీ లేవు. కానీ, తాజాగా బండి సంజయ్‌ తనయుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో మాత్రం తెలంగాణలో కొన్ని సంఘాలు, కొంతమంది నాయకులు అతిగా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

బండి సంజయ్‌ కుమారుడి కేసు..
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు సాయి భగీరథ్‌పై ఫోక్సో కేసు నమోదైంది. హైదరాబాద్‌ మెట్రోలో పోస్టర్లు, ఉద్యమాలు ఊపందుకున్నాయి. యువతితో సహవాసం సహజమే, కానీ మైనర్‌తో లైంగిక బంధం మాత్రం నేరం. దీనిపై విచారణ జరగాలి. వాస్తవాలు తెలియాలి. భగీరథ్‌కు మద్యపాన అలవాటు తీవ్ర లోపాలు ఉన్నాయన్నది అర్థమవుతోంది.

ద్వంద్వ వైఖరి..
టీసీఎస్‌లో మత స్వేచ్ఛా ఉల్లంఘనలు మర్చిపోతూ, బండి కేసులో రొడ్డెక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ నేత కుమారుడిపై దాడి రాజకీయ లీకేజీలా కనిపిస్తోంది. ఇలాంటి డబుల్‌ స్టాండర్డ్స్‌ సమాజంలో విభేదాలను పెంచుతాయి. మైనర్‌ సురక్షణ, మత హక్కులు సమానంగా కాపాడాలి.

చట్టం అందరిపై సమానంగా అమలవ్వాలి. పోలీసులు టీసీఎస్‌ దర్యాప్తును వేగవంతం చేయాలి. పోక్సో కేసుల్లో త్వరిత నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయులు కుటుంబ సమస్యలను సరిదిద్దుకుని, సామాజిక బాధ్యతలు నెరవేర్చాలి.

బెంగాల్లో బిజెపి విజయం.. బంగ్లా సరిహద్దు కుట్రలకు ఇక చెక్

Bangladesh Border Infiltration
Bangladesh Border Infiltration

Bangladesh Border Infiltration: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తృణమూల్‌ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. 70 ఏళ్ల చరిత్రలో బీజేపీ తొలిసారి గెలిచింది. అయితే ఇది తృణమూల్‌కు షాక్‌ ఇచ్చింది. అంతకన్నా ఎక్కువగా బంగ్లాదేశీయులకు షాక్‌. ఎందుకంటే అక్రమ చొరబాటు, ఆయుధ స్మగ్లింగ్‌ మార్గాలు మూసుకుపోతున్నాయి. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌లో భారతంలో బీజేపీ గెలుపును ’ప్రమాదకరం’గా చూపించింది. బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడడం కష్టమవుతోంది.

ఉగ్ర సంస్థల బెదిరింపులు..
చాత్ర సైనిక్‌ జనతా వంటి గుండాలు సువేందు అధికారిని ’సరిహద్దులో సమాధి’ చేస్తామని, మమత బెనర్జీ స్వతంత్ర దేశ ప్రకటనకు మద్దతిస్తామని హెచ్చరించాయి. ఇవి ఖాళీ మాటలు కావు. గోవుల అక్రమ రవాణా, ఆయుధాలు ఆగిపోవడం వెనుక ఉద్రిక్తతలు. తృణమూల్‌ నేతల వద్ద ఆయుధాలు, టన్నెల్స్‌ గుర్తింపు జరుగుతున్నాయి.

త్రిపుర ఘటన..
మే 9న త్రిపుర కమలాసాగర్‌–పతారియా జీరో పాయింట్‌ వద్ద స్మగ్లర్ల చొరబాటు ప్రయత్నంపై బీఎస్‌ఎఫ్‌ కాల్పులు. రాళ్ల దాడితో ఇద్దరు మృతి. 4,096 కి.మీ. సరిహద్దులో (బెంగాల్‌కు 2,217 కి.మీ.) అస్సాం, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరామ్‌లో బీజేపీ/మిత్రపక్షాలు చొరబాటును అడ్డుకుంటున్నాయి. ఇది బంగ్లాదేశ్‌కు మింగుడు పడడం లేదు.

ఐఎస్‌ఐ, జమాత్‌ కుట్రలు..
పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ నాయకులు బంగ్లాదేశ్‌ సందర్శనలు, జమాత్‌ సమావేశాలు జరుపుతున్నారు. దీంతో భారత్‌ సరిహద్దు యాక్టివిటీలను పెంచింది. పేలుళ్లు, దాడుల ప్రమాదం నిఘా సంస్థల హెచ్చరిక ఉంది. తృణమూల్‌ నిర్లక్ష్యం ఈ పరిస్థితికి కారణంగా భావిస్తున్నారు.

బెంగాల్‌ మార్పు జాతీయ భద్రతకు మలుపు. బలమైన ఫెన్సింగ్, డ్రోన్‌ నిఘా, బీఎస్‌ఎఫ్‌ బలోపేతం తప్పనిసరులు. కేంద్రం ఈశాన్య రాష్ట్రాల సమన్వయంతో చొరబాటు నిర్మూలించాలి. రాజకీయ పక్షపాతాలు మాని, జాతీయ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి అదే భారత మార్గం.

లడ్డాక్ లో మోడీ సరికొత్త పాచిక.. ఓవైసీ నుంచి కమ్యూనిస్టుల దాకా గడబిడ.. ఇంతకీ ఏం జరిగింది

Modi Ladakh Plan
Modi Ladakh Plan

Modi Ladakh Plan: దేశమంతా పొదుపు గురించి చర్చ జరుగుతోంది. అంతర్జాతీయంగా మధ్య ఆసియా యుద్ధం గురించి విశ్లేషణ సాగుతోంది. కానీ మన దేశానికి వచ్చేసరికి ఒక కీలక విషయం చోటు చేసుకుంది. దీనిపై ప్రధాన మీడియా సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు.. ఒకవేళ తెలిసినా కొన్ని మీడియా సంస్థలు తక్కువ ప్రయారిటీ ఇచ్చాయి.. కానీ అక్కడ జరుగుతున్నది.. జరగబోయేది కొంతమందికి మాత్రమే తెలుసు. దీంతో రియాక్ట్ అయ్యారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ వేసిన స్కెచ్ అలాంటిది.

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్, లడ్డాక్ వేరువేరు అయ్యాయి. లడ్డాక్ ప్రాంతంలో రెండు జిల్లాలు మాత్రమే ఉండేవి. ఒక జిల్లాలో ముస్లింలు.. మరో జిల్లాలో బుద్ధులు ఉండేవారు. ఈ రెండు జిల్లాలలో చాలావరకు గ్రామాలు దూరం గా ఉంటాయి. ఫలితంగా పరిపాలన అనేది సక్రమంగా సాగడం లేదు. పైగా ఇక్కడ ప్రేరేపిత హింస ఇష్టానుసారంగా సాగిపోతూ ఉంటుంది. గతంలో లడ్డాక్ ప్రాంతంలో వాంగ్ చుక్ పాల్పడిన హింస జమ్ము కాశ్మీర్లో అలజడి కారణమైంది. అతని ప్రేరేపిత పార్టీలు ఉన్నాయి. పైగా లడ్డాక్ ప్రాంతంలో చైనాకు సరిహద్దులో చాలా గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ భారతదేశానికి భద్రతకు సంబంధించి అత్యంత సున్నితమైన ప్రాంతాలు.

ఈ ప్రాంతాలలో అభయారణ్యాలు చాలా ఉన్నాయి. పైగా లడ్డాక్ ప్రాంతంలో కొన్ని సంచార తెగలు ఈ ప్రాంతాలలో పశువులను మేపుతుంటారు. ఆరు నెలలపాటు అ పశువులను అక్కడ మేపి.. వాటి ద్వారా ఉన్ని సేకరిస్తారు.. ఈ ప్రాంతాలు అత్యంత సున్నితం. అయితే ఇక్కడ అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. చాలా గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయాలు లేవు. దీనిని గుర్తించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం.. ఈ ప్రాంతాలను ఏడు జిల్లాలుగా మార్చింది. అన్ని జిల్లాలలో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీనిద్వారా ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణ.. అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుందని కేంద్రం భావించింది.

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత ఓవైసీ ఖండించారు. కొంతమంది కమ్యూనిస్టులు కూడా తప్పు పట్టారు. ముస్లిం జనాభా ప్రాబల్యానికి ప్రమాదం ఏర్పడుతుందని ఓవైసీ ఆరోపిస్తున్నారు. కానీ అక్కడ మతపరమైన వివాదాలు చెలరేగి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పైగా లడ్డాక్ ప్రాంతంలో ఒకే ఒక పార్లమెంట్ స్థానం ఉంది. ఇక్కడ అసెంబ్లీ స్థానాలు లేవు.

ఒకవేళ ఎన్నికల కోణంలో బీజేపీ అలా చేసింది అనుకుంటే.. అక్కడ ఎటువంటి శాసనసభ స్థానాలు లేవు. ఓవైసీ, కమ్యూనిస్టులు ఇలా గోల చేస్తున్నారంటే.. అక్కడ మన దేశానికి ఏదో మంచి జరుగుతుందని అర్థం. అందువల్లే ఆ స్థాయిలో ఆ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయని బిజెపి నేతలు అంటున్నారు.. ఆర్టికల్ 370 సమయంలో కూడా ఇలానే వ్యాఖ్యానించారని.. ఇప్పుడు జమ్ము కాశ్మీర్లో పరిస్థితులు.. అభివృద్ధి అద్భుతంగా సాగుతున్న నేపథ్యంలో కుహనా మేధావులు కళ్ళు మూసుకున్నారని బిజెపి నాయకులు అంటున్నారు.

నరేంద్ర మోడీ వేసిన పాచిక వల్ల మతోన్మాద పార్టీల ఎత్తుగడలు చిత్తు అయ్యాయని బిజెపి కార్యకర్తలు పేర్కొంటున్నారు.. ఈ ప్రాంతాలను ఏడు జిల్లాలుగా విస్తరించడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది. శాంతి భద్రతల పరిరక్షణ సులభం అవుతుంది. అందువల్లే మతోన్మాద గొడవలు. ఇతర కుట్రలకు ఆస్కారం ఉండదని ఓవైసీ బాధపడుతున్నారని.. అందువల్ల కేంద్రం మీద విమర్శలు చేస్తున్నారని బిజెపి నాయకులంటున్నారు..

మగతనం నిరూపించుకోవాలంటే.. అక్కడ కుట్టించుకోవాలి.. వామ్మో ఇదేం ఆచారం రా బాబూ

Amazon tribe tradition
Amazon tribe tradition

Amazon tribe tradition: నిజంగా అక్కడ మగాడిగా పుట్టడం కంటే.. అడవిలో చెట్టుగా పుట్టడం నయం అనుకుంటా. ఎందుకంటే మగ పుట్టుక పుట్టిన తర్వాత అక్కడ ప్రతిరోజు ఒక పరీక్షనే. ఆ పరీక్షలను తట్టుకుంటూ.. బాధలను భరించుకుంటూ ముందుకు సాగిపోవాలి. నావల్ల కాదు అంటే.. ఇక అప్పుడు ఉంటది నా సామిరంగా.. ప్రతిరోజు సినిమానే. అందువల్లే అక్కడ మగాళ్లుగా పుట్టిన వారంతా ప్రతిరోజు పరీక్షలు ఎదుర్కొంటూనే ఉంటారు.

ఆదిమ కాలంలో ఇటువంటి విధానాలు ఉండేవి అనుకుంటా. ఇప్పటి ఆధునిక కాలంలో కూడా అటువంటి పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వాటిని ఎదుర్కొంటు మగాళ్లు ముందుకెళ్తుండడం నిజంగా ఆశ్చర్యమే. అమెజాన్ అడవుల్లో సతేరే మావే అనే తెగ జీవిస్తూ ఉంటుంది. ఈ తెగలో పుట్టిన మగాళ్లు.. తాము మగాళ్లమని గుర్తింపు పొందాలంటే కచ్చితంగా బుల్లెట్ పరీక్షా ఎదుర్కోవాలి. ఇక్కడ బుల్లెట్ అనగానే ఎవరూ తుపాకులతో కాల్చరు. బుల్లెట్ ఆంట్స్(చీమలు) తో కుట్టించుకోవాలి. బుల్లెట్ చీమలతో నిండిన గ్లోవ్స్ ధరించాలి. ఆ చీమల కుట్టినప్పుడు కలిగే నొప్పి బుల్లెట్ తగిలిన దానికంటే ఇబ్బందిగా ఉంటుందట. ఈ పరీక్షను ధైర్యానికి, సహనానికి ప్రతీకగా భావిస్తుంటారు. ఈ పరీక్షను వారు అనేక సందర్భాల్లో ఎదుర్కోవాలి. చీమలు కుట్టినప్పుడు మగవాళ్ళు దారుణంగా ఏడుస్తారు. కొన్ని సందర్భాలలో విపరీతమైన గాయాలు కూడా అవుతుంటాయి. అయినప్పటికీ వారు ఓర్చుకుంటారు. దీనిని ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన ఆచారంగా చెబుతుంటారు.

చీమలలో విష పదార్థం ఉంటుంది. కాకపోతే అది మనుషులను చంపే స్థాయిలో ఉండదు. అయినప్పటికీ ఆ చీమలు కుట్టినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. పైగా ఒక్కోసారి దద్దుర్లు కూడా ఏర్పడుతుంటాయి. కొన్ని బలమైన చీమలు గాయాలు కూడా చేస్తుంటాయి. ఆ సమయంలో రక్తాలు కూడా కారుతూ ఉంటాయి. అయినప్పటికీ మగవాడిగా గుర్తింపు పొందాలంటే వారు బుల్లెట్ పరీక్షను ఎదుర్కొంటారు. బుల్లెట్ పరీక్షలో విజయవంతమైన వారు వివాహానికి యోగ్యులని అక్కడి పెద్దలు చెబుతుంటారు. ఆ తర్వాత వారికి వివాహాలు చేస్తుంటారు.

తెలంగాణ లో 'పెద్ది' మూవీ ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ ఇవే.. ఇంత తక్కువ ఊహించలేదు..

Peddi Movie Premiere Ticket Rates
Peddi Movie Premiere Ticket Rates

Peddi Movie Premiere Ticket Rates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఉన్నటువంటి అంచనాలు ఏ రేంజ్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంక్రాంతి తర్వాత నాలుగు నెలల నుండి సరైన సినిమా లేక ఇబ్బంది పడుతున్న బయ్యర్స్ ఈ సినిమా మీదనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అభిమానులు కూడా ఈ చిత్రం తో రామ్ చరణ్ కుంభస్థలం బద్దలు కొడుతాడు అనే బలమైన నమ్మకంతో ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రంగస్థలం రేంజ్ హిట్ గా నిల్చి, వెయ్యి కోట్ల గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు. ప్రొమోషన్స్ ని కూడా ఈ నెల 18 నుండి చాలా అగ్రెసివ్ గా మొదలు పెట్టబోతున్నారు. ముందుగా 18 న ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు, ఆ తర్వాత భోపాల్ లో స్పెషల్ సాంగ్ ని విడుదల చేసి మ్యూజికల్ నైట్ ఈవెంట్ ని ఏర్పాటు చేయనున్నారు.

ఈ ఈవెంట్ లో AR రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఉండబోతుంది. ఇదంతా పక్కన పెడితే , ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. జూన్ 3 న ఇండియా వైడ్ గా ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్. అందుకే తెలంగాణ లో ప్రీమియర్ షోస్ టికెట్ రేట్ 600 కి పెట్టుకునేలా అనుమతిని ఇవ్వాలంటూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు మేకర్స్. అదే విధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్, మల్టీ ప్లెక్స్ థియేటర్స్ కి ప్రస్తుతం ఉన్న రేట్స్ మీద 100 రూపాయిలు పెంచాల్సిందిగా కోరారు. మరి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, హై కోర్టు ఆ అనుమతిని నిరాకరించే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

అయితే ప్రీమియర్ షోస్ కి 600 రూపాయిలు పెట్టాలనే ఆలోచన కచ్చితంగా స్వాగతించబడినది. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి 800 రూపాయిల టికెట్ రేట్స్ పెట్టారు. కానీ ఈ చిత్రానికి కేవలం 600 రూపాయిలు మాత్రమే పెట్టారు . ఈ రేంజ్ హైప్ ఉన్న సినిమాకు ఇంత తక్కువ పెట్టడం వల్ల, ఫుట్ ఫాల్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది, గ్రాస్ కూడా అద్బురంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

మైఖేల్ జాక్సన్ బ్రతికే ఉన్నాడా.. కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడుగా.. వీడియో వైరల్..

Michael Jackson
Michael Jackson

Michael Jackson: పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ ని ఇష్టపడని వారంటూ ఎవరుంటారు చెప్పండి. తన డ్యాన్స్ తో ప్రపంచం లోని ప్రతీ సంగీత ప్రియుడిని ఉర్రూతలూ ఊగించేలా చేసిన దిగ్గజం ఆయన. ఈరోజు అలాంటి దిగ్గజం మన మధ్య లేకపోవడం మనం చేసుకున్న దురదృష్టం, మళ్లీ అలాంటి టాలెంటెడ్ పాప్ సింగర్ పుట్టడు. అయితే మనిషిని పోలిన మనుషులు ఈ లోకంలో 7 మంది ఉంటారని అందరూ అంటున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అలాంటి వాళ్ళను చూస్తుంటాం. ఇప్పుడు మైఖేల్ జాక్సన్ కి జిరాక్స్ కాపీ లాంటి వ్యక్తిని కూడా చూసే అదృష్టం కలిగింది. ఒక పబ్లిక్ బస్సు లో చెవిలో పాటలు పెట్టుకొని కళ్లద్దాలు ధరించి ఉన్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అచ్చు గుద్దినట్టు అతను మైఖేల్ జాక్సన్ లాగా ఉండడం తో , తోటి ప్రయాణికులు ఫోటోలు , వీడియోలు తీయడం మొదలు పెట్టారు.

వాళ్ళని చూడగానే ఆయన కెమెరాలకు చేతులు అడ్డు పెడుతాడు. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇతను ఎవరు?, ఏ ప్రాంతానికి చెందిన వాడు? ఏమి చేస్తుంటాడు వంటి వివరాలు తెలియవు కానీ , సోషల్ మీడియా లో మాత్రం ఈ వీడియో ని మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గానే మైఖేల్ జాక్సన్ బయోపిక్ మీద ‘మైఖేల్’ అనే చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో మైఖేల్ జాక్సన్ అల్లుడు జాఫర్ జాక్సన్ హీరో గా నటించిన . మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి 17 రోజుల్లో 600 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో నార్త్ అమెరికా నుండి 255 మిలియన్ డాలర్ల గ్రాస్ రాగా, ఇంటర్నేషనల్ మర్కెట్స్ నుండి 350 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ వేల్యూ కేవలం 412 మిలియన్ డాలర్లు మాత్రమే. అంటే ఈ చిత్రం ప్రస్తుతం లాభాల్లోనే ఉంది అన్నమాట. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి ఇంకా ఎంత గ్రాస్ వసూళ్లు వస్తుందో చూడాలి.

అందాల సెలయేరు.. అందులో మంజరి అందాలు

Manjari Fadnnis
Manjari Fadnnis