Homeవింతలు-విశేషాలుEngineer Travel Story: యంగ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఫ్లైట్ లో ఆఫీసుకు.. ఇంతకీ ఇతడు...

Engineer Travel Story: యంగ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఫ్లైట్ లో ఆఫీసుకు.. ఇంతకీ ఇతడు అలా ఎందుకు వెళ్తున్నాడంటే..

Engineer Travel Story: పెట్రోల్ ధరలు తారస్థాయిలో ఉన్నాయి. జీవనశైలి కూడా భారంగా మారింది. ఇలాంటి సమయంలో వ్యక్తిగత వాహనాల కంటే.. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణం చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే నాలుగు డబ్బులను మిగుల్చుకోవాలని భావిస్తున్నారు. కానీ ఇతడు అందరికంటే భిన్నంగా ఉన్నాడు. తన పని చేస్తున్న కార్యాలయానికి వెళ్లడానికి కారు లేదా బస్సు లేదా రైలు వంటి ప్రయాణ సాధనాలు వాడకుండా.. ఏకంగా విమానాన్ని ఉపయోగిస్తున్నాడు. కార్యాలయానికి వెళ్లడానికి విమానం ఉపయోగిస్తున్న […]

Engineer Travel Story: పెట్రోల్ ధరలు తారస్థాయిలో ఉన్నాయి. జీవనశైలి కూడా భారంగా మారింది. ఇలాంటి సమయంలో వ్యక్తిగత వాహనాల కంటే.. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణం చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే నాలుగు డబ్బులను మిగుల్చుకోవాలని భావిస్తున్నారు. కానీ ఇతడు అందరికంటే భిన్నంగా ఉన్నాడు. తన పని చేస్తున్న కార్యాలయానికి వెళ్లడానికి కారు లేదా బస్సు లేదా రైలు వంటి ప్రయాణ సాధనాలు వాడకుండా.. ఏకంగా విమానాన్ని ఉపయోగిస్తున్నాడు.

కార్యాలయానికి వెళ్లడానికి విమానం ఉపయోగిస్తున్న ఇతడి పేరు హాంగ్ వై.. యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతడి దక్షిణ కొరియా. 15 సంవత్సరాల క్రితమే అమెరికా వచ్చాడు. ఇతడికి పెళ్లి కూడా అయింది. గూగుల్ సంస్థలో ఇతర పని చేస్తున్నాడు. ఇతడి పనితీరు మెచ్చిన గూగుల్ వైబే ఏరియాలో ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చింది. ఇతడు భార్యకు మాత్రం అమెజాన్ కార్యాలయంలో కీలకమైన ఉద్యోగం లభించింది. ఆమె ప్రస్తుతం సీ టెల్ ప్రాంతంలో ఉంటున్నారు. వైబే ఏరియాలో పనిచేస్తున్న హాంగ్.. తన భార్యను చూసేందుకు తాను ఉంటున్న శాన్ జోస్ నుంచి భార్య పని చేస్తున్న సీ టెల్ ప్రాంతానికి ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రాంతానికి వెళ్లడానికి అతడు విమానంలో ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. ప్రతి సోమవారం లేదా మంగళవారం సీటెల్ ప్రాంతం నుంచి శాన్ జోస్(కాలిఫోర్నియా) కు విమాన ప్రయాణం సాగిస్తుంటాడు. మళ్లీ గురువారం లేదా శుక్రవారం సీ టెల్ వెళ్తుంటాడు. అటు సీ టెల్, ఇటు శాన్ జోస్ ప్రాంతాలలో ఇంటి అద్దెలు.. విమానానికి సంబంధించిన టికెట్ ధరలు.. ఇతర ఖర్చులు కలిపి దాదాపు 2.8 లక్షల వరకు ఉంటుంది.. అయినప్పటికీ తన భార్యను చూసేందుకు రావడం తనకు ఎంతగానో ఆనందం కలిగిస్తోందని.. ఇద్దరం కూడా కెరియర్లో కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఈ ఖర్చు పెద్దది కాదని అతడు చెబుతున్నాడు.

హాంగ్ ప్రస్తుతం గూగుల్ ఏఐ ప్రాజెక్టులలో పనిచేస్తున్నాడు. ఖాళీ సమయం దొరికితే తన పర్సనల్ న్యూస్ లెటర్లో పనిచేస్తూ ఉంటాడు. దానికి 500 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.. ఈ ప్రయాణ అనుభవాన్ని అతడు గొప్పగా ఆస్వాదిస్తున్నాడు. భార్యతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. కెరియర్.. రిలేషన్.. ఎదుగుదల ఇలా మూడింటిని ఒకేకాలంలో చేస్తూ.. నేటితరం పిల్లలు దేన్నైనా సాధించడానికి ఎంతకైనా తెగిస్తారని నిరూపిస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper