Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli Century: 0, 0.. ఇప్పుడేమో 105*.. విరాట్ అంటేనే రన్ మిషన్..

Virat Kohli Century: 0, 0.. ఇప్పుడేమో 105*.. విరాట్ అంటేనే రన్ మిషన్..

Virat Kohli Century: వరుసగా రెండు మ్యాచ్ లు …0 పరుగులు.. కోహ్లీ పని అయిపోయిందని అందరూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.. దీనికి తోడు విరాట్ కోహ్లీ కూడా అంత సౌకర్యవంతంగా మైదానంలో కనిపించలేదు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇకపై టి20లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని కొంతమంది విశ్లేషకులు జోష్యం చెప్పారు. ఇలాంటివి విరాట్ కోహ్లీ చాలా చూశాడు. ఆడితే గొప్పవాడివని.. ఆడకపోతే చెడ్డవాడివని ఇటువంటి ముద్రలు అతడు అనేకం భరించాడు. సింహం జూలు విధిల్చినట్టుగా.. ఒక్కసారిగా తన బ్యాట్ పరాక్రమాన్ని బయటపడ్డాడు..

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేశాడు.. 60 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 105* పరుగులు చేశాడు. ఫలితంగా షారుక్ ఖాన్ జట్టు విధించిన లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 19.1 ఓవర్లలో, నాలుగు వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది.

లక్నో జట్టు విధించిన 193 పరుగుల టార్గెట్ ఫినిష్ చేసేందుకు రంగంలోకి దిగిన బెంగళూరు ప్రారంభంలోనే బెతల్ (15) వికెట్ నష్టపోయింది. విరాట్ కోహ్లీ జోరు చూపించడంతో బెంగళూరు ఈజీగా విక్టరీ అందుకుంది. చెత్త బంతులను మాత్రమే శిక్షించిన విరాట్.. పదునైన బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా వైభవ్ వేసిన ఓవర్ లో నాలుగు ఫోర్లు కొట్టాడు. కార్తీక్ బౌలింగ్లో భారీ సిక్సర్ సాధించాడు. ఫలితంగా 10 ఓవర్లలోనే బెంగళూరు స్కోర్ సెంచరీ మార్క్ అందుకుంది. ఈ దశలోనే విరాట్ కోహ్లీ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తదుప రి ఓవర్లలో కూడా విరాట్ కోహ్లీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. పడికల్ తో రెండో వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని విరాట్ నమోదు చేశాడు.

పడికల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన పాటిదర్ గొప్పగా ఆడలేకపోయాడు. చివరి నాలుగు ఓవర్లలో బెంగళూరు విజయానికి 36 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో విరాట్ బ్యాటింగ్ చేయడంతో విజయం సాధ్యమైంది.. తద్వారా 58 బంతుల్లో ఐపీఎల్లో తన 9వ సెంచరీని పోస్ట్ చేసుకున్నాడు విరాట్.. ఇప్పటివరకు ఐపీఎల్లో ఎక్కువ సెంచరీలు(9) చేసిన ఆటగాడిగా విరాట్ కొనసాగుతున్నాడు. అతని తర్వాతి స్థానంలో బట్లర్ (7) ఉన్నాడు. అదే కాదు ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్ (279) లు ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ధోని, రోహిత్ (278) మ్యాచులతో తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు. ఈ విజయం ద్వారా బెంగళూరు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి వచ్చింది. ప్లే ఆఫ్ ఆశలను మరింత సుస్థిరం చేసుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular