Homeఆంధ్రప్రదేశ్‌SI Krishna Prasad: కర్ర దొరికితే ఆ ఎస్ఐ చేసే విన్యాసం అది.. వీడియో వైరల్!

SI Krishna Prasad: కర్ర దొరికితే ఆ ఎస్ఐ చేసే విన్యాసం అది.. వీడియో వైరల్!

SI Krishna Prasad: పోలీస్ శాఖ లో ఎక్కువ మంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే. పోలీస్ ఎంపికలో కూడా గ్రామీణ నేపథ్యం ఎంతగానో అక్కరకు వస్తుంది. ముఖ్యంగా పోలీస్ నియామకాల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఎంపిక అవుతుంటారు. చాలామంది ఉన్నత స్థానాలకు వెళ్లిన తమ మూలాలను మాత్రం మరిచిపోరు. తాము చిన్ననాడు చేసే విన్యాసాలను కూడా వారు మారవ రు. ఓ పోలీస్ ఎస్ఐ అయితే ఎదురుగా సాము గరిడీలు కనిపించడంతో ఉండలేకపోయారు. […]

SI Krishna Prasad: పోలీస్ శాఖ లో ఎక్కువ మంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే. పోలీస్ ఎంపికలో కూడా గ్రామీణ నేపథ్యం ఎంతగానో అక్కరకు వస్తుంది. ముఖ్యంగా పోలీస్ నియామకాల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఎంపిక అవుతుంటారు. చాలామంది ఉన్నత స్థానాలకు వెళ్లిన తమ మూలాలను మాత్రం మరిచిపోరు. తాము చిన్ననాడు చేసే విన్యాసాలను కూడా వారు మారవ రు. ఓ పోలీస్ ఎస్ఐ అయితే ఎదురుగా సాము గరిడీలు కనిపించడంతో ఉండలేకపోయారు. అక్కడే ఉన్న కర్ర సాము కళాకారుల నుంచి కర్రను తీసుకొని.. అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ఎస్ఐ చేసిన కర్ర సాము సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

* అమ్మవారి పండుగలో..
శ్రీకాకుళం జిల్లా బెల్లు పట్టియాలో అమ్మవారి పండుగలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద గ్రామం కావడంతో.. పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సై కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో సిబ్బంది బందోబస్తు చేపడుతున్నారు. మూడు రోజులపాటు అమ్మవారి పండుగ వేడుకలు జరిగాయి. మరో ఆరు రోజులపాటు కొనసాగనున్నాయి. పండుగలో భాగంగా కర్ర సాము విన్యాసాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడే ఉన్న ఎస్సై కృష్ణ ప్రసాద్ ఉండలేకపోయారు. తాను చిన్నప్పుడు చేసిన కర్ర సాము విన్యాసం ఆయనకు గుర్తు వచ్చింది. వెంటనే కర్రను తీసుకుని విన్యాసం చేయడం ప్రారంభించారు. అక్కడ ఉన్న వారిని అది ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఎస్సై కృష్ణ ప్రసాద్ ను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* పోలీసులకు కత్తి మీద సాము..
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గ్రామ దేవత పండుగలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో మూడు నుంచి తొమ్మిది రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ ఐక్యతకు చిహ్నంగా.. సంప్రదాయాల మేళవింపుగా గ్రామ దేవతల పండుగలు జరుపుకుంటారు. అయితే ఈ గ్రామ దేవత పండుగలకు పోలీస్ బందోబస్తు నిర్వహించడం కష్టతరంగా మారుతోంది. అయితే సనాతన సంప్రదాయాలను గుర్తుకు తెస్తూ ఈ అమ్మవారి పండుగలు కొనసాగుతున్నాయి. నిత్యం బందోబస్తులో బిజీగా ఉండే ఇటువంటి పోలీస్ అధికారులు.. ఆటవిడుపుగా విన్యాసాలు చేయడం ఆకట్టుకుంటోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper