Home Blog Page 281

ఈ వారం 'కూకూ విత్ జాతి రత్నాలు 2' నుండి కళ్యాణ్ పడాల అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చిన తనూజ..

Cooku With Jathi Ratnalu 2
Cooku With Jathi Ratnalu 2

Cooku With Jathi Ratnalu 2: స్టార్ మా ఛానల్ లో రీసెంట్ గానే మొదలైన ఎంటర్టైన్మెంట్ షో ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’. గత ఏడాది ఇదే స్టార్ మా ఛానల్ లో మొదలైన సీజన్ 1 కి సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో , రెండవ సీజన్ ని భారీ అంచనాల నడుమ లాంచ్ చేశారు. ఈ సీజన్ కి మొదటి సీజన్ కంటే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని బహుశా మేకర్స్ కూడా ఊహించి ఉండరేమో. ప్రతీ శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ కుకింగ్ రియాలిటీ షోకి 4 నుండి 5 కి మధ్యలో టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి. అయితే ఈ సీజన్ కి ఈ రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ రావడానికి ముఖ్య కారణం కళ్యాణ్ , తనూజ జంట అని అంటున్నారు విశ్లేషకులు.

ఈ జంట బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరిలో తనూజ రన్నర్ గా నిలవగా, కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలిచారు. వీళ్లిద్దరి మధ్య ఈ షోలో సాగిన ప్రేమ, ఆప్యాయత ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ప్రేమ అంటే ముద్దులు పెట్టుకోవడం , హగ్ చేసుకోవడం వంటివి కాకుండా, ఒకరి కోసం ఒకరు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్దపడే తత్త్వం ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. అందుకే ఈ జంటకు ఆ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. షో పూర్తి అయ్యి 6 నెలలు కావొస్తుంది , అయినప్పటికీ కూడా ఈ జంటకు ఇసుమంత కూడా క్రేజ్ తగ్గలేదు అంటనే అర్థం చేసుకోవచ్చు , వీళ్ళు ఆడియన్స్ లో ఏ రేంజ్ ఇంప్యాక్ట్ ని తీసుకొచ్చారు అనేది. అయితే వీళ్లిద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు , స్నేహం కాదు, అంతకు మించిన బంధం అని పలు సందర్భాల్లో వీళ్ళు చెప్పకనే చెప్పారు.

అయితే వీళ్ళిద్దరిని జోడీ గా తీసుకొని రావాలని ‘బీబీ జోడి 2’ సమయం లోనే ప్రయత్నం చేశారు మేకర్స్. కానీ తమ బంధాన్ని వేరే విధంగా తీసుకెళ్తున్నారు, నెగెటివిటీ ఏర్పడుతుంది అనే భావనతో వీళ్లిద్దరు ఆ షోని రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు వీళ్లిద్దరు ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’ లో పాల్గొంటున్నారు. ఇద్దరినీ కూడా శనివారం ఎపిసోడ్ లోనే వేశారు. రీసెంట్ ఎపిసోడ్ లోనే మీరంతా చూసే ఉంటారు , తనూజ కూరగాయలను కట్ చేస్తున్నప్పుడు చెయ్యి తెగి కళ్యాణ్ అని అరవడం , అందుకు కళ్యాణ్ పరుగులు తీసుకుంటూ ఆమె వద్దకు వెళ్లడం వంటివి జరిగాయి. ఈ ఒక్క సంఘటనని చూసే చెప్పొచ్చు వాళ్ళ మధ్య ఏ రేంజ్ బాండింగ్ ఉంది అనేది. అయితే వీళ్లిద్దరి కెమిస్ట్రీ ని ఈ వారం నుండి మనం చూడలేము , ఎందుకంటే కళ్యాణ్ పడాలా ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వబోతున్నారు , అతను ఎలిమినేట్ అయ్యినందుకు తనూజ వెక్కి వెక్కి ఏడ్చినట్టు తెలుస్తోంది.

'సింగిల్ స్క్రీన్స్ ని చంపేస్తున్నదే ఆ నిర్మాత' అంటూ నిర్మాత నాగవంశీ సంచలన కామెంట్స్..

Naga Vamsi
Naga Vamsi

Naga Vamsi: టాలీవుడ్ లో ఇప్పుడు రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగేలా అనిపిస్తుంది. నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బ్రతకాలంటే , ఎట్టి పరిస్థితిలోనూ కమీషన్ బేసిస్ మీద సినిమాలను నడుపుకోవడానికి ఒప్పందం చేసుకోవాలి, లేదంటే మేము ఈ నెల 29 నుండి తెలంగాణ లో థియేటర్స్ మూసేస్తాము అంటూ నిన్న దిల్ రాజు సోదరుడు శిరీష్ , ఏషియన్ సునీల్ తదితరులు ప్రెస్ మీట్ ని నిర్వహించి ‘పెద్ది’ నిర్మాతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘పెద్ది’ మూవీ నైజాం ప్రాంతం థియేట్రికల్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దాదాపుగా 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సినిమాకు ఇప్పుడు పెద్ద సమస్యలు ఎదురయ్యేలా లాగానే కనిపిస్తున్నాయి. దిల్ రాజు మరియు ఏషియన్ సునీల్ థియేటర్స్ లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక నేడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరుపున కూడా ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవి శంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత నాగవంశీ , సాహు గారపాటి తదితరులు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో నాగవంశీ ఏషియన్ సునీల్ పై చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నిన్న ఒక టాప్ ఎక్సిభిటర్ ప్రెస్ మీట్ లో సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయి అంటూ మాట్లాడినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది. ఖాళీ స్థలం దొరికితే మల్టీప్లెక్స్ ని నిర్మించి , సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతుండడానికి కారణం అవుతున్న ఆయన అలా బాధ పడుతూ మాట్లాడడం హాస్యాస్పదం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మూసాపేట ఒక మల్టీప్లెక్స్ థియేటర్ ని రీసెంట్ గానే రీ మోడలింగ్ చేశారు. కానీ దాని ఎదురుగా ఉన్న ఒక టాప్ సింగిల్ స్క్రీన్ ని పట్టించుకోవడం లేదు , కుప్ప తొట్టి లాగా మార్చేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ.

కమీషన్ బేసిస్ మీద సినిమాలను రన్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని , కానీ మేము ఇచ్ 40 శాతం కమీషన్ కి వచ్చే గ్రాస్ లో పారదర్శకత ఉండాలని , అందుకు రెంటార్క్ సిస్టం ని తీసుకొని రావాలని , అప్పుడే మాకు ఎంత గ్రాస్ వస్తుంది , ఎంత మేము కమీషన్ ఇవ్వాలి అనే దానిపై క్లారిటీ వస్తుందని , ఆ సిస్టం వచ్చేంత వరకు మేము కమీషన్ బేసిస్ మీద సినిమాలను నడిపేందుకు ఒప్పుకోమని నాగవంశీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. వీళ్ళు చేస్తున్న ఈ రచ్చ వల్ల రేపు నష్టపోయే మొదటి సినిమా పెద్ది నే, అప్పుడు మేము చిరంజీవి , రామ్ చరణ్ గార్ల దగ్గరకు వెళ్లి, జరుగుతున్న విషయాలను వివరించడమే ఇక మిగిలింది అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ.

బంగారం.. ఖరీదైన లోహమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థ నే సవాల్ చేస్తోంది..

Gold Import Duty In India
Gold Import Duty In India

Gold Import Duty In India: బంగారం.. ఖరీదైన లోహాలలో ఒకటి.. వజ్రం, ప్లాటినం కంటే తక్కువ ఖరీదైనప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా చాలామంది బంగారాన్ని వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఆభరణాల తయారీలో బంగారానికే మొదటి ఓటు వేస్తుంటారు.. పైగా బంగారాన్ని మహిళలు విపరీతమైన సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. అందువల్లే భారత్ లాంటి దేశంలో బంగారం పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతూ ఉంటుంది.

బంగారం ఎలా అయితే మెరుస్తుందో.. దీని ఆధారంగా సాగే రంగాలు అదే స్థాయిలో దూసుకుపోతుంటాయి. అయితే బంగారం వినియోగం స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో భారత్ లాంటి దేశం దిగుమతుల మీద ఆధారపడుతూ ఉంటుంది. ఈ దిగుమతులే ఇప్పుడు భారత్ కు గుదిబండ లాగా మారిపోయాయి.. అందువల్లే భారత ఆర్థిక వ్యవస్థ బంగారం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. అయినప్పటికీ బంగారం దిగుమతులు మనదేశంలో తగ్గడం లేదు. బంగారం దిగుమతికి అధికంగా ఫారెక్స్ నిల్వలను ఖర్చు చేయడం వల్ల ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో భారత్ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

సుంకం పెంచడం వల్ల మనదేశంలో ఉన్న బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. పాత బంగారం రీసైక్లింగ్ కు వచ్చేస్తూ ఉంటుంది. దీనివల్ల దిగుమతులు చాలా వరకు తగ్గుతాయి. అదే సమయంలో పన్నులు అధికంగా ఉన్నప్పుడు.. అక్రమ మార్గంలో బంగారం దేశానికి దిగుమత అయ్యే ప్రమాదం లేకపోలేదు.. దీనిని ఏ విధంగా అడ్డుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే మన దేశంలో ఉన్న ప్రధాన విమానాశ్రయాలలో ప్రతిరోజు కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న బంగారాన్ని పట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు బంగారం మీద సుంకం పెంచిన నేపథ్యంలో.. అధికారులు దాడులను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.

ఇక మనదేశంలో బంగారం మీద సుంకం విధించడం ఇదే తొలిసారి కాదు. 2022లో బంగారం మీద సుంకం 10.75 శాతం ఉండేది. అప్పుడు దానిని 15% కి పెంచారు. 2024 లో మనదేశంలో ఆభరణాల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సుంకం మొత్తాన్ని ఆరు శాతానికి తగ్గించారు.. మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధం వల్ల సుంకం మొత్తాన్ని ఆరు శాతం నుంచి 15% పెంచారు. 2012 కంటే ముందు కూడా బంగారం పై దిగుమతి సుంకం ఉండేది. అయితే బంగారం విలువతో సంబంధం ఉండేది కాదు. 10 గ్రాములకు కేవలం 300 రూపాయలు చొప్పున సుంకం వసూలు చేసేవారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాట్ అనే విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అప్పుడు బంగారం విలువలో రెండు శాతం కస్టమ్స్ టాక్స్ విధించేవారు. దీంతో నాడు బంగారం మీద ఒక శాతంగా ఉన్న దిగుమతి సుంకం డబుల్ అయింది. బడ్జెట్లో అయితే దానిని నాలుగు శాతం పెంచేశారు.

2013లో రూపాయి విలువ దారుణంగా పతనమైంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ సంవత్సరం ప్రభుత్వం ఏకంగా మూడుసార్లు సుంకాన్ని పెంచేసింది. 2013లో జనవరిలో నాలుగు శాతం నుంచి ఆరు శాతానికి పెంచింది. జూన్ నెలలో ఏకంగా 6 నుంచి 8 శాతానికి పెంచింది. ఆగస్టులలో 8 నుంచి 10 శాతానికి పెంచింది. 2014 అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 వరకు దాదాపు 10 శాతం దిగుమతి సుంకం మాత్రమే వసూలు చేసేవారు. 2019లో 12.5% పెంచేశారు. 2021 కేంద్ర బడ్జెట్లో 12.5% నుంచి 10.75% తగ్గించారు. తాజాగా 15% సుంకం పెంచిన నేపథ్యంలో.. దాని విలువలను కేంద్రం బయటపెట్టింది. 10 శాతాన్ని ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీగా.. ఐదు శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ గా ప్రకటించింది.

బంగారం మీద సుంకాన్ని పెంచితే.. ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయా..

Forex Reserves And Gold Imports
Forex Reserves And Gold Imports

Forex Reserves And Gold Imports: ముల్లును ముల్లుతోనే తీయాలి. ముల్లు గుచ్చుకుంటే దానిని గునపంతో తీస్తే ప్రాణాలు పోతాయి. ఆర్థిక నిపుణులు ఒక దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు.. దేశ పాలకులు సంబంధంలేని విధానాలకు కొనసాగిస్తే.. ఈ ఉపోద్ఘాతాన్ని వాడుతుంటారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఇదే పరిస్థితి ఉందా అంటే.. ఉందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.

బంగారం దిగుమతి కోసం భారత్ అధికంగా విదేశీ మారకద్రవ్య నిల్వలను ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనివల్ల ఫారెక్స్ నిలువలు వేగంగా కరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు కూడా ఏమాత్రం బాగోలేదు. మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధం తగ్గే అవకాశం కనిపించడం లేదు. పైగా అమెరికా దూకుడుగా వెళ్తోంది. ఇరాన్ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అని ఆందోళనలు కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయంగా యుద్ధాలు ఏర్పడినప్పుడు ధరలు అనేవి ఎవరి చేతిలో ఉండదు. అలాంటప్పుడు దిగుమతుల మీద ఆధారపడిన దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా మన దేశం కూడా చమురు, బంగారం, ఇతర కీలకమైన వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. యుద్ధం వల్ల రవాణా కూడా ఆగిపోవడంతో సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విపరీతంగా బలపడుతున్న నేపథ్యంలో.. రూపాయి విలువ దారుణంగా తగ్గిపోతుంది. ఇది కూడా భారతదేశాన్ని ఆర్థికంగా ఒత్తిడిలోకి నెడుతోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల మీద ఒత్తిడి గించడానికి భారత్ బంగారం మీద సుంకాన్ని పెంచేసింది. వాస్తవానికి ఇలా పెంచడం కొత్తేమీ కాదు..

ఫారెక్స్ నిలువలు తగ్గిపోతున్నప్పుడు కచ్చితంగా ఖరీదైన వస్తువుల దిగుమతిని ప్రభుత్వాలు నిలుపుదల చేస్తాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. బంగారం దిగుమతిని సాధ్యమైనంతవరకు తగ్గించాలని భారత్ భావిస్తుంది. దీనివల్ల చాలావరకు ఫారెక్స్ నిలువలు కరిగిపోకుండా ఉంటాయని భారత ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. చమురు, ఎరువుల వినియోగాన్ని వల్ల తగ్గించడం వల్ల చాలావరకు విదేశీ మారకద్రవ్య నిల్వలను ఖర్చు పెట్టకుండా ఉండవచ్చని… తద్వారా ఆర్థికంగా దేశం బలంగా ఉంటుందని.. రేటింగ్ సంస్థలు కూడా మంచి రేటింగ్ ఇవ్వడం వల్ల తక్కువ వడ్డీకి అప్పులు తీసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

పిఠాపురం విద్యార్థులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్..ఇది నిజంగా ఎవ్వరూ ఊహించి ఉండరు..

Pawan Kalyan Pithapuram Students Free Education
Pawan Kalyan Pithapuram Students Free Education

Pawan Kalyan Pithapuram Students Free Education: ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు దేశంలోనే సంచలనం గా మారాయి. ముఖ్యంగా ఆయన ఆద్వర్యం లో నడుస్తున్న పంచాయితీ రాజ్ శాఖకు జాతీయ అవార్డులు వెల్లువలాగా కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కి లభిస్తున్న ఈ అరుదైన గౌరవాలు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గాన్ని అన్నీ రంగాల్లోనూ రోల్ మోడల్ గా మార్చాలని కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగా ఆయన విద్యార్థులకు వరాలు కురిపించాడు. ఇప్పటికే ఆయన తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను పిఠాపురం నియోజకవర్గం లో దత్తత తీసుకొని, నెలకు తన జీతం నుండి 5000 రూపాయిలు ఒక్కొక్కరికి అందిస్తున్నాడు.

వీరిలో రీసెంట్ గా విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో 550 కి పైగా మార్కులు సాధించిన ఒక విద్యార్థి కూడా ఉన్నాడు. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గం లో 10 వ తరగతి లో అద్భుతమైన ప్రతిభ ని చూపించిన విద్యార్థులకు , వారి అభిరుచికి తగ్గట్టుగా ఉచితంగా ఉన్నత విద్యాబ్యాసం కల్పించే కార్యక్రమాన్ని తలపెట్టాడు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం లో దాదాపుగా 31 మంది విద్యార్థులు 580 కి పైగా మార్కులు సాధించారు. వీరిలో ఒకరు 598 మార్కులు సాధించి , రాష్ట్రంలోనే అగ్రస్థానం లో ఉన్నారు. వీళ్ళ ప్రతిభ ని ప్రోత్సహిస్తూ , ఉచితంగా ఉన్నత విద్యని అందించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి , వారి ఆసక్తి అనుగుణంగా టాప్ విద్య సంస్థల్లో ఉచితంగా ఈ విద్యార్థులకు విద్యని అందించే విధంగా చూస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

తన నిర్ణయాన్ని గౌరవించి అడిగిన వెంటనే ఆ విద్యార్థులకు ఉచిత విద్య ని అందించడానికి ముందుకొచ్చిన విద్య సంస్థలకు పవన్ కళ్యాణ్ కృతఙ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ లాగానే ఇతర నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇలా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తే బాగుంటుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనప్పటికీ , ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.

హార్దిక్ పాండ్యాను ఊహించని దెబ్బ కొట్టిన ఆకాష్ అంబానీ

Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya: ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ ఊహించని దెబ్బ కొట్టాడు. దీంతో ఇప్పుడు అతడి కెరియర్ ప్రమాదంలో పడింది.. హార్దిక్ పాండ్యా తదుపరి ఏం చేస్తాడు అనేది ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. ఇటీవల అతడు ముంబై ఇండియన్స్ జట్టులో కనిపించడం లేదు. వరుస ఓటములతో గ్రూప్ దశ నుంచే ముంబై ఇండియన్స్ ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆ జట్టు యాజమాన్యం గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ ఇటీవల బీసీసీఐ పెద్దలను కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఆయా జట్ల ఆటగాళ్లు తమ స్నేహితురాళ్ళతో కలసి హోటల్ గదులలో ఉంటున్నారని.. అందువల్ల ఆట మీద ఏకగ్రాత చూపించడం లేదని.. దీనివల్ల ఓటములు ఎదురవుతున్నాయని ఆకాష్ బీసీసీఐ పెద్దలతో చెప్పినట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా తన స్నేహితురాలితో కలిసి తిరగడం వల్ల ఆట మీద మనసు లగ్నం చేయలేకపోయాడని.. దానివల్ల తన జట్టు గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

దీనిని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ పెద్దలు కఠిన నిబంధనలను విధించినట్టు సమాచారం. హోటల్ గదుల్లోకి స్నేహితురాళ్ళను తీసుకెళ్లకుండా షరతులు విధించినట్టు సమాచారం. పంజాబ్ జట్టులో అర్ష్ దీప్ సింగ్, హైదరాబాద్ జట్టులో ఇషాన్ కిషన్ ఇలాగే స్నేహితురాళ్ళ తో కలిసి హోటల్ గదిలోకి వస్తున్నారు. వారితో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఇది క్రమశిక్షణ లోపించేలా చేస్తోందని.. దీనివల్ల ఐపిఎల్ నియమావళి సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉందని బిసిసిఐ పెద్దలు చెబుతున్నారు. అందువల్లే ఆటగాళ్లు నిబంధనలు పాటించాలని పేర్కొంటున్నారు.

తన స్నేహితురాలిని హార్దిక్ పాండ్యా తీసుకెళ్లకుండా షరతులు విధించడంతో అతడు ఇబ్బంది పడుతున్నాడు. పైగా ముంబై నాయకుడిగా అతడు విఫలం కావడంతో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. వాస్తవంగా గాయమైందని అతడిని ఆడించలేదని ప్రచారం జరిగింది. కానీ వాస్తవం మాత్రం వేరే. ఆకాష్ వల్ల హార్దిక్ స్నేహితురాలితో స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పోయింది.. మరోవైపు హార్దిక్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో.. వచ్చే సీజన్లో అతడిని ముంబై జట్టు సారధిగా కొనసాగించే అవకాశం లేదని క్రికెట్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

అపరిచితుడిలా సంజు శాంసన్.. ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్.. వైరల్ వీడియో

Sanju Samson Viral Video
Sanju Samson Viral Video

Sanju Samson Viral Video: ఏ ముహూర్తంలో అయితే రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై జట్టులోకి అడుగు పెట్టాడో .. సంజు శాంసన్ రాత ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై జట్టు తరఫున అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సూపర్ ఫాం కంటిన్యూ చేస్తున్నాడు. ఓపెనర్ గా వస్తున్న అతడు జట్టు భారాన్ని సాధ్యమైనంతవరకు మోస్తున్నాడు. జట్టుకు భారీ స్కోరు అందిస్తున్నాడు. ఫలితంగా చెన్నై జట్టు వరుస విజయాలు సాధించి.. ప్లే ఆఫ్ మీద ఆశలు పెంచుకుంది.

సంజు అద్భుతంగా ఆడుతున్న నేపథ్యంలో.. అతడిని చెన్నై అభిమానులు ధోని వారసుడిగా కీర్తిస్తున్నారు. ధోని లాగా వికెట్ల వెనుక అడ్డుగోడలాగా నిలబడుతున్నాడని.. పరుగులను ఆపుతున్నాడని.. క్షణకాలంలోనే స్టంప్ ఔట్ చేస్తూ అదరగొడుతున్నాడని చెన్నై అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నై అభిమానులు తనమీద చూపిస్తున్న ప్రేమకు ఆనంద పరవసుడిగా సంజు ఉబ్బి తబ్బిబవుతున్నాడు.

సంజు చెన్నై అభిమానులకు ఇటీవల ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.. తను కారులో వెళ్తుండగా.. చెన్నైలోని ఓ ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న అభిమానులను సంజు కలిశాడు. వారు బ్యాటింగ్ చేస్తుంటే సంబరపడ్డాడు. ఆ తర్వాత వారితో సంజు కలిసిపోయాడు. వారితోపాటు క్రికెట్ ఆడాడు. ఈ సందర్భంగా సంజు కొట్టిన బంతి అమాంతం గాల్లోకి ఎగిరింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది..

సంజు ఆట తీరు చూసి అభిమానులు మైదానంలో కేరింతలు కొట్టడం సహజం. కానీ తమ మధ్య.. తమతో సంజు క్రికెట్ ఆడటాన్ని అభిమానులు సరికొత్తగా ఆస్వాదించారు. సంజు డౌన్ టు ఎర్త్ అని.. అతడు ఆడుతుంటే ఆశ్చర్యంగా ఉందని.. అతడు తన జోరు ఇలానే కొనసాగించాలని.. తమను ఆశ్చర్యపరచే విధంగా వ్యవహరించాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు.

మా 'పెద్ది' విడుదల అవుతున్నప్పుడే మీకు కష్టాలు గుర్తుకొచ్చాయా అంటూ నిర్మాత హాట్ కామెంట్స్..

Peddi Movie
Peddi Movie

Peddi Movie: ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల సమయం లో దిల్ రాజు మరియు ఆయనకు సంబంధించిన గ్యాంగ్ కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని రన్ చెయ్యాలి , లేదంటే మూసేస్తాం అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన థియేటర్స్ పై రైడింగ్ చెయ్యమని అధికారులను ఆదేశించడం, అదే విధంగా ఇక పై టికెట్ రేట్స్ రావాలంటే వేరే పద్దతి ని అనుసరించాలని అధికారులకు ఆర్డర్లు వేయడం వంటివి చేయడం తో , అప్పట్లో ఈ గ్యాంగ్ కాస్త భయపడి , థియేటర్స్ బంద్ చెయ్యాలనే ఆలోచన విరమించుకున్నారు. ఇప్పుడు ఇదే గ్యాంగ్ మరో మూడు వారాల్లో విడుదల అవ్వబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు ఆటంకాలు కలిగించాలని చూస్తున్నారు.

నిన్న దిల్ సోదరుడు శిరీష్ , సునీల్ నారంగ్ తదితరులు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి కమీషన్ బేసిస్ మీదనే సినిమాలను నడపాలని, లేని పక్షం లో సింగల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి జీవో ని జారీ చేసినప్పటికీ కూడా మేము మా సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్స్ పెంచమని ఇలా ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా నేడు మైత్రీ మూవీ మేకర్స్ రవి శంకర్ , నాగవంశీ , సాహు గారపాటి వంటి వారు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి దిల్ రాజు గ్యాంగ్ అనుసరిస్తున్న వైఖరి ని తప్పుబట్టారు.

ముందుగా రవిశంకర్ మాట్లాడుతూ ‘హరి హర వీరమల్లు సినిమా విడుదలైన సమయంలో మొదలైన అంశం ఇది. ఆ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి నైజాం ప్రాంతం లో ఎన్నో సినిమాలు విడుదల చేశారు. వార్ 2, కూలీ, ఓజీ, అఖండ 2, ఈ సంక్రాంతికి విడుదలైన సూపర్ హిట్ సినిమాలన్నీ మీరే విడుదల చేశారు. ఇన్ని సినిమాలు విడుదల చేసినప్పుడు ఎక్సిభిటర్స్ కస్టాలు మీకు కనపడలేదా , మీ చేతుల్లో ఇప్పుడు పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి, ఇప్పుడే కమీషన్ బేసిస్ మీద సినిమాలను సింగిల్ స్క్రీన్స్ లో రన్ చెయ్యాలి అనడం కరెక్ట్ కాదు, అందరూ కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం పెద్ద రేంజ్ కి వెళ్లేలా ఉందని , ‘పెద్ది’ చిత్రానికి నైజాం ప్రాంతం లో కష్టాలు తప్పేలా లేవని అంటున్నారు విశ్లేషకులు.

సీఎం విజయ్ ని ఇక అలా చూడడం ఆపేయండి అంటూ కమల్ హాసన్ హాట్ కామెంట్స్..

Kamal Haasan Comments On Vijay
Kamal Haasan Comments On Vijay

Kamal Haasan Comments On Vijay: ఎన్నో సవాళ్లను అధిగమించి తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం సాధించినప్పటి నుండి తమిళనాడు లో చోటు చేసుకున్న పరిణామాలు ఎలాంటివో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. అయితే ఎట్టకేలకు విజయ్ మ్యాజిక్ ఫిగర్ ని దాటి, గవర్నర్ వద్ద అనుమతిని తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు . నిన్నటి నుండి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి, ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో కొన్ని జనాలను విపారీతంగా ఆకర్షించింది. విజయ్ ని అభినందిస్తున్నారు , వారిలో తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన కమల్ హాసన్ కూడా ఉన్నాడు. రీసెంట్ గా ఈయన ట్విట్టర్ లో సీఎం విజయ్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా మారింది. కమల్ హాసన్ నుండి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని విజయ్ ఫ్యాన్స్ అసలు ఊహించలేదు.

ఆయన మాట్లాడుతూ ‘ మా సినీ ఇండస్ట్రీ నుండి ఒకరు నేడు ముఖ్యమంత్రి అయ్యినందుకు నటుడిగా ఎంతో గర్వపడుతున్నాను. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రధాన మందిరాలు, పాఠశాలలు, కళాశాలల సమీపాల్లో నడుస్తున్న మద్యం దుకాణాలను ఖాళీ చెయ్యాలంటూ విజయ్ తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రశంసనీయం’ అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తాడు కమల్ హాసన్. విజయ్ ని జనాలు ఇక కేవలం సినీ హీరో గా చూడడం మానేయాలని , ఆయనకు రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత ఉందని కమల్ హాసన్ గుర్తు చేశారు. ఇకపోతే కమల్ హాసన్ కి కూడా ‘మక్కల్ నీది మైయం’ అనే పార్టీ ఉన్న సంగతి తెలిసిందే. 2021 తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ కూడా చేసింది. కానీ స్వయంగా కమల్ హాసన్ కూడా ఓడిపోవడం తో, కొన్నాళ్ళకు ఆయన డీఎంకే పార్టీ తో జతకట్టాడు. ఆ తర్వాత ఆ పార్టీ తరుపున రాజ్యసభకు కూడా ఎంపికయ్యాడు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేయలేదు. అయితే తన మిత్రపక్షం ఓడిపోయినప్పటికీ కూడా కమల్ హాసన్ సీఎం విజయ్ గురించి ఇంత గొప్పగా మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంతే సాఫ్ట్ గా ఉంటారా , లేకపోతే విమర్శలు చేస్తాడా అనేది చూడాలి.

అల్లు అర్జున్ , లోకేష్ కనకరాజ్ మూవీలో డిజాస్టర్ హీరోయిన్..ఆందోళనలో అభిమానులు..

Allu Arjun Lokesh Kanagaraj Movie
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj movie Heroine: కొన్ని సెంటిమెంట్స్ ని అభిమానులు చాలా సీరియస్ గా నమ్ముతుంటారు , ఎందుకంటే అవి పదే పదే నిజం అవుతున్నాయి కాబట్టి . ముఖ్యంగా హీరోలు హీరోయిన్స్ ని ఎంపిక చేసుకునే విషయం లో అభిమానుల నుండి చాలా డిమాండ్స్ ఉంటాయి. వాళ్ళు ఎంచుకున్న హీరోయిన్స్ హిట్ ట్రాక్ లో ఉన్నారా?, లేదంటే ఫ్లాప్ ట్రాక్ లో ఉన్నారా అనేది కచ్చితంగా చూస్తారు, ఒకవేళ ఫ్లాప్ ట్రాక్ లో ఉంటే మాత్రం , ఇలాంటి హీరోయిన్ తో ఇప్పుడు మనకు సినిమా అవసరమా అని అంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న అల్లు అర్జున్, ఈ చిత్రం పూర్తి అవ్వగానే, లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఒక స్పెషల్ వీడియో ద్వారా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగింది. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే దానిపై సోషల్ మీడియా లో అనేక మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. చివరికి ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే ని ఎంచుకున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తలు. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పూజ హెగ్డే రెండు సినిమాల్లో నటించింది. అందులో ఒకటి ‘డీజే’ కాగా , మరొకటి ‘అలా వైకుంఠపురంలో’. ‘డీజే’ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ , ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఓవరాల్ గా మంచి కాంబినేషన్ అనే చెప్పొచ్చు. కానీ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం బాగోలోదు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి.

‘అలా వైకుంఠపురంలో’ చిత్రం తర్వాత ఈ హీరోయిన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. కానీ ఒక్కటి కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వలేదు. చివరికి లోకేష్ కనకరాజ్ గత చిత్రం ‘కూలీ’ లో ఐటెం సాంగ్ చేసింది పూజ హెగ్డే, ఆ చిత్రం కూడా కమర్షియల్ గా ఫ్లాప్ గానే మిగిలింది. ఇన్ని ఫ్లాప్స్ ని పెట్టుకొని ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకున్న పూజ హెగ్డే తో ఇప్పుడు సినిమా చేయడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. త్వరలోనే ఈమెకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కతున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు.

ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్ లు బంద్.. ఎందుకంటే..

Petrol bunks closed on Sundays
Petrol bunks closed on Sundays

Petrol bunks closed on Sundays: పశ్చిమ ఆసియా ప్రాంతంలో చోటు చేసుకున్న యుద్ధం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటివరకు తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. ఇది ఏ క్షణమైనా మళ్లీ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. తమతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని అమెరికా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొస్తోంది. ఇరాన్ తమషరతులకు లొంగితేనే అమెరికాతో చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు పంపిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య భీకరమైన వాతావరణం కొనసాగుతోంది. ఇది ఎప్పటికీ సానుకూలంగా మారుతుందో అర్థం కావడం లేదు.

ఇరాన్ గల్ఫ్ దేశాలలో ప్రధానమైనది. మన దేశానికి క్రూడ్ ఆయిల్ ఈ దేశం నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఈ దేశంలో ఉన్న హార్మోజ్ జల సంధి నుంచి క్రూడ్ ఆయిల్ రవాణా అవుతూ ఉంటుంది. అయితే ఈ జల సంధి మీదుగా రవాణా అయ్యే క్రూడ్ ఆయిల్ విషయంలో ఇరాన్ షరతులు విధిస్తోంది. ఈ జల సంధి మీదుగా రవాణా అయ్యే క్రూడ్ ఆయిల్ నౌకల మీద దాడులు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.. దీంతో మన దేశానికి అంతంతమాత్రంగా క్రూడ్ ఆయిల్ సరఫరా అవుతుంది. మన దేశ ఇంధన అవసరాలు మొత్తం దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాయి. అలాంటప్పుడు క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైతే రిజర్వ్ నిల్వలు ఉన్నప్పటికీ.. యుద్ధం వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో అంతు పట్టకుండా ఉంది.

ఇంధన వనరుల మీద ఒత్తిడి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెట్రోలియం సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి, హర్యానా రాష్ట్రాలలో ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పనిచేయవు. మే 14 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీనివల్ల ఇంధన వనరుల మీద ఒత్తిడి తగ్గుతుందని ఇండియన్ ఆయిల్ ఫెడరేషన్ బాధ్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పెట్రోల్ , డీజిల్ సరఫరాలో అంతరాయాలు చోటుచేసుకున్నాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ వాతావరణం ఏర్పడింది. అయితే గల్ఫ్ దేశాలలో పరిస్థితి ఇంతవరకు సాధారణ స్థితికి రాలేదు. ఎప్పుడు అది సాధారణస్థితికి చేరుకుంటుందో కూడా తెలియడం లేదు. అలాంటప్పుడు ఇప్పటినుంచి స్వీయ జాగ్రత్త పాటిస్తే మంచిదని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.

ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసి ఉంటాయి కాబట్టి.. వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. “మే 14 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసి ఉంచాలని నిర్ణయించాం.. ఈ నిర్ణయం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకున్నాం.. దీనివల్ల భవిష్యత్తు కాలంలో పెట్రోల్ మీద ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నాం. పునరుద్ధరించలేని వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని” ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.

షూటింగ్ సెట్స్ లో డైరెక్టర్ నెత్తి పగలగొట్టిన హీరోయిన్ దీపికా పదుకొనే..వీడియో వైరల్..

Deepika Padukone viral video
Deepika Padukone viral video

Deepika Padukone viral video: ఇండియా లో ఒక మేల్ సూపర్ స్టార్ కి ఉన్నంత ఫాలోయింగ్ , క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు దీపికా పదుకొనే . డైరెక్టర్ , హీరో తో సంబంధం లేకుండా , కేవలం ఈమెని చూడడం కోసం థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా వందల కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను అందుకుంటూ ఉంటాయి. ప్రముఖ హీరో రణవీర్ సింగ్ ని పెళ్లాడిన తర్వాత సినిమాలను కాస్త తగ్గించినప్పటికీ కూడా దీపికా పదుకొనే క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇదంతా పక్కన పెడితే ఈమెకు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి వైరల్ గా మారింది. ఈ వీడియో ని చూసి దీపికా ప్రవర్తనపై కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే గతం లో ఈమె బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ అనే చిత్రం చేసింది. సౌత్ ఇండియన్ మూవీస్ ఫ్లావర్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఆరోజుల్లో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. అప్పట్లోనే ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 423 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చాయి. 2013 వ సంవత్సరం లో ఈ స్థాయి వసూళ్లు అనేది సాధారణమైన విషయం కాదు. ఈ చిత్రం ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం మూవీ లోనే కాదు , షూటింగ్ సెట్స్ లో కూడా మూవీ యూనిట్ మొత్తం ఫన్నీ మోడ్ లోనే ఉన్నారు. అందుకు సంబంధించిన ఒక బ్లూపర్ వీడియో లో దీపికా పదుకొనే కూల్ డ్రింక్ తాగుతుండగా డైరెక్టర్ రోహిత్ శెట్టి అడ్డుకుంటాడు.

దీనికి ఆగ్రహించిన దీపికా పదుకొనే , ఆమె చేతిలోని బాటిల్ ని తీసుకొని, రోహిత్ శెట్టి నెత్తి ని పగలగొట్టింది. ఈ వీడియో ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే , ఇదంతా కేవలం ఫన్నీ బ్లూపర్ గానే షాట్ చేశారు. దీపికా చేతిలో ఉన్నది నిజమైన బాటిల్ కాదు , షుగర్ బాటిల్. మన తెలుగు లో ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షోలో అప్పుడప్పుడు నామినేషన్స్ సమయంలో ఇలాంటి షుగర్ బాటిల్స్ ని ఉపయోగిస్తుంటారు గుర్తుందా ?, అదే ఇది. ఈ వీడియో ఇప్పుడు మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే దీపికా పదుకొనే ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి ‘రాకా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by GLAMSHAM.COM (@glamsham)

నాగార్జున ఫోటోలను వాడుకున్నందుకు ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం.. అసలు ఏమైందంటే..

Nagarjuna photos misuse case
Nagarjuna photos misuse case

Nagarjuna photos misuse case: అక్కినేని నాగార్జున పేరు ని, ఫోటోలను టీ షర్ట్స్ మీద వాడుకోవడం పై ఢిల్లీ హై కోర్టు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాయి. రీసెంట్ గానే ఆయన తన అనుమతి లేకుండా ఫోటోలను , పేరు ని వాడుకుంటున్నారని , నా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని హై కోర్టు లో పిటీషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ చేపట్టిన జస్టీస్ తుషార్ రావు ధర్మాసనం విచారణ చేపట్టి, సదరు వ్యాపారిని ప్రశ్నిస్తూ , నాగార్జున ఫోటోలను వాడుకునే అధికారం మీకు ఎవరిచ్చారని నిలదీసింది. దీనికి వ్యాపారట తరుపున న్యావాడి శృతి అయ్యర్ తన వాదనలు వినిపిస్తూ ‘అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రానికి నా క్లయింట్ మర్చండైజ్ కి అధికారిక భాగస్వామి. కాబట్టి తన క్లయింట్ ని ఈ కేసు నుండి తప్పించాల్సిందిగా అభ్యర్దిస్తున్నాను’ అంటూ తమ వాదనని వినిపించారు.

ఒక ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా తమ ప్రొడక్షన్ హౌస్ తో ఒప్పందం ఉందని , అప్పట్లో అక్కినేని నాగార్జున గారే స్వయంగా ప్రమోట్ చేసారని చెప్పుకొచ్చారు. దీనిపై నాగార్జున తరుపున న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చివరికి ఆ వ్యాపారి తనకు కానీ , ఆ నిర్మాణ సంస్థతో కానీ అటువంటి ప్రత్యక్ష సంబంధం లేదని న్యాయస్థానం ముందు అంగీకరించాల్సి వచ్చింది. దీంతో ఈ వాదనలపై హై కోర్టు చాలా సీరియస్ రియాక్షన్ ఇచ్చింది. స్వయంగా ఈ వ్యాపారి తమకు ఆ నిర్మాణ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు, నాగార్జున ఫోటోలను అతని టీ షర్ట్స్ పై వాడుకునే అధికారం ఎవరిచ్చారు అని హై కోర్టు ప్రశ్నించగా, వ్యాపారి కి సంబంధించిన న్యాయవాది మాట్లాడుతూ ‘వాల్స్ & ట్రెండ్స్ సంస్థ తమ కంపెనీ ని నియమించుకుంది , దానికి ప్రొడక్షన్ హౌస్ తో కూడా ఒప్పందం జరిగిందని , కాస్త సమయం ఇస్తే ఆధారాలతో సహా మీ ముందుకొస్తానని చెప్పడం , హై కోర్టు ఈ కేసుని ఆగస్టు 3 కి వాయిదా వేసింది.

దీంతో ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గతం లో అక్కినేని నాగార్జున తన వ్యక్తి గత వివరాలకు భద్రతా కల్పించాలని ఢిల్లీ హై కోర్టు ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో హై కోర్టు నాగార్జున వివరాలకు వ్యక్తిగత భద్రతని కల్పిస్తూ, ఎవ్వరూ కూడా నాగార్జున అనుమతి లేకుండా, ఆయన ఫోటోలను, పేర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని , అలా చేస్తే చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని తీర్పుని ఇచ్చింది. ఇప్పుడు నాగార్జున అనుమతి లేకుండా ఆ ఫోటోలను ఒక వ్యాపారి వాడుకోవడం తో హై కోర్టు ఆ వ్యాపారిని మందలించింది.

మోడీ చెప్పారని తిట్టుకుంటున్నాం కదా.. 40 దేశాల్లో ఇదే పరిస్థితి..

Work from home in 40 countries
Work from home in 40 countries

Work from home in 40 countries: ఒక ఏడాది పాటు ఖర్చులు తగ్గించుకోండి. బంగారం కొనుగోలు చేయకండి. విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బులు వెచ్చించకండి.. ఇటీవల హైదరాబాద్ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు ఇది. సహజంగానే ప్రధానమంత్రి పిలుపునకు వక్రీకరణలు చేసేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా అదే పని చేసింది.. వాస్తవానికి పొదుపు అనేది మన జీవితంలో ఒక భాగం అయితే అది చాలా బాగుంటుంది.. ఉదాహరణకు మనకు జ్వరం వస్తే డాక్టర్ మాంసాహారం తినవద్దని చెబుతుంటారు. దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని డాక్టర్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తారు. దానిని మనం సానుకూలంగా తీసుకోవాలి. అంతేతప్ప వ్యతిరేకంగా తీసుకుంటే మన ఆరోగ్యమే పాడవుతుంది. ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ పరోక్షంగా చెప్పారు. దేశ ప్రధాని సూచించిన పొదుపు మంత్రాన్ని మనలో చాలామంది వ్యతిరేకంగా చూస్తున్నారు గాని.. మన మాదిరిగానే ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నాయి.

పచ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతోంది. అయితే దీని నుంచి తేరుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలు పొదుపు చర్యలను పాటిస్తున్నాయి.. ఇంతకీ ఆ జాబితాలో ఎటువంటి దేశాలు ఉన్నాయంటే.

మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, పెరూ వంటి దేశాలు పాఠశాలలకు సంబంధించిన పని దినాలను పూర్తిగా తగ్గించాయి. రిమోట్ లెర్నింగ్ విధానాన్ని పెంచేశాయి.. శ్రీలంకలో అయితే బుధవారాలలో కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నారు. జోర్డాన్, పాకిస్తాన్ దేశాలలో ప్రభుత్వ అధికారులకు సంబంధించిన అంతర్జాతీయ ప్రయాణాలను పూర్తిగా నిషేధించాయి. విదేశాలకు సంబంధించిన ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడాన్ని జోర్డాన్ పూర్తిగా తగ్గించింది. ప్రభుత్వ భవనాలలో ఏసీల వినియోగాన్ని కూడా తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, మసీద్ ప్రాంతాలలో ఏసీల వినియోగాన్ని కనీసం 25° లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ ప్రాంతాలలో కూడా ఇటువంటి ఆదేశాలు అమలులో ఉన్నాయి.

ఆస్ట్రేలియాలో ఎవరీ లిటిల్ బీట్ హెల్ప్స్ ప్రచారం మొదలైంది. ఇది ఇంధన వీడియో గాని స్వచ్ఛందంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది.

బ్రిటన్ దేశంలో చిన్న చిన్న వ్యాపారులు ఎలక్ట్రిక్ హీటింగ్ విధానానికి మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం ఆర్థిక సహాయం పొందడానికి బాయిలర్ ఆఫ్ గ్రేడ్ పథకాన్ని ఇటీవల మొదలుపెట్టారు.. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి శ్రీలంక ప్రభుత్వం బిల్ బోర్డులపై లైట్లు ఆపివేస్తోంది. ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ దేశాలలో ప్రభుత్వ అధికారులకు నాలుగు రోజుల పని దినాలు అమలులో ఉన్నాయి. ఇందులో 50% రిమోట్ వర్క్ విధానాన్ని అక్కడి ప్రభుత్వాలు అందుబాటులో తీసుకొచ్చాయి. ఇండోనేషియాలో ప్రభుత్వ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు శుక్రవారం ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు.. మయన్మార్ దేశంలో బుధవారం రిమోట్ వర్క్ విధానం అమలులో ఉంది. వియత్నాం కూడా ఇదే విధానాన్ని అమలు చేసే పనిలో ఉంది.

అమెరికాకు చెక్ పెట్టేందుకు రష్యా సిద్ధం.. తాజాగా ఏం చేసిందంటే..

Russia Sarmat missile test success
Russia Sarmat missile test success

Russia Sarmat missile test success: ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించింది రష్యా. అనేక విధాలుగా ప్రపంచ దేశాల మీద ఆధిపత్యాన్ని కొనసాగించింది. అమెరికా చేసిన పన్నాగం వల్ల రష్యా క్రమంగా తన పట్టును కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కోల్పోయిన పట్టును సాధించడానికి అమెరికా ప్రణాళికలు రూపొందిస్తుంది. అమెరికాకు దగ్గరగా ఉన్న అనేక దేశాలపై రష్యా ఒకరకంగా కత్తి కట్టింది. గల్ఫ్ దేశాలలో యుద్ధం సాగుతున్న క్రమంలో.. రష్యా క్రూడ్ ఆయిల్ అమ్మకాన్ని మరింత ముమ్మరం చేసింది.. ఇక్కడితోనే అమెరికా పెత్తనానికి రష్యా చెక్ పెట్టే ప్రయత్నాన్ని ఆపడం లేదు.

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంలో అమెరికా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలతో పోలిస్తే మందు వరుసలో ఉంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలో అమెరికాను బీట్ చేసేందుకు రష్యా సిద్ధమైంది. సరికొత్త మిస్సైల్ సార్మాట్ ను రష్యా పరీక్షించింది. న్యూక్లియర్ బలగాలను బలోపేతం చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టినట్టు రష్యా పేర్కొంది. అయితే ప్రపంచంలోనే ఇది అత్యంత సంక్లిష్ట క్షిపణి అని యుద్ధరంగా నిపుణులు చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇదే మాట చెబుతున్నారు.

సోవియట్ కాలంలో ఓయే ఓడ అస్త్రాల స్థానంలో దీనిని ప్రవేశపెట్టే ఆలోచన పుతిన్ చేస్తున్నారు.. న్యూక్లియర్ వెపన్ క్యాపబులిటీ కలిగిన సార్ మార్ట్ మిస్సైల్ ఈ ఏడాది చివర్లో రష్యా సైనిక దళాల్లో చేరే అవకాశం ఉంది. ఈ మిస్సైల్ లో వార్ హెడ్ ల ఉమ్మడి శక్తి పశ్చిమ దేశాలలో ఏ మిస్సైల్ కన్నా నాలుగు రెట్లు అధికమని తెలుస్తోంది. సార్మాట్ మిస్సైల్ ను సాటన్ -2 అని పిలుస్తుంటారు. 2011లో దీనిని డెవలప్ చేయడం రష్యా మొదలుపెట్టింది. 2024లో దీనిని టెస్ట్ చేసేందుకు రష్యా సిద్ధమైంది. ఆ సమయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. అయితే దీనిపై ప్రపంచ దేశాలు మౌనాన్ని పాటించాయి. రష్యా ఏం చేస్తుందో చూద్దామని అలా ఉండిపోయాయి. సార్మాట్ కు అమెరికాకు సంబంధించిన గగనతల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టించే సామర్థ్యం ఉంది. ఇది 35వేల కిలోమీటర్ల పైగా పరిధిని కలిగి ఉంటుంది. లక్ష్యాలను అత్యంత సులువుగా ఫినిష్ చేయగలుగుతుంది. అందువల్లే దీనిమీద రష్యా విపరీతమైన భరోసాతో ఉంది.

బాలయ్య కథ తో రవితేజ.. ఇది కదా ఊర మాస్ కాంబినేషన్ అంటే.. పూర్తి వివరాలు ఇవే..

Ravi Teja Transgender Role
Ravi Teja Transgender Role

Balakrishna story for Ravi Teja: మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు నేటి తరం యూత్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా తనని తాను మార్చుకున్నట్టుగా అనిపిస్తోంది. ‘ధమాకా’ తర్వాత రవితేజ చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఒకప్పుడు 40 నుండీ 50 కోట్ల రూపాయిల రేంజ్ లో ఉండే రవితేజ మార్కెట్ , ఈ ఫ్లాప్స్ కారణంగా 10 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఆయన గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల రూపాయలకు జరిగితే , కేవలం 11 కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టింది , దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు రవితేజ మార్కెట్ ఏ రేంజ్ లో పడిపోయింది అనేది.

అయితే రవితేజ ని ఈ ఫ్లాప్స్ బాగా అలర్ట్ చేశాయి. అందుకే ఇకపై ఆయన చేసే ప్రతీ సినిమా మినిమం గ్యారంటీ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. రీసెంట్ గా ఆయన ప్రముఖ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ‘సరిపోదా శనివారం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న వివేక్ ఆత్రేయ తన తదుపరి చిత్రాన్ని బాలయ్య బాబు తో చెయ్యాలని అనుకున్నాడు. బాలయ్య కి కథ వినిపించగా, ఆయనకు తెగ నచ్చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అయితే కానీ, మన సినిమా సెట్స్ మీదకు వెళ్ళదని బాలయ్య క్లారిటీ ఇవ్వడం , సమయం వృధా చేయకుండా వివేక్ ఆత్రేయ అదే స్టోరీ ని రవితేజ కి వినిపించాడు. రవితేజ కి కూడా ఈ స్టోరీ తెగ నచ్చేసింది. వెంటనే ఈ సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ ఏడాది లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వం లో ‘ఇరుముడి’ అనే చిత్రం చేస్తున్నాడు. తన ఇమేజ్ కి పూర్తి భిన్నమైన ఈ సినిమాని రవితేజ ఎంచుకోవడం తో , ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియా భావాన్ని శంకర్ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.