Homeవింతలు-విశేషాలుSun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో అయితే సూర్యోదయం కాస్త ముందుగానే అవుతుంది. సూర్యుడు ఉదయించేది నిజమే. అస్తమించేది కూడా నిజమే. ఉదయించిన సూర్యుడు నిప్పులు చిమ్ముతూ ఉంటాడు. సూర్యుడి అస్తమైన తర్వాత చీకటి ఏర్పడుతుంది. సూర్యుడు అస్తమించడం కూడా దశలవారీగా జరుగుతూ ఉంటుంది. తూర్పున ఉదయించే సూర్యుడు.. సాయంత్రం […]

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో అయితే సూర్యోదయం కాస్త ముందుగానే అవుతుంది.

సూర్యుడు ఉదయించేది నిజమే. అస్తమించేది కూడా నిజమే. ఉదయించిన సూర్యుడు నిప్పులు చిమ్ముతూ ఉంటాడు. సూర్యుడి అస్తమైన తర్వాత చీకటి ఏర్పడుతుంది. సూర్యుడు అస్తమించడం కూడా దశలవారీగా జరుగుతూ ఉంటుంది. తూర్పున ఉదయించే సూర్యుడు.. సాయంత్రం పూట పడమర అస్తమిస్తూ ఉంటాడు. సూర్యుడు అస్తమించినప్పుడు ఎక్కడికి వెళ్తాడు.. సూర్యుడు పడమర ఆకాశగర్భంలో కలిసిపోయినప్పుడు.. ఎందుకు చీకటి ఏర్పడుతుంది.. ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది.

వాస్తవానికి సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు. సూర్యుడు తన స్థానంలో ఉంటాడు. సూర్య అస్తమయం అనేది ఒక భ్రమ మాత్రమే.. భూమి తన అక్షం మీద తాను తిరగడం వల్ల పగలు, రాత్రి ఏర్పడతాయి.. తిరుగుతున్న సమయంలో ఒకవైపు పగలు.. మరోవైపు చీకటి ఏర్పడుతుంటాయి. ఇందులో సూర్యోదయానికి.. సూర్యాస్తమయానికి ఆస్కారం లేదు.

ఇక ఈ భూమి మీద నార్వే, ఫిన్లాండ్, ఐస్లాండ్ 20 ధ్రువ ప్రాంతాలలో వేసవికాలంలో 24 గంటల పాటు పగలు ఉంటుంది. దీనిని మిడ్ నైట్ సన్ అని పిలుస్తుంటారు.. మే నెల నుంచి జూలై వరకు ఈ అద్భుతం చోటు చేసుకుంటూ ఉంటుంది.. అప్పుడు అక్కడ 24 గంటల పాటు వెలుతురు ఉంటుంది.. ఈ అద్భుతాన్ని అక్కడి ప్రజలు మిడ్ నైట్ సన్ అని పిలుస్తుంటారు.

ఒకవేళ భూమి గనుక తిరగడం ఆగిపోతే.. తన అక్షం మీద అలాగే నిలిచిపోతే.. ఒకవైపు ఎప్పటికీ పగలు ఉంటుంది. అప్పుడు భూమి కాలిపోతూ ఉంటుంది. మరోవైపు ఎప్పటికీ రాత్రి ఉంటుంది. తీవ్రమైన చలి వల్ల జీవరాశి అంతరించిపోతుంది. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం భూమి తిరిగే వేగం క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల ప్రతి 100 సంవత్సరాలకు ఒక రోజు సమయం 1.7 మిల్లీ సెకండ్ లకు తగ్గిపోతోంది. కాగా, దీనివల్ల కాలక్రమంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ అని సైంటిస్టులు అంటున్నారు. భూమి గమనం, గురత్వాక్షరణ శక్తి వంటివి సహజసిద్ధంగానే ప్రభావితమవుతాయని వారు వివరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper