Sunrise : టి20 లో అలా ఉండదు. మరీ ముఖ్యంగా ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్ లలో అలా అసలు ఉండదు. ఎందుకంటే ఇక్కడ వేగానికే ప్రాధాన్యం ఉంటుంది. దూకుడుకే గౌరవం లభిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఎంత ప్రతిదాడికి దిగితే.. ఎంతస్థాయిలో ప్రతిఘటన చూపితే.. అప్పుడే ఆ జట్టు నిలబడగలుగుతుంది.. కలబడగలుగుతుంది . అలా చేయని పక్షంలో తడబడుతుంది. తలవంచాల్సి వస్తుంది. తప్పుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ దుస్థితిని హైదరాబాద్ జట్టు అనుభవిస్తున్నది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న మేనేజ్మెంట్.. బలమైన ఆటగాళ్లు ఉన్న జట్టు.. అయినప్పటికీ హైదరాబాద్ జట్టు విఫలమవుతోంది. వరుసగా విజయాలు సాధించి.. దర్జాగా ప్లే ఆఫ్ అవకాశాలను చేతిలో పెట్టుకోవాల్సిన ఆ జట్టు.. 9వ స్థానంలో బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఆటతీరును నమ్ముకోక.. అదృష్టం పై లెక్కలు వేసుకుంటున్నది. ఇది జట్టు మేనేజ్మెంట్ కు మాత్రమే కాదు.. హైదరాబాద్ జట్టును విపరీతంగా ప్రేమించే అభిమానులకు కూడా ఏ మాత్రం రుషించడం లేదు. చివరికి ఆటగాళ్ల కోసం.. వారి ఆటవిడుపు కోసం మిగతా 9 జట్ల మేనేజ్మెంట్లు చేయని ప్రయోగాన్ని హైదరాబాద్ మేనేజ్మెంట్ చేసింది. ఏకంగా ప్రత్యేక విమానాలలో ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని రెండు విభాగాలుగా విభజించి మాల్దీవులు తీసుకెళ్లింది. వారిపై ఉన్న ఒత్తిడిని తొలగించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ గుజరాత్ జట్టుపై అత్యంత నాసిరకమైన ప్రదర్శన చేసింది హైదరాబాద్ జట్టు.
Also Read : కొత్త విమానమైనా.. సన్ రైజర్స్ రాత మార్చుతుందా..
వీళ్లకు ఏం పుట్టింది
మహమ్మద్ షమీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అత్యంత దరిద్రమైన బౌలింగ్ వేస్తున్నాడు. అసలు అతడికి ఏమైందో అర్థం కావడం లేదు. బంతిలో స్వింగ్ లేదు. బౌన్స్ కూడా కావడం లేదు. వికెట్ కాదు కదా కొట్టుకో అన్నట్టుగా బ్యాట్ మీదకు బంతులు వేస్తున్నాడు. ఇక కెప్టెన్ కమిన్స్ అయితే అనుభవాన్ని ఆస్ట్రేలియాలో వదిలి వేసినట్టుగా కనిపిస్తోంది. ప్రారంభ ఓవర్లలో విచ్చలవిడిగా పరుగులు ఇస్తున్నాడు. హర్షల్ పటేల్ పర్వాలేదనే స్థాయిలో బౌలింగ్ వేస్తున్నప్పటికీ అది జట్టు అవసరాలకు సరిపోవడం లేదు. ఇక బ్యాటింగ్లో హెడ్ బీరు తాగి.. బొర్రను పెంచుతున్నాడు. అంతే తప్ప పరుగులు మాత్రం తీయడం లేదు. ఇషాన్ కిషన్ పనికిమాలిన ఆటగాడిగా పేరుపొందాడు. రాజస్థాన్ జట్టుపై మినహా ఇంతవరకు అతడు ఒక్కసారి కూడా గట్టి ఇన్నింగ్స్ ఆడి న దాఖలాలు లేవు. అనికేత్ వర్మ కూడా ఢిల్లీ జట్టు పై మినహా ఇంతవరకు గొప్ప ఇన్నింగ్స్ ఆడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ జట్టులో ఉన్న చెత్త మామూలుది కాదు. సోమవారం మ్యాచ్ జరిగేది సొంతమైదానంలో.. ఈ మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు అత్యంత ముఖ్యమైనది. ఇందులో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు కొంతలో కొంత ఉంటాయి. అవి జరగాలంటే.. హైదరాబాద్ చెత్తను మొత్తం తొలగించుకోవాల్సిందే. లేకపోతే ఈ మ్యాచ్ కూడా అస్సాం వెళ్తుంది. హైదరాబాద్ జట్టు గ్రూప్ దశ నుంచి ఇంటికి వస్తుంది.
Also Read : కేఎల్ రాహుల్ భయ్యా నీకో దండం.. నిజంగా నువ్వు దూతవే..