Wife Charges Husband For Cooking: భర్త ఉద్యోగం చేస్తాడు.. భార్య ఇంట్లో పనులు చేస్తుంది. సంసారానికి ఇద్దరు ఇరుసుల్లాగా ఉంటారు కాబట్టి బండి సజావుగా సాగిపోతూ ఉంటుంది. కానీ ఇద్దరిలో ఎవరికి ఇగో హర్ట్ అయినా సరే.. మొదటికే మోసం వస్తుంది.
నేటి కాలంలో దంపతుల ఆలోచనలు చాలా అడ్వాన్స్ గా ఉంటాయి. ప్రతిదీ కూడా డబ్బు కోణంలోనే ఉంటున్నది. ఇక్కడ బంధాలు.. అనుబంధాలు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతున్నప్పుడు.. అవసరాలను మొత్తం డబ్బే తీర్చుతున్నప్పుడు బంధాలకు.. అనుబంధాలకు ఆస్కారం లేదని నేటితరం నమ్ముతోంది. అందువల్లే ప్రతి విషయాన్ని కూడా కేవలం మనీ అనే యాంగిల్ లోనే ఆలోచిస్తోంది.
ఆ మధ్య హైదరాబాద్ కు చెందిన ఓ జంట తమ భవిష్యత్తు ప్రణాళికను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. వారిద్దరు కూడా పేరుపొందిన కంపెనీలలో పని చేస్తుంటారు. ఒకరి జీతం గురించి మరొకరు అడగరు. ఖర్చులు చెరి సమానం భరిస్తారు. ఇన్వెస్ట్ మెంట్లు కూడా ఎవరికి వారే చేసుకుంటారు. కానీ చివర్లో బడ్జెట్ లెక్కలు మాత్రం ఎవరికి వారుగా చెప్పుకుంటారు.. ఆర్థిక స్వేచ్ఛ.. సామాజిక స్వేచ్ఛ నేటి కాలంలో యువత కోరుకుంటున్నారు. చివరికి పెళ్లి జరిగినప్పటికీ ఆ స్వేచ్ఛ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. అందువల్లే నేటి తరంలో ఉన్న దంపతుల ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటున్నాయి. వీటిని తప్పు అనడానికి లేదు. తప్పు పట్టడానికి అసలు లేదు.
హైదరాబాద్ జంట విషయాన్ని అలా వదిలేస్తే.. ఢిల్లీకి సమీపంలో ఉన్న గురు గ్రామ్ లో ఓ జంట వ్యవహారం సంచలనంగా మారింది. గురు గ్రామ్ ప్రాంతంలో ఓ వ్యక్తి పేరు పొందిన కంపెనీలో పనిచేస్తుంటాడు. ఈయనకు ప్రియా నే భార్య ఉంది. ఈమె ఫుడ్ క్రియేటర్. అయితే ఇతడికి కె పే స్టైల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ప్రతిసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం.. భారీగా డబ్బులు ఖర్చు పెట్టి తినడం అతనికి అలవాటుగా మారింది. ఇది ప్రియకు నచ్చలేదు. భర్తను ఒకరోజు తను కెఫె స్టైల్ లో ఫుడ్ తయారు చేస్తానని.. కాకపోతే నాకు చార్జ్ చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పింది. పైగా ఇంట్లోనే వండుతానని ఆమె పేర్కొంది. ఈ ఆఫర్ నచ్చిన అతను ఓకే చెప్పాడు. దీంతో భర్తకు ప్రతిరోజు కెఫే స్టైల్ లో ఆమె ఫుడ్ వండడం మొదలుపెట్టింది. దీని ప్రిపరేషన్ మొత్తం షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇంకేముంది 12 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు తన భర్తకు ఫుడ్ వండి పెట్టినందుకు రోజుకు 1000 రూపాయలు ఇస్తున్నాడని ఆమె పేర్కొంది. ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందడమే కాకుండా.. భర్తకు వండి పెట్టినందుకు డబ్బులు కూడా వసూలు చేస్తుండడంతో.. ప్రియ ఆనందానికి అవధులు లేవు. ఈ వీడియో పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఎవరికి తోచినట్టుగా వారు కామెంట్లు చేస్తున్నారు.