Air Pollution: ఇంట్లో సమస్యలు.. బయట కూడా సమస్యలు.. చదువు పూర్తయినా రాని ఉద్యోగం.. ఒకవేళ ఉద్యోగం వచ్చినా సరిపోని జీతం.. కుటుంబ సభ్యులు పెళ్లి అంటారు.. పెళ్లి చేసుకుంటే.. వయసు వేడిలో పిల్లలు పుడతారు. ఇటు భార్యని చూసుకోవాలి. పిల్లల బాధ్యతలను భుజాల ఎత్తుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లను కూడా చూసుకోవాలి.. ఇన్ని చేసినప్పటికీ మగవాడిని ఎవరూ కీర్తించరు. గొప్పవాడివంటూ సన్మానాలు చేయరు. పైగా తిట్లు దండకాలు..
ఇంట్లో.. బయట ఇలా ఉందంటే.. ఇప్పుడు మగాడికి అసలైన శత్రువుగా కాలుష్యం పరిణమించింది. ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇప్పటివరకు కేవలం శ్వాస కోశ సంబంధిత సమస్యలు.. హృదయ రోగాలు మాత్రమే వస్తాయని అందరూ అనుకున్నారు. వైద్య పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని బయటపెట్టాయి. కానీ ఇప్పుడు పొల్యూషన్ వల్ల మగాడి మగతనమే ప్రమాదంలో పడింది.. గర్భంతో ఉన్నప్పుడు.. వాతావరణ కాలుష్యం బారిన పడితే పిండం అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో హైపోస్పాడియాస్ అనే అత్యంత అరుదైన సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా మగ పిల్లల్లో మూత్రం వచ్చే రంధ్రం పురుషాంగం చివర్లో కాకుండా.. కింది భాగంలో ఏర్పడుతుంది.
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా సాగాలి అంటే కచ్చితంగా పురుషాంగం చివరన రంధ్రం ఉండాలి. అలా ఉంటేనే వైవాహిక జీవితం సజావుగా ఉంటుంది. భార్యతో సంసార జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కడో రంధ్రం ఏర్పడితే.. దానివల్ల ఎదురయ్యే సమస్యలు తీవ్రంగా ఉంటాయి. అలాంటప్పుడు గర్భం దాల్చినపుడు సాధ్యమైనంత వరకు కాలుష్యం లేని ప్రాంతాలలో ఉండాలి. కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి. నగరాలలో జీవించేవారు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి. చికిత్స సమయంలో ఆస్పత్రికి వచ్చినప్పటికీ.. మిగతా సమయాలలో ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలి. అప్పుడే తల్లి.. పుట్టే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది.
నేటి కాలంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల రకరకాల రోగాలు వెలుగు చూస్తున్నయి. ముఖ్యంగా క్యాన్సర్.. ఇతర వ్యాధులు ఎక్కువగా సోకుతున్నాయి. ఇలాంటప్పుడు సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి శ్రమ కలిగించాలి.. అప్పుడే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరీ ముఖ్యంగా మగ పిల్లలు బాగుంటారు. వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది.