Homeఆంధ్రప్రదేశ్‌TV5 Murthy: టీవీ 5 మూర్తి వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్.. ఇది ఎక్కడికి దారితీస్తుందో..

TV5 Murthy: టీవీ 5 మూర్తి వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్.. ఇది ఎక్కడికి దారితీస్తుందో..

TV5 Murthy: పాత్రికేయులు పాత్రికేయుల మాదిరిగా ఉండాలి. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఒకవేళ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యను మరో కోణంలో చూపించాలి. ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య పాత్రికేయులు వారధి లాగా ఉండాలి. ఎప్పుడు కూడా సొంత భాష్యాలను చెప్పకూడదు. ప్రజల కోణంలో లేదా ప్రభుత్వ కోణంలో మాత్రమే మీడియా సంస్థలు పని చేయాలి. అలా కాకుండా సొంత వ్యవహారాలను చెప్పుకోవడానికి.. సొంత ఆవేశాలను ప్రదర్శించడానికి మీడియాను ఉపయోగిస్తే అంతకుమించిన వ్యవస్థ విధ్వంసం మరొకటి […]

TV5 Murthy: పాత్రికేయులు పాత్రికేయుల మాదిరిగా ఉండాలి. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఒకవేళ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యను మరో కోణంలో చూపించాలి. ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య పాత్రికేయులు వారధి లాగా ఉండాలి. ఎప్పుడు కూడా సొంత భాష్యాలను చెప్పకూడదు. ప్రజల కోణంలో లేదా ప్రభుత్వ కోణంలో మాత్రమే మీడియా సంస్థలు పని చేయాలి. అలా కాకుండా సొంత వ్యవహారాలను చెప్పుకోవడానికి.. సొంత ఆవేశాలను ప్రదర్శించడానికి మీడియాను ఉపయోగిస్తే అంతకుమించిన వ్యవస్థ విధ్వంసం మరొకటి ఉండదు.

ఇటీవల సర్ ప్రక్రియపై నిర్వహించిన డిబేట్ కార్యక్రమంలో టీవీ5 లో పనిచేసే జర్నలిస్టు మూర్తి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అటు మీడియాలో.. ఇటు పొలిటికల్ సర్కిల్ లో చర్చకు దారి తీసాయి. ఈ నేపథ్యంలో బిజెపి నాయకులు స్పందించారు. మూర్తి చేసిన వ్యాఖ్యలను ఒక్కొక్క దాన్ని వివరిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని.. వ్యవస్థలను తప్పు పట్టే విధంగా వ్యవహరించడం దారణమని పేర్కొన్నారు.

ఒకవేళ సర్ ప్రక్రియపై అనుమానాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని.. అంతేగాని వ్యవస్థలను నిందించడం ఏంటని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు..’ఫామ్ 6 ద్వారా అడుగుతోంది మీ అస్తిత్వం ఏంటి అని కాదు. మీకు 18 ఏళ్లకు వచ్చే ఓటు హక్కు ఇవ్వడానికి కావలసిన కొంత ప్రాథమిక సమాచారం. మూర్తి అంటున్నట్టుగా 2001 కాదు అది 2002. 2002 ఎందుకు అంటే ఇది 2026 అంటే 18 ఏళ్లు నుండి ఓటు వేసే పెద్దరికం వచ్చిందని రుజువు చేసే ఒక విషయం.. మీ పేరెంట్స్ 2002లో ఓటు వేసి ఉంటే మీ ఓటు అనుసంధానం జరుగుతుంది. ఇది భవిష్యత్ కాలంలో భార్య పిల్లలు గల గృహస్తులకు చాలా ఉపయోగం.. ఇకపై ఎస్ఐఆర్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే ఇప్పుడు మ్యాపైన ఓటర్ కు పుట్టే సంతానం.. అతనికి పుట్టే సంతానం అంటే మనవళ్లకు కి ఆటోమేటిగ్ గా అనుసంధానం జరుగుతుంది. అతనికి ఓటు అనేది సహజంగా వస్తుందని” బిజెపి నాయకులు చెబుతున్నారు.

కూటమికి టీవీ5 ఛానల్ అనుకూలంగా ఉంటుంది. కూటమిలో బిజెపి కూడా ఉంది. కానీ మూర్తి మాత్రం ఎస్ఐఆర్ విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. వాస్తవాలను పక్కనపెట్టి.. తనకు తోచిన సంఖ్య చెప్పుకొచ్చారని.. దీని ద్వారా ప్రజల్లో లేని అపోహలు మొదలయ్యాయని.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా టీవీ5 మూర్తి మాట్లాడారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. టీవీ5 మూర్తి ఆ స్థాయిలో ఆవేశంగా మాట్లాడిన తర్వాత.. బిజెపి నాయకులు విలేకరులకు ముందుకు వచ్చి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే బిజెపి నాయకుల విలేకరుల సమావేశాన్ని సాక్షి టీవీ ప్రధానంగా హైలెట్ చేయడం విశేషం.

కూటమి ఏర్పడిన తర్వాత ఏపీలో సాక్షి టీవీ బీజేపీ నాయకులకు అంతగా ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపించడం లేదు. కానీ, టీవీ 5 మూర్తి అగ్రహంగా మాట్లాడిన నేపథ్యంలో సాక్షి టీవీ బిజెపి నాయకులకు ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ లెక్కన వచ్చే రోజులలో కూడా ఇదే జరుగుతుందా.. ఇలాగే జరిగితే కూటమిలో ఏమైనా అవుతుందా.. టీవీ5 మూర్తి వల్ల ఇది రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుందా.. ఇలాంటి సందేహాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మూర్తి ఆధారాలతో సహా మాట్లాడి ఉంటే బాగుండేదని.. అలా కాకుండా ఆవేశంతో మాట్లాడటం వల్లే ఇన్ని ఇబ్బందులు వచ్చాయని.. రాజకీయంగా చర్చ నడుస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper