BJP MLA Raja Singh : బీజేపీ(BJP)కి తెలంగాణలో ఉన్న కీలక నేతల్లో గోషామహల్(Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్. కరుడుగట్టిన హిందూవాది. ముస్లింపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. రాజీసింగ్‌కు తరచూ బెదిరింపు ఫోన్లు కూడా వస్తుంటాయి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్(Rajasingh) ప్రస్తుతం పార్టీ తీరుపై అసంతృప్తితో ఉంటున్నారు. దానిని అప్పుడప్పుడు బయట పెడుతున్నారు. ఇటీవల పార్టీ గోల్కోండ(Golkonda) జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో బ్లాస్ట్ అయ్యారు. పార్టీలో ఉండమంటే ఉంటా.. లేదంటే వెళ్లిపోతా అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేకు తెలియకుండా జిల్లా అధ్యక్షుడిని నియమించడం సరికాదన్నారు. తాను సూచించిన వ్యక్తిని కాకుండా, ఎంఐఎంకు అంటకాగే వ్యక్తిని అధ్యక్షుడిని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. అనుకునేలోనే మళ్లీ రాజాసింగ్ సొంత పార్టీపై కీలక వ్యాఖ్యలుచేశారు.
Also Read : మీ వేధింపులు తట్టుకోలేపోతున్నా.. ఉండమంటే ఉంటే.. పొమ్మంటే పోతా.. బాంబు పేల్చిన రాజాసింగ్!
పాత సామాన్ అని..
తెలంగాణలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఈ బీజేపీ నాయకుడు, పార్టీలోని కొంతమంది నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తూ వ్యాఖ్యానించారు. రాజాసింగ్ తన పార్టీలో “పాత సామాన్” (పాత నాయకులు) వెళ్లిపోతేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలను సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తరచూ వివాదం.
రాజాసింగ్ గతంలో కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ చర్చనీయాంశంగా మారారు. 2022లో ప్రవక్త మహమ్మద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అతన్ని సస్పెండ్ చేసింది, కానీ తర్వాత 2023లో ఆ సస్పెన్షన్ ఎత్తివేయబడింది. ఈసారి, పార్టీలోని సీనియర్ నాయకులను ఉద్దేశించి “వారిని తరిమేస్తేనే పార్టీకి బలం చేకూరుతుంది” అని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో రాజాసింగ్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, కొందరు రాజా సింగ్‌ను సమర్థిస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలు పార్టీ ఐక్యతకు హాని కలిగిస్తాయని విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
Also Read : సీఎంలను సెలక్ట్ చేయడంలో మోడీ, అమిత్ షాల స్ట్రాటజీ ఇదే.. దాన్నే బేస్ చేసుకుంటారట