Punjab: పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తూ భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న పాక్ గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తార్న్ తరణ్ జిల్లాకు చెందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యక్తికి పాకిస్ఠాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ దళా మోహరింపులు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సహా సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.