Age Gap Relationships: ఒకప్పుడు ప్రేమైనా.. పెళ్లయినా ఈడు జోడు చూసుకునేవారు. సామాజిక అంతరాలు తీవ్రంగా ఉన్న ఆనాటి రోజుల్లోనే చాలామంది తమ వైవాహిక బంధాలకు.. ప్రేమ బంధాలకు వయసును ప్రామాణికంగా తీసుకునేవారు. తమ ఈడు వాళ్లను లేదా కొంత వ్యత్యాసం ఉన్న వాళ్లను ప్రేమించేవారు లేదా పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలం కాదు మనుషులు పూర్తిగా మారిపోయారు..
Also Read: కవిత vs జగదీశ్వర్ రెడ్డి.. ఫామ్ హౌస్ లో కెసిఆర్ కీలక సమావేశం.. గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది?
వయసుతో సంబంధం లేకుండా.. వైవాహిక స్థితితో సంబంధం లేకుండా నేటి రోజుల్లో ప్రేమించుకోవడాలు.. శారీరక సంబంధాలు పెట్టుకోవడాలు పరిపాటిగా మారిపోయాయి. అసలు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా అయిపోతుంది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంతు పట్టకుండా ఉంది. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. న్యాయస్థానాలు కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ.. చాలామందిలో మార్పు రావడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో నేరాలు చేస్తున్నారు. ఘోరాలకు పాల్పడుతున్నారు. అసాంఘిక ఆకృత్యాలకు బరితెగిస్తున్నారు..
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలో ఓ దారుణం చోటుచేసుకుంది.. ఆ వివాహితకు 30 సంవత్సరాల వయసు ఉంటుంది. గతంలోనే ఆమెకు వివాహం జరిగింది. భర్తతో విభేదాలు చోటు చేసుకోవడంతో ఒంటరిగా ఉంటున్నది. స్థానికంగా ఓ ప్రైవేట్ షాపులో పనిచేస్తోంది. ఆమెకు ఎదురింట్లో ఉండే ఓ బాలుడు తెగ నచ్చాడు. అతని వయసు 17 సంవత్సరాలు. మొదట్లో అతడిని మచ్చిక చేసుకుంది. ఆ తర్వాత మాట కలిపింది. ప్రారంభంలో అతడు ఆమెను అక్కా అని పిలిచేవాడు. దానికి ఆమె ఒప్పుకునేది కాదు. నన్ను ఆంటీ అని పిలువు అని అతనికి చెప్పేది. దీంతో అతడు అదే విధంగా పిలిచేవాడు. ఆ తర్వాత అతనిని ఆమె మరింత దగ్గర చేసుకుంది. ఈ వ్యవహారం మొత్తం అతనికి కొత్తగా అనిపించడంతో.. అతడు కూడా ఆమెకు మరింత దగ్గరయ్యాడు. కాలేజ్ వెళ్లడం.. ఆ తర్వాత ఆ వివాహిత వద్దకు వెళ్లడం.. ఇలానే జరిగిపోతుంది.
Also Read: రేవంత్ ఆఫర్ : జూబ్లీహిల్స్ క్యాండిడేట్ ను డిసైడ్ చేసేది చిరంజీవినే
ఇది ఇలా ఉండగా నాలుగు నెలల క్రితం ఆ బాలుడిని ఆమె తీసుకొని వెళ్ళిపోయింది.. అతని ఫోన్ స్విచాఫ్ చేసింది.. ఇంటి వద్దనే పడేసింది.. అతనితో ఆంధ్రాలోని ఓ ప్రాంతంలో కాపురం పెట్టింది. అక్కడే ఉన్న గుడిలో అతనిని పెళ్లి కూడా చేసుకుంది. ఆ బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేసి చివరికి నాలుగు నెలల తర్వాత అతడి ఆచూకీ తెలుసుకున్నారు.. అనంతరం ఆ వివాహిత మీద ఆ బాలుడి తల్లి కిడ్నాప్ కేసు పెట్టింది. పోలీసులు ఆమెను కోర్టులో హాజరు పరిచారు. ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు. సత్తుపల్లి పట్టణంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సంఘటన సంచలనం సృష్టించింది.. అయితే ఆ బాలుడి ద్వారా గర్భం దాల్చి సంతానం పొందాలనే కోరిక ఉన్నట్టు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించడం విశేషం.