Homeక్రైమ్‌Rajasthan Case: ఇదీ హనీమూన్ క్రైమ్ కథా చిత్రం.. భార్య బాగోతం ఇలా బయటపడింది!.

Rajasthan Case: ఇదీ హనీమూన్ క్రైమ్ కథా చిత్రం.. భార్య బాగోతం ఇలా బయటపడింది!.

Rajasthan Case: గత ఏడాది ఇండోర్ నగరానికి చెందిన సోనం అనే యువతి తన భర్తను హనీమూన్ తీసుకెళ్లి అంతం చేసింది. ఆ తర్వాత రకరకాల డ్రామాలు ఆడింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ కేసులో దాదాపు మూడు రాష్ట్రాల పోలీసులు విచారణలో పాల్గొన్నారు. అనేక రకాలుగా ఆధారాలు సేకరించారు. చివరికి చివరికి సోనం, ఆమె ప్రియుడు, కొంతమంది కిరాయి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోనం సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. ఇప్పుడు అంతకుమించి అనే […]

Rajasthan Case: గత ఏడాది ఇండోర్ నగరానికి చెందిన సోనం అనే యువతి తన భర్తను హనీమూన్ తీసుకెళ్లి అంతం చేసింది. ఆ తర్వాత రకరకాల డ్రామాలు ఆడింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ కేసులో దాదాపు మూడు రాష్ట్రాల పోలీసులు విచారణలో పాల్గొన్నారు. అనేక రకాలుగా ఆధారాలు సేకరించారు. చివరికి చివరికి సోనం, ఆమె ప్రియుడు, కొంతమంది కిరాయి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సోనం సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. ఇప్పుడు అంతకుమించి అనే స్థాయిలో ఓ దారుణం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన నిజాలు పోలీసుల విచారణలో బయటపడ్డాయి. అవి కాస్త షాకింగ్ కు గురి చేస్తున్నాయి.

సరిగ్గా మూడు నెలల క్రితం వారిద్దరికీ వివాహం జరిగింది. మూడు నెలల వరకు వారిద్దరు బాగున్నారు. ఒకరోజు సాయంత్రం హైవే మీదకి వెళ్లారు. అక్కడ వాకింగ్ చేస్తున్నారు. ఇంతలోనే వేగంగా ఒక వాహనం వచ్చింది. వారిద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త ఆశీష్ చనిపోయాడు. భార్య అంజు రోడ్డు పక్కన పడిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు.

విగత జీవిగా పడి ఉన్న ఆశీష్ మీద పడి అంజు తీవ్రంగా రోదించింది. చూసేవాళ్ళకు ఆ దృశ్యం తీవ్రమైన విషాదాన్ని కలిగించింది. ఆ తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వారు అంజును విచారించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఫలితంగా పోలీసులు ఈ కేసును రకరకాల కోణాలలో విచారించారు. దీంతో అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి.

రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ జిల్లాకు చెందిన ఆశీష్ ను అతడి భార్య అంజు అత్యంత దారుణంగా హత్య చేయించింది. ఈ కేసును హిట్ అండ్ రన్ గా చిత్రీకరించింది. ఆ కేసును త్వరగా మూసి వేయించాలని అంజు రకాలుగా ప్రయత్నించింది. ఎవరికి ఆమె ప్రయత్నం విఫలం కావడంతో పోలీసులకు దొరికిపోయింది.

గత నెల 30న ఆశిష్, అంజు సాయంత్రం వాకింగ్ చేస్తున్నారు. ఇంతలోనే వెనకనుంచి సంజు (అంజు లవర్) వాహనంలో వచ్చాడు. ఆశీష్ ను ఢీకొట్టాడు. కింద పడిపోయిన ఆశిష్ ను రాఖి (రోహిత్), బాదల్(సిద్ధార్థ) ఎటూ కదలకుండా పట్టుకున్నారు.. ఆ తర్వాత సంజు, అంజు అతడికి ఊపిరి ఆడకుండా చేశారు. అనంతరం ఆశీష్ మృతదేహాన్ని ఆ వాహనంతో ఢీ కొట్టారు. ఆ తర్వాత తన ఒంటి మీద ఉన్న నగలను అంజు సంజు కు ఇచ్చింది. ఆ తర్వాత రోడ్డు పక్కన పడిపోయినట్టు నటించింది.. పోలీసుల విచారణలో వాంగ్మూలాలు ఇచ్చే క్రమంలో అంజు రకరకాలుగా మాట్లాడింది. పోలీసులకు అనుమానం వచ్చి ఆమె ఫోన్ రికార్డులను పరిశీలించారు. అయితే ఆమె సంజు అనే వ్యక్తితో ఎక్కువగా మాట్లాడినట్టు గుర్తించారు.. ఇటీవల కాలంలో ఆశీష్ ను కలిసిన తర్వాత ఆ కాల్స్ మరింత పెరిగాయని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆ తర్వాత అంజు, సంజు, ఇతర వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆశీష్ అంటే అంజుకు ఇష్టం లేదు. పెద్దలు బలవంతం చేయడంతో ఆమె వివాహం చేస్తుంది. వివాహం తర్వాత అంజు సంజు ఇంటికి వెళ్ళింది. ఆశీష్ ను అంతం చేయాలని అతనితో మాట్లాడింది. అనేక సార్లు ఇలా మాట్లాడుతున్న తర్వాత ఆశిష్ ను అంతం చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper