Australia Black Magic Incident: మన ఇండియాలో సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి సంస్కృతులు మారుతూ ఉంటాయి. కొంతమంది దీన్ని చాదస్తం అని కొట్టిపారిస్తూ ఉంటారు. మూర్ఖత్వం అంటూ ఎగతాళి చేస్తుంటారు. కానీ ఎవరి నమ్మకాలు వారివి.
భారతీయులు తమ సొంత ప్రాంతంలో ఉన్నప్పుడు రకరకాల ఆచారాలు పాటిస్తుంటారు. విభిన్న రకాల సంస్కృతులను అవలంబిస్తుంటారు. అందులో రకరకాల నేపథ్యాలు ఉంటాయి. కొందరు ఉన్నత స్థాయికి ఎదిగితే.. చుట్టుపక్కల వారు దిష్టి పెట్టకూడదని.. నిమ్మకాయలు మంత్రించి బయటపడేస్తుంటారు. గుమ్మడికాయలు కొడుతుంటారు. కుంకుమ కలిపిన నీళ్లను మీద చల్లుకుంటారు. ఇంకా కొందరైతే రకరకాల ప్రక్రియలు చేపడుతుంటారు.
భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్లినా సరే.. కొత్త కొత్త వాహనాలకు నిమ్మకాయలు కట్టి ఉంటాయి. వాటికి దిష్టి గింజలు కూడా ఉంటాయి. చివరికి ఆగర్భ శ్రీమంతులు కూడా తమ వాహనాలకు దసరా రోజున పూజలు జరిపిస్తుంటారు. గుమ్మడికాయలు కొట్టిస్తుంటారు. కొత్త వాహనాలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పూజలు జరిపిస్తూ ఉంటారు. కానీ విదేశాలలో అలా ఉండదు. ఎందుకంటే వాళ్లకు ఇటువంటి నేపథ్యాలు ఉండవు. వాళ్లు నమ్మే మతం ప్రకారం.. బ్లాక్ మ్యాజిక్ వంటి వ్యవహారాలు ఉన్నప్పటికీ.. వాటిని పెద్దగా నమ్మరు. కానీ మన భారతీయులు అలా కాదు కదా.. ఎక్కడికి వెళ్లినా సరే.. ఏ దేశంలో స్థిరపడినా సరే తమ గుర్తింపు ప్రదర్శిస్తూనే ఉంటారు.
ఆస్ట్రేలియాలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది ఆ దృశ్యాలు స్థానికంగా ఉన్న సిసి టీవీలలో రికార్డు అయ్యాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ శివారులోని టామ్ నెట్ ప్రాంతంలో నోస్లీ అవెన్యూ అనే ఒక ఏరియా ఉంది. గత ఏడాది 29న ఒక జంట ఈ ప్రాంతంలోని నడిరోడ్డు మధ్య నడుచుకుంటూ వెళ్ళింది. నడిరోడ్డు మీద ఒక దీపాన్ని వదిలి వెళ్లారు. ఈ దృశ్యాలను స్థానికుడు గుర్జిత్ చూశాడు. ఆ ఫుటేజ్ మొత్తాన్ని ఒక టీవీకి అందించాడు. ఆ టీవీ ఈ దృశ్యాలను టెలికాస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ” ఆ జంట చేస్తున్న పని చూస్తే ఆందోళన కలిగించింది. చేతులతో దీపాన్ని పట్టుకొని వారు ఎక్కడికి వెళ్తున్నారు అర్థం కావడం లేదు. నడిరోడ్డు మీద ఎందుకు ఉంచారో అంతు పట్టలేదు. కాకపోతే ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ వ్యవహారాలు లైవ్ లో చూస్తే భయం వేస్తుందని” గుర్జిత్ వ్యాఖ్యానించాడు.
నడిరోడ్డుపై దీపం వెలిగించిన జంట
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ శివారు టామ్నెట్ పరిధిలోని ‘నోస్లీ అవెన్యూ లో ఆగస్టు 29న ఒక జంట నడిరోడ్డు మధ్యలో వెలిగించిన దీపాన్ని ఉంచి వెళ్లడం కలకలం రేపింది
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కాగా, గుర్జీత్ అనే… pic.twitter.com/uv6lLR70Z9
— RTV (@RTVnewsnetwork) September 2, 2026