Delhi Car Blast: సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట సమీపంలో మెట్రో రైల్వే స్టేషన్ పక్కన కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ఉగ్రవాదులే కారణమని భారత్ అనుమానిస్తోంది. అంతేకాదు దీని వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత జై ష్ ఏ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు భారత నిఘా వర్గాలకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, నిఘా వర్గాలు మరింత లోతయిన సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇలా చేస్తుండగానే మరో కీలక సమాచారం బయటకు వచ్చింది.
ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు ఉమర్ నబీ పోలీసులు పేర్కొంటున్నారు. ఈ పేలుడుకు సంబంధించి ముందు అతడు పాత ఢిల్లీలోని తబ్లిగి జమాత్ మసీదుకు వెళ్ళాడు. అక్కడ 10 నుంచి 15 నిమిషాల పాటు గడిపాడు. ఆ తర్వాత తన కార్ తీసుకొని ఎర్రకోటలోని పార్కింగ్ ప్లేస్ కు వెళ్ళాడు.. ఆ తర్వాత మూడు గంటల పాటు అక్కడ కారులోనే ఉన్నాడు. ఆ తర్వాతే బ్లాస్టింగ్ జరిగింది. కారు బ్లాస్టింగ్ కావడంతోనే మంటలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి. చుట్టుపక్కల ఉన్న వాహనాలు కూడా కాలి పోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 8 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 20 మందికి పైగా గాయపడ్డారు.
ఉమర్ నబి వాస్తవానికి పెద్ద కుట్రకు పాల్పడ్డాడు. అతడికి చాలామంది ఉగ్రవాదులు సహకరించారు. అయితే పోలీసు వర్గాలు అత్యంత కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అరెస్టులు కొనసాగిస్తున్న క్రమంలో.. ఉమర్ భయపడ్డాడు. తన సహచర ఉగ్రవాదులు అరెస్టు కావడంతో.. తనను కూడా పోలీసులు పట్టుకుంటారని భయపడ్డాడు. అందువల్లే పేలుడు సామగ్రి నిండి ఉన్న కారును పార్కింగ్ ప్లేస్ వద్దకు తీసుకెళ్లాడు. భారీ పేలుడుకు పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా భయానక పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక నరకం చూస్తున్నారు.
నబీ భారీగా పేలుడు సామగ్రిని నిల్వ చేశాడు. తన సహచర ఉగ్రవాదుల సూచనతోనే అతడు ఆ పని చేశాడు. అయితే సహచర ఉగ్రవాదులు పోలీసుల చేతిలో అరెస్టుకు గురి కావడంతో నబి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. ఆ తర్వాత కారులో పేలు లడు సామగ్రితో బయలుదేరాడు. ఏదో చేద్దామనుకొని.. భయపడి మెట్రో సమీపంలో పేల్చేశాడు. ఈ ప్రమాదంలో అతను కూడా చనిపోయాడని తెలుస్తోంది. ఈ సిసి ఫుటేజ్ ఆధారంగా మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు.
#BREAKING Another update about the K2wa terrorist who’s the prime suspect, Dr Umar Un Nabi, in the Delhi blast case. He went to Masjid for 10minutes and did Namaz. Also this has been officially declared a Terror Attack.
EcoSport DL 10 CK 0458, pic.twitter.com/TyHre79JuP pic.twitter.com/aSmj4gTLyw— ExtremistXD (@ExtremistXD) November 12, 2025